బంజారాహిల్స్ (హైదరాబాద్): నిద్రలేమి సమస్యలతో పాటు నిద్రలో వచ్చే అనేక ఇబ్బందులకు ఎక్కడికి వెళ్లాలో చాలామందికి తెలియదని అలాంటి వారికోసం ప్రత్యేకంగా ఆధునిక సాంకేతికతతో ఆస్పత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఫిలింనగర్ రోడ్ నెం 82లో ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కోడలు, స్లీప్ థెరపిటిక్స్ డాక్టర్ హర్షిణికి చెందిన ‘ది బ్రీత్ క్లినిక్’ను ఆయన మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి నిద్ర అనేది ముఖ్యమని, చాలినంత నిద్రలేకపోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకు ఇలాంటి ఆస్పత్రులు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ హర్షిణి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి పైగా జనాభా నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. అలాంటి వారికోసం తాము మూడు ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేశామని, తెలుగు రాష్ట్రాల్లోనే నిద్రకు సంబంధించి ఇది తొలి క్లినిక్ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment