యోగాపై విద్యా సంస్థలు, వర్శిటీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ యూజీసీ సర్క్యులర్ జారీ చేయడం, యోగా చేసే ముందు ఓంకారం, శ్లోకాలతో ప్రార్థన చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఓపక్క పార్టీలు, మత పెద్దలు ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగానే... ఆరవతరగతినుంచి సీబీఎస్ఈ స్కూళ్ళలోని రోజువారీ సీసీఈ కార్యక్రమాల్లో యోగాను భాగం చేయడంతోపాటు గ్రేడ్స్ ను సైతం అందించాలని ఎఫ్లియేటెడ్ పాఠశాలల ప్రిన్సిపల్స్ కు సర్క్యులర్ అందడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సీబీఎస్ఈ పాఠశాలలకు వచ్చిన యోగా సర్క్యులర్ పై కార్యదర్శి జోసెఫ్ ఇమ్మాన్యూల్ స్పందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొనేందుకు విద్యార్థులు సంవత్సరమంతా రోజువారీ కార్యక్రమంగా యోగాను చేయాలా అంటూ ప్రశ్నించారు. ఆయుష్ ప్రోటోకాల్ ను ప్రస్తావించిన ఆయన... పిల్లలు వారానికోసారి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే సరిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ముస్లిం మత పెద్దలు, పార్టీల అభ్యంతరాలతో యోగా కార్యక్రమంలో 'ఓం' ను, వైదిక మంత్రాలను పఠించడం తప్పనిసరి కాదని, ఎవరి ఇష్టం వారిదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్సష్టం చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే... ఇప్పటికే సీసీఈ కార్యకలాపాల్లో యోగా భాగంగా ఉందని, మొత్తం పాఠశాల విద్యార్థులు ప్రతిరోజూ యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకపోయినా, వారానికోసారి ఉదయం అసెంబ్లీలో భాగంగా యోగా నిర్వహించవచ్చని సీనియర్ సీబీఎస్ఈ అధికారి తెలిపారు. మరోవైపు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆయుష్ మంత్రిత్వశాఖ సూచనల ప్రకారం విద్యార్థులను సర్టిఫికేషన్ కోర్సు చేయించాలంటే.. సీబీఎస్ఈ స్కూళ్ళలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ను కూడ అప్పాయింట్ చేయాలని సీబీఎస్ఈ కోరింది.
స్కూళ్ళలో యోగాకు గ్రేడ్స్ ఇవ్వండి!
Published Fri, May 20 2016 2:21 PM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM
Advertisement