collegess
-
ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే టీకాలు..!
సాక్షి, హైదరాబాద్: కళాశాలలు తెరిచిన నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన విద్యార్థులకు కరోనా టీకాలు వేయడంపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు గాను ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల వద్దే మొబైల్ కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్లు వేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశంలో థర్డ్‌వేవ్‌పై నిపుణుల హెచ్చరికలు కొనసాగుతు న్నాయి. మరోవైపు రాష్ట్రంలో విద్యాసంస్థలు బుధవారం నుంచి ప్రారంభమ య్యాయి. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ తదితర ఉన్నత విద్యా సంస్థల వద్ద విద్యార్థులకు టీకాలు అందు బాటులోకి తేనున్నారు. అలాగే అన్ని యూని వర్సిటీల్లోనూ ఈ మేరకు ఏర్పాట్లు చేయను న్నారు. ఉన్నత విద్యా సంస్థల్లో 18 ఏళ్లు నిండిన వారు దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఉంటారని అంచనా. కాగా ఇప్పటివరకు టీకాలు తీసుకోనివారికి వీలైనంత త్వరగా టీకాలు వేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అన్ని వసతిగృహాల్లోనూ వ్యాక్సినేషన్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించిన హాస్టళ్లలోనూ టీకాలు వేయాలని నిర్ణయించారు. 20–30 మంది ఉన్న వసతిగృహాలు, ప్రైవేట్ హాస్టళ్లలోనూ టీకాలు వేస్తారు. ఏదైనా ప్రైవేట్ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉన్నా, సమాచారం ఇస్తే అక్కడకు కూడా మొబైల్ వాహనంలో వెళ్లి వ్యాక్సినేషన్ చేపడతారు. ఎక్కడ వీలైతే అక్కడ వ్యాక్సిన్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ తాజాగా జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాలు పాఠశాల, కాలేజీ బస్సు ఎక్కే విద్యార్థులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి. వీలైతే ఒక సీటులో ఒకరు మాత్రమే కూర్చునేలా చూడాలి. హాస్టళ్లలో విద్యార్థులు గుమికూడకుండా, ఒకే రూములో ఎక్కువమంది ఉండకుండా చూడాలి. భోజనాలకు వేర్వేరు సమయాలు పెట్టాలి. తద్వారా విద్యార్థులు గుంపులుగా ఏర్పడకుండా చూడాలి. ప్రతిరోజూ అన్ని హాస్టళ్లలో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టాలి. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఏమాత్రం కన్పించినా తక్షణమే ఆయా హాస్టళ్లలోని ఐసోలేషన్ గదుల్లో ఉంచాలి. అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలి. -
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ లో విద్యాసంస్థలు ప్రారంభం
-
నైపుణ్య కళాశాలలు: ఏపీ సర్కార్ కీలక ముందడుగు..
సాక్షి, అమరావతి: విద్యార్థులు, యువత మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా వారిలో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఏర్పాటు చేస్తున్న నైపుణ్య కళాశాలల స్థాపనకు కీలక ముందడుగు పడింది. నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు పరిపాలన అనుమతులు ఇస్తూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రూ.1,385.53 కోట్లతో 30 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒకటి చొప్పున 25, ట్రిపుల్ఐటీల్లో ఒక్కొక్కటి వంతున 4, పులివెందులలో ఒకటి ఏర్పాటు చేయనున్నారు. మొదటగా లోక్‌సభ నియోజకవర్గాల్లో 25 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: 2 Years Of YS Jagan Rule In AP: 86 శాతం ఇళ్లకు లబ్ధి వారెప్పటికీ అనాథలు కారు..! -
ఏపీ: రూ.1,200 కోట్లతో 30 నైపుణ్య కళాశాలలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించడానికి నైపుణ్య కళాశాలల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. నైపుణ్య విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. 21 చోట్ల ఇప్పటికే స్థలాల ఎంపిక పూర్తికాగా, త్వరలో టెండర్లు పిలవడానికి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఒక్కో నైపుణ్య కళాశాలను కనీసం 5 ఎకరాల్లో రూ. 40 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 30 కళాశాలలకు రూ. 1,200 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. పరిపాలన అనుమతులు రాగానే టెండర్లు పిలిచి నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నారు. నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని తిరుపతి సమీపంలో కోబాక వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. దివంగత మహానేత వైఎస్సార్ జయంతి రోజైన జూలై 8న నైపుణ్య కళాశాలలకు సీఎం వైఎస్ జగన్ చేతులు మీదుగా శంకుస్థాపన చేయించాలని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 100కు పైగా కోర్సులు: నైపుణ్య కళాశాలల్లో 100కి పైగా కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వీటిలో 49 టెక్నికల్, 41 నాన్ టెక్నికల్, 20 సెక్టోరియల్ స్కిల్ కోర్సులు ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు, వాటికి కావాల్సిన నైపుణ్య అవసరాలను గుర్తించి ఈ కోర్సులను రూపొందించారు. అలాగే ఈ కోర్సులకు కావాల్సిన ల్యాబ్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ నైపుణ్య శిక్షణలో భాగస్వామ్యం కావడానికి 18 ప్రముఖ సంస్థలు ముందుకు రావడంతో పాటు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. చదవండి: 15 వేల గ్రామ సచివాలయాల్లో ఏఆర్‌సీలు 1.81 లక్షల ఎకరాలకు ‘సత్వర’ ఫలాలు -
ఇలాగైతే కరోనా వ్యాప్తి చెందదా?
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ చైతన్యపురిలో ఓ కార్పొరేట్ కాలేజీలో యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రత్యక్ష విద్యాబోధన ఫొటోలు ఇవీ. ఇక్కడ విద్యార్థులను కూర్చోబెట్టిన తీరు చూస్తుంటే భౌతికదూరం పాటిస్తున్నట్లు ఉందా? ఒక్కో విద్యార్థికి మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలన్న నిబంధన అమలు అవుతున్నట్లు అనిపిస్తోందా? బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలు, తరగతి గదిలో 20 మంది విద్యార్థులనే కూర్చొబెట్టి విద్యా బోధనను నిర్వహించాలన్న నిబంధనను తుంగలో తొక్కి సదరు కార్పొరేట్ కాలేజీ యాజమాన్యం తరగతులను నిర్వహిస్తోంది. పట్టించుకునే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఇదొక్క కాలేజీనే కాదు రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు అన్నింటిలో ప్రత్యక్ష విద్యా బోధన ఇష్టారాజ్యంగా మారిపోయింది. అంతేకాదు ప్రత్యక్ష బోధన సాకుతో మొత్తం ఫీజుల వసూళ్లకు తల్లిదండ్రులపై ఒత్తిడిని తీవ్రం చేశాయి. దీంతో గత్యంతరం లేక తల్లిదండ్రులు ఫీజులను చెల్లించక తప్పడం లేదు. మరోవైపు త్వరలోనే హాస్టళ్లను ప్రారంభిస్తున్నామని, ఇప్పుడే ఫీజులు చెల్లించి హాస్టళ్లలో విద్యార్థుల పేర్లు నమోదు చేయించుకోవాలని ఎస్ఎంఎస్లు పంపిస్తుండటంతో తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టించుకోని ఇంటర్ బోర్డు అధికారులు పాఠశాలల్లో 9, 10 తరగతులు, ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు, ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రత్యక్ష బోధనకు ఈనెల 1వ తేదీ నుంచి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకు వరంగా మారింది. ప్రత్యక్ష బోధన పేరుతో ఫీజుల వసూళ్లకు అవకాశం వచ్చేసింది. అందుకే కరోనా ప్రొటోకాల్‌కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలు అసలేమాత్రం పట్టించుకోకుండా విద్యార్థులను పూర్తిస్థాయిలో విద్యాబోధనకు అనుమతిస్తున్నాయి. అదే సాకుతో మొత్తం ఫీజుల వసూళ్లకు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచాయి. ఒకరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులను మరొక రోజు ద్వితీయ సంవత్సర విద్యార్థులను మాత్రమే ప్రత్యక్ష బోధనకు అనుమతించాలన్న బోర్డు నిబంధనలు తుంగలో తొక్కాయి. తరగతికి 20 మంది చొప్పున, బెంచీకి ఒక్కరినే కూర్చోబెట్టాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. కాలేజీల్లో విద్యాబోధన ఎలా జరుగుతోందన్న దానిపై పర్యవేక్షణే లేదు. ఇలా రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా ఇంటర్ బోర్డు అధికారులకు పట్టడం లేదు. యాజమాన్యాల నుంచి ముడుపులు పుచ్చుకొని ఇంటర్ బోర్డు క్షేత్రస్థాయి అధికారులు నిబంధనల అమలును పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బెంచీకి ముగ్గురు.. కరోనా వ్యాపించదా? కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కోవిడ్–19 నిబంధనలను పాటిస్తూ విద్యా సంస్థల్లో ప్రత్యక్ష విద్యాబోధనను కొనసాగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయినా వాటిని తుంగలో తొక్కి కార్పొరేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తరగతి గదుల్లో విద్యార్థులను గుంపులుగా కూర్చోబెట్టాయి. ఒక్కో బెంచీకి ముగ్గురు చొప్పున విద్యార్థులను కూర్చోబెట్టి, కనీస భౌతికదూరం పాటించుకుండా చేస్తున్నాయి. ఐదు క్లాసుల కోసం కనీసం ఐదు గంటల పాటు విద్యార్థులు తరగతి గదుల్లో ఇలా కిక్కిరిసి కూర్చోవాల్సి వస్తోంది. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే మిగతా విద్యార్థులకు వచ్చే ప్రమాదం నెలకొంది. ఇంత సమయం కలిసి ఉండటం మూలంగా వైరస్ వ్యాప్తికి అవకాశాలెక్కువ. అయినా ఈ విషయాన్ని పట్టించుకునే వారే లేకుండా పోయారు. పరీక్ష ఫీజుతో లింకు... ఇంటర్ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు వార్షిక ఫీజును కట్టడానికి ప్రైవేటు కాలేజీలు అనుమతించడం లేదు. కాలేజీ ట్యూషన్ ఫీజును మొత్తం చెల్లిస్తేనే పరీక్ష ఫీజులు తీసుకుంటామని మెలికపెడుతున్నాయి. పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థుల జాబితాను ఇంటర్ బోర్డుకు పంపాల్సింది కాలేజీ యాజమాన్యాలే కాబట్టి దీన్ని అడ్డంపెట్టుకొని... ట్యూషన్ ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. కాలేజీ హాస్టళ్లలో ఫీజుల దందా ఫీజుల దందా ప్రస్తుతం రాష్ట్రంలో 1,586 ప్రైవేటు జూనియర్ కాలేజీలుండగా, అందులో కార్పొరేట్ కాలేజీలకు చెందినవే 700 పైగా ఉన్నాయి. వాటిల్లో కోవిడ్ నిబంధనలను పాటించకుండా యాజమాన్యాలు విద్యా బోధనను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆయా కార్పొరేట్ కాలేజీలకు చెందిన హాస్టళ్లే 587 వరకు కొనసాగుతున్నాయి. గతంలో వాటిల్లో 2.5 లక్షల మంది విద్యార్థులు చేరేవారు. గత ఏడాది ప్రథమ సంవత్సరంలో చేరిన వారిలో లక్షల మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. వారంతా ఇపుడు ద్వితీయ సంవత్సరంలో ఉండగా హాస్టళ్ల బాట పట్టేందుకు సిద్ధం అయ్యారు. ఇదే అదునుగా యాజమాన్యాలు ద్వితీయ సంవత్సర విద్యార్థులతో పాటు ప్రథమ సంవత్సర విద్యార్థులను హాస్టళ్లలో చేర్పించేందుకు రిజిస్టర్ చేసుకోవాలని, ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఇపుడు రిజిస్టర్ చేసుకొని ఫీజు చెల్లించకపోతే తరువాత చేర్చుకోబోమంటూ ఫీజులు చెల్లించక తప్పని పరిస్థితి కల్పిస్తున్నాయి. ప్రభుత్వ గురుకుల హాస్టళ్లను తెరవడానికి మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రైవేటు హాస్టళ్లను తెరవడానికి ఇంకా అనుమతించలేదు. అయినా హాస్టల్ వసతి పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 50 వేల నుంచి రూ. 70 వేల వరకు వార్షిక ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ప్రవేశ పరీక్షలు రాసేదెలా?
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ పెరిగిపోతోంది. కరోనా మూలంగా ఇంకా కాలేజీలే మొదలు కాలేదు... అప్పుడే ఏడునెలల విలువైన కాలం గడిచిపోయింది. మరోవైపు ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదివే దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షల భయం పట్టుకుంది. ప్రత్యక్ష బోధన లేక, డిజిటల్/ఆన్లైన్ బోధన అర్థంకాక తలపట్టుకుంటున్న విద్యార్థులను... ఒక్కొక్కటిగా ప్రవేశపరీక్షల నోటిఫికేషన్ల జారీ షురూ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో తమ చదువులెలా? అన్న ఆవేదనలో విద్యార్థులు పడ్డారు. ప్రత్యక్ష బోధన లేని ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలే కాదు.. ఎంసెట్ వంటి రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లోనైనా నెగ్గుకు రాగలుగుతామా? అన్న భయం వారిని వెంటాడుతోంది. ఏపీ విద్యార్థుల నుంచే ప్రధాన పోటీ జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్, నీట్ వంటి జాతీయ పరీక్షలకు సిద్ధం కావాలన్నా, ఎంసెట్ లాంటి రాష్ట్ర స్థాయి పరీక్షలు రాయాలన్న ప్రత్యక్ష బోధన ఉండాల్సిందేనని అధ్యాపకులే చెబుతున్నారు. రాష్ట్రంలో సెపె్టంబర్ 1 నుంచి ఆన్లైన్/ డిజిటల్ బోధన చేపట్టినా ఫలితం అంతంతేనంటున్నారు. విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లోని ఓపెన్ కోటా 20% సీట్లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడతారు. ఎంసెట్‌లో తీవ్ర పోటీ ఉంటుంది. హైదరాబాద్‌లో టాప్ కాలేజీ లు ఎక్కువగా ఉండటంతో ఏపీ విద్యార్థులు తెలం గాణ ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఏపీలో నవంబర్ 2 నుంచే ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. దాదాపు 30% సిలబస్ కూడా పూర్తయినట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ప్రిపరేషన్ మెరుగ్గా ఉంది కాబట్టి ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులకు ఎక్కువ శాతం సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. వార్షిక పరీక్షలూ కష్టమే రాష్ట్రంలో సెపె్టంబర్ 1 నుంచి ఆన్లైన్/డిజిటల్ విద్యా బోధన ప్రారంభమైంది. అయితే విద్యార్థులంతా డిజిటల్ పాఠాలను వినడం లేదని అధ్యాపకులే చెబుతున్నారు. టీశాట్‌లో వీడియోపాఠాలు ప్రసారం చేస్తున్నా విద్యార్థులకు అర్థం కావడం లేదని, ఆన్లైన్లో అందుబాటులో ఉంచిన వీడియో పాఠాలపై అనుమానాలు వస్తే నివృత్తి చేసుకునే అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడతున్నారు. మొత్తానికి 50 శాతం మంది విద్యార్థులు అంతంతగానే పాఠాలు నేర్చుకునే పరిస్థితి నెలకొనగా, 30 శాతం మంది విద్యార్థులు అసలు పాఠాలే వినడం లేదని ఆన్లైన్/డిజిటల్ బోధనను పర్యవేక్షిస్తున్న లెక్చరర్లు చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిర్వహించేలా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు అకడమిక్ కేలండర్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వీడియో పాఠాలు అర్థంకాక, కొంత మంది పాఠాలే వినలేని పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు ఎలా రాస్తారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. నిర్ణయం తీసుకునేదెప్పుడు? ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ఎలాగోలా పాస్ చేసినా, ఇంటరీ్మడియట్ విషయంలో ప్రత్యక్ష బోధన లేకుండా ఎలా ముందుకు సాగాలన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. అంతేకాదు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలు రాసి, మెరుగైన ర్యాంకులు సాధిస్తేనే వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలను పొందగలుగుతారు. అయితే ప్రత్యక్ష విద్యా బోధన లేకుండా విద్యార్థులు ఎలా ప్రవేశ పరీక్షలకు సిద్ధం అవుతారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయినా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. కాలేజీలు తెరిచేందుకు గతంలోనే ప్రతిపాదనలను పంపించినా వాటికి మోక్షం లభించకపోవడంతో ఇంటర్‌బోర్డు, ఇంటరీ్మడియట్ విద్యాశాఖ చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తోంది. పాఠాలు అర్థం కావడం లేదు కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించిన అధ్యాపకులు టీవీలో ఏకధాటిగా చెబుతూ వెళ్తుండటం, చెప్పింది అర్థం కాకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. నోట్స్ రాసుకునే సమయం ఇవ్వడం లేదు. టీవీలో పాఠం వింటూ వేగంగా నోట్స్ రాసుకోవడమే తప్ప.. తిరిగి వారిని డౌట్లు అడిగే వీలు లేదు. – మనీష, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, నయాబజార్ కళాశాల, ఖమ్మం అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం లేదు ఆన్లైన్లో పాఠాలు వింటున్నా. అయితే క్లాస్‌రూమ్‌లో వింటున్న అనుభూతి.. డౌట్ వస్తే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకునే వెసులుబాటు లేదు. డిజిటల్ క్లాసులు వేగంగా కొనసాగుతున్నాయి. పాఠం అర్థమైందో..లేదో తెలుసుకునే అవకాశం అధ్యాపకులకు లేదు. – ఉష, బైపీసీ, ద్వితీయ సంవత్సరం, నయాబజార్ కళాశాల, ఖమ్మం వన్‌వే బోధనతో లాభం లేదు మొదట్లో 80 శాతం మంది పాఠాలు విన్నారు. ఇప్పుడది చాలా వరకు తగ్గిపోయింది. నెట్వర్క్, ఇతరత్రా సమస్యలతో వినడం లేదు. ఆన్లైన్/ డిజిటల్ బోధన ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదు. విద్యార్థి– అధ్యాపకుల మధ్య ఉన్న అనుబంధం లేకుండా పోయింది. వన్‌వే వల్ల విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పోయింది. –కృష్ణకుమార్, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు విద్యార్థులకు తీవ్ర నష్టం ఇంటర్లో ప్రత్యక్ష విద్యా బోధనపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రత్యక్ష బోధనకు డిజిటల్ బోధన సాటిరాదు. డిజిటల్ బోధన వల్ల విద్యార్థులకు పాఠాలు అర్థం అయ్యేది అంతంతే. ప్రత్యక్ష బోధన లేకుండా విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కష్టమే. – డాక్టర్ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు -
గడ్డు స్థితిలో విద్యారంగం
అందరూ ఊహిస్తున్న ఉత్పాతమే ఇది. కరోనా మహమ్మారి విరుచుకుపడిన పర్యవసానంగా ఇతర రంగాలన్నిటిలాగే విద్యారంగం కూడా కుప్పకూలింది. ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక దీన్ని ధ్రువీక రిస్తోంది. ప్రపంచ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా విద్యారంగం అస్తవ్యస్థం అయిందని ఆ నివే దిక చెబుతోంది. అన్ని ఖండాల్లో, అన్ని దేశాల్లో బడులన్నీ మూతబడటం వల్ల వంద కోట్లమందికి పైగా విద్యార్థులు చదువులకు పూర్తిగా దూరమయ్యారని, మరో 4 కోట్లమంది పిల్లలకు ప్రీ స్కూల్ చదువులు లేనట్టేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ చెబుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో ఊహించుకోవచ్చు. నిరుడు డిసెంబర్ చివరిలో చైనాలోని వుహాన్‌లో తొలి సారి కరోనా జాడలు కనబడగా అనంతరం అది అన్నిచోట్లా సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇప్పటివరకూ వివిధ దేశాల్లో దాదాపు 2 కోట్లమంది జనం ఈ వైరస్ వాతబడ్డారు. మరణాల సంఖ్య 7 లక్షలు దాటిపోయింది. ఒక్క అమెరికాలోనే అరకోటిమంది కరోనా వ్యాధిగ్రస్తులున్నారు. లక్షా 61 వేలమంది అక్కడ మృత్యువాతబడ్డారు. మన దేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. మరణాలు 41,000పైమాటే. ఈ పరిస్థితుల్లో బడులు తెరవాలంటేనే అన్నిచోట్లా ప్రభుత్వాలు భయపడుతున్నాయి. తెరిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏం చేయాలో పిల్లల వైద్యులు, విద్యావేత్తలు సూచనలు చేస్తూనేవున్నారు. ఇలా నిరవధికంగా బడులు మూతపడితే పిల్లల మానసిక స్థితిపై, వారి సామర్థ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. కానీ తెరిస్తే వచ్చే సమస్యల మాటేమిటన్న ప్రశ్న ప్రతిచోటా ఉత్పన్నమవుతోంది. ఈ సందర్భంగా బ్రిటన్‌లోని పిల్లల వైద్యులు చేసిన హెచ్చరిక గమనించదగ్గది. బడులు తెరవడానికి బదులుగా ఆన్లైన్ విద్యను అందిస్తే సరిపోతుందన్న భావన సరికాదని వారంటున్నారు. విద్యాసంస్థలు యధావిధిగా పనిచేస్తే అల్పా దాయ వర్గాల పిల్లలకు తగిన పౌష్టికాహారం అందుబాటులో వుంటుందని, అవి మూతపడటం వల్ల అవసరమైన పోషకాహారానికి దూరమవుతారని, ఫలితంగా వారిలో అన్ని రకాల సామర్థ్యాలు దెబ్బ తింటాయని చెబుతున్నారు. మరో ప్రమాదం కూడా వుందంటున్నారు. పాఠశాలలు సక్రమంగా నడు స్తుంటే పిల్లలపట్ల ఇళ్లల్లో ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తున్నారా అన్నది కనిపెట్టడం సులభమవు తుందని, లేనట్టయితే అది అసాధ్యమంటున్నారు. ఇలాంటి ప్రమాదాలను గమనంలోకి తీసుకుని తైవాన్, నికరాగువా, స్వీడన్ వంటి 20 దేశాలు పాఠశాలలను తెరిచాయి. అందుకోసం కఠినమైన ఆంక్షలు అమల్లోకి తెచ్చాయి. జాగ్రత్తలు తీసుకున్నాయి. అయితే వీటిల్లో చాలా దేశాలు సమస్యలెదు ర్కొన్నాయి. విద్యాలయాలు తెరిచివుంచడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నామా అని ఆందోళనపడ్డాయి. బాగా చిన్న వయసు పిల్లల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా వుండటం, 18 ఆ పైబడి వయసున్న వారిలో ఎక్కువమంది దాని బారినపడటం గమనించామంటున్నారు. పాఠశాలలు తెరిస్తే సరిపోదు. అవి ప్రారంభమయ్యాక అడుగడుగునా సమస్యలెదురవుతాయి. తరగతి గదిలో పిల్లల్ని కూర్చోబెట్టడం మొదలుకొని వారు తిరిగి వెళ్లేవరకూ అడుగడుగునా ఆంక్షలు విధించవలసి వస్తుంది. కలిసి ఆడుకోవడం, భోజన విరామ సమయంలో కబుర్లు చెప్పుకుంటూ తినడం వంటివి కూడా ఆ బడుల్లో నిషేధించాల్సివచ్చింది. ఇవన్నీ సహజంగానే ఆ పిల్లల మానసిక స్థితిగతులపై ప్రభావం చూపుతాయి. అదే జరిగితే పాఠశాలలు తెరిచిన ప్రయోజనమే దెబ్బతిం టుంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు తీసుకునే పకడ్బందీ చర్యలే పాఠశాలలు సక్రమంగా పనిచేయడానికి దోహదపడతాయి. పాఠశాలలు సాధ్యమైనంత త్వరగా తెరవాలని అమె రికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మొదలుకొని చాలామంది చెబుతున్నారు. అయితే తెరవాలనే కోరిక వుంటే సరిపోదు. అందుకు తగ్గట్టుగా అధినేతలుగా వారేం చేశారో, చేస్తున్నారో గమనించుకోవాల్సిన అవసరం వుంది. కరోనా మహమ్మారిపై తొలినాళ్లలో హెచ్చరించినప్పుడే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక మాట చెప్పింది. దాన్ని అరికట్టడానికి విస్తృతంగా పరీక్షలు జరపడం ఒక్కటే మార్గమని, అందుకు దగ్గరి దారులు లేవని తెలిపింది. కానీ అన్ని దేశాల్లోనూ పాలకులు తేలిగ్గా తీసుకున్నారు. లాక్డౌన్ ఒక్కటే తారకమంత్రం అన్నట్టు వ్యవహరించారు. దానివల్ల ఫలితం పెద్దగా వుండదని తెలిశాక నిబంధనలు సడలించడం మొదలుపెట్టారు. కానీ అన్నిచోట్లా కేసులు ఉగ్రరూపం దాల్చాయి. అయినా ప్రభుత్వాలు తెలివితెచ్చుకున్న దాఖలా కనబడదు. కరోనా విషయంలో ఇంకా నిర్లక్ష్యంగానే వుంటున్నాయి. ప్రపంచంలో ఇప్పటికే వున్న అంతరాలను కరోనా మహమ్మారి మరిన్ని రెట్లు పెంచింది. విద్యా రంగంలో అది మరింత ప్రస్ఫుటంగా కనబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ 48 శాతం మందికి మాత్రమే అందుబాటులో వున్నదని, ఆఫ్రికా, ఆసియా దేశాలు ఈ విషయంలో బాగా వెనక బడివున్నాయని ఒక అధ్యయనం చెబుతోంది. ఇంకా లోతుకెళ్లి పరిశీలిస్తే ప్రాంతీయ, ఆర్థిక వ్యత్యా సాలు కూడా బయటపడతాయి. సారాంశంలో ఆన్లైన్ విద్య అల్పాదాయ వర్గాలను పూర్తిగా విద్యా రంగం నుంచి బయటకు నెడుతుందన్నది నిపుణుల అంచనా. విద్యారంగంపై ఇతోధికంగా ఖర్చు చేయడానికి ప్రభుత్వాలు ముందుకొస్తే తప్ప ఈ పరిస్థితి మారదు. కరోనా కారణంగా ఆదాయాలు పడిపోయినా విద్యారంగంపై ఆ ప్రభావం కనబడనీయకుండా చూడటం ప్రభుత్వాల లక్ష్యం కావా లని ఐక్యరాజ్యసమితి నివేదిక హితవు చెబుతోంది. మన దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితుల కారణంగా 32 కోట్లమందికి పైగా పిల్లలు మార్చి నెలాఖరు మొదలుకొని ఇళ్లకే పరిమితం కావలసివస్తోంది. వీరిని తిరిగి బడిబాట పట్టించేందుకు అనువైన సురక్షితమైన పరిస్థితుల కోసం ప్రభుత్వాలు బహుముఖ కృషి చేయాల్సివుంటుంది. ఒక తరం మొత్తం పెను విపత్తులో పడిందని సమితి నివేదిక హెచ్చరిస్తున్న నేపథ్యంలో తమ విధానాలు మార్చుకోవాల్సివుంటుంది. -
అక్టోబర్ 15 నుంచి కాలేజీలను తెరుస్తాం
-
ఉన్నత విద్యపై సీఎం జగన్ కీలక నిర్ణయాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని ఉన్నత విద్య విధానంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖయమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్‌ను 90 శాతానికి తీసుకెళ్లాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్, ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు హాజరయ్యారు. (జక్కంపూడికి సీఎం జగన్ నివాళి) ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ అన్నారు. దీని వల్ల కచ్చితంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలన్నారు. పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు రావాలని, డిగ్రీ కోర్సులో అప్రెంటిస్ చేర్చినట్లు తెలిపారు. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను చేర్చినట్లు పేర్కొన్నారు. దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందని, ఆ తర్వాతే దాన్ని డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తామన్నారు. వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్ ఉంటుందన్నారు. దీనికి అదనంగా 20 అడిషనల్ క్రెడిట్స్ సాధించేవారికి కూడా ఆనర్స్ డిగ్రీ ఇవ్వాలని ఆదేశించారు. అడ్మిషన్లు పొందినప్పుడే సాధారణ డిగ్రీ కావాలా? లేదా ఆనర్స్ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటామని వెల్లడించారు. (‘కడప స్టీల్ ప్లాంట్’కు భారీ స్పందన) చదువులు చెప్పే విధానంలో మార్పులు రావాలి: సీఎం మంచి పాఠ్య ప్రణాళిక వల్ల డిగ్రీలకు విలువ ఉంటుందని ముఖయమంత్రి తెలిపారు. ప్రభుత్వ కాలేజీలను మెరుగు పరుద్దామన్న ఆలోచన గతంలో ఎవ్వరికీ రాలేదని, ఇప్పుడు ప్రభుత్వ కాలేజీల్లో అత్యున్నత ప్రమాణాలతో బోధన అందించాలని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు – నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యా రంగం మీద తమ ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి .. వీటి గురించి ఆలోచిస్తున్నామన్నారు. ఇన్నాళ్లుగా వీటి గురించి ఎవ్వరూ ఆలోచన చేయలేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్‌ఫోన్ వెలుగులో ఆపరేషన్లు ఎందుకు చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎలుకలు కొరికి శిశువు చనిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందని? జనరేటర్లు పని చేయని పరిస్థితి ఎందుకు వచ్చిందని అధికారులను నిలదీశారు. కాలేజీల్లో కూడా నాడు – నేడు కార్యక్రమాలు కాలేజీల్లో కూడా నాడు – నేడు కార్యక్రమాలు చేయాలని, దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నాడు – నేడు పనులతో అత్యుత్తమ ప్రమాణాలను తీసుకు రావాలని సూచించారు. కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని అధఙకారులు ముఖ్యమంత్రికి తెలిపారు. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ పనులు మొదలుపెట్టేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ ఆదేశించారు. ‘పాడేరులో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకారం. ప్రతి ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో.. వచ్చే మూడు నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలి. యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్. దాదాపు 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం. ప్రభుత్వ కాలేజీలు స్వావలంబన దిశగా సాగాలి. అక్టోబరు 15న కాలేజీలు తెరవాలని నిర్ణయం. సెప్టెంబరులో సెట్ల నిర్వహణ పూర్తి కావాలని నిర్ణయం. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. -
ఇంటర్ బోర్డుపై టీఎస్ హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: నారాయణ, చైతన్య కళాశాలలకు సంబంధించి ఇంటర్ బోర్డు సమర్పించిన నివేదిక పై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నివేదికలో ఎలాంటి అంశాలను పొందు పరచలేదని హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారని ప్రశ్నించింది. ‘నారాయణ, చైతన్య కళాశాలలో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు.. కళాశాలల్లో వసతులు, ఇప్పటి వరకు కళాశాలల్లో ఎంత మంది విద్యార్థులు మృతి చెందారు’ వంటి పూర్తి వివరాలతో మరోసారి నివేదిక సమర్పించాలని ఇంటర్‌బోర్డును హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 27కు వాయిదా వేసింది. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టులో పిల్.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వం జీవోలను వెబ్సైట్లో పెట్టడం లేదని పిల్లో పేర్కొన్నారు. జీవోలను ఎందుకు వెబ్సైట్లో ఉంచడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. (దిశ: శంషాబాద్ ఏసీపీతో రామ్‌గోపాల్ వర్మ భేటీ) -
10 రోజులు డెడ్‌లైన్ పెట్టాం: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేటు జూనియర్ కళాశాలలపై చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా కళాశాలలు చట్టవిరుద్ధంగా నడుస్తున్నాయని తెలిపారు. కోచింగ్‌లు పేరుతో పెడుతున్న బోర్డులను కళాశాల యాజమాన్యాలు వెంటనే తొలగించాలన్నారు. 699 కాలేజీల బోర్డులను తొలగించామని..1300 కాలేజీలకు 10 రోజులు డెడ్‌లైన్ పెట్టామని వెల్లడించారు. అన్ని కళాశాలల బోర్డులు ఒకేవిధంగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. ఆటస్థలాలు, ల్యాబ్‌లు లేకుండా కాలేజీలు నడుపుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలలకు ఫైర్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలని లేకపోతే చర్యలు చేపడతామన్నారు. ఇంటర్ సిలబస్‌లో కూడా మార్పులు తీసుకొస్తాం.. 2013 తరువాత ఇంటర్ బోర్డ్ సమావేశం కూడా నిర్వహించని దుస్థితి ఏర్పడిందని మంత్రి ఆదిమూలపు అన్నారు. ఇంటర్ సిలబస్‌లో కూడా మార్పులు తీసుకొస్తామన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు క్రమబద్దీకరణకు ఉపసంఘం వేశామని చెప్పారు. శాశ్వత ఉద్యోగాలను భర్తీ చెయ్యడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్పొరేట్ కళాశాలలు 50 వేలు నుండి 2.50 లక్షలు ఫీజులు వసూళ్లు చేస్తున్నాయని.. వాటిపై రెగ్యులేటరీ కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రైవేట్ హాస్టళ్ల చట్టాన్ని కూడా సవరిస్తామని తెలిపారు. ఫిర్యాదులు ఆన్లైన్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. సమస్యలుంటే ఇంటర్ విద్యార్థులు ourbieap@gmail.com, 9391282578 నెంబరుకు ఫిర్యాదు చేయొచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. -
10 రోజులు డెడ్‌లైన్ పెట్టాం: మంత్రి సురేష్
-
‘దోస్త్’ లేకుంటే రీయింబర్స్మెంట్ లేనట్లే..
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల (దోస్త్) పరిధిలోకి రాని కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అస్తవ్యస్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను క్రమబద్ధం చేసేందుకు ప్రభుత్వం ఆన్లైన్ ప్రవేశాలను చేపడుతుంటే.. కొన్ని కాలేజీలు మాత్రం కోర్టును ఆశ్రయించి ఆన్లైన్ ప్రవేశాల పరిధిలోకి రాకుండా సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫీజు రీయింబర్స్మెంట్ అవసరం లేదని అనుకుంటేనే విద్యార్థులు వాటిల్లో చేరాలని సూచించింది. ఫీజు రీయింబర్స్మెంట్ కావాలనుకునే విద్యార్థులు మాత్రం ఆ కాలేజీల్లో చేరితే నష్టపోవాల్సి ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ మెమో జారీ చేసినట్లు విద్యా శాఖ వర్గాలు వెల్లడించారు. ఇదే విషయాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేసే సంక్షేమ శాఖలకు కూడా ప్రభుత్వం తెలిపింది. 27 టాప్ కాలేజీలు దోస్త్‌కు దూరం రాష్ట్రంలో 1,084 వరకు ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిల్లో 4.2 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏటా 2.2 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతుండగా, దాదాపు 23 వేల సీట్లు దోస్త్ పరిధిలో లేని కాలేజీల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం 47 కాలేజీలు దోస్త్ పరిధిలో లేవు. అవి సొంతంగానే ప్రవేశాలు చేపడుతున్నాయి. అందులో 20 మైనారిటీ కాలేజీలు సొంతంగా ప్రవేశాలు చేపట్టుకునేందుకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. మరో 27 టాప్ కాలేజీలు మాత్రం కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. ఇలా దాదాపు 15 వేలకు పైగా సీట్లను ఆయా కాలేజీలు భర్తీ చేసుకుంటున్నాయి. వాటిని ఆన్లైన్ పరిధిలోకి తెచ్చేందుకు దోస్త్ కమిటీ ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ కాలేజీల్లో వార్షిక ఫీజులు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు ఉందని, యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు మాత్రం రూ.25 వేలకు (యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుకు అదనంగా రూ. 10 వేలు వసూలు చేసుకునేలా కల్పించిన వెసులుబాటుతో కలిపి) మించి లేదని, దానివల్ల తాము కాలేజీలను కొనసాగించలేమని సదరు యాజమాన్యాలు పేర్కొన్నట్లు తెలిసింది. కోర్టుకెళ్లి మరీ.. తాము దోస్త్ పరిధిలోకి వస్తే యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజునే వసూలు చేయాల్సి వస్తుందని, దానివల్ల తమ కాలేజీలు, కోర్సుల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలోనూ 27 కాలేజీలు సొంతంగా ప్రవేశాలకు చర్యలు చేపట్టాయి. దీంతో వాటిల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది జారీ చేసిన ఉత్తర్వులనే ఈ ఏడాది అమలు చేయాలని ఆదేశించింది. ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా దోస్త్ చర్యలు చేపట్టింది. దోస్త్ ఆధ్వర్యంలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాలను ఈ–పాస్ విభాగానికి కూడా కాలేజీలు, దోస్త్ కమిటీ పంపిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ–పాస్ విభాగం వాటినే పరిగణనలోకి తీసుకొని ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు దోస్త్ ఉన్నతాధికారి వెల్లడించారు. -
అంతా తూచ్..!
ప్రభుత్వ నిబంధనలు కార్పొరేట్ కళాశాలలకు పట్టడం లేదు. తమ దారి అడ్డదారి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఒక పక్క పదో తరగతి పరీక్ష ఫలితాలు రాకుండానే ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఐఐటీ, నీట్ ర్యాంకుల ఆశలు చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదన్న నిబంధనలు ఉన్నా ఉత్తమ ఫలితాల పేరుతో కళాశాలను నిర్వహిస్తున్నారు. ఆటవిడుపు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. విద్యార్థులకు ఇష్టం లేకున్నా బలవంతపు చదువులు రుద్ది వారిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తున్నారని పలువురు మండి పడుతున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. తమ చేతులు తడిపితే ఎప్పుడైనా తరగతులు నిర్వహించుకోవచ్చంటూ సంకేతాలు పంపుతుండడం గమనార్హం. నెల్లూరు(టౌన్): జిల్లావ్యాప్తంగా మొత్తం 189 ప్రభుత్వ, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 58 ప్రభుత్వ, 15 ఎయిడెడ్, 116 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 58 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. అదే నెల 29వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 3వ తేదీన జూనియర్ కళాశాలలు ప్రారంభించాల్సిఉంది. అయితే కళాశాలల యాజమాన్యాలు ఉత్తీర్ణత శాతం, ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవులతోపాటు పండగ రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. నారాయణ, శ్రీచైతన్య, గాయిత్రి తదితర జూనియర్ కళాశాలలు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. వేసవి సెలవులు ఇచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తుండడం గమనార్హం. ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపకుండా కళాశాలల్లోనే ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారు. ముందుగానే టాలెంట్ టెస్ట్ రాయాలంటూ విద్యార్థులను కళాశాలలకు పిలిపించి వారిని తమ కళాశాలలో చేరే విధంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిరోజూ ఏదో ఒక కళాశాలకు వెళ్లి యాజమాన్యాలను నిలదీస్తున్నారు. తరగతులను బహిష్కరించి విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్‌బోర్డు అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులతో మిన్నకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తరగతుల నిర్వహణపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగువేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పబ్లిక్ పరీక్షలు రాసిన వెంటనే మళ్లీ తరగతులు అంటే విద్యార్థులు విముఖత కనబరుస్తున్నారు. కనీసం ఆటవిడుపు కూడా లేకుండా నిత్యం పుస్తకాలు పట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుస్తకాలతో విద్యార్థులను కుస్తీ పట్టిస్తున్నారు. ఒత్తిడికి తట్టుకోలేని విద్యార్థులు రకరకాల మానసిక ఆందోళనకు గురివుతున్నారు. భారీగా ఫీజులు ఇంటర్లో ప్రవేశం కోసం కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఐఐటీ, నీట్ల పేరుతో రూ.లక్ష నుంచి రూ.3.50 లక్షల వరకు ఫీజులు నిర్ణయించారు. వీటితోపాటు దుస్తులు, పుస్తకాలు, పరీక్ష ఫీజు, ఆన్లైన్లో పరీక్ష, మెయింటినెన్స్ల పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నారు. అయితే తమ పిల్లలు సెటిల్ అవుతారన్న ఆశతో తల్లిదండ్రులు కూడా అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ఫీజులపై నియంత్రణ ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా కార్పొరేట్ ఆగడాలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదు వేసవి సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదు. ప్రధానంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇప్పటి నుంచే తరగతులు నిర్వహించకూడదు. విద్యార్థుల ప్రవేశాల కోసం ఎలాంటి టాలెంట్ టెస్ట్‌లు పెట్టకూడదు. కళాశాలలు జూన్ 3వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ వచ్చే వరకు అడ్మిషన్లు చేపట్టకూడదు. అధిక ఫీజులు వసూలు చేయకూడదు. కళాశాల ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఈ నిబంధనలను అత్రికమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. – ఎస్.సత్యనారాయణ, ఆర్ఐఓ -
మూడు సంవత్సరాల్లో 351 కాలేజీలు మూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడేళ్లలో వివిధ వృత్తి విద్యా కోర్సులను నిర్వహించే 351 కాలేజీలు మూత పడ్డాయి. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ)కి వచ్చిన ఫీజు ప్రతిపాదనలతో ఈ విషయం వెల్లడైంది. వచ్చే మూడేళ్లలో ఆయా కాలేజీల్లోని వివిధ కోర్సులకు నిర్ణయించాల్సిన ఫీజుల కోసం కాలేజీ ఆదాయ, వ్యయాలు, కొత్త ఫీజు ప్రతిపాదనలు ఇవ్వాలని టీఏఎఫ్ఆర్సీ కాలేజీల నుంచి ప్రతిపాదనలను స్వీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించింది. తాజాగా ఈ నెల 27వ తేదీ వరకు గడువును పెంచింది. అయితే ఇకపై కొత్తగా దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకొని, నిర్ణీత ఫీజు చెల్లించి, హార్డ్ కాపీలను అందజేయాల్సి ఉండటంతో ఈ గడువును పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, గడిచిన మూడేళ్లలో వసూలు చేసిన ఫీజులకు ప్రతిపాదనలు అందజేసిన కాలేజీల సంఖ్యతో పోల్చితే 351 కాలేజీలు మూత పడినట్లుగా తెలుస్తోంది. 2016–17, 2017–18, 2018–19 విద్యా సంవత్సరాల్లో రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీల్లో నిర్వహించే కోర్సులకు వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేసేందుకు కాలేజీల నుంచి అంతకుముందు మూడేళ్ల ఆదాయ వ్యయాలను, కొత్త ఫీజల ప్రతిపాదనలను 2015లో ఏఎఫ్ఆర్సీ స్వీకరించింది. వాటి ఆధారంగా ఫీజులను నిర్ణయించింది. అయితే అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 1,586 కాలేజీలు ఫీజుల ప్రతిపాదనలను ఇచ్చాయి. కానీ ఈసారి 1,235 కాలేజీలు మాత్రమే ఫీజుల ప్రతిపాదనలను ఇవ్వడంతో మిగిలిన 351 కోర్సులను నిర్వహించే కాలేజీలు మూత పడినట్లుగానే అధికారులు పేర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం ఫీజుల నిర్ణయం కోసం ఏఎఫ్ఆర్సీకి దరఖాస్తు చేసుకుంటేనే ఆ కాలేజీల్లో ఆయా కోర్సులు కొనసాగుతున్నట్లు లెక్క. లేదంటే ఆ కాలేజీలో ఆ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అత్యధికంగా బీటెక్, ఎంటెక్‌లోనే.. రాష్ట్రంలో బీటెక్, ఎంటెక్ కాలేజీలే ఎక్కువగా మూత పడ్డాయి. 2015–16 విద్యా సంవత్సరం వరకు 268 కాలేజీలు బీటెక్ కోర్సును నిర్వహిస్తున్నాయి. ఆ కాలేజీలో కొత్త ఫీజుల కోసం అప్పట్లో దరఖాస్తు చేసుకున్నాయి. ఇపుడు 2019 నుంచి 2022 వరకు మూడేళ్ల పాటు వసూలు చేయాల్సిన కొత్త ఫీజుల కోసం కేవలం 197 కాలేజీలే దరఖాస్తు చేసుకున్నాయి. అంటే 71 బీటెక్ కాలేజీలు మూత పడ్డాయి. మరోవైపు ఎంటెక్‌ను నిర్వహిస్తున్న 235 కాలేజీలలో ఇపుడు 130 కాలేజీలు మాత్రమే కొత్త ఫీజుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో 105 కాలేజీలు మూత పడ్డాయి. అలాగే గతంలో 228 బీఈడీ కాలేజీలు ఫీజులకు దరఖాస్తు చేసుకోగా, ఇపుడు 196 కాలేజీలు మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. మిగతావన్నీ మూత పడ్డట్టుగానే భావిస్తున్నారు. -
కేరళలో తెరుచుకున్న స్కూళ్లు, కాలేజీలు
తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో దాదాపు 15 రోజుల తర్వాత పాఠశాలలు, కళాశాలలు మళ్లీ తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులను టీచర్లు పాటలు పాడుతూ ఆహ్వానించారు. పుస్తకాలు, యూనిఫాం నాశనమయ్యాయన్న బాధను పోగొట్టేందుకు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి స్వీట్లను అందజేశారు. ఈ విషయమై కేరళ విద్యా శాఖ మంత్రి ప్రొఫెసర్ సి.రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. వరదల కారణంగా రాష్ట్రంలో 600 పైచిలుకు పాఠశాలలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇంకా 1.97 లక్షల మంది పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న నేపథ్యంలో కొన్నిచోట్ల పాఠశాలలు తెరుచుకోలేదని వెల్లడించారు. సెప్టెంబర్ 3 నాటికి అన్ని పాఠశాలలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వరదతో మానసికంగా కుంగిపోయిన పిల్లలందరికీ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. యూనిఫామ్, పుస్తకాలు కోల్పోయిన పిల్లలు బాధ పడొద్దనీ, ప్రభుత్వం కొత్తవి అందజేస్తుందని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. -
కాలేజీల్లో జంక్ ఫుడ్ అమ్మకాలపై నిషేధం
న్యూఢిల్లీ: అన్ని విశ్వవిద్యాలయాలు, ఉన్నత స్థాయి విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్ అమ్మకాల్ని నిషేధించాలని యూజీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ‘విద్యార్థుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడానికి కళాశాలల్లో జంక్ ఫుడ్‌ను నిషేధించాల్సిన అవసరముంది. ఆరోగ్య కరమైన పదార్థాలను అందించడం వల్ల విద్యా ర్థుల్లో ఏదైనా నేర్చుకోవాలనే దృక్పథం అలవ డుతుంది. ఊబకాయ సమస్యను సైతం దూరం చేయవచ్చు. అధికబరువుకు జీవనశైలి రుగ్మ తలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. జంక్‌ఫుడ్ నిషేధం వల్ల ఈ రుగ్మతలన్నింటిని అధిగమించవచ్చు’ అని యూజీసీ పేర్కొంది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఇదివరకు ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యా సంస్థల ప్రాంగణాల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలపై నిషేధిస్తూ యూజీసీ ఈ నిర్ణయం తీసుకుంది. జంక్‌ఫుడ్, దాని వల్ల కలిగే దుష్ఫలితాలపై యువతకు అవగాహన కల్పించాలని యూజీసీ ఉత్తర్వుల్లో వర్సిటీలకు సూచించింది. -
300 ఇంజినీరింగ్ కాలేజీలు మూత
సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు నాలుగైదేళ్లుగా దేశంలో ఇంజినీరింగ్ విద్యను చదివేవారి సంఖ్య అసాధరణరీతిలో తగ్గుతూ వస్తోంది. యూనివర్సిటీలు, ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల విషయాన్ని పక్కనపెడితే.. సాధారణ కాలేజీలవైపు విద్యార్థులు ముఖం కూడా తిప్పడం లేదు. దీంతో వరుస విద్యాసంవత్సరాల్లో అడ్మిషన్స్.. చాలా తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 300 ఇంజినీరింగ్ కాలేజీలు మూతకు సిద్ధమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఆయా కాలేజీలు ఆలిండియా కౌన్సెల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ)కి స్పష్టం చేశాయి. వచ్చే విద్యాసంవత్సరం అంటే 2018-19 నుంచి అకడమిక్ కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు ఆయా కాలేజీలు ఏఐసీటీకి తెలిపాయి. ఇదిలా ఉండగా 300 కాలేజీల్లో గత ఐదేళ్లుగా.. 30 శాతంకంటే తక్కువగానే విద్యార్థులు చేరుతున్నారు. ఇదిలా ఉండగా మరో 500 కాలేజీల పరిస్థితి కూడా ఇంచుమించుగా ఇలాగే ఉందని మానవ వనరుల అభివృద్ధి మండలి ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐదేళ్ల విద్యాసంవత్సరంలో 30 శాతం కంటే తక్కువ అడ్మిషన్లున్న కాలేజీలను మూసివేయకుండా.. ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని ఏఐసీటీఈ కోరింది. ప్రధానంగా సైన్స్, ఒకేషనల్ ఎడ్యుకేషన్ కాలేజీలుగా మార్చుకోవాలని ఆయా యాజమాన్యాలకు ఏఐసీటీఈ కోరింది. దేశవ్యాప్తంగా 3000 వేల ఇంజినీరింగ్ కాలేజీలు అండర్ గ్యాడ్యుయేట్ కోర్సులను అందిస్తున్నాయని ఏఐసీటీఈ పేర్కొంది. ఇందులో సుమారు 13.56 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,361 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1500, తమిళనాడులో 1300, యూపీలో 1,165, ఆంధ్రప్రదేశ్‌లో 800 కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రవేశాలపై సెప్టెంబర్ రెండో వారంలోగా యాజమాన్యాలు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రవేశాలను పెంచుకునేందుకు తమకు ఏడాది గడువు ఇవ్వాలని కొన్ని కళాశాలలు ఏఐసీటీఈని కోరినట్లు తెలుస్తోంది. -
ఇష్టం వచ్చినప్పుడు అనుమతులా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇష్టం వచ్చినప్పుడు కాలేజీలు, స్కూళ్లకు అనుమతులు, గుర్తింపులు తీసుకోవడం, ఇష్టం వచ్చినంత మందిని చేర్చుకొని తర్వాత అనుమతికి దరఖాస్తు చేసుకోవడం ఇకపై కుదరదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. తాము ముందుగా ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం 2018 ఏప్రిల్ 30వ తేదీలోగా అన్ని విద్యా సంస్థలకు అనుబంధ గుర్తింపు, అనుమతుల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్ 20వ తేదీ తరువాత వచ్చే ఎలాంటి దరఖాస్తులను స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీల్లో విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. గత 40 నెలల్లో విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు, వచ్చే 20 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి చేపట్టాల్సిన కార్యక్రమాలపై డిసెంబర్ 10వ తేదీలోపు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి వార్షిక కేలండర్‌ను ప్రభుత్వంతోపాటు ప్రైవేట్, కార్పొరేట్, ఇతర అన్ని విద్యా సంస్థలు పాటించాలన్నారు. సెలవుల్లో పాఠశాలలు, కాలేజీలు నడపకూడదన్నారు. సెలవుల్లో పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవాలన్నారు. అలాగే హాస్టళ్లకు అనుమతులు తీసుకోవాలన్నారు. తనిఖీలు చేపట్టి నిబంధనల ప్రకారం ఉన్న వాటికే అనుమతులు ఇస్తామన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఇకపై ఆన్లైన్లో నిర్వహిస్తామన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే పూర్తి చేసిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను 70 శాతం మేర పెంపునకు సీఎం కేసీఆర్ ఆమోదించాల్సి ఉందన్నారు. పోస్టుల భర్తీని యూనివర్సిటీలే చేపడతాయని, త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయని తెలిపారు. అన్ని విద్యా సంస్థల్లో కచ్చితంగా ప్రాక్టికల్స్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త జిల్లాల ప్రాతిపదికన విద్యా సంస్థల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. మౌలిక వసతులకోసం రూ.2 వేలకోట్ల పనులు విద్యాశాఖ సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూ. 2 వేల కోట్ల పనులు కొనసాగుతున్నాయని, అవన్నీ వచ్చే జూన్‌లోపు పూర్తి చేయాలని గడువు విధించామని తెలిపారు. ప్రతి విద్యా సంస్థలో ఐటీæ సెల్ పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పాఠశాలలు, కాలేజీల్లో క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఇందుకు అనుగుణంగా పీఈటీ పోస్టులను భర్తీ చేస్తామని, ఈలోగా విద్యా వలంటీర్లను నియమిస్తామని చెప్పారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలకు సంబంధించి ఆయా కాలేజీలపై క్రిమినల్ కేసులు పెట్టామన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యా, సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాగేందర్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు కళాశాలల బంద్
దేవరకొండ : ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన ప్రభుత్వ, ప్రై వేట్ కళాశాలల బంద్‌కు సహకరించాలని ఆ సంఘం నియోజకవర్గ ఇన్చార్జి కంబాలపల్లి వెంకటయ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని చెప్పిన మాటకు కట్టుబడి పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.