![schools, colleges reopen in kerala - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/30/kerala.jpg.webp?itok=0xA0-5DJ)
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో దాదాపు 15 రోజుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులను టీచర్లు పాటలు పాడుతూ ఆహ్వానించారు. పుస్తకాలు, యూనిఫాం నాశనమయ్యాయన్న బాధను పోగొట్టేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి స్వీట్లను అందజేశారు. ఈ విషయమై కేరళ విద్యా శాఖ మంత్రి ప్రొఫెసర్ సి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 600 పైచిలుకు పాఠశాలలు దెబ్బతిన్నాయని తెలిపారు.
ఇంకా 1.97 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపథ్యంలో కొన్నిచోట్ల పాఠశాలలు తెరుచుకోలేదని వెల్లడించారు. సెప్టెంబర్ 3 నాటికి అన్ని పాఠశాలలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదతో మానసికంగా కుంగిపోయిన పిల్లలందరికీ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. యూనిఫామ్, పుస్తకాలు కోల్పోయిన పిల్లలు బాధ పడొద్దనీ, ప్రభుత్వం కొత్తవి అందజేస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment