Include
-
నిద్రలేమితో ఆస్తమా తీవ్రం!
నిద్రలేమి (ఇన్సామ్నియా) సమస్యతో బాధపడేవారిలో ఒక్కోసారి అది ఆస్తమాను ప్రేరేపించవచ్చంటున్నారు నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు. ఆస్థమాతో బాధపడేవారిలో ఆస్తమా అటాక్ రాగానే రాత్రివేళ నిద్రలేకపోవడం, నిద్రలో నాణ్యత లోపించడం మామూలే. అయితే రాత్రివేళ సరిగా నిద్ర పట్టకపోవడం కూడా ఆస్తమాకు దారి తీస్తుందన్న విషయం తెలిసిందనీ, ఇదో వలయంలాగా సాగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త లిన్ బీటె స్ట్రాండ్ తెలిపారు. నిద్రలేమితో బాధపడుతున్న 20 నుంచి 65 ఏళ్ల వయసున్న దాదాపు 18,000 మందిపై నిర్వహించిన అధ్యయనంలో చాలామందికి ఆస్తమా అటాక్ అయినట్టు స్ట్రాండ్ పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఇన్సామ్నియా బాధితుల్లో ఈ ముప్పు మరింత ఎక్కువని తెలి΄ారు. -
పెట్టెలో ఏముంది? నీ మనసులో ఏముంది?
ఎల్లుండే ఎలక్షన్ రిజల్ట్! మల్లప్పకు మహాటెన్షన్‌గా ఉంది. సస్పెన్స్ నవలలు చదవడం మల్లప్ప హాబీ. ఆ నవలల్లో ‘నరాలు తెగే ఉత్కంఠ’ అనే వాక్యాన్ని తరచుగా చదివేవాడు. ఇప్పుడది స్వయంగాఅనుభవంలోకి వచ్చింది. గోడ గడియారంలోని లోలకం తన గుండెలో పెద్దగా చప్పుడు చేస్తుంది.మల్లప్ప తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగాడు.‘ఇజ్జత్‌కా సవాల్’ అంటూ తన ప్రత్యర్థి పది రూపాయలు ఖర్చు చేస్తే తాను పాతిక ఖర్చు పెట్టాడు. ప్రత్యర్థి వంద ఖర్చు చేస్తే తాను అయిదొందలు ఖర్చు చేశాడు.ఈ దెబ్బకు ఆస్తంతా మే నెల ఎండల్లో ఆరుబయట ఐసుముక్క కరిగిపోయినట్లు కరిగిపోయింది.‘ఒకవేళ ఎలక్షన్లో గెలవకపోతే’ తనలో తాను ఎన్నిసార్లు అనుకున్నాడో!ఆదివారం పొద్దుట నుంచి మల్లప్పలో ఒకటే టెన్షన్.రోజూ నిద్ర లేవడంతోనే బెడ్ మీద నుండే...‘కాఫీ’ అని అరవడంమల్లప్ప అలవాటు. ఈరోజు మాత్రం... లేవడం లేవడంతోనే...‘‘గెలుస్తానా.... లేదా!’’ అని అరిచాడు.భార్య మల్లీశ్వరి నవ్వుకుంది.బాత్రూమ్లో పాటలు పాడుతూ స్నానం చేయడం మల్లప్ప అలవాటు. ట్యూన్ పాతదే. పాటే కొత్తది. ‘గజిని’ సినిమాలోని ట్యూన్‌తో ఇలా పాట అందుకున్నాడు.‘గెలుపు ఎక్కడ ఉన్నాది?గెలుపు ఎక్కడ ఉన్నాది?నీ చుట్టూనే తిరుగూతున్నాది!’ఇప్పుడు కూడా భార్య మల్లీశ్వరి చిన్నగా నవ్వుకుంది.స్నానం తరువాత దేవుడి పటం ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ మంత్రాలు చదవడం మల్లప్ప అలవాటు.ఈరోజు కూడా అలాగే కూర్చున్నాడు. కానీ మనసు మాత్రం ఎక్కడికో వెళ్లింది. ‘ఓం... గెలుస్తానా లేదా ఓం... ఓడిపోతానా ఏమిటి కొంపదీసి? ఓం... ఎలాగైనా గెలవాలి. ఓం... గెలవకపోతే ఇంకేమైనా ఉందా!’ ఈసారి మాత్రం భార్య చిన్నగా నవ్వలేదు. పెద్దగా అరిచింది...‘‘ఏమైంది నీకు?’’ట్రాన్స్ నుంచి బయటికి వచ్చిన మల్లప్ప...‘‘నాకేమైంది!’’ అన్నాడు అమాయకంగా.‘‘మీ టెన్షన్ ముదిరి పాకాన పడింది. ఇలాగైతే మీకు పిచ్చిపట్టడం ఖాయం. మీరు గెలిచినా... అందరూ పిచ్చి ఎంఎల్ఏ అంటారు. పిచ్చి వల్ల పదవికి అనర్హుడిగా ప్రకటిస్తారు’’ అని భయపెట్టింది మల్లీశ్వరి.‘‘నిజమే సుమీ! కానీ నేను ఎంత ప్రయత్నించినా టెన్షన్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను.ఏంచేయమంటావు చెప్పు!’’ దీనంగా జుట్టు పీక్కోబోయాడు మల్లప్ప.‘‘ఇంకా జుట్టు ఎక్కడ ఉంది నా బొంద... మొన్న ఎలక్షన్లో ప్రత్యర్థులు పీకిపాకాన పెట్టారు కదా’’ అని ఉన్నవిషయం చెప్పింది మల్లీశ్వరి.‘‘జుట్టు సంగతి సరే, టెన్షన్ నుంచి డైవర్ట్ కావడం ఎలా?’’ అడిగాడు మల్లప్ప.‘‘టీవీలో స్వామిసాగరానంద అనే ఆయన గొప్ప ప్రవచనలు చెబుతున్నాడు. ఆ ప్రవచనలు వింటే మీ మనసు శాంతిస్తుంది. టెన్షన్ మాయమవుతుంది. వెంటనే యూ ట్యూబ్ ఓపెన్ చేయండి’’ అని లాప్టాప్ చేతిలో పెట్టింది మల్లీశ్వరి.ఆరోజంతా ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ప్రవచనలు సీరియస్‌గా విన్నాడు మల్లప్ప. మరుసటిరోజు ఆయన మనసు తేలికైంది. టెన్షన్ ధ్వంసమైంది. మనసు దూదిపింజలా తేలిపోయింది.తన గది దాటి బయటకు వచ్చాడు మల్లప్ప. ‘‘చక్కని సలహా ఇచ్చావు మల్లీశ్వరి. ఇప్పుడు నాకు ఎలాంటి టెన్షనూ లేదు. నిండు కొండలా నిబ్బరంగా ఉన్నాను’’ అన్నాడు తన్మయంగా.‘‘అదిసరే... రేపు రిజల్ట్ పెట్టుకొని సంచిలో బట్టలు సర్దుకొని ఎక్కడికిబయలుదేరారు?’’ ఆశ్చర్యంగా అడిగింది శ్రీమతి మల్లీశ్వరి.అప్పుడు ఆయన ఇలా అందుకున్నాడు:‘మల్లీశ్వరీ!ఎలక్షనేమిటీ? రిజల్ట్ ఏమిటీ? ఈ చరాచరసృష్టిలో చెరుకుగడలో కూడా పరమార్థం ఉంది.తీపి గడను నిర్ణయిస్తుందా?గడ తీపిని నిర్ణయిస్తుందా?.... సమాధానం అంత తేలికా!ఎలక్షనేమిటీ దానితో నాకు ఉన్న కనెక్షనేమిటి?నువ్వు గెలిచాననుకున్నది గెలుపు కాదు. నువ్వు ఓడాననుకున్నది ఓటమి కాదు.గెలుపు ఓటములకు అతీతమైన సమ్యక్ దృష్టి నిన్ను గెలిపిస్తుంది.ఈ లోకంలో ఎవరికి ఎవరు శత్రువులు కాదు... విధి ఆడిస్తున్న వింత బొమ్మలు. జయాపజయాలు దైవాధీనాలు కదా.... నాకు విజయం కానీ, పదవి కానీ, సుఖం కానీ వద్దు.నేను జయం కోరను. పదవి వలన కానీ, జీవించడం వలన కానీ ప్రయోజనం ఏమిటి?’‘‘ప్రయోజనం ఏమిటో నేను చెబుతాను’’ అంటూ బకెట్ నీళ్లను అతడి నెత్తి మీద కుమ్మరించడంతో ఏదో లోకం నుంచి ఈలోకంలోకి వచ్చిపడ్డాడు మల్లప్ప!మల్లప్ప గురించి మాట్లాడుకున్నాం కదా.... ఇప్పుడు రాజపక్షే గురించి చెప్పుకుందాం. ఈయన శ్రీలంకీయన్ కాదు మనోడే. అసలు పేరు పక్షి రాజా. ఇంటిపేరు తన పేరు పక్కన చేరడం వల్ల రాజా పక్షి అయ్యాడు.... కాలక్రమంలో రాజపక్షే అయ్యాడు. సరే ఈ పేరు గోల ఎందుకుగానీ బిడ్డ చచ్చినా పురిటి కంపు పోనట్లు... ఎలక్షన్లై పోయినా ఎల్లుండి రిజల్ట్ అని తెలిసినా ఎలక్షన్ క్యాంపెయిన్ అలవాటునుమాత్రం మానుకోలేకపోతున్నాడు ఈ రాజపక్షే.ఉదాహరణకు... పొద్దున్నే లేచి కెమెరామెన్‌ను వెంటదీసుకొని బయలుదేరుతాడు. పేపర్బాయ్ని సైకిల్ దింపి తాను సైకిల్ ఎక్కి ఇంటింటికి వెళ్లి పేపర్ వేసి వస్తాడు. ఆ తరువాత కనిపించిన హోటల్లోకి దూరి టీ కాస్తాడు. ఆ తరువాత వేడి వేడి బజ్జీలు వేస్తాడు. కొద్దిసేపటి తరువాత సెలూన్‌లోకి దూరి గెడ్డాలు గీస్తాడు. మార్కెట్లోకి దూరి కూరగాయలు అమ్ముతాడు... ఒక్కటా రెండా! – యాకుబ్ పాషా -
స్కూళ్ళలో యోగాకు గ్రేడ్స్ ఇవ్వండి!
యోగాపై విద్యా సంస్థలు, వర్శిటీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ యూజీసీ సర్క్యులర్ జారీ చేయడం, యోగా చేసే ముందు ఓంకారం, శ్లోకాలతో ప్రార్థన చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఓపక్క పార్టీలు, మత పెద్దలు ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగానే... ఆరవతరగతినుంచి సీబీఎస్ఈ స్కూళ్ళలోని రోజువారీ సీసీఈ కార్యక్రమాల్లో యోగాను భాగం చేయడంతోపాటు గ్రేడ్స్ ను సైతం అందించాలని ఎఫ్లియేటెడ్ పాఠశాలల ప్రిన్సిపల్స్ కు సర్క్యులర్ అందడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీబీఎస్ఈ పాఠశాలలకు వచ్చిన యోగా సర్క్యులర్ పై కార్యదర్శి జోసెఫ్ ఇమ్మాన్యూల్ స్పందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొనేందుకు విద్యార్థులు సంవత్సరమంతా రోజువారీ కార్యక్రమంగా యోగాను చేయాలా అంటూ ప్రశ్నించారు. ఆయుష్ ప్రోటోకాల్ ను ప్రస్తావించిన ఆయన... పిల్లలు వారానికోసారి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే సరిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ముస్లిం మత పెద్దలు, పార్టీల అభ్యంతరాలతో యోగా కార్యక్రమంలో 'ఓం' ను, వైదిక మంత్రాలను పఠించడం తప్పనిసరి కాదని, ఎవరి ఇష్టం వారిదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్సష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... ఇప్పటికే సీసీఈ కార్యకలాపాల్లో యోగా భాగంగా ఉందని, మొత్తం పాఠశాల విద్యార్థులు ప్రతిరోజూ యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకపోయినా, వారానికోసారి ఉదయం అసెంబ్లీలో భాగంగా యోగా నిర్వహించవచ్చని సీనియర్ సీబీఎస్ఈ అధికారి తెలిపారు. మరోవైపు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆయుష్ మంత్రిత్వశాఖ సూచనల ప్రకారం విద్యార్థులను సర్టిఫికేషన్ కోర్సు చేయించాలంటే.. సీబీఎస్ఈ స్కూళ్ళలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ను కూడ అప్పాయింట్ చేయాలని సీబీఎస్ఈ కోరింది.