
కొందరు పగటివేళ చురుగ్గా ఉండటానికి ఆహారం తక్కువగా తీసుకుంటూ, రాత్రి మాత్రం ఫుడ్ కాస్త గట్టిగానే తినేస్తుంటారు. రోజువారీ పనులన్నీ పూర్తయ్యాయనే రిలాక్సేషన్, మర్నాటి ఉదయం వరకు మరో పని ఉండదన్న హాయి ఫీలింగ్‌తో ఇలా చేస్తుంటారు. ఇంకొందరు రాత్రి డిన్నర్లలో ‘బిర్యానీ విత్ డబుల్ మసాలా’ అంటూ కాస్త ఎక్కువగానే ఆరగిస్తుంటారు.
అయితే రాత్రిపూట తినే ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉన్నా, అదిప్రోటీన్ చాలా ఎక్కువగా ఉండే ఆహారమైనా తినేవాళ్లు నిద్రలేమికి గురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు స్లీప్ స్పెషలిస్టులు. రాత్రి నిద్రకు ఉపక్రమించే కనీసం రెండుగంటల ముందుగానే లైట్ ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఎక్కువ మసాలాలతో పాటు కొన్నిసార్లు కాఫీ, కొవ్వులు, చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే ఆహారాలతోనూ నిద్రపట్టకపోవచ్చనీ... హాయిగా నిద్రపట్టాలంటే గోరువెచ్చని పాలు, అరటిపండ్లు, బాదం, తేనె.. వీటిల్లో ఏదైనా తీసుకుంటే, అవి హాయిగా నిద్రపట్టేందుకు దోహదపడతాయన్నది స్లీప్ స్పెషలిస్టుల మాట.
ఇవి చదవండి: ఈ యోగా.. సీతాకోక చిలుక రెక్కల్లా మన కాలి కదలికలు..
Comments
Please login to add a commentAdd a comment