insomnia
-
నిద్రలేమితో ఆస్తమా తీవ్రం!
నిద్రలేమి (ఇన్సామ్నియా) సమస్యతో బాధపడేవారిలో ఒక్కోసారి అది ఆస్తమాను ప్రేరేపించవచ్చంటున్నారు నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిపుణులు. ఆస్థమాతో బాధపడేవారిలో ఆస్తమా అటాక్ రాగానే రాత్రివేళ నిద్రలేకపోవడం, నిద్రలో నాణ్యత లోపించడం మామూలే. అయితే రాత్రివేళ సరిగా నిద్ర పట్టకపోవడం కూడా ఆస్తమాకు దారి తీస్తుందన్న విషయం తెలిసిందనీ, ఇదో వలయంలాగా సాగుతుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త లిన్ బీటె స్ట్రాండ్ తెలిపారు. నిద్రలేమితో బాధపడుతున్న 20 నుంచి 65 ఏళ్ల వయసున్న దాదాపు 18,000 మందిపై నిర్వహించిన అధ్యయనంలో చాలామందికి ఆస్తమా అటాక్ అయినట్టు స్ట్రాండ్ పేర్కొన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక ఇన్సామ్నియా బాధితుల్లో ఈ ముప్పు మరింత ఎక్కువని తెలి΄ారు. -
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య! ప్రశాంతమైన నిద్రపట్టాలంటే..?
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు పది శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. ముప్పయి నుంచి అరవై శాతం మంది ప్రజలు తరచు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలిలోని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటివి చాలామందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. ఇవే కాకుండా, కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడేవారు, కొన్ని రకాల ఔషధాలు వాడేవారు కూడా నిద్రలేమితో బాధపడేవారిలో ఉన్నారు.సాధారణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు నిద్రలేమితో బాధపడుతున్నారంటే, రకరకాల బయటి ఒత్తిళ్లు అందుకు కారణమవుతాయి. అంతేకాకుండా, ఆహారపు అలవాట్లు కూడా నిద్రను దూరం చేస్తాయి. ప్రశాంతమైన నిద్రపట్టాలంటే, నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహార పానీయాలను తీసుకోకుండా ఉండటమే క్షేమమని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమికి దారితీసే ఇతరేతర కారణాలను విడిచిపెడితే, ఆరోగ్యవంతుల్లో నిద్రలేమికి సర్వసాధారణంగా ఆహార పానీయాలే కారణమవుతుంటాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. తాజాగా ఇదే విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని స్టాన్ఫోర్డ్ స్లీప్ మెడిసిన్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ షెరీ మాహ్ నిద్రలేమికి దారితీసే ఆహార, పానీయాల గురించి పలు అంశాలను విపులంగా వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం...నిద్రను దూరం చేసేవి ఇవే!మద్యం, కెఫీన్‌తో కూడిన కాఫీ, టీ, సాఫ్ట్‌డ్రింక్స్ వంటి పానీయాలు, వేపుడు వంటకాలు, తీపి పదార్థాలు, టమాటోలు, టమాటోలతో తయారు చేసిన పదార్థాలు నిద్రను చెడగొడతాయి. నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే, నిద్రపట్టడం కష్టమవుతుంది. వీటి వల్ల కడుపులో ఆమ్లాలు పెరిగి, కడుపు మంట, ఉబ్బరం ఇబ్బంది పెడతాయి. ఫలితంగా కునుకు పట్టని పరిస్థితి ఎదురవుతుంది. చాలామందికి రాత్రి భోజనం తర్వాత మిఠాయిలు తినడం, ఐస్‌క్రీమ్ తినడం అలవాటు. నిద్ర పట్టకుండా ఉంటే, కొందరు అదే పనిగా పిండిపదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు తింటూ ఉంటారు. ఇలాంటివి నిద్రను మరింతగా చెడగొడతాయి. రాత్రిపూట ఏం తింటే కడుపు తేలికగా ఉంటుందో, ఎలాంటి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయో జాగ్రత్తగా గమనిస్తూ తినడం అలవాటు చేసుకోవాలి. కడుపులో గడబిడకు దారితీసే పదార్థాలను పడుకునే ముందు తినడం ఏమాత్రం మంచిది కాదు. వాటి వల్ల నిద్రలేమితో పాటు జీర్ణకోశ సమస్యలు కూడా తలెత్తుతాయి. – నిద్రలేమికి దారితీసే పదార్థాల్లో కెఫీన్‌కు మొదటి స్థానం దక్కుతుంది. రాత్రివేళ కాఫీ, టీ, కెఫీన్ ఉండే సాఫ్ట్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదు.– రాత్రి భోజనంలో మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలు, బాగా పుల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కలిగి, నిద్రలేమి తలెత్తుతుంది.– రాత్రిపూట నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయలు, కీరదోసకాయలు వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల త్వరగా బ్లాడర్ నిండి, మూత్రవిసర్జన అవసరం వల్ల నిద్రాభంగం అవుతుంది.– రాత్రిపూట తీపిపదార్థాలు తినడం మంచిది కాదు. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, నిద్రను చెడగొడుతుంది. రాత్రిభోజనంలో బఠాణీలు, డ్రైఫ్రూట్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఫలితంగా సరిగా నిద్రపట్టదు.ఆలోచనలకు కళ్లెం వేయాలి..శరీరం ఎంతగా అలసిపోయినా, మనసులో ఆలోచనల పరంపర కొనసాగుతున్నప్పుడు నిద్ర రాదు. ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఆలోచనలకు కళ్లెం వేయాలంటారు డాక్టర్ షెరీ మాహ్. ఆలోచనల వేగానికి కళ్లెం వేయడానికి ఆమె ఏం చెబుతున్నారంటే– నిద్రపోవడానికి పక్క మీదకు చేరినప్పుడు పడక గదిలో మసక వెలుతురుతో వెలిగే బెడ్‌లైట్ తప్ప మరేమీ వెలగకూడదు. పక్క మీదకు చేరిన తర్వాత పది నిమిషాల సేపు మనసులో రేగే ఆలోచనల వేగానికి కళ్లెం వేసే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా కాళ్లు, చేతులను సాగదీయాలి. గాఢంగా ఊపిరి తీసుకుని, నెమ్మదిగా విడిచిపెడుతుండాలి. ఈ చర్యల వల్ల నాడీ వ్యవస్థ నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవడం మొదలై చక్కగా నిద్ర పడుతుంది. అప్పటికీ ఇబ్బందిగా ఉంటే, మనసులోని ఆలోచనలను కాగితంపై రాయడం, చేయవలసిన పనులను జాబితాలా రాయడం వంటి పనులు మనసుకు కొంత ఊరటనిచ్చి, నెమ్మదిగా నిద్రపట్టేలా చేస్తాయి.దీర్ఘకాలిక నిద్రలేమితో అనర్థాలు..ఆధునిక జీవన శైలిలోని ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అభద్రత, దీర్ఘకాలిక వ్యాధులు, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు నిద్రలేమికి దారితీస్తాయి. తరచు విమానయానాలు చేసేవారిలో జెట్లాగ్ వల్ల కూడా నిద్రలేమి తలెత్తుతుంది. నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారితేనే ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది.– నిద్రలేమి వల్ల చురుకుదనం లోపించి, పనితీరు మందగిస్తుంది.– వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి.– మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కుంగుబాటు, ఆందోళన పెరుగుతాయి.– దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.– రాత్రిపూట నిద్రపట్టక అదేపనిగా చిరుతిళ్లు తినే అలవాటు వల్ల స్థూలకాయం, మధుమేహం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.నిద్రలేమిని అరికట్టాలంటే!కొద్దిపాటి జాగ్రత్తలతొ నిద్రలేమిని తేలికగానే అధిగమించవచ్చు. నిద్రపోయే పరిసరాలను పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే, నిద్రలేమిని జయించవచ్చు. · రాత్రి తేలికపాటి భోజనం మాత్రమే చేయాలి. · ప్రతిరోజూ రాత్రిపూట ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి – పడకగదిలో విపరీతమైన వెలుగు, రణగొణ శబ్దాలు లేకుండా చూసుకోవాలి.– పడకగది ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.– ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటుగా చేసుకుంటే చక్కగా నిద్రపడుతుంది.– అలాగని నిద్రపోయే ముందు అతిగా వ్యాయామం చేయడం తగదు.– ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్రపట్టకుంటే, పక్క మీద నుంచి లేచి కాసేపు కూర్చుని మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది. తిరిగి నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపించినప్పుడు పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.మంచి నిద్రకు దోహదపడే పదార్థాలు..– నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచిది. పాలలోని ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ మంచి నిద్రకు దోహదపడుతుందని అంతర్జాతీయ పరిశోధనల్లో రుజువైంది.– చక్కని నిద్ర కోసం అరటిపండ్లు తీసుకోవడం కూడా మంచిదే! అరటిపండ్లలో నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌తో పాటు మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.– ద్రాక్షలు ‘మెలటోనిన్’ను సహజంగా కలిగి ఉంటాయి. నిద్రపోయే ముందు ద్రాక్షలను తినడం వల్ల కూడా చక్కని నిద్రపడుతుంది.కొన్ని రకాల ఆహార పానీయాలు మంచి నిద్రకు దోహదం చేస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు వీటిని రోజువారీగా తీసుకుంటున్నట్లయితే, నిద్రలేమి సమస్య నుంచి సులువుగా బయటపడగలుగుతారు. ప్రశాంతమైన నిద్రకు దోహదపడే పదార్థాలు ఇవి:– నిద్రపోయే ముందు వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి గింజలు తీసుకోవడం మంచిది. వీటిలో ‘ట్రిప్టోఫాన్’, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.– రాత్రిభోజనంలో పొట్టుతీయని బియ్యం, గోధుమలు, ఇతర చిరుధాన్యాలతో తయారైన పదార్థాలు తినడం మంచిది. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా, నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌ను శరీరం పూర్తిగా శోషించుకునేలా చేస్తాయి.– రాత్రిభోజనం తర్వాత ఐస్‌క్రీమ్‌ల బదులు పెరుగు తినడం మంచిది. పెరుగు తిన్నట్లయితే, శరీరంలో నిద్రకు దోహదపడే ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.– అలాగే, ‘ట్రిప్టోఫాన్’ పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్ వంటివి రాత్రిభోజనంలో తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అయితే, వీటిని వండటంలో మసాలాలు ఎక్కువగా వాడినట్లయితే, ప్రయోజనం దెబ్బతింటుంది.మంచి నిద్రకు... మంచి ఆహారం!నిద్రకీ ఆహారానికీ సంబంధం ఉంది. కొన్ని ఆహారాలు నిద్రలేమికి కారణం కావచ్చు. కొన్ని ఆహారాలు తీసుకున్న తర్వాత ఆ మసాలాలలోని స్టిములెంట్స్ రక్తప్రసరణ వేగాన్ని పెంచడం నిద్రలేమికి దారితీయవచ్చు. అందుకే మంచి నిద్రపట్టాలంటే తక్కువ మసాలాలతో, పోషకాలతో కూడిన తేలికపాటి సమతులాహారాన్ని తీసుకోవడం మేలు. ప్రత్యేకంగా చెప్పాలంటే కాఫీ లేదా టీ తీసుకున్న తర్వాత అందులోని హుషారు కల్పించే కెíఫీన్, క్యాటెచిన్ వంటి ఉత్ప్రేరకాలు నిద్రను దూరం చేస్తాయి. గ్రీన్ టీ వంటి వాటిల్లోని ఎపిగ్యాలో క్యాటెచిన్, క్యాటెచిన్ ఎపిగ్యాలేట్ వంటివీ నిద్రకు శత్రువులే. కేవలం కాఫీ టీలలోనే కాకుండా ఎనర్జీ డ్రింక్స్, కోలా డ్రింక్స్‌లోనూ కెఫీన్ ఉంటుంది. మధ్యాహ్న, రాత్రి భోజనాల తర్వాత కెఫీన్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్లోని హుషారును కలిగించే ప్రభావ సమయం చాలా ఎక్కువ. అందువల్ల అది నిద్రలేమిని కలిగించే అవకాశమూ ఎక్కువే! ఇక పాలలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ స్వాభావికంగానే నిద్రపోయేలా చేస్తుంది. గుడ్లలోని తెల్లసొన, చేపలు, వేరుశనగలు, గుమ్మడి గింజల్లోనూ ట్రిప్టోఫాన్ ఉంటుంది కాబట్టి అవీ కొంతవరకు సహజ నిద్రను అందిస్తాయి. – డాక్టర్ కిషన్ శ్రీకాంత్, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
ఈ డ్రైఫ్రూట్‌తో నిద్రలేమికి చెక్!
నిద్రలేమి అనేది నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారిని వేధిస్తున్నసాధారణ సమస్యగా మారింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం..శారీర మానసిక ఆరోగ్యం కోసం నాణ్యమైన నిద్ర అత్యంత అవసరం. అయితే చాలామందికి సరైన నిద్ర లేకపోవడానికి ప్రధాన కారణాలు జీవనశైలి, ఆహార సమస్యలే అని చెబుతున్నారు నిపుణులు. ఈ నిద్ర సమస్య విటమిన్లు ఏ, సీ, డీ, ఈ, కే, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాల లోపం వల్లే వస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఈ లోపాన్ని అధిగమించేందుకు పోషకాలతో నిండిన ఈ డ్రైఫ్రూట్ తీసుకోమని సూచిస్తున్నారు. ఇంతకీ ఏంటా డ్రైఫ్రూట్? నిద్రలేమికి ఎలా సహాయపడుతుందంటే?నిద్రలేమికి పిస్తాపప్పు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. ఇది నిద్రలేమి సమస్యకు సహజ సప్లిమెంట్లా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మెలటోనిన్ స్లీప్ హార్మోన్‌తో లోడ్ చేయడబడి ఉంటుంది. మంచి నిద్ర సహాయకారిగా పిస్తాపప్పులను పేర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం చీకటికి ప్రతిస్పందనగా మెలటోనిన్‌ని ఉత్పత్తి చేస్తుంది. పిస్తాపప్పులు తీసుకుంటే సహజంగానే ఇది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందట.సుమారు 100 గ్రాముల షెల్డ్ పిస్తాలో 23 mg మెలటోనిన్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంటే.. నిద్రలేమి కోసం వాడే మెలటోనిన్ సప్లిమెంట్లలో కంటే ఎక్కువ. అంతేగాదు పిస్తాలో మెగ్నీషియం, విటమిన్ బీ6 పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి మంచి ప్రశాంతమైన నిద్రను అందించడంలో చక్కగా ఉపయోగపడతాయి. ఎప్పుడు తింటే మంచిదంటే..మెగ్నీషియం, మెలటోనిన్ మాత్రలు వేసుకోవడం కంటే నిద్రవేళకు ఒక గంట ముందు కొన్ని పిస్తాలను తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని పచ్చిగా లేదా షెల్డ్గా తీసుకోవచ్చు లేదా మంచి రుచి కోసం కాల్చి తినవచ్చు. ఇక్కడ పరిమితికి మించి తీసుకోకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది అదనపు కేలరీలను అందిస్తుంది. అందులోనూ రాత్రిపూట తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మంచి నిద్ర కోసం చేయాల్సినవి..ప్రతిరోజూ నిర్ణిత సమయానికే నిద్రపోవాలని చెబుతున్నారు నిపుణులు పడుకునే ముందు కనీసం రెండు గంటల ముందు స్క్రీన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయాలి.ఎల్లప్పుడూ మీ పడకగదిలో ఉష్ణోగ్రతను 65–68°F మధ్య ఉంచండి.అలాగే నిశబ్దంగా ఉండేలా ఫ్యాన్, ఎయిర్ కండీషనర్‌ని చూసుకోండికెఫిన్ తాగవద్దు, ఎక్కువ భోజనం చేయవద్దు అలాగే నిద్రవేళల్లో ఆల్కహాల్ లేదా నికోటిన్‌ని ఉపయోగించవద్దు క్రమం తప్పకుండా వ్యాయామం చేయండిపగటిపూట చురుకుగా ఉండేలా చూసుకుంటే బాగా నిద్రపోవచ్చు ఒత్తిడి, ఆందోళన, చింతించడం లాంటివి దూరం చేసుకోండి. (చదవండి: నటి డైసీ రిడ్లీకి 'గ్రేవ్స్ వ్యాధి': ఎందువల్ల వస్తుందంటే..?) -
డబుల్ మసాలాతో.. నిద్రలేమి!
కొందరు పగటివేళ చురుగ్గా ఉండటానికి ఆహారం తక్కువగా తీసుకుంటూ, రాత్రి మాత్రం ఫుడ్ కాస్త గట్టిగానే తినేస్తుంటారు. రోజువారీ పనులన్నీ పూర్తయ్యాయనే రిలాక్సేషన్, మర్నాటి ఉదయం వరకు మరో పని ఉండదన్న హాయి ఫీలింగ్‌తో ఇలా చేస్తుంటారు. ఇంకొందరు రాత్రి డిన్నర్లలో ‘బిర్యానీ విత్ డబుల్ మసాలా’ అంటూ కాస్త ఎక్కువగానే ఆరగిస్తుంటారు.అయితే రాత్రిపూట తినే ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అదిప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండే ఆహారమైనా తినేవాళ్లు నిద్రలేమికి గురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు స్లీప్ స్పెషలిస్టులు. రాత్రి నిద్రకు ఉపక్రమించే కనీసం రెండుగంటల ముందుగానే లైట్ ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.ఎక్కువ మసాలాలతో పాటు కొన్నిసార్లు కాఫీ, కొవ్వులు, చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలతోనూ నిద్రపట్టకపోవచ్చనీ... హాయిగా నిద్రపట్టాలంటే గోరువెచ్చని పాలు, అరటిపండ్లు, బాదం, తేనె.. వీటిల్లో ఏదైనా తీసుకుంటే, అవి హాయిగా నిద్రపట్టేందుకు దోహదపడతాయన్నది స్లీప్ స్పెషలిస్టుల మాట.ఇవి చదవండి: ఈ యోగా.. సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు.. -
ఎంత ప్రయత్నించినా.. నిద్ర పట్టడంలేదు!
విజయ్ ఒక ప్రముఖ ఎమ్మెన్సీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి. మరో సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లిచేసుకున్నాడు. జీవితంలోనూ, ఉద్యోగంలోనూ త్వరత్వరగా ప్రమోషన్లు అందుకున్నాడు. కానీ గత మూడు నెలలుగా రాత్రిళ్లు నిద్రపట్టక నానా ఇబ్బందులు పడుతున్నాడు. సాధారణంగా ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.కానీ విజయ్‌కు త్వరగా మెలకువ వస్తుంది. ఆ తర్వాత అస్సలు నిద్ర పట్టదు. ఉదయం చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. ఏ పనిౖ పెనా శ్రద్ధ నిలవడంలేదు. నిరంతరం నిద్ర గురించిన ఆలోచనలే. పనిలో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. దాంతో ఆఫీసులో రెడ్ స్లిప్ వచ్చింది.ఏం చేయాలో అర్థంకాక, స్లీపింగ్ పిల్స్ వాడటం ఇష్టంలేక కౌన్సెలింగ్‌కి వెళ్లాడు. ఫస్ట్ సెషన్లోనే అతను నిద్రలేమి (ఇన్ సోమ్నియా)తో బాధపడుతున్నట్టు తేలింది. ముగ్గురిలో ఒకరు ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్నారు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి థైరాయిడ్ లాంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేయించుకోమని సూచించారు.ఎలాంటి శారీరక కారణాలు లేవని పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత రెండు వారాలపాటు ఏ సమయంలో నిద్రపోతున్నాడో, ఏ సమయంలో మేల్కొంటున్నాడో డైరీ రాయమని సూచించారు. విజయ్ భార్యతో మాట్లాడి స్లీప్ ఆప్నియా లేదా రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటివి లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా విజయ్ కొద్దివారాల్లో తన నిద్రలేమిని అధిగమించగలిగాడు.నిద్రలేమికి కారణాలు..- దీర్ఘకాలిక నిద్రలేమికి రకరకాల కారణాలున్నాయి. ఒత్తిడి, పని, పాఠశాల, ఆరోగ్యం, డబ్బు లేదా కుటుంబం గురించిన ఆందోళనలు రాత్రిపూట మన మనస్సును చురుకుగా ఉంచుతాయి, నిద్రను కష్టతరం చేస్తాయి. - షిఫ్ట్ లను తరచుగా మార్చడం లేదా వివిధ టైమ్ జోన్లలో ప్రయాణించడం వల్లా శరీరంలోని గడియారానికి (సర్కేడియన్ రిథమ్స్) భంగం కలుగుతుంది- ఒక్కోరోజు ఒక్కో సమయంలో పడుకోవడం, మేల్కోవడం, మంచంపై ఉన్నప్పుడు తినడం, టీవీ చూడటం, పనిచేయడం, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం లాంటివి నిద్రను డిస్టర్బ్ చేస్తాయి. - యాంగ్జయిటీ, డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలు..- మధుమేహం, ఉబ్బసం, గుండె జబ్బుల వల్ల లేదా వాటికి వాడుతున్న మందులు..- స్లీప్ ఆప్నియా, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి స్లీప్ డిజార్డర్స్..- రాత్రిళ్లు నికోటిన్, ఆల్కహాల్, కెఫీన్ ఉన్న పదార్థాలు, పానీయాలను తీసుకోవడమూ నిద్రలేమికి కారణమవుతాయి.మంచి అలవాట్లతో మంచి నిద్ర..మంచి అలవాట్లు నిద్రలేమిని నివారించడంలో సహాయపడతాయి.- వారాంతాలు సహా ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, మేల్కోవడం చేయాలి. - రోజూ వ్యాయామం చేయడం వల్ల మంచి నిద్ర వస్తుంది.- పగలు అస్సలు నిద్రపోవద్దు, లేదా పరిమితం చేసుకోవాలి. - కెఫీన్, ఆల్కహాల్, నికోటిన్లను పరిమితం చేయాలి.. వీలైతే పూర్తిగా మానేయాలి. - నిద్రవేళకు ముందు భారీగా తినొద్దు, తాగొద్దు. - పడకగదిని కేవలం నిద్ర కోసమే ఉపయోగించాలి. - గోరువెచ్చని నీటితో స్నానం, చదవడం లేదా శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా నిద్రకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించుకోవాలి. - ఇవన్నీ చేసినా నిద్ర పట్టనప్పుడు సైకాలజిస్ట్‌ను కలవడం తప్పనిసరి. - నిద్రకు దూరంచేసే నెగెటివ్ ఆలోచనలు, చర్యలను సీబీటీ ద్వారా నియంత్రించవచ్చు. ఇది స్లీపింగ్ పిల్స్ కంటే ప్రభావవంతంగా ఉంటుంది. - లైట్ థెరపీ, స్టిములస్ కంట్రోల్ థెరపీ లాంటివి శరీరాన్ని, మనసును మంచి నిద్రకు సిద్ధం చేస్తాయి. - ప్రోగ్రెసివ్ రిలాక్సేషన్ టెక్నిక్, బయోఫీడ్ బ్యాక్, బ్రీతింగ్ టెక్నిక్స్ లాంటివి కూడా నిద్రవేళల్లో ఆందోళనను తగ్గించడానికి ఉపయోగపడతాయి.ఎవరి నిద్ర వారిదే..నిద్ర అలవాట్లు, అవసరాలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల తక్కువ నిద్రపోయేవాళ్లందరికీ నిద్రలేమి ఉన్నట్లు కాదు. నిపుణులు అనేక రకాల నిద్ర లక్షణాలను సాధారణంగా పరిగణిస్తారు. - త్వరగా పడుకొని, త్వరగా లేచేవారిని ఎర్లీబర్డ్స్ అంటారు. - గుడ్లగూబల్లా రాత్రంతా మేలుకుని, ఆలస్యంగా పడుకుని, ఆలస్యంగా లేచేవారిని గుడ్లగూబలనే అంటారు. - ఇతరుల కంటే తక్కువ నిద్ర అవసరమైన వారిని షార్ట్ స్లీపర్స్ అంటారు. - పోలీసు, సైన్యం లాంటి విభాగాల్లో ఉండేవారు ఎప్పుడంటే అప్పుడు మేల్కొనేలా ఉంటారు. వారిని లైట్ స్లీపర్స్ అంటారు.– సైకాలజిస్ట్ విశేష్ -
ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా!
నిత్యం కాలం పరుగెడుతున్నట్లూ.. ఈ లోకం పరుగెత్తక తప్పదు. అందులో ఎన్ని చిక్కులున్నా, ఎన్ని అడ్డంకులున్నాగానీ వాటిని అధికమిస్తూ సాగక తప్పదు. ఇలాంటి తరుణంలో మనుషుల విషయానికొస్తే.., వారిలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలాగా ఉంటుంది. కొందరు ఎంతో ధైర్యవంతులుగానూ, మరికొందరు పిరికితనంగానూ కనిపిస్తుంటారు. ఇది సహజమే. ఇలాంటి ధైర్యాలకూ, భయాలకు రకరకాల ఫోబియాల పేర్లతో పిలుస్తుంటాం. అలాగే నిద్దుర విషయానికొస్తే.., ప్రతిరోజూ ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అవసరమే! అయితే, కొందరు నిద్దుర అంటేనే చికాకు పడుతూ, అసలు నిద్దురే రావటంలేదంటారు. ఏదో ఒక పనిలో నిమగ్నమౌతుంటారు. నిద్రపోవాలంటేనే కొందరు విపరీతంగా భయపడతారు. ఇలాంటి ఈ భయాన్నే ‘సోమ్నిఫోబియా /హిప్నోఫోబియా’ అంటారు. ఇవి చదవండి: ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు -
రెప్పవాలదే..!.. ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మందికి నిద్రలేమి సమస్య
సాక్షి, అమరావతి: మానవాళి నిద్రకు దూరమవుతోంది. రాత్రిళ్లు కంటినిండా కునుకు లేకుండానే తెల్లారుతోంది. సగటు 7 గంటల నిద్ర అనేది ఇకపై చెప్పుకోవడానికి తప్ప.. ఆస్వాదించడానికి అవకాశం లేకుండాపోతోంది. ప్రముఖ వైద్య పరికరాల సంస్థ ‘రెస్‌మెడ్’ నిర్వహించిన తాజా సర్వేలో దీర్ఘకాలంగా నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తేలింది. అంతర్జాతీయంగా 40 శాతం మంది ప్రజలు నిద్ర సమస్యతో నలిగిపోతున్నారు. వారంలో కనీసం మూడు రోజుల కూడా మంచి నిద్రను పొందలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి వ్యక్తుల్లో పగటిపూట నిద్రపోవడం, ఉదయాన్నే వివిధ ప్రతికూల ప్రభావాలతో పాటు ప్రతి చిన్న విషయానికీ ఎక్కువగా చిరాకుపడటం కనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో మునిగితే అంతే.. రెస్‌మెడ్ గ్లోబల్ స్లీప్ సర్వేలో ఆ్రస్టేలియా, బ్రెజిల్, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, హాంకాంగ్, భారత్, ఐర్లాండ్, జపాన్, కొరియా, మెక్సికో, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, థాయ్‌లాండ్, యూకే, యూఎస్ఏలో ప్రజల నిద్ర అలవాట్లను ట్రాక్ చేసింది. ఇందులో స్వల్పంగా 13 శాతం మంది మాత్రమే రాత్రిళ్లు ఆరోగ్యకర నిద్రను అనుభవిస్తున్నట్టు తేలింది. జపానీయులు (57శాతం) ప్రతి వారం రాత్రిళ్లు సరైన నిద్రలేక ఇబ్బంది పడుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. ముఖ్యంగా నిద్రకు ముందు ఎక్కువ మంది సామాజిక మాధ్యమాల్లో ముగినితేలుతుండటం దుష్ప్రభావాలను పెంచుతోంది. మరికొంతమంది అర్ధరాత్రి వరకు టీవీలు చూడటం, ఇతర డిజిటల్ పరికరాలను వినియోగిస్తుండటంతో నిద్ర దూరమైపోతోందని నివేదిక స్పష్టం చేస్తోంది. వ్యక్తిగత ఆందోళనలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊబకాయం వంటి ప్రధాన కారణాలతో చాలా మంది రాత్రిళ్లు కంటిపై కునుకు వేయట్లేదు. ప్రతి 10 మందిలో ముగ్గురు నిద్ర మధ్యలో మేల్కొనకుండా ఉండలేకపోతున్నారని నివేదిక పేర్కొంది. యూకేలో 44 శాతం, ఫ్రాన్స్‌లో 42 శాతం మంది ప్రజల్లో నిద్రకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారతదేశంలో 42 శాతం, థాయ్‌లాండ్‌లో 41 శాతం కొంత వరకు రాత్రిళ్లు నిద్ర హాయిగానే ఉన్నట్టు తేలింది. రుతుక్రమం ఆగిన స్త్రీలలో నిద్రలేమి సమస్య అధికంగా ఉంది. ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం మహిళలు కలత నిద్రతో ప్రభావితం అవుతున్నారు. నిద్రలో శ్వాసకు అంతరాయాలు(స్లీప్ అప్నియా) పెద్ద రుగ్మతగా పరిణమించింది. భారత్‌లో అత్యధిక మందికి 6 గంటలు కంటే తక్కువ నిద్ర భారత్‌లోనూ అంతర్జాతీయ సర్వేలతో పాటు స్థానిక సర్వేల్లోనూ నిద్రలేమి భయపెడుతోంది. గతంలో రోజుకు ఏడు గంటలు కూడా నిరంతరాయంగా నిద్రపోవడంలో భారతీయలు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే తాజా సర్వేలో.. 61 శాతం మంది భారతీయులు గడిచిన 12 నెలల్లో రాత్రిపూట 6 గంటల కంటే తక్కువగా నిద్రపోగా, 38 శాతం మంది 4 నుంచి 6 గంటల మధ్య మాత్రమే నిద్రించడం గమనార్హం. వారిలో దాదాపు 23 శాతం మంది 4 గంటల కూడా నిద్రపోలేదు. అంటే రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే ప్రజలు 2002లో 50 శాతం నుంచి ఇప్పుడు 55 శాతానికి పెరగడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. దీంతో భారత్‌లో 2024లో నిద్రలేమి సమస్య 61 శాతానికి పెరిగింది. 72 శాతం మంది నిద్రలో ఒకటి, రెండు సార్లు వాష్‌రూమ్‌ని ఉపయోగించడం కోసం మేల్కొంటున్నట్టు తేలింది. చాలా మంది నిద్రపోవడానికి ఆలస్యంగా వెళ్తుండటం కూడా వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. కోవిడ్ బారిన పడిన వారిలో నిద్ర నాణ్యత లోపించినట్టు సర్వేలు చెబుతున్నాయి. నిద్రలేమిని అధిగమించేందుకు రోజూ నడక, గంటపాటు క్రమం తప్పకుండా వ్యాయామం, రాత్రిపూట తేలికపాటి భోజనం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి నిద్రకు మధ్య 3 గంటల సమయాన్ని పాటించడంతో పాటు నిద్రకు మూడు గంటలకు ముందు టీ, కాఫీలకు దూరంగా ఉండాలని, నిద్ర కోసం పుస్తకం చదవడం, ధ్యానం చేయడం అలవాటు చేసుకోవాలని వారంటున్నారు. -
నిద్రలేమికి ఆస్పత్రి ఏర్పాటు అభినందనీయం
బంజారాహిల్స్ (హైదరాబాద్): నిద్రలేమి సమస్యలతో పాటు నిద్రలో వచ్చే అనేక ఇబ్బందులకు ఎక్కడికి వెళ్లాలో చాలామందికి తెలియదని అలాంటి వారికోసం ప్రత్యేకంగా ఆధునిక సాంకేతికతతో ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఫిలింనగర్ రోడ్ నెం 82లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కోడలు, స్లీప్ థెరపిటిక్స్ డాక్టర్ హర్షిణికి చెందిన ‘ది బ్రీత్ క్లినిక్’ను ఆయన మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి నిద్ర అనేది ముఖ్యమని, చాలినంత నిద్రలేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు ఇలాంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా జనాభా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అలాంటి వారికోసం తాము మూడు ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, తెలుగు రాష్ట్రాల్లోనే నిద్రకు సంబంధించి ఇది తొలి క్లినిక్ అని అన్నారు. -
కిమ్ జోంగ్కు ఇన్సోమ్నియా డిజార్డర్!
ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అరోగ్య పరిస్థితి గురించి మరో కథనం తెరపైకి వచ్చింది. ఆయన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నాడని, ఆయనకున్న మద్యం, ధూమపానం అలవాటుకు అది మరింత ముదిరి ఆయన ప్రాణం మీదకు తెచ్చే అవకాశం లేకపోలేదంటూ బ్లూమ్‌బర్గ్, న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రముఖ మీడియా హౌజ్‌లలో కథనాలు పబ్లిష్ అయ్యాయి. దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్(NIS) రూపొందించిన ఓ నివేదిక ప్రకారం.. ఉత్తర కొరియా అధికారులు ఇన్సోమ్నియా(నిద్రలేమి)కు సంబంధించి విదేశీ మెడికల్ ఇన్ఫర్మేషన్ను.. ప్రత్యేకించి జోల్పిడెమ్ లాంటి మందులకు సంబంధించిన సమాచారం కోసం తెగ వెతికేస్తున్నారట. ఎన్ఐఎస్ నివేదిక వివరాలను సౌత్ కొరియా పార్లమెంటరీ ఇంటెలిజెన్స్ కమిటీ కార్యదర్శి యూ సాంగ్ బూమ్ మీడియాకు వెల్లడించారు. ఇన్సోమ్నియా ఉత్తర కొరియాను కలవరపెడుతోంది. అక్కడి పెద్ద తలకాయ ఆ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం మాకు ఉంది. అంతేకాదు.. దాని ట్రీట్మెంట్, మందుల సమాచారం కోసం విదేశీ వైద్యవిధానాల గురించి అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారని తేలింది. వీటితో పాటు తాజాగా కిమ్ జోంగ్ ఉన్ బయట కనిపించిన కొన్ని ఫొటోలను అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) ద్వారా పరిశీలించాం. అందులో ఆయన మళ్లీ విపరీతంగా బరువు పెరిగినట్లు స్పష్టమైందని బూమ్ తెలిపారు. వీటితో పాటుగా.. విదేశాల నుంచి మల్బరో, డన్హిల్ లాంటి విదేశీ బ్రాండ్ సిగరెట్లను, ఆల్కాహాల్‌తో పాటు తినే చిరు తిండ్లను ఉత్తర కొరియా విపరీతంగా దిగుమతి చేసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. అతిగా మద్యం, ధూమపానం వల్ల కిమ్ ఆరోగ్యం దిగజారిపోతున్నట్లు కనిపిస్తోంది. దాదాపు 140 కేజీల బరువునకు ఆయన చేరినట్లు తెలుస్తోంది. దీనికి తోడు స్లీపింగ్ డిజార్డర్ ఇన్సోమ్నియా ఆయన్ని వేధిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మే 16వ తేదీన ఆయన ఓ కార్యక్రమానికి వెళ్లగా.. అక్కడ ఆయన కళ్ల కింద నల్లటి వలయాలు స్పష్టంగా కనిపించాయి. అంతేకాదు ఆయన కోసం జోల్పిడెమ్లాంటి మందుల్ని సైతం సేకరిస్తున్నట్లు సమాచారం ఉంది అని సదరు నివేదిక సారాంశాన్ని ఆయన వివరించారు. ఇదిలా ఉంటే.. నార్త్ కొరియాలో ఆహార కొరత కారణంగా.. ఆహార ధాన్యాల ధరలకు రెక్కలు వచ్చిందని, కిమ్ అధికారంలోకి చేపట్టాక పరిస్థితి అంతకంతకూ దిగజారిపోతూ వస్తోందని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంటున్నాయి. ప్రజల ఆకలిని పట్టించుకోకుండా.. విలాసాలు, హైప్రొఫైల్ పార్టీలతో కిమ్ కుటుంబం జల్సాలు చేస్తోందన్న విమర్శలూ బలంగా వినిపిస్తున్నాయి. ఇదీ చదవండి: నిద్ర లేమి ఎంత ప్రమాదకరమంటే.. -
బుర్ర బద్దలయ్యేలా పని చేస్తున్నారా? అంతొద్దు.. లాభమేమీ లేదు!
సాక్షి, హైదరాబాద్: మెదడు.. మన శరీరంలోని అత్యంత సంక్షిష్టమైన నిర్మాణం. ఆలోచనలు, కళలు, జ్ఞాపకాలు, సృజనాత్మకత, తార్కిక బుద్ధి ఇలా అనేక విషయాల్లో మనిషిని ఇతర జీవజాతులకన్నా ఉన్నతంగా, విభిన్నంగా నిలుపుతున్న అవయవం. కోట్లాది న్యూరాన్ల కలబోతగా దైనందిన జీవితంలో చురుకైన పోషిస్తూ.. ఇన్ఫర్మేషన్–ప్రాసెసింగ్ పవర్‌హౌస్ పాత్ర పోషిస్తున్న ఓ మినీ సూపర్ కంప్యూటర్. అయితే నేటి ఆధునిక కాలంలో మనలో రోజురోజుకూ పెరుగుతున్న మానసిక ఒత్తిళ్లకు మెదడు సైతం ప్రభావితం అవుతోంది. ఫలితంగా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య అధికమవుతోంది. ఈ నేపథ్యంలో మెదడుకు విశ్రాంతి ఇవ్వాల్సిన ఆవశ్యకత, ఇవ్వకుంటే కలిగే దుష్ప్రభావాలపై వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. అవి ఏమిటంటే... ►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకుండా బుర్ర బద్దలయ్యేలా పని చేసేందుకు ప్రయత్నిస్తే దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలు అంతంత మాత్రమే. ►మెదడు స్పాంజ్ లాంటిది. అది ఎంతవరకు సమాచారాన్ని భద్రపరచుకోగలదో అంతే చేయగలదు. అందువల్ల బ్రెయిన్‌కు నిత్యం రెస్ట్ అవసరమే. ►పనిచేస్తున్న రోజుల్లో మధ్యలో విరామం తీసుకోవడం వల్ల మూడ్ బాగుకావడంతోపాటు పనితీరు, ఏకాగ్రత మెరుగుపడుతుంది. ►మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వకపోతే అది అనారోగ్య సమస్యలతోపాటు దీర్ఘకాలిక ఒత్తిళ్లకు కారణమవుతుంది. మెదడుకు విశ్రాంతి కోసం... కేవలం నిద్రలోనే మెదడుకు రెస్ట్ దొరుకుతుందనేది కూడా పూర్తిగా శాస్త్రీయం కాదని నిపుణులు అంటున్నారు. మెదడుకు ఎక్కువగా పని కల్పించకుండా ఉంచడం కోసం వివిధ రకాల ధ్యానాలు చేయడం కూడా సరైనదేనని నిపుణులు చెబుతున్నారు. వారి సూచనల ప్రకారం... ►ప్రకృతిలో కాసేపు మమేకం కావాలి. ►మెదడు రిలాక్స్ కావడానికి స్నానం కూడా దోహదపడుతుంది. ►రాత్రిపూట 8 గంటల చొప్పున నిద్ర పోనివారు ఉదయం వేళల్లో కాసేపు కునుకు తీసినా మెదడు పనితీరు మళ్లీ చురుగ్గా మారుతుంది. ►ఏదైనా ఓ ఆట ఆడటం లేదా శారీరక శ్రమతోనూ మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ►సెల్ఫోన్లు, సోషల్ మీడియా వాడకానికి రోజూ కాసేపు విరామం ఇవ్వడం ద్వారా కూడా మెదడు విశ్రాంతి పొందుతుంది. నిద్రలో బ్రెయిన్ వేవ్స్ నెమ్మదిస్తాయి... సుఖనిద్ర సమయంలో బ్రెయిన్ వేవ్స్ (మెదడు కణాలు విద్యుత్ తరంగాల ద్వారా సమాచారం ఇచ్చిపుచ్చుకొనే ప్రక్రియ) నెమ్మదిస్తాయి. ఏదైనా విషయాన్ని 2–3 గంటలపాటు చదివాక కనీసం 15–20 నిమిషాలు నిద్రపోవడమో లేదా కళ్లు మూసుకొని మౌనంగా ఉంటే అది బాగా గుర్తుండిపోతుందని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. నిద్రలో ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఆర్ఈఎం), నాన్ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ (ఎన్‌ఆర్‌ఈఎం) అనే పద్ధతులుంటాయి. ఆర్‌ఈఎంలో కలలు, జ్ఞాపకశక్తి, భావోద్వేగ అంశాల వంటివి ప్రాసెస్ అవుతాయి. మనం మెలకువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఆదే యాక్టివిటీ కొనసాగుతుంది. నాన్ ఆర్‌ఈఎంలో అవి సరిగ్గా ప్రాసెస్ కాక మనసు కలతచెందేలా భంగం కలిగిస్తుంటాయి. బాగా నిద్రపోయినప్పుడు ఆయా అంశాలను క్రమపద్ధతిలో పెట్టేందుకు మెదడు పనిచేస్తుంటుంది. నాన్ ఆర్‌ఈఎంలో నిద్ర సరిగ్గా పట్టక జ్ఞాపకశక్తి తగ్గడం, భావోద్వేగాలను సరిగ్గా విశ్లేషించకపోవడం వల్ల కలత చెందడానికి కారణమవుతుంది. -
నిద్ర లేకపోతే ఎంత డేంజరంటే..? షాకింగ్ విషయాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కంటి నిండా కునుకు తీసి ఎన్నాళ్లయిందో.. మనసారా నిద్రపోవడం ఒక కలగా మారింది..ఇప్పుడు ఎక్కువ మంది నోట వినిపించే మాట ఇది. అనారోగ్యానికి కారణమవుతున్న ప్రధాన సమస్య ఇది. పగలంతా రెక్కలు ముక్కలు చేసుకుని రాత్రికి మంచమెక్కినా నిద్ర పట్టడానికి చాలా సమయం పడుతోంది. ఏ తెల్లవారుజామునో నిద్రలోకి జారుకుని రెండు మూడు గంటలకే మేల్కొనాల్సి వస్తోంది. జీవనశైలిలో వచ్చిన మార్పులు ఇందుకు కారణమవు తున్నాయి. అలాగని జీవనశైలిని ఏమైనా మార్చుకుంటున్నారా అంటే అదీ చేయడం లేదు. గాఢనిద్ర లేక పోవడం ఆరోగ్య పరంగా అనేక అనర్థాలకు దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పనిలో పెరిగిన ఒత్తిళ్లు, అమెరికా వంటి దేశాలలోని మల్టీ నేషనల్ కంపెనీల కోసం నిరంతరం రాత్రి పూట పనిచేయడం నిద్ర లేమికి కారణమవుతూ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న వారిలో 50 నుంచి 60శాతం మంది నిద్ర లేమితో బాధపడుతున్నారని వైద్యుల అధ్యయనంలో తేలింది. ఒకప్పుడు గాఢనిద్ర అంటే పది గంటలు పైమాటే. మారిన పరిస్థితులతో నిద్రను అమెరికన్ స్లీప్ అసోసియేషన్ ఎనిమిది గంటలకు కుదించింది. నీరసం..నిస్సత్తువ నిద్ర లేమిని వైద్య పరిభాషలో ఇన్సామ్నియా అంటారు. దీని బాధితులకు రాత్రి వేళ్లల్లో నిద్ర త్వరగా పట్టకపోవడం, మధ్య రాత్రి వేళల్లో మెలకువ రావడం, త్వరగా లేచిపోవడం, మెదడు పనితీరు క్షీణించడం, నిద్రపోయిన తర్వాత కూడా విశ్రాంతి తీసుకున్న భావన కలగక పోవడం, రోజంతా మత్తుగా ఉండటం జరుగుతుంది. ఫలితంగా నీరసం వచ్చేస్తుంది. పగలంతా శ్రమించిన వారికి, మెదడుకు విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి. వైద్యులు నిద్రను రెండు రకాలుగా పేర్కొంటున్నారు. నిద్రలో ఉన్న 1, 2, 3 దశల్లో గాఢ నిద్రలో 2,3 స్టేజ్‌లుగా చెబుతున్నారు. నిద్రలో మూడో స్టేజ్ చాలా కీలకమైంది. ఉదయం నుంచి జరిగే కార్యక్రమాలు ఈ సమయంలోనే మెదడులో నమోదవుతుంటాయి.ఆ సమయంలో సరిగ్గా నిద్ర పట్టలేదంటే ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్టేనని గుర్తించాలంటున్నారు. నిద్ర అనేది చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఏడాది లోపు పిల్లలు 12 గంటలు నిద్రపోతారు. వయస్సు పెరిగే కొద్దీ 8 గంటలు ఉండాలి. యుక్త వయసు నుంచి 50 సంవత్సరాలు మధ్య ఉన్న వారికి మధ్యాహ్నం నిద్ర పోవడం మంచిది కాదు. నిద్రపోయేందుకు ఇవి పాటించాలి ♦నిద్రపోయే ముందు మొబైల్ చూడకూడదు. ♦పడకునే గదిలో లైట్ వేసుకోకూడదు.అసలు టీవీ ఉండకూడదు. ♦పడుకునే గది కొంత చీకటిగా ఉండాలి.బెడ్‌లైట్ కూడా కాంతివంతంగా ఉండకూడదంటున్నారు. ♦మధ్య వయస్సు వారు మధ్యాహ్నం పడుకోకూడదు. తిన్న తరువాత పడుకోకపోవడమే చాలా మంచింది. ♦బెడ్‌కు ఎదురుగా గడియారం పెట్టుకోవడం, టైం ఎంతయిందనిని తరచు చూడటం వల్ల నిద్ర లేమికి మరో కారణం. ♦ఈ మధ్య కాలంలో నిద్ర లేమితో ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. రెండు, మూడు గంటలు, ఐదు గంటలు లోపు నిద్రపోయే వారిలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ♦ఇది చాలా ప్రమాదకరం. మెదడుతో పాటు ఇతర భాగాలపై ప్రభావం చూపుతోంది. నిద్రపై ఆరోగ్య ప్రభావం సుఖమైన నిద్ర పోయే వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారని వైద్యులు చెబుతున్నారు. పిల్లలు పరీక్షలు కోసం రాత్రి అంతా చదివేసినా అవి ఒకటి, రెండు రోజులు మాత్రమే గుర్తుంటాయి. ఆ తరువాత మరరిచిపోతారు. చదివినంత సమయం నిద్ర కూడా ఉన్నప్పుడే చదువుకున్నది మెదడులో స్థిరంగా ఉంటుంది. పిల్లల్లో .నిద్ర సరిగ్గా లేని వారు పెరగాల్సినంత పెరగక పోవచ్చు. చదవండి: సాహస రాణి.. ‘ఎందుకొచ్చిన రిస్క్’ అన్నవాళ్లే ఎక్కువ, కానీ! నిద్ర పోకపోవడం పొగతాగడం కంటే ప్రమాదకరం పడుకునే ముందు మొబైల్ వినియోగం, ఆన్లైన్, ఛాటింగ్‌లు, డ్రగ్స్ వంటిని తగ్గించాలి. పడుకోవడానికి మూడు గంటలు ముందు కాఫీ, టీ, ఆల్కాహాల్, కూల్‌డ్రింక్ తీసుకోకూడదు. గంట ముందు పాలు తీసుకోవచ్చు. నిద్రపోయేందుకు ముందు వ్యాయామం చేయకూడదు. కొందరు రాత్రి పూట వాకింగ్, వ్యాయామం చేస్తుంటారు. అది ఏమంత మంచిది కాదు. నిద్రపోకపోవడమనేది పొగతాగడం, మద్యం సేవించడం వంటి వాటికంటే ప్రమాదకరంగా పేర్కొంటున్నారు. – డాక్టర్ పిల్లారిశెట్టి శంకర్, ఎండీ, డీఎన్బీ, న్యూరో ఫిజీషియన్, రాజమహేంద్రవరం నిద్ర మాత్రలతో మతిమరుపు మానసిక సమస్యలు, యాంగ్జయిటీ, డిప్రెషన్ వల్ల కూడా స్లీపింగ్ డిస్ట్రబెన్స్ ఉంటుంది. అసలు కారణానికి మందులు వాడాలి తప్ప నేరుగా నిద్రలేమికి మందులు వాడకూడదు. ఆ్రల్పాజోలం ఎక్కువగా వాడుతున్నారు. నిద్రకు సమయ పాలన లేకపోవడంతోనే యువతలో నిద్ర లేమి సమస్యలు వస్తున్నాయి. జీవన శైలి మార్చుకుంటే మందులతో పనిలేదు. శ్వాస సంబంధిత ఇబ్బందుల వల్ల కూడా నిద్ర లేమి ఎదురవుతుంది. నిద్రమాత్రల వల్ల మతిమరుపు త్వరగా వస్తుంది. పాలీ సోమినో గ్రాఫీ యంత్రం ద్వారా నిద్ర లేమిని పరీక్షించవచ్చు. – డాక్టర్ వానపల్లి వరప్రసాద్, మానసిక వైద్య నిపుణుడు, జీజీహెచ్, కాకినాడ -
తోడొకరుండిన అదే భాగ్యమూ.. ఆరోగ్యమూ..
ప్రభుత్వోద్యోగిగా రిటైరైన ఎఎస్‌రావు నగర్ వాసి ప్రహ్లాదరావు, కొన్నాళ్ల క్రితం భార్యను కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం దెబ్బతిని డయాబెటిస్, బీపీ వగైరాలు చుట్టుముట్టాయి. ఇటీవల ఆయన తన వయసుకు తగ్గ తోడును వెదుక్కుని మళ్లీ ఓ జంటవారయ్యారు. కొన్ని నెలల్లోనే ఆయన ఆరోగ్య సమస్యలూ నియంత్రణలోకి వచ్చాయి. పిల్లలంతా వేర్వేరు చోట్ల స్థిరపడిపోవడంతో ఒంటరిగా ఉంటున్న శైలజ (55) ఇటీవలే తనలాగే ఒంటరిగా ఉంటున్న స్నేహితుడితో కలిసి జీవించడం ప్రారంభించారు. విచిత్రంగా ఆమెను వేధించిన డిప్రెషన్, నిద్రలేమి తదితర సమస్యలన్నీ మాయమయ్యాయి. ‘ఏ వయసులోనైనా తోడు అనేది ఒక తప్పనిసరి. అది మనిషిని మానసికంగా సేదతీర్చి అనేక ఆరోగ్య సమస్యలకు చికిత్సలా పనిచేస్తుంది’ అని నగరానికి చెందిన ఫిజిషియన్ డా.శంకర్ చెప్పారు. సాక్షి, హైదరాబాద్ : ఒంటరి జీవితం ఏ వయసులోనైనా దుర్భరమే అయినప్పటికీ.. మరే రకమైన వ్యాపకం లేని వృద్ధులకు అది మరింత తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఈ పరిస్థితిలోనే అనేక రకాల శారీరక, మానసిక అనారోగ్యాలకు వారు గురవుతారు. అప్పటిదాకా లేని జబ్బులు వారిని చుట్టుముడతాయి. ‘‘మానసిక వేదన, నిరాశా నిస్పృహలు, తాము అప్ర«దాన వ్యక్తులుగా మారామనే భావన...రోగ నిరోధకశక్తిని తీవ్రంగా దెబ్బతీస్తాయి. దాగి ఉన్న వ్యాధులు విజృంభించేలా చేస్తాయి’’ అని సైకాలజిస్ట్ ప్రవీణ్ చెప్పారు నిద్రలేమి, బీపీ తగ్గాయి.. ఒంటరిగా ఉన్నప్పుడు రక్తపోటు, చక్కెర వ్యాధి, నిద్రలేమి వంటి సమస్యలు వేధించేవి. నిత్యం మందులు వాడాల్సి వచ్చేది. ఈ పరిస్థితిలో టైమ్‌కి మందులవీ ఇచ్చి నా బాగోగులు చూసుకునేందుకు ఒకరు ఉంటే బాగుండని రాజేశ్వరిని పెళ్లి చేసుకుంటే... తనే నా పాలిట మెడిసిన్‌గా మారింది. ఇప్పుడు నిద్రలేమి పోయింది.. మందుల అవసరం తగ్గిపోయింది. –కోటేశ్వరరావు ఆ‘పరేషాన్’ తీరింది... వ్యక్తిగతంగా నేనూ 60ఏళ్ల వయసులో పునర్వివాహం చేసుకున్నాను. ఆ పెళ్లి నాతో పాటు నా భర్త ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగయ్యేలా చేసింది. తోడు నీడ స్థాపించడానికి అదో కారణం. మా సంస్థ ద్వారా కొన్ని వందల మంది సీనియర్ సిటిజన్స్‌ని పెళ్లిళ్లు/లివిన్ రిలేషన్ షిప్స్ ల ద్వారా జంటలుగా మార్చాం. అది అనేకమందికి అప్పటికే ఉన్న అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపింది. ఒంటరిగా ఉన్న ఓ పెద్దావిడ ఎప్పటి నుంచో వాయిదా వేస్తూ వచ్చిన మోకాలి చిప్ప ఆపరేషన్ ను పెళ్లయిన వెంటనే చేయించుకోగలిగారనేది దానికో చిన్న ఉదాహరణ మాత్రమే. –రాజేశ్వరి, నిర్వాహకులు తోడు నీడ సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘం (చదవండి: ‘లింక్’ ప్యాకేజ్... అనుసంధాన రోడ్లకు రూ.2410 కోట్లు) -
నిద్ర సరిగ్గా పట్టట్లేదా? ఈ మినరల్ లోపిస్తే అంతే! నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు పాడై!
Health Tips In Telugu: మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎ, బి, సి, డి, ఈ, కె, బీకాంప్లెక్స్, బీట్వెల్వ్(బీ12) వంటి విటమిన్లు ఏవిధంగా అవసరమో, అదేవిధంగా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా అవసరం. మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. మెగ్నీషియం లోపిస్తే ఈ అనారోగ్యాలు వస్తాయి..!! ►సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం దేహానికి అందిస్తాయి. ►ఇలా ఎక్కువసార్లు మెగ్నీషియం కోసం కిడ్నీలపై ఆధారపడితే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు కూడా పాడవుతాయి. ►శరీరంలో తగినంత మెగ్నీషియం లేనప్పుడు మనకు కొన్ని సూచనలు వస్తాయి. వాటిని గమనిస్తే ముందుగానే ఈ లోపం గురించి తెలుసుకొని నివారించవచ్చు. లక్షణాలు..( Magnesium Deficiency Symptoms) ►మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. ►వికారంగా ఉంటుంది. ►వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. ►నీరసంగా ఉంటారు. ► హార్ట్ బీట్‌రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. ► కళ్ళు మసక బారిన ఎక్కువగా ఉంటుంది. ►కండరాలలో నొప్పి వస్తుంది. ►ఒత్తిడి పెరుగుతుంది. ►నిద్ర సరిగ్గా పట్టదు. ►అధిక రక్తపోటు వస్తుంది. ►ఆస్తమాతో బాధపడేవారు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు..!! (Magnesium Rich Foods) ►ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి పండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. ►అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. ►బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. ►మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. ►డార్క్ చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. ►మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు. ►సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే..? ►మెగ్నీషియం ఎక్కువైనా కూడా ఇబ్బందులు తప్పవు. ► కడుపునొప్పి, డయేరియా వచ్చే అవకాశం ఉంది. ►మెగ్నీషియం ఎంత అవసరమో అంతే ఉండేలా చూసుకోవాలి. లోపించినా ప్రమాదమే; ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి సమంగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: Vitamin D Deficiency: విటమిన్- డి.. ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
వాతావరణ మార్పులతో నిద్రలేమి
న్యూఢిల్లీ: నిద్రలేమి.. ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. దీనికి ఎన్నో కారణాలుంటాయి. వాతావరణ మార్పులు కూడా మన నిద్రపై ప్రభావం చూపిస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. భూగోళం ఇంకా ఇంకా వేడెక్కిపోతూ ఉంటే ఈ శతాబ్దం చివరికి ఒక వ్యక్తి ఏడాది కాలంలో పోయే నిద్రలో 50 నుంచి 58 గంటలు తగ్గిపోతుందని జర్నల్ వన్ ఎర్త్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. అంటే మనం పడుకునే సమయంలో రోజుకి పది నిముషాలు తగ్గిపోతుంది. మనం ఎంత సేపు, ఎంత గాఢంగా నిద్రపోతున్నామో చెప్పే రిస్ట్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌ల ద్వారా సేకరించిన గణాంకాలతో ఈ అధ్యయనం రూపొందించారు. మొత్తం 68 దేశాల్లో 47 వేల మంది రాత్రిపూట ఎంతసేపు నిద్రపోయారో రెండేళ్ల పాటు వివరాలు సేకరించారు. ‘‘వాతావరణంలో వస్తున్న మార్పులతో రాత్రిళ్లు వేడిగా మారుతున్నాయి. దీని ప్రభావం వ్యక్తుల నిద్రపై పడుతోంది. వారు నిద్రపోయే సమయం క్రమక్రమంగా తగ్గిపోతోంది.’’ అని ఈ అధ్యయనం సహరచయిత కెల్టన్ మినార్ చెప్పారు. ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయేవారి సంఖ్య 3.5% పెరిగినట్టు ఆ అధ్యయనం వెల్లడించింది. మనుషులు నిద్రపోయే సమయంలో మనుషుల శరీరం వేడిని నిరోధిస్తూ చల్లగా, హాయిగా ఉండేలా చేస్తుంది. బయట ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే అలా వేడిని నియంత్రించడం కష్టంగా మారుతుందని ఆ అధ్యయనం వివరించింది. -
మీకు ఎడమచేతివాటం ఉందా?.. ఇవి తప్పక తెలుసుకోండి.!
మీకు ఎడమచేతివాటం అలవాటా? లేదా మీకు తెలిసిన వారిలో ఎవరైన ఉన్నారా? వీరి గురించి శాస్త్రవేత్తలు తెలియజేసే ఆసక్తికర విషయాలు ఏమిటో తెలుసుకోండి.. ►భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5 నుంచి 10 శాతం మాత్రమే ఎడమచేతివాటం వ్యక్తులు ఉన్నారు. ►కుడిచేతివాటం వ్యక్తులతోపాల్చితే వీరికి ఆల్కహాల్ తీసుకునే అలవాటు మూడు రెట్లు ఎక్కువట. ►మెదడులో కుడి భాగాన్ని వీరు ఎక్కువగా వినియోగిస్తారు. ►యుక్తవయసులోకి 4 నుంచి 5 నెలలు ఆలస్యంగా అడుగుపెడతారు. ►ప్రముఖ టెన్నిస్ ఆటగాళ్లలో 40శాతం ఎడమచేతివాటం ఉన్నవారే ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? ఎడమచేయి అలవాటు ఉన్నవాళ్లు బేస్‌బాల్ ఆటల్లో నిష్ణాతులట. టెన్నీస్, స్విమ్మింగ్, బాక్సింగ్ ఆటలు బాగా ఆడతారట. ►మొత్తం 26 అమెరికా అధ్యక్షుల్లో 8 మంది ఎడమచేతి వాటం ఉన్నవాళ్లే. జేమ్స్ ఎ గార్ఫీల్డ్, హెర్బర్ట్ హూవర్, హ్యారీ ఎస్ ట్రూమాన్, గెరాల్డ్ ఫోర్డ్, రోనాల్డ్ రీగన్, జార్జ్ హెచ్‌డబ్యూ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా. ►గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లెఫ్ట్ హ్యండ్ వ్యక్తుల్లో 26 శాతం మంది ధనవంతులౌతారు. ►చరిత్రలో మంచికి కానీ చెడుకి కానీ పేరుగాంచిన వారిలో ఎడమచేతివాటం ఉన్నవాళ్లే ఎక్కువగా మంది కనిపిస్తారు. వీరిలో సృజనాత్మకత, సంగీత సామర్ధ్య లక్షణాలు కూడా ఎక్కువేనట. బోస్టన్ స్ట్రాంగ్లర్, ఒసామా బిన్ లాడెన్, జాక్ ది రిప్పర్ అందరూ ఎడమచేతి వాటం గలవారే. ►left అనే ఇంగ్లీష్ పదం ఆంగ్లో సక్సాన్ పదమైన lyft నుంచి వచ్చింది. దీనికి విరిగిన లేదా బలహీణం అని అర్థం. ►20 యేళ్ల మహిళలతో పోల్చితే 40 యేళ్లు దాటిన స్త్రీలు 128 శాతం ఎడమచేతివాటం ఉన్న శిశువులకు జన్మనిస్తున్నారట. ►ఎడమచేతివాటం వ్యక్తులు గణితం, భవన నిర్మాణ (ఆర్కిటెక్చర్), అంతరిక్ష రంగాల్లో మరింత ప్రతిభావంతులని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కుడిచేతి వారు మాటలు చెప్పడంలో నిష్ణాతుని కూడా పేర్కొన్నాయి. ►ప్రతి నలుగురు అంతరిక్ష వ్యోమగాముల్లో ఒకరు ఎడమచేతివాటం వారే! ►అమెరికా జనాభాలో 30 లక్షల మంది ఎడమచేతివాటం పౌరులున్నారు. ►వీరికి ఆస్థమా, అలర్జీల సమస్యలు అధికంగా ఉంటాయి. ►ఎడమచేతికి గాయమైతే, కుడిచేత్తో పనులు చేయడం త్వరగానే నేర్చుకుంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ►బ్రిటీష్ రాజ కుటుంబంలో క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ 2, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీళ్లంగా ఎడమచేతివాటం వారే. కుటుంబాన్ని ముందుకు నడిపే నైపుణ్యం వీళ్లకి ఎక్కువే. ►వీరు ఇన్సోమ్నియా అనే నిద్రలేమి వ్యధికి ఎక్కువగా గురౌతారు. ►ఆగస్ట్ 13ను ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు. ►వీరు పొడవైన పదాలను స్పీడ్‌గా టైప్ చేయగలరట. ►ఎడమ చేతి వాటం ఉన్న వ్యక్తులు కుడిచేతి వాటం వారి కంటే నీటి అడుగున ఉన్నవాటిని స్పష్టంగా చూడగలుగుతారు. ►కుడి చేతివాళ్ల కంటే వీరిలో కొంచెం కోపం ఎక్కువని జర్నల్ ఆఫ్ నెర్వస్ అండ్ మెంటల్ డిసీజ్ నిర్వహించిన అధ్యయనాలు తెలుపుతున్నాయి. ప్రముఖ టెన్నీస్ ఆటగాడు జాన్ మెక్ఎన్రో చాలా కోపిష్టి. ఇతను ఎడమచేతి వాటం ఆటగాడే. ఇవన్నీ పరిశోధనల్లో తేలిన విషయాలు. ఐతే అందరిలో ఇక్కడ ఇచ్చిన అన్ని లక్షణాలు ఉండక పోవచ్చు. సాధారణంగా కనిపించే లక్షణాలను మాత్రమే పేర్కొనడం జరిగింది. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ
బీజింగ్: సాధారణంగా ఒక్కరోజు సరిగా నిద్రపోకపోతేనే ఆ ప్రభావం మన మీద చాలా దారుణంగా ఉంటుంది. రోజంతా చిరాకుగా... నిరుత్సాహంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న పని వాతావారణం, సాంకేతికత మన శరీర పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో రాత్రి ఎంత సమయం గడిచినా ఓ పట్టాన నిద్రపట్టదు చాలా మందికి. మనకు వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం. ఇక నిద్రలేమితో బాధపడేవారు వైద్యులను సంప్రదించి.. చికిత్స తీసుకుని సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్త ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ ఏకంగా 40 ఏళ్ల నుంచి నిద్ర పోవడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టడం లేదట. నిద్రమాత్రలు వేసుకున్నప్పటికి ప్రయోజనం లేదని వాపోతుంది. ఆ వివరాలు.. చైనా హెనాన్ ప్రావిన్స్‌లో నివసించే లి జ్యానింగ్ అనే మహిళ(45) గత 40 ఏళ్లుగా ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంది. ఈ వింత జబ్బు ఆమెని ఒక్క సెకను కూడా నిద్రపోనివ్వడం లేదట. తనకు 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా నిద్రపోయినట్లు గుర్తుందని.. ఆ తర్వాత ఈ వింత వ్యాధి బారిన పడటంతో ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని తెలిపింది జ్యానింగ్. (చదవండి: నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది ) ఈ విషయాన్ని జ్యానింగ్ భర్త కూడా అంగీకరించాడు. పెళ్లైన నాటి నుంచి ఇప్పటివరకు జ్యానింగ్ నిద్రపోవడం తాను చూడలేదన్నాడు. రాత్రంతా మెలకువగా ఉండటంతో టైం పాస్ కోసం ఇంటి పనులు చేయడం, టీవీ చూస్తూ గడుపుతుందన్నాడు. ఇక ప్రారంభంలో భార్యను ఈ సమస్య నుంచి బయటపడేయడం కోసం జ్యానింగ్ భర్త నిద్ర మాత్రలు కూడా తీసుకువచ్చాడట. కానీ అవి కూడా ఆమె మీద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. వాటిని వాడటం మానేసిందట. (చదవండి: రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతే.. ఈ సమస్యలు తప్పవు!) ఈ వింత జబ్బు వల్ల జ్యానింగ్ తన గ్రామంలో చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా జ్యానింగ్ను టెస్ట్ చేయడం కోసం చాలా మంది రాత్రి పూట ఆమె ఇంటికి వచ్చి.. పేకాట ఆడుతూ ఉండేవారు. అలా ఆడుతూనే వారికి తెలియకుండా నిద్రలోకి జారుకునేవారు. కానీ జ్యానెంగ్ మాత్రం అలానే మెలకువగా ఉండేదట. సమస్య పరిష్కారం కోసం జ్యానెంగ్ ఎన్నో ఆస్పత్రులను సందర్శించింది.. ఎందరో వైద్యులను కలిసింది. కానీ ఆమె సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. (చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..) అయితే సాధారణంగా వారం రోజుల కంటే ఎక్కువ సమయం ఎవరు నిద్ర పోకుండా బతకలేరు. అలాంటిది జ్యానెంగ్ ఇన్నేళ్లు నిద్ర పోకుండా ఉంది అనే వార్తలను జనాలు పెద్దగా నమ్మడం లేదు. బహుశా ఆమెకు రాత్రి నిద్ర పట్టకపోవచ్చు.. పగటి పూట నిద్ర పోతుండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. -
కోవిడ్ బాధితుల కష్టాలు తెలిస్తే కంటనీరు ఆగదు..
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎవరో తరుముతున్నట్లు అనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటుంది. రాత్రిపూట కళ్లు మూసుకుంటే చాలు పీడకలలు వచ్చేస్తున్నాయి. భయంతో నిద్ర పట్టడం లేదు..’ కొద్ది రోజుల క్రితం కోవిడ్ నుంచి బయటపడిన ఒక మహిళ భయాందోళన ఇది. ‘తీవ్రమైన అలసట, నిస్సత్తువ, తలనొప్పి, మనస్సంతా భారంగా దిగులుగా ఉంది.’ కోవిడ్ నుంచి బయటపడిన హిమాయత్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి ఆవేదన ఇది. ఇటీవల కాలంలో ఈ తరహా పోస్టు కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు మానసిక వైద్య నిపుణులు, న్యూరోసైకియాట్రిస్టులు పేర్కొంటున్నారు. మొదటి దశ కోవిడ్ బాధితుల్లో ఎక్కువ శాతం శారీరక బాధలు కనిపించగా ప్రస్తుతం రెండో దశ బాధితుల్లో మానసిక సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మహమ్మారి భారినుంచి బయటపడినా చాలామందిని దాని తాలూకు నీలినీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు వైరస్ తగ్గుముఖం పట్టింది. ఆ సమయంలో కేసుల తాకిడి తక్కువగానే ఉంది. డిసెంబర్లో తిరిగి కోవిడ్ పాజిటవ్ కేసులు క్రమంగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కేసుల సంఖ్య పెరిగింది. మార్చి నుంచి రెండో దశ ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ ఉధృతి తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వైద్యసేవలు లభించి వ్యాధి నుంచి బయటపడినప్పటికీ భయాందోళనలు, కుంగుబాటు, మానసిక వ్యాకులత, నిద్రలేమి వంటి సమస్యలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డాక్టర్ ఎన్.శ్వేతారెడ్డి తెలిపారు. గులియన్ బ్యారో సిండ్రోమ్.. కొంతమందిలో చాలా అరుదైన గులియన్ బ్యారో సిండ్రోమ్ లక్షణాలు కూడా కనిపించినట్లు ఆమె చెప్పారు. రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపే ఈ జబ్బు వల్ల శారీరకరంగా బలహీనంగా మారుతారు. బరువు తగ్గిపోవడం, కూర్చుంటే లేవలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. దీని ప్రభావం కొద్ది రోజులే ఉంటుంది. మరోవైపు 60 ఏళ్లు దాటిన వారిలో న్యూరోపతి లక్షణాలు ఎక్కువగా కనిపించినట్లు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. మోకాళ్ల నుంచి పాదాల వరకు నొప్పులు, అరికాళ్ల మంటలు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చాలా మందిని తిమ్మిర్లు వేధిస్తున్నాయి. మెగ్రెయిన్‌ను తలపించే విధంగా తలనొప్పి ఉంటుంది. గుండెదడ వంటి సమస్యలతో కొందరు బాధపడుతున్నారు. నూటికి ఒకరిద్దరిలో ఆత్మహత్యాభావన కూడా కనిపిస్తుందని న్యూరోసైకియాట్రిక్ వైద్య నిపుణులు చెబుతున్నారు. చదవండి: ముంబై నుంచి తెలంగాణ: ఈ జర్నీ చాలా కాస్ట్లీ గురూ! కరోనా ప్రతాపం: ఆట పాటలకు టాటా! -
నిద్రలేమితో బాధపడుతున్నారా.. ఇలా చేయండి!
రోజూ తగినంత నిద్రపోవడం కూడా ఆరోగ్యాన్ని చేకూర్చే అంశాల్లో ఒకటి. సరిపడనంత నిద్ర పట్టకపోవడాన్ని ‘నిద్రలేమి’ (ఇన్సామ్నియా)గా వ్యవహరిస్తారు. ఇది కూడా అందరిలో ఒకేలా ఉండదు. నిద్రలేమిలో రకాలివి... ►ప్రైమరీ ఇన్సామ్నియా:స్వాభావికంగానే నిద్రపట్టకపోవడాన్ని ప్రైమరీ ఇన్సామ్నియా అంటారు. అంటే... ఇది శరీరంలోని ఏదో అవయవం లేదా భాగంలోని సమస్య వల్ల నిద్రపట్టకపోవడం కాదన్నమాట.. ► సెకండరీ ఇన్సామ్నియా: మన శరీరంలోని ఏదైనా ఇతర సమస్య వల్ల నిద్రలేమి రావడాన్ని సెకండరీ ఇన్సామ్నియా అంటారు. అంటే ఉదాహరణకు ఆస్తమా, డిప్రెషన్, క్యాన్సర్, గుండెమంట, కీళ్లనొప్పులు లేదా ఇతర అవయవాల్లో ఏదైనా నొప్పి వల్ల నిద్రపట్టకపోవడం మత్తుపదార్థాలు తీసుకోవడం వల్ల నిద్రపట్టకపోవడం లేదా ఒక్కోసారి పట్టలేని సంతోషం లేదా తీవ్రమైన దుఃఖం వల్ల నిద్రపట్టకపోవడాన్ని సెకండరీ ఇన్‌సామ్నియాగా అభివర్ణిస్తారు. ► నిద్రలేమి కూడా మరో రెండు రకాలుగా ఉండవచ్చు. అది తాత్కాలిక నిద్రలేమి, రెండోది దీర్ఘకాలిక నిద్రలేమి. మొదటిది కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అయితే అది మరీ దీర్ఘకాలం (అంటే మూడు వారాల కంటే ఎక్కువగా) కొనసాగితే దాన్ని దీర్ఘకాలిక నిద్రలేమి అనవచ్చు. కారణాలు ► జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు (ఉద్యోగం మారడం, దగ్గరి బంధువులు చనిపోవడం, విదేశాలకు వెళ్లడం, విడాకులు, రోడ్డు ప్రమాదాల వంటివి). ► శారీరక మానసిక ఆందోళనలు, సమస్యలు ► వాతావరణ పరిస్థితుల ప్రభావాలు (పెద్దశబ్దం, ఎక్కువ కాంతి, ఎక్కువ వేడి/చలి). ► కొన్నిరకాల మందులు (ఉదా: జలుబు, అలర్జీ, ఆస్తమా, డిప్రెషన్, బీపీలకు వాడేమందులు). అసలు నిద్రపట్టకపోవడం ► పడుకున్న తర్వాత మధ్యలో మెలకువ వచ్చి మళ్లీ నిద్ర పట్టకపోవడం ► తెల్లవారుజామున మెలకువ వచ్చి ఆ తర్వాత నిద్రపోలేకపోవడం ►ఉదయం లేవగానే అలసటగా ఉండటం... ► ఇలాంటి లక్షణాలతో నిద్రలేమి ఉంటుంది. చదవండి: వంటలూ వడ్డింపులతో క్యాన్సర్ నివారణ ప్రీ–హైపర్‌టెన్షన్ దశ అంటే..? చికిత్స తాత్కాలిక నిద్రలేమికి చికిత్స అవసరం లేదు. కాకపోతే వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్ల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇక దీర్ఘకాలిక నిద్రలేమి ఉన్నప్పుడు శారీరక, మానసిక సమస్యల వల్ల ఇలా జరుగుతుందేమో పరిశీలించి, వాటికి చికిత్స చేయించుకుంటూ తాత్కాలికంగా నిద్రమాత్రలు వాడవచ్చు. అయితే వాటిని కూడా దీర్ఘకాలం వాడటం వల్ల ఇతర సమస్యలు రావచ్చు కాబట్టి వాటిని పరిమితంగా వాడాల్సి ఉంటుంది. జీవనశైలి మార్పులతో నిద్రను పొందడం మంచిది. దానితో పాటు కొన్నిరకాల విశ్రాంతి వ్యాయామాలు, కౌన్సెలింగ్ వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. చదవండి: ఆరోగ్యకరంగా బరువు తగ్గించుకోండిలా.. నిద్రలేమిని అధిగమించడానికి కొన్ని సూచనలు ► వేళకు నిద్రపోవాలి. రోజూ వేళకు నిద్రలేవాలి. మధ్యాహ్నం వేళ చిన్న కునుకు తీయకుండా ఉండాలి. ఇలే చేస్తే అది రాత్రి నిద్రకు ఆటంకం కలిగించవచ్చు. ► కాఫీ, నికోటిక్, ఆల్కహాల్ అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి ఉత్ప్రేరకాలుగా పనిచేసి నిద్రలేమికి కారణమవుతాయి. ► వ్యాయామాన్ని జీవితంలో ఒక అంశం చేసుకోవాలి. అయితే నిద్రకు ఉపక్రమించే 3–4 గంటల ముందర వ్యాయామం చేయకూడదు. దీనివల్ల నిద్రపట్టే సమయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ► పడకగది సౌకర్యంగా ఉండాలి. గది నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండాలి. మరీ చీకటిగానూ, మరీ ఎక్కువ వెలుతురుతోనూ ఉండకూడదు. మరీ చలిగానూ, మరీ వేడిగానూ ఉండకూడదు. బనిద్రవేళకు ముందు మంచి పుస్తకం, మంచి సంగీతం వినవచ్చు. అయితే నిద్రపోయే సమయం మించిపోయాక కూడా వాటిలో నిమగ్నం కావడం సరికాదు. గోరువెచ్చని స్నానం సుఖనిద్రను కలగజేస్తుంది. ► పడుకునే ముందు మనసులోకి ఎలాంటి ఆందోళనలూ రానివ్వకండి. రేపటి కార్యక్రమాలను ముందుగానే రాసి పెట్టుకోండి. దానివల్ల మీకు ఎలాంటి ఆందోళనా కలగదు. -డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ – స్లీప్ స్పెషలిస్ట్ -
నగరం నిద్రపోవడం లేదు..
సాక్షి సిటీబ్యూరో : సిటీజనులకు కునుకు కరువైంది. ఆహారం, అనారోగ్యం, మానసిక ఆందోళన నగర జీవిని సుఖనిద్రకు దూరం చేస్తోంది. ఆన్లైన్ చాటింగ్‌లు, టీవీలకు అతుక్కుపోవడం, రాత్రి వరకు బాతాఖానీల్లో మునిగిపోతుండడం వంటి వ్యాపకాల వల్ల నిద్ర సమయం మించిపోతోంది. ఈ కారణంగా మన నగరం నిద్రలేమిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటే హైదరా‘బాధ’ అర్ధం చేసుకోవచ్చు. వర్క్‌ఫ్రం హోమ్‌తో పాటు రోజుల తరబడి ఇంట్లోనే ఉండడంతోనూ స్లీపింగ్ వేళలు మారిపోయాయి. చదవండి: చికెన్.. చికెన్.. మటన్.. చికెన్ నిద్రలేమి అందరికీ ‘త్వరగా పడుకోండి.. త్వరగా నిద్రలేవండి.. అది ఆరోగ్యం, సంపదను ఇస్తుంది’ అనే సూత్రం ఇప్పటి యువతకు అర్థమమ్యేలా చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైందంటున్నారు పరిశోధకులు. అసలు నేటి యువత అనే కాదు.. మహిళలు, పురుషులు, పిల్లలు సైతం నగరంలో సరిగా నిద్ర పోలేకపోతున్నారని కాస్మోస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ బిహేవిరియల్ సైన్సెస్ (సీఐఎంబీఎస్) సంస్థ అధ్యయనంలో తేలింది. పని ఒత్తిడి, ఆందోళన, ప్రవర్తనలో మార్పులతో పాటు చెడు వ్యసనాలు నిద్రలేమికి దారి తీస్తున్నాయని స్పష్టం చేసింది. ఇవేగాకుండా మారిన జీవనశైలి, విధుల నిర్వహణ, వ్యక్తిగత కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయని పేర్కొంది. ఇతర నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లోనే ఎక్కువ హైదరాబాద్ నగరంలో ఆది నుంచే జనం అర్థరాత్రి దాటిన తర్వాత నిద్రపోవడం, పొద్దుపోయాక లేవడం అలవాటు. దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగరంలో అర్థరాత్రి వరకు విందులు, వేడుకలు ఎక్కువ. మరోవైపు ల్యాప్టాప్స్ లేదంటే మొబైల్ ఫోన్లు ఏదో ఒక దాంతో కాలక్షేపం చేయాల్సిందే! ఇదే నిద్రనూ దూరం చేస్తోందన్నది సుస్పష్టం. కరోనా కూడా ప్రజలను నిద్దురకు దూరం చేసింది. ఈ మహమ్మారి సోకి కోలుకున్న వారిని నిద్రలేమి వేధిస్తోంది. ఈ వైరస్ భయం కూడా మరికొందరిని నిద్ర పోకుండా చేస్తోంది. మొత్తంగా నగరం నిద్రపోవడం లేదు. -
ఒక రోజు నిద్రలేకున్నా ఏమవుతుందో తెలుసా...
నిద్రలేమి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనందరికీ తెలుసు కానీ ఆ పరిణామాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజు నిద్ర పోకపోయినా సమస్యలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మానవ డీఎన్ఏలో మార్పులు చోటుచేసుకుంటాయని హాంకాంగ్‌కు చెందిన ష్యు వేయ్ చాయ్ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన 49మందిపై జరిపిన పరిశోధనలో రాత్రి వేళలో పనులు చేస్తున్న వారిలో శరీరం డీఎన్ఏను మరమ్మత్తు చేయటంలో విఫలమైనట్లు గుర్తించారు. కేవలం ఒక రాత్రి మేలుకోవటం కారణంగా వారి డీఎన్ఏ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు. ఒక రోజు నిద్రను కోల్పోవటం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చాయ్ వెల్లడించారు. మనసు పెట్టి తింటేనే మంచిది... ఉరుకుల పరుగు జీవితం... వేళకు ఏదో గబాగబా తినేసి కానిచ్చేద్దాం అంటే సమస్యలు తప్పవు. భోజనం మీద మనసు లగ్నం చేయడం వల్ల శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయని, ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారని, మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇటీవల బరువు తగ్గేందుకు డైట్ పాటిస్తున్న 53 మందిపై ఆరు నెలలుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విశేషాలేమంటే... 6 నెలల్లో మైండ్‌ఫుల్ ఈటింగ్‌కు సంబంధంచి మూడు, నాలుగు సెషన్స్‌కు హాజరైన వారు సగటున 3 కిలోల బరువు తగ్గారట. ఒకటి, రెండు సెషన్లకు వచ్చినవారు కిలో మాత్రమే తగ్గారట. పండుగలు, సెలవురోజుల్లో కుటుంబం, స్నేహితులతో కలిసి వివిధ రకాల ఆహారపదార్థాలను కడుపునిండా లాగించేస్తాం. తీరా బరువు పెరిగి, మునుపటి షేప్‌లోకి వచ్చేందుకు కసరత్తులు, నానా కష్టాలు పడతాం. అయితే ఈ సమస్యకు సులువైన పరిష్కారం చెబుతున్నారు పరిశోధకులు. మనసుపెట్టి పనిచేయడం వల్ల ఉద్రేకం తగ్గి, ఆలోచనల మీద గురి ఉంటుంది. ఒత్తిడి తగ్గి, అదనపు శక్తి సమకూరి, రెట్టించిన ఉత్సాహం సొంతమవుతుంది. అదేవిధంగా మనసుపెట్టి తినడం వల్ల ఆహారాన్ని సంతృప్తిగా తినడం అలవడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పటిష్ఠమవుతుందంటున్నారు పరిశోధకులు. -
జబ్బులొస్తాయి.. బబ్బోండి
50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చే హృద్రోగ సమస్యలు ఇటీవల చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నిద్రలేమి అని సర్వే స్పష్టం చేసింది. సాక్షి, హైదరాబాద్ : ‘ఆరోగ్యకరమైన జీవితం కోసం మనిషి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. కానీ టార్గెట్లు పూర్తి చేయాలనే ఒత్తిడి, రోజులో ఎక్కువ సేపు రద్దీగా ఉన్న రోడ్లపై ప్రయాణించాల్సి రావడం, వాట్సాప్, ఫేస్‌బుక్‌ల వాడకం కలిపి మనిషిని ఐదారు గంటలకు మించి నిద్రపోనివ్వడం లేదు. తల పక్కనే ఫోన్ పెట్టుకోవడం వల్ల తరచూ మేల్కొనే ఉంటున్నారు. మారిన జీవనశైలికి తోడు కంటికి కునుకు లేకపోవడం, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడం, ఏది పడితే అది తినడం.. ఇవన్నీ కలిపి పరోక్షంగా బీపీ, మధుమేహం, హృద్రోగ సమస్యలకు కారణమవుతున్నాయి’అని నీల్సన్–సఫోలాలైఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తేలిన అంశాలు. నిద్రలేమిపై ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో సర్వే నిర్వహించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూసినట్లు ఆ సంస్థలు వెల్లడించాయి. ఈ మూడు నగరాల్లో నిద్రలేమి సమస్యపై 1,226 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. భాగ్యనగరంలో 56 శాతం.. నిద్రలేమితో ఢిల్లీలో 76 శాతం మంది బాధపడుతుండగా, ముంబైలో 62 శాతం, హైదరాబాద్‌లో 56 శాతం మంది బాధపడుతున్నట్లు బయటపడింది. ఈ నిద్రలేమి తీవ్ర మానసిక ఒత్తిడికి కారణమవుతుండగా, పరోక్షంగా ఇది గుండెపోటుకు కారణమవుతున్నట్లు పేర్కొంది. ఒత్తిడికి గురవుతున్న 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో 57 శాతం మంది, 41 నుంచి 50 ఏళ్లలోపు వారిలో 61 శాతం మందికి హృద్రోగ సమస్యల ముప్పు పొంచి ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇవీ కారణాలు.. నిద్రపోయే సమయంలో వాట్సాప్, ఫేస్‌బుక్‌లను వీక్షించడం, చాటింగ్ చేయడం వల్ల మెదడు నుంచి సెరోటిన్ హార్మోన్ విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. దీని కారణంగా నిద్రలేమి ఏర్పడుతుంది. వేళకు నిద్రపోకపోవడం వల్ల మానసిక ఒత్తిడి సమస్య తలెత్తుతుంది. ఈ ఒత్తిడి అధిక బరువుకు, రక్తపోటు, మధు మేహం వంటి రుగ్మతలకు కారణమవుతుంది. వీటి నియంత్రించకపోవడం వల్ల గుండెపై ప్రభావం చూపుతున్నాయి. యుక్త వయసులో వెలుగు చూస్తున్న గుండెపోటుకు ఇవే ప్రధానంగా కారణమవుతున్నట్లు నిర్ధారించింది. ఐదుగురిలో ముగ్గురికి ఇప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఐదుగురు బాధితుల్లో 2020 నాటికి ముగ్గురు హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడే ప్రమాదం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చే హృద్రోగ సమస్యలు ఇటీవల చిన్న వయసులోనే వెలుగు చూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నిద్రలేమి అని సర్వే స్పష్టం చేసింది. పురుషుల్లోనే అధికం.. అధిక బరువుతో బాధపడుతున్న బాధితుల్లో 57 శాతం మంది, ఒత్తిడిని ఎదుర్కొంటున్న బాధితుల్లో 56 శాతం మందికి హృద్రోగ ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తించింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో మానసిక ఒత్తిడితోపాటు హృద్రోగ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక సుఖనిద్ర పొందిన వారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలినట్ల ఆ సంస్థలు ప్రకటించాయి. 31% మరణాలకు ఇదే కారణం జీవనశైలి మార్పు, పని ఒత్తిడి.. వెరసి అధిక బరువు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు కారణమవుతుంది. పరోక్షంగా ఇవి గుండె పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న 31 శాతం మరణాలకు గుండె పోటే కారణం. సాధ్యమైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవడం, రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవడం, కుటుంబ సభ్యులతో గడపడం, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండటం, రోజుకు కనీసం అర గంట వ్యాయామం చేయడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. – డాక్టర్ వాసు, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ జంక్ ఫుడ్తోనే అసలు ముప్పు మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాలకు బదులు చెడు కొవ్వు స్థాయిలు పెరుగుతున్నాయి. శరీరంలో పేరుకుపోతున్న ఈ కొవ్వును కరిగించే చర్యలు చేపట్టకపోవడం వల్ల కూడా గుండె పనితీరు దెబ్బతింటుంది. ప్రతి రోజూ ఉదయం అరగంట వ్యాయామం చేయడం, వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. –డాక్టర్ సుజాతా స్టీఫెన్, పోషకాహార నిపుణురాలు -
నిదురపోరా తమ్ముడా..
ఆఫీసులో లంచ్ లాగించాక.. మధ్యాహ్నం 1– 4 గంటల మధ్య కునుకుపాట్లు పడే ఉద్యోగులెందరో..ఇక ఆ పాట్లు వద్దు..ఏకంగా ఆఫీసులో కునుకేయడానికి ఏర్పాట్లు చేస్తే బెటర్ అని అంటున్నారు మెజారిటీ ఉద్యోగులు. నిద్రలేమికి పరిష్కారాలు కనుగొనే స్టార్టప్ సంస్థ వేక్‌ఫిట్.కామ్ ఇటీవల ఆన్లైన్లో చేపట్టిన దేశ వ్యాప్త సర్వేలో ఇదే తేలింది. ఈ సర్వే నివేదికను ‘పని వేళల్లో కునుకు ఒక హక్కు’ అన్న పేరుతో సదరు సంస్థ విడుదల చేయడం విశేషం. బోలెడన్ని లాభాలు.. మధ్యాహ్నం పూట కాస్త కునుకు వేస్తే.. మనిషిలో శక్తి సామర్థ్యాలు రెట్టింపు అవుతాయని, వారి ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువు కావడంతో ఈ సర్వేలోని అంశాలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీసుల్లో పనిచేసేవారికి ఒత్తిడి ఎక్కువ ఉంటుందని.. దీన్ని అధిగమించడానికి కునుకు తీయడానికి అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సర్వే తెలిపింది. ‘దేశంలో నిద్రలేమికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయాయి. అందుకే బడా కంపెనీలు, ఉద్యోగులతో అత్యధిక పని గంటలు చేయించుకునే సంస్థలు వాళ్లు కునుకు తీయడం కోసం ప్రత్యేకంగా చాంబర్లు పెట్టాలి‘ అని వేక్‌ఫిట్ సంస్థ డైరెక్టర్ చైతన్య రామలింగగౌడ చెబుతున్నారు. కాగా, గోద్రేజ్, ఎక్సెంచర్, గూగుల్, భారతి ఎయిర్టెల్, కోక కోలా వంటి సంస్థలు మాత్రమే పనిచేయడానికి అవసరమైన ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేసినట్టుగా ఈ సర్వే తెలిపింది. ఈ సంస్థలన్నీ కంపెనీ నియమనిబంధనల కంటే ఉద్యోగుల సంక్షేమం కోసం ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా పేర్కొంది. సర్వే ఏం చెప్పింది.. కునుకుతీయడానికి ఆఫీసుల్లో ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలని చెబుతున్నవారు 86% పనిఒత్తిడితో రాత్రిపూట సరిగా నిద్రపట్టక, మర్నాడు ఆఫీసులో నిద్రమత్తుతో జోగుతున్నామని చెప్పినవారు 40% వారంలో రెండు, మూడు రోజులు మాత్రమే నిద్ర వస్తుందని చెప్పినవారు 80% వారమంతా నిద్రతో తూలిపోతూ ఉంటామన్న వారు 5% -
నిను వీడని నీడను నేనే
సాక్షి, విశాఖపట్నం : కంటినిండా కునుకు కరువయ్యిందా..?అయితే.. పనిలో ఏకాగ్రత కోల్పోతారు.చిన్న విషయానికే కోపం, చిరాకు పడుతుంటారు..ఊబకాయులుగా మారిపోతారు..అవునా.. సరిగా నిద్రపోకపోతే ఇన్ని సమస్యలు వెంటాడతాయా? అని ఆశ్చర్యపోతున్నారా.? ఇది అక్షరాలా నిజం. ఎందుకంటే ఎవరైనా నిద్రపోతున్న వారిని మేల్కొలిపితే ‘బంగారం లాంటి నిద్ర చెడగొట్టావు’ అంటూ కొంచెం అసహనం వ్యక్తం చేస్తారు. నిద్రను బంగారంతో పోల్చడం చూస్తే ఎంతటి ప్రాధాన్యం ఉందో ఇక్కడే తెలిసిపోతోంది. మానవుడికే కాదు పశుపక్ష్యాదులకూ నిద్ర అవసరమే. ఆకలి రుచి ఎరగదు.. నిద్ర సుఖమెరగదు.. అంటారు. కడుపు నిండా తిండి.. కంటి నిండా నిద్ర.. ఇంతకు మించిన జీవితం ఏముంటుందనడంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా కంటికి కునుకు దూరమైపోతోంది. నిద్రలేమితో కనురెప్పలు మూతలు పడక అలసిపోతున్నాయి. ఈ విపత్కర పరిణామాలు ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నాయి. ఉద్యోగ ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, చదువులో విపరీతమైన పోటీ.. సాధారణంగా వీటివల్లే నిద్రలేమి సమస్యలు వస్తాయి. వీటన్నింటికంటే యువత నిద్రలేని రాత్రులు గడుపుతుండటానికి మూలకారణం ఇంటర్నెట్ వినియోగం, స్మార్ట్‌ఫోన్ ఫీవర్. వీటితో సావాసం చేసుకుంటూ నిద్రమానుకుంటున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ అంటూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఏడాది కిందట ఎయిమ్స్ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా 70 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని వెల్లడైంది. ఇక విశాఖ నగరం విషయానికొస్తే 60 శాతం మంది నిద్రలేమితో బాధపడుతున్నారని తేలింది. ఇందులో యువతే ఎక్కువ శాతం ఉంది.. రోజుకు 7 గంటలు నిద్రపోయిన వారిలో మరణశాతం రేటు తక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. అలాగే రోజుకు 6 గంటల కంటే తక్కువ 8 గంటల కంటే ఎక్కువ పడుకున్నా.. 15 శాతం మరణ రేటు పెరుగుతుందని వెల్లడించింది. ఒకప్పుడు నిద్ర పోయే సమయం రాత్రి 7 నుంచి 8 గంటలకు ప్రారంభమయ్యేది. టీవీలు వచ్చాక అది కాస్తా 10 గంటలైంది. కంప్యూటర్లు వచ్చాక 11 గంటలు., స్మార్ట్ఫోన్లు వచ్చాక అర్ధరాత్రి 12.. ఒంటి గంట, 2 గంటలు.. ఇలా.. దాటిపోతోంది. నగరంలోనూ నిద్రలేమి దేశ రాజధానిలోనే కాదు.. ప్రతి నగరం దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. విశాఖ నగరంలో ముఖ్యంగా యువతరం నిద్రకు దూరమైపోతోంది. ఒక దశలో అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల వరకూ నిద్రపోకుండా కొన్ని నెలల పాటు కాలం వెళ్లదీసిన వారి శరీర గడియారంలో వచ్చిన మార్పుల కారణంగా నిద్రపోదామని ఇప్పుడు ప్రయత్నిస్తున్నా.. ఫలితం శూన్యం. కేవలం యువతరమే కాదు.. ఉద్యోగులు, వ్యాపారులు సైతం.. తమ పనులు ముగించుకుని ఇంటికి వచ్చాక.. సెల్‌ఫోన్‌తో సావాసం చేస్తూ.. ఆరోగ్యానికి మేలు చేకూర్చే నిద్రను మరిచిపోతున్నారు. ఓవైపు పని ఒత్తిడి, మరోవైపు.. టెక్నాలజీ రెండూ కలిసి సిటీజనులను నిద్రకు దూరం చేస్తున్నాయని నగరానికి చెందిన పలు సంస్థలు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 83 శాతం మంది కలత నిద్రకు గురవుతున్నట్లు ఈ సర్వేలో తేలింది. ప్రభుత్వ, ప్రైవేట్, సొంత వ్యాపారాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రజలు నిద్ర సుఖానికి దూరమైపోతున్నారు. నిత్యం 7 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నవారు 31 శాతం కాగా, 6 గంటల కంటే తక్కువ సమయం శయనిస్తున్నవారు 27 శాతం మంది ఉండటం గమనార్హం. ఇక 25 శాతం మంది ఏకంగా 5 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారని అధ్యయనంలో తేలింది. 35 శాతం మంది అర్ధరాత్రి 12 నుంచి ఒంటిగంట దాటిన తర్వాత కానీ.. నిద్రకు ఉపక్రమిస్తున్నారంట. రాత్రి సమయంలో నిద్రలేమి కారణంగా పని చేస్తున్న ప్రాంతాల్లో 83 శాతం మంది ఓ పావు గంట సేపు కునుకు తీస్తున్నారని అధ్యయనంలో తేలింది. చక్కటి నిద్రకు చిట్కాలివే.... నిద్రకు ఉపక్రమించే ముందు టీ, కాఫీలు తాగకూడదు. నిద్రపోయే ప్రదేశంలో చీకటిగా ఉండాలి. వెలుతురు కళ్లపై పడకుండా జాగ్రత్త పడాలి. నిద్రకు ఉపక్రమించే సమయంలో సెల్ఫోన్లను దూరం పెట్టాలి. అవసరమైతే స్విచాఫ్ చేయాలి. వీలైనంత వరకూ పడుకునే సమయానికి గంట ముందుగానే టీవీలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు ఆఫ్ చేయాలి. మంచి పుస్తకం చదువుతూ నిద్రపోతే గాఢనిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంటే.. రాత్రి 8 గంటలకే ఆఫ్ చేయాలి. అప్పుడే సోషల్‌మీడియాలో ఎలాంటి అప్డేట్స్ మిమ్మలను విసిగించవు. మెడిటేషన్ సాధన చేస్తూ.. శరీరంపై పట్టు సాధించాలి. యోగా, నడక, వ్యాయామాన్ని దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. మధ్య వయసులో ఉన్న వారు 24 గంటల్లో కచ్చితంగా నిద్రకు 8 గంటలు కేటాయించాలి. మిగిలిన 8 గంటలు పని, మరో 8 గంటలు శారీరక అవసరమైన పనులకు వినియోగించాలి. -
కొత్త కష్టాల్లో హైదరాబాదీలు..
నగరాలు అభివృద్ధికి పట్టుకొమ్మలు, ఉపాధికి ఊతమిచ్చేవి, వేగంగా పరిగెత్తేవని చెప్పే మాటలు నిజమే! అవును.. గ్రామాల సంస్కృతిని మరచి, పోష్ కల్చర్‌కు మారడమే నిజమైన అభివృద్ధేమో! ఉద్యోగాలంటూ ఊపిరాడనివ్వకుండా, నిద్రపోని రోబోల్లాగా ఉద్యోగులతో పని చేయించడమే అసలైన ఉపాధనుకోవాలేమో! పీల్చుదామంటే స్వచ్ఛమైన గాలి దొరకదు.. పడుకుందామంటే కంటినిండా నిద్రా పట్టదు! ఇది కదా అభివృద్ధిలో అంతర్జాతీయ నగరాలతో పోటీపడటమంటే! పోటీ అభివృద్ధిలోనే కాదు, ప్రజల ఆయుః ప్రమాణాలను పెంచడంలోనూ ఉండాలన్నది మనందరం గుర్తెరగాల్సిన సమయమిది. ఆయుష్షు రేటును పక్కన పెట్టండి.. మంచి నిద్రకు కరువై.. భారంగా బతుకీడుస్తున్న పట్టణవాసుల బాధలు తెలుసుకుందాం రండి. సాక్షి, హైదరాబాద్: హైదరాబాదీలు కొత్త కష్టాల్లో చిక్కుకున్నారు. ఎప్పుడూ ఉండే ట్రాఫిక్, కాలుష్యం కష్టాలు కావివి. ఉరుకులు, పరుగుల నగర జీవితంలో.. ఊపిరి సలపకుండా పనిచేసే భాగ్యనగర వాసులను సరికొత్త బీమార్ తెగ ఇబ్బంది పెడుతోంది. ‘నిద్రలేమిగా’ పిలిచే ఇన్సోమ్నియా వ్యాధితో హైదరాబాద్‌లోని దాదాపు 79 శాతం మంది బాధపడుతున్నట్టు ఒక సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వేలో భాగంగా సదరు సంస్థ హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, ముంబై, ఢిల్లీలోని దాదాపు 16వేల మందిని కలిసింది. సర్వే ఫలితాల ప్రకారం నిద్రలేమి అనేది ప్రస్తుతం మన దేశంలో చాలామంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో ఆయా నగరాల్లోని మనుషుల ఆయుః ప్రమాణాలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని సర్వే తెలిపింది. (చదవండి : నిద్రలేమితో మహిళలకు మరింత చేటు) హైదరాబాద్‌లో ఇన్సోమ్నియాతో బాధపడుతున్న వారి సమాచారం: - హైదరాబాద్‌లోని దాదాపు 48 శాతం జనాభా రాత్రి 11 నుంచి 1 గంటల మధ్య నిద్రిస్తారు. - నగర ప్రజల్లో 25 శాతం మంది రోజులో 7 గంటల కంటే తక్కువ సమయం పడుకుంటారు. - హైదరాబాద్‌లోని 79 శాతం మంది ప్రజలు ఇన్సోమ్నియా వ్యాధితో బాధపడుతున్నారు. - రాత్రిళ్లు నిద్రపోకుండా ఎక్కువగా ల్యాప్టాప్స్, మొబైల్స్‌లో బిజీగా గడుపుతున్న వారి సంఖ్య నగరంలో 28 శాతంగా ఉంది. - అప్పుల బాధతో నిద్ర కరువైన వారి శాతం 23గా ఉందని తెలుస్తోంది. - 89 శాతం హైదరాబాదీలు వారంలో 1 నుంచి 2 సార్లు నిద్రలో ఉండగా అకస్మాత్తుగా మేల్కొంటారు. - భాగ్యనగరంలోని 45 శాతం ప్రజలు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. - 81 శాతం నగరవాసులు వారంలో 1-3 రోజులు నిద్రమత్తులోనే పనిచేస్తున్నారు. సర్వే చేసిన వేక్‌ఫిట్ సంస్థ అధినేత అంకిత్ గార్గ్ మాట్లాడుతూ.. ‘నిద్రలేమితో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటు (హై బీపీ), అనవసర ఆందోళన లాంటి రోగాలు వచ్చే చాన్సులు ఎక్కువగా ఉంటాయి. మేం హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 2000 శాంపిల్స్ సేకరించాం. సర్వేతో మన ప్రజలు ఈ సమస్యల బారిన ఎలా పడుతున్నారో తెలిసింది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారిలో అనేకులు దీన్నో సమస్యలా చూడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. వీటి పరిష్కారం కోసం మేం అహర్నిషలు కృషి చేస్తున్నాం. ప్రజల్లో ఈ వ్యాధి గురించిన అవగాహన తీసుకురావాల్సిన అవసరముంద’ని అభిప్రాయపడ్డారు. వేక్‌ఫిట్ సంస్థ 2016లో బెంగళూరును తన కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది. భారతీయుల నిద్రించే అలవాట్లు, నిద్రలేమి కారణాలపై పరిశోధన జరుపుతోందీ సంస్థ. గత మూడేళ్ల నుంచి వేక్‌ఫిట్ ఉద్యోగులు దేశంలోని వేలాది మందిని కలిసి వారి నిద్ర సంబంధిత అలవాట్లు, సమస్యలపై ఇంటర్వ్యూలు తీసుకొని, సమస్యలకు పరిష్కారంగా ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తోంది. -
నిద్రలేమితో మహిళలకు మరింత చేటు
నిద్రలేమి వల్ల నానా రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి ఫలితంగా పురుషుల ఆరోగ్యం కంటే మహిళల ఆరోగ్యం మరింతగా క్షీణించే అవకాశాలు ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. అమెరికాలోని ఒక మెడికల్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని 323 మంది మహిళలపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. వారిలో నిద్రకు సంబంధించి చిన్న చిన్న అవరోధాలు ఎదుర్కొన్న వారిలో రక్తపోటు పెరిగినట్లు గుర్తించారు. రోజు మొత్తంలో ఏడు నుంచి తొమ్మిది గంటల సేపు నిద్రపోయినా, నిద్రలో తలెత్తే అవరోధాలు రక్తపోటును పెంచుతాయని ఈ అధ్యయనం ద్వారా గుర్తించామని అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పడుకున్న తర్వాత నిద్ర పట్టడానికి సాధారణ సమయం కంటే ఎక్కువ సమయం పట్టడం, తగినంత సేపు నిద్ర లేకపోవడం, చెదురు మదురుగా నిద్ర పట్టడం వంటి తీవ్ర సమస్యలు ఉన్నట్లయితే రక్తపోటుతో పాటు గుండెజబ్బులకు కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు.