
నిద్రలేమి (ఇన్‌సామ్నియా) సమస్యతో బాధపడేవారిలో ఒక్కోసారి అది ఆస్తమాను ప్రేరేపించవచ్చంటున్నారు నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు. ఆస్థమాతో బాధపడేవారిలో ఆస్తమా అటాక్ రాగానే రాత్రివేళ నిద్రలేకపోవడం, నిద్రలో నాణ్యత లోపించడం మామూలే.
అయితే రాత్రివేళ సరిగా నిద్ర పట్టకపోవడం కూడా ఆస్తమాకు దారి తీస్తుందన్న విషయం తెలిసిందనీ, ఇదో వలయంలాగా సాగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త లిన్ బీటె స్ట్రాండ్ తెలిపారు. నిద్రలేమితో బాధపడుతున్న 20 నుంచి 65 ఏళ్ల వయసున్న దాదాపు 18,000 మందిపై నిర్వహించిన అధ్యయనంలో చాలామందికి ఆస్తమా అటాక్ అయినట్టు స్ట్రాండ్ పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఇన్‌సామ్నియా బాధితుల్లో ఈ ముప్పు మరింత ఎక్కువని తెలి΄ారు.
Comments
Please login to add a commentAdd a comment