cce
-
సమస్యల సీసీఈ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో ఆలోచన, అవగాహన, సృజనాత్మకత పెంపొందించేందుకు కొత్తగా అమల్లోకి తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)లో సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని పక్కాగా అమలు చేయలేక టీచర్లు ఆపసోపాలు పడుతున్నారు. సీసీఈ అమలుతో సాధించాల్సిన లక్ష్యాలపై వారికే అవగాహన లేకుండా పోయింది. బట్టీ విధానానికి స్వస్తి చెప్పి సొంతంగా పరీక్షల్లో ఆలోచించి జవాబులు రాయాల్సిన విద్యార్థులు గైడ్లు చూసే రాస్తున్నారు. సమయమంతా ప్రాజెక్టులు, రాత పనులకే పోతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఇటీవలి విద్యా శాఖ సర్వేలోనే వెల్లడైంది. సీసీఈతో టీచర్లపైనా తీవ్ర పని భారం పడుతోంది. దాంతో ప్రత్యామ్నాయాలపై, వచ్చే విద్యా సంవత్సరంలో తేవాల్సిన మార్పులపై శాఖ దృష్టి సారించింది. సీసీఈ అమలులో సమస్యలివీ... - అన్ని సబ్జెక్టుల టీచర్లూ ఒకేసారి ప్రాజెక్టు పనులు, పుస్తక సమీక్షలు, రాత పనులు ఇవ్వడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. - పదో తరగతిలో సహ పాఠ్య కార్యక్రమాలు నిర్వహించకుండానే మార్కులు వేస్తున్నారు. - 6, 7 తరగతుల్లో సహ పాఠ్య కార్యక్రమాలు నిర్వహించడమూ లేదు, ఆ మార్కులు వేయడమూ లేదు. నమోదూ చేయడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లోనూ అంతే. - చాలా స్కూళ్లలో సైన్స్ ప్రయోగాలు చేయించకుండానే మూస పద్ధతిలో ల్యాబ్ రికార్డులు రాయిస్తున్నారు. - 9, 10 తరగతుల్లోనూ ప్రాజెక్టు పని నివేదికలను ఎంతమంది విద్యార్థులు సొంతంగా రాస్తున్నారో పట్టించుకోవడం లేదు. - ప్రాజెక్టు పనులతో పిల్లలు చదవడం కంటే రాయడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోంది. - ఏ తరగతిలోనూ విద్యార్థులు పరీక్షల్లో సొంతంగా ఆలోచించకుండా, చాలావరకు గైడ్లలో చూసి జవాబులు రాస్తున్నారు. అయినా టీచర్లు మార్కులు వేస్తున్నారు. - పిల్లల భాగస్వామ్యం అంశంలో.. సాంఘిక శాస్త్రంలో సమకాలీన అంశాలపై ప్రతిస్పందన రాయడంపై చాలామందికి అవగాహనే ఉండటం లేదు. - 6, 7 తరగతుల్లో పుస్తక సమీక్షలు నామ మాత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రాథమిక వివరాలు రాసినా మార్కులేస్తున్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి ఈ సమస్యల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యా శాఖ కమిటీలు క్షేత్రస్థాయిలో అధ్యయనంతో చేసిన సిఫార్సులను పరిశీలిస్తోంది. - వచ్చే విద్యా సంవత్సరంలో ప్రాజెక్టు పనులను తగ్గించే యోచన చేస్తోంది. తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో ప్రాజెక్టు పనులు లేకుండా చూడాలని భావిస్తోంది. - 6, 7 తరగతుల్లో విజ్ఞాన శాస్త్రం, సాంఘిక శాస్త్రం; 8, 9, 10 తరగతుల్లో భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రాల అభ్యాసాల్లో ప్రశ్నలను తగ్గిస్తే రాత భారం తగ్గుతుందని భావిస్తోంది. - ఏటా నాలుగుసార్లు నిర్వహించే నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫామేటివ్ అసెస్మెంట్–ఎఫ్ఏ) విద్యార్థులకు భారం కాకుండా తగిన మార్పులు చేయాలని భావిస్తోంది. వీటిలో పిల్లల భాగస్వామ్య ప్రతిస్పందనలకు 10 మార్కులు, రాత పనులకు 5, లఘు పరీక్షకు 5, మొత్తం 20 మార్కులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోంది. -
సీసీఈ విధానాన్ని మార్చాలి
జిల్లా ఏపీపీఎస్ఏ సర్వసభ్య సమావేశం తీర్మానం తాళ్లరేవు : నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) వి«ధానాన్ని ప్రభుత్వం మార్చాలని జిల్లా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (ఏపీపీఎస్ఏ) డిమాండ్ చేసింది. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో జిల్లా అధ్యక్షుడు తమ్మయ్యనాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశం వివరాలను జిల్లా జనరల్ సెక్రటరీ, తాళ్లరేవు మార్గదర్శి హైస్కూల్ కరస్పాడెంట్ పెమ్మాడి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీపీఎస్ఏ రాష్ట్ర అ«ధ్యక్షుడు కేఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ సీసీఈ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. ఆరు నుంచి 9వ తరగతి పరీక్షలను ఏప్రిల్‌లోనే నిర్వహించాలని కోరారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకత పాటించాలని తదితర సమస్యలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. ఆదిత్యా విద్యా సంస్థల అధినేత నల్లిమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ ఏపీపీఎస్ఏ బలోపేతానికి పాఠశాలల యాజమాన్యాలు కృషి చేయాలని కోరారు. తమ్మయ్యనాయుడు మాట్లాడుతూ సమస్యలు తెలిపితే జిల్లా కమిటీ తరఫున పోరాడతామన్నారు. పెమ్మాడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ తరహాలో ఏపీపీఎస్ఏ సంఘానికి నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రగౌరవ అధ్యక్షురాలు వసంతాప్రసాద్, రాష్ట్ర కన్వీనర్ చౌదరి, ప్రధాన కార్యదర్శి మురళీమనోహర్, రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజు, ఆదిత్య విద్యా సంస్థల కరస్పాండెంట్ మధులత తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన మొక్కు‘బడి’
తూతూ మంత్రంగా ‘ముందస్తు విద్యాసంవత్సరం’ విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో కానరాని ఉత్సాహం లక్ష్యానికి ఆమడదూరంలో నిలిచిన ప్రయోగం ప్రభుత్వం సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ మాదిరిగా కొత్త విద్యా సంవత్సరాన్ని (2017-18) ఒక నెల ముందుగానే ప్రారంభిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఆశించినా రాష్ట్ర ప్రభుత్వ ఆశయం లక్ష్యానికి ఆమడదూరంలోనే నిలచిపోయింది. రాష్ట్ర విద్యాశాఖ మార్చి 17వ తేదీలోగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు వార్షిక పరీక్షలు నిర్వహించి 2016-17 విద్యాసంవత్సరాన్ని ముగించింది. నాలుగు రోజుల వ్యవధినిచ్చి అదే నెల 21 నుంచి కొత్త విద్యాసంవత్సరాన్ని ప్రారంభించింది. అయితే, మార్చి నెలారంభం నుంచే ఎండలు విపరీతం కావడం, పెళ్లిళ్ల సీజన్, పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్‌కు టీచర్లు వెళ్లడం తదితర కారణాలతో కొత్త విద్యాసంవత్సరం మొక్కుబడిగా ముగిసింది. తరగతులు జరిగిన రోజులు పలు పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం అతి తక్కువగా కనిపించింది. - కాకినాడ రూరల్ గత నెల 17 నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో టీచర్లు ఇన్విజిలేషన్‌కు వెళ్లడం, ఈ నెల మూడు నుంచి ప్రారంభమైన స్పాట్ వాల్యుయేషన్‌కు వెళ్లడంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారే కరువయ్యారు. మిగిలిన ఒకరో, ఇద్దరో పాఠశాలకు వచ్చి మమ అనిపించేశారు. దీంతో అసలు లక్ష్యం నెరవేరకపోగా సమయం వృథా అయ్యిందంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయకపోవడంతో చిన్నారులు పాతపుస్తకాలతోనే పాఠశాలకు వెళ్లడం తప్ప ముందస్తు విద్యాసంవత్సరంతో పిల్లలకు ఒరిగిందేమీలేదు. పాఠశాలలు సక్రమంగా నడుస్తున్నాయా? విద్యార్థుల సాధకబాధలేమిటీ? టీచర్లు సక్రమంగా హాజరవుతున్నారా? అనే విషయాల్లో ఉన్నతాధికారులు పర్యవేక్షించిన పాపాన పోలేదు. ముందస్తు పుణ్యమా అని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కొత్త అడ్మిషన్ల పేరుతో ఫీజులు దండికోవడం తప్పితే ఒనగూరిన ప్రయోజనం లేదని సర్వతా విమర్శలు వినిపిస్తున్నాయి. బోసిపోయిన తరగతులు ఎండలు తీవ్రమవ్వడంతో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోనూ విద్యార్థుల సంఖ్య బాగా తగ్గింది. కొన్ని పాఠశాల్లోనైతే వేళ్లమీద లెక్కించదగ్గ విద్యార్థులే హాజరయ్యారు. ఉపాధ్యాయులు సైతం ఇష్టానుసారంగా వచ్చిపోవడం కూడా ముందస్తు విద్యాసంవత్సరం విఫలమవ్వడానికి కారణమన్న ఆరోపణలు లేకపోలేదు. మొత్తానికి మండిపోతున్న ఎండలతో శనివారంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో ముందస్తు విద్యాసంవత్సరం ముగించేశారు. మార్పుపై పునరాలోచించాలి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తరహాలో కొత్త విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించినా అందుకు తగ్గట్టు విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లను ప్రభుత్వం సన్నద్ధం చేయకపోవడంతో ఈ ప్రయోగం విఫలమైందని తల్లిదండ్రులు, విద్యా మేథావులు అభిప్రాయపడుతున్నారు. కనీసం వచ్చే విద్యా సంవత్సరానికైనా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. ముందస్తు విద్యాసంవత్సరాన్ని కొనసాగించదల్చుకుంటే అన్ని వసతులు కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన పది పరీక్షలు
– చివరి రోజున 233 మంది విద్యార్థులు గైర్హాజరు – వచ్చే నెల 3నుంచి స్పాట్ మొదలు అయ్యే అవకాశం కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి మొదలై.. గురువారం సోషల్ పేపర్–2తో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది సీసీఈ విధానంలో పరీక్షలు జరిగాయి. కొత్త విధానం అయినా.. ఎక్కడా పెద్దగా ఆందోళనలు జరగక పోవడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో ఏవిధంగా పరీక్షలు నిర్వహిస్తారోననే ఆందోళన ఉన్నా ఇంచార్జీ డీఈఓ, డిప్యూటీ ,ఈఓలు, సీనియర్ హెచ్ఎంల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించారు. చివరి రోజున 50,079 మంది విద్యార్థులకుగాను 49,846 మంది విద్యార్థులు హాజరు కాగా.. 233 మంది గైర్హాజరైయ్యారు. డీఈఓ తాహెరా సుల్తానా ఐదు కేంద్రాలు, ఎస్సీఈఆర్టీ నుంచి జిల్లా అబ్జర్వర్‌గా వచ్చిన లక్ష్మీవాట్స్ ఏడు కేంద్రాలను తనిఖీ చేశారు. వచ్చే నెల 3నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. -
సీబీఎస్ఈ పాఠశాలల్లో సీసీఈ విధానం రద్దు
న్యూఢిల్లీ: అన్ని సీబీఎస్ఈ స్కూళ్లలో 6–9 తరగతులకు సమగ్ర నిరంతర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సీబీఎస్ఈ బుధవారం తెలిపింది. బోధన, ముల్యాంకనాలను ప్రామాణీకరించడం కోసం చేపట్టనున్న ఈ మార్పులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సీబీఎస్ఈ పాఠశాలల్లో అమల్లోకి రానున్నాయి. పదో తరగతి పరీక్షలను పునరుద్ధరించడంతో ఈ మార్పులు అత్యవసరమయ్యాయని సీబీఎస్ఈ తెలిపింది. సీసీఈ విద్యా విధానంలోని లోపాల కారణంగా ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారే 6–9 తరగతుల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీబీఎస్ఈ అధికారి ఒకరు అన్నారు. నూతన విద్యావిధానంలో రాత పరీక్షకు 90 శాతం మార్కులు ఉండగా, 10 శాతం మార్కుల్ని ఉపాధ్యాయులు ఇతర కార్యక్రమాలకు కేటాయించనున్నారు. -
విజయోస్తు...
పది ఫలితాల్లో జిల్లాకు వరుసగా ర్యాంకులు సీసీఈ విధానమున్నా ఆ స్థానం ‘పది’లమేనంటున్న విద్యాశాఖ అధికారులు పరీక్షలకు హాజరవనున్న విద్యార్థులు 68,853 భానుగుడి (కాకినాడ) : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర స్థాయిలో జిల్లా ఘనమైన విజయాలను సొంతం చేసుకుంది. ప్రభు త్వ పాఠశాలల్లో మెరికల్లాంటి విద్యార్థులు పదికి పదికి పా యింట్లు సాధించి ప్రైవేటు పాఠశాలలకు దీటైన పోటీనిచ్చారు. అయితే ఈసారి పరీక్షలకు సంబం ధించి నిరంతర సమగ్ర మూ ల్యాంకన విధానం ఆది నుంచి అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్థులకు తల నొప్పిగా మా రింది. దీంతో ప్రస్తుతం పదిస్థానంపై అనుమానాలు ఎక్కువయ్యాయి. సర్కారు నిర్ణయాలతో... ప్రభుత్వం అడ్డగోలుగా ఒకేసారి విద్యా విధానాన్ని మార్చివేసింది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు గందరగోళ పరి స్థితిలోకి వెళ్ళారు. అప్పటి వరకు 9వ తరగతి వరకు ఒక విద్యా విధానానికి అలవాటుపడ్డ ప్రస్తుత పదో తరగతి విద్యార్థి ఒకేసారి ఒక కొత్త విధానంలోకి మారాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనిపై ఉపాధ్యాయులకు శిక్షణ నిర్వహిస్తామన్న విద్యాశాఖ ప్రత్యక్షంగా ఒక శిక్షణా తరగతిని నిర్వహించిందీ లేదు. ఎఫ్ఏ–1,2,3,4 పరీక్షలకు సంబంధించి మార్కుల పైనా, సమ్మెటివ్–1,2లపైనా ఎటువంటి సమీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. దీనికితోడు మూడు నెలలుగా ఉపాధ్యాయులకు ఎమ్ఈవో ప్రమోషన్లు, పండిట్, పీఈటీ అప్గ్రేడేషన్లు, ఉపాధ్యాయుల బదిలీలంటూ గందరగోళానికి గురిచేశారు. సరిగ్గా పరీక్షలు దగ్గరపడే సమయానికి 50 మంది ప్రధానోపాధ్యాయులను ఎమ్ఈవోలుగా ప్రమోష¯ŒS కల్పించి ఆయా పాఠశాలలను దిక్సూచి లేని నావలా మార్చేశారు. జనవరి వరకు గ్రిగ్స్ పోటీలు నిర్వహించడం, డీఈవోలకు బదిలీలు పెట్టడం, ఇవన్నీ పదో తరగతి పరీక్షల మీద ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాకు ఒకే ఒక్క డీవైఈవో ఉన్నారు... మిగిలిన చోట్ల గందరగోళ పరిస్థితిలో విద్యాశాఖ కొట్టుమిట్టాడుతోంది. 1 నుంచి 3 స్థానాల్లో నిలిచిన ఘనత జిల్లాదే. 2012 సంవత్సరం నుంచి గతేడాది వరకు పదో తరగతి ఫలితాల్లో 1 నుంచి 3 వరకు ర్యాంకులు సాధించిన ఘనత జిల్లాకు దక్కుతుంది. సంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉత్తీర్ణతా శాతం ర్యాంకు 2012–13 58,781 55,488 94.40 3 2013–14 60,431 63,217 96.26 1 2014–15 65,338 63,217 96.75 2 2015–16 67,493 65,850 97.57 3 ఈ సారి ఉన్నత స్థానమే... గత మూడు సంవత్సరాలుగా ఉత్తీర్ణతా శాతం పెరుగుతూ వస్తోంది. పదో తరగతి పరీక్షలకు సంబం ధించి అన్ని చర్యలూ తీసుకున్నాం. గత కొన్ని నెలలుగా ప్రత్యేక బృందాలు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ప్రతీ విద్యార్థి వ్యక్తిగత సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీచేశాం. ఆ¯ŒSలై¯ŒSలో విద్యార్థుల మార్కుల ఆధారంగా ఉపాధ్యాయులకు సూచనలిచ్చాం. ఈసారి మెరుగైన స్థానాన్ని ఖచ్చితంగా జిల్లా సాధిస్తుంది. – డీఈవో అబ్రహం -
సీసీఈతో చిక్కులే..
ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రూరల్ విద్యార్థుల్లో సృజనాత్మకత కష్టమంటున్న ఉపాధ్యాయులు సీసీఈ రద్దు పైనే ఆశలు కాకినాడ రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి, బట్టీ విధానానికి స్వస్తి పలికేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సీసీఈ విధానంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టకుండా వారిలో ఉన్న తెలివితేటల ఆధారంగా పాఠ్యాంశాల్లోని సారాంశాన్ని గ్రహించి అర్థం చేసుకునేందుకుగాను నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి వల్ల విద్యార్థులు ఏ ఒక్కరోజు పాఠశాల గైర్హాజరు కాకుండా నిత్యం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు గ్రహించిన పాఠ్యాంశ సారాంశంపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి అవగాహనను అంచనా వేస్తారు. సమ్మెటివ్, ఫార్మటివ్ పరీక్షలపై విద్యార్థుల భవితవ్యం నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్ 1 నుంచి 4, ఫార్మటివ్ 1 నుంచి 4 పరీక్షలు నిర్వహిస్తారు. వీటిల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు పదో తరగతిలో 20 మార్కులు మేర స్కోరింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలన్నింటికీ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరై పదో తరగతి వార్షిక పరీక్షలో 80 మార్కులకుగాను 35 మార్కులు పైబడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఉత్తీర్ణతను కోల్పోవాల్సి ఉంటుంది. ఏడు మార్కులు తప్పనిసరి... సమ్మెటివ్, ఫార్మటివ్ పరీక్షల్లో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 20 మార్కులకుగాను తప్పనిసరిగా ఏడు మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సమ్మెటివ్, ఫార్మటివ్ పరీక్షల్లో జీరో (0) మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు వార్షిక పరీక్షలో 80 మార్కులకు 35 మార్కులు పైబడి సాధించుకుంటేనే ఉత్తీర్ణత సాధిస్తారు. పాఠ్యాంశాల్లోని సారాంశంతో పాటు విద్యార్థుల తెలివితేటలను ఆధారంగా చేసుకొని ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను రూరల్ ప్రాంతాల్లోని విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు. సీసీఈపై నివేదిక... సీసీఈ విధానాన్ని మొదట్లో సీబీఎస్ఈ (సెంట్రల్ సిలబస్) ఉన్న పాఠశాలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ విధానం వల్ల విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత సాధించలేకపోవటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన తీవ్రమైంది. ఓ కమిటీని నియమించి సీసీఈ విధానంపై సమగ్ర విచారణ చేయించింది. కమిటీ సభ్యులు త్వరలో నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారని విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులకు లాంగ్వేజ్‌పై పట్టు ఉండాలి సీసీఈ విధానం వల్ల ప్రతి విద్యార్థికి లాంగ్వేజ్‌పై పట్టుండాలి. నిత్యం పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలి. అప్పుడే సీసీఈ విధానం విజయవంతమవుతుంది.రూరల్ ప్రాంతాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. – ఎంవీఏ మణికుమార్, ఇంగ్లిషు ఉపాధ్యాయుడు, ఇంద్రపాలెం గ్రామీణంలో ఇబ్బందే... సీసీఈ విధానం మంచిదే కానీ రూరల్ ప్రాంతాల్లో విజయవంతం కాదు. విద్యార్థులు పూర్తిగా అర్థం చేసుకొని సొంతంగా జవాబు రాయాల్సి ఉంది. సీబీఎస్ఈ సిలబస్ ఉన్న పాఠశాలల్లో ఇది వరకే ఈ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనతో కేంద్రప్రభుత్వం కమిటీని వేసి విచారించింది. కమిటీ కూడా విచారణ చేసి నివేదికలను సమర్పిస్తే విధానం రద్దయ్యే అవకాశం ఉంది. – పి.పుల్లయ్య, హెచ్ఎం జెడ్పీ ఉన్నతపాఠశాల, ఇంద్రపాలెం. తెలివితేటలపై ఆధారపడి ఉంది... సీసీఈ విధానం విద్యార్థుల తెలివితేటలపై ఆధారపడి ఉంది. మొదట్లో ఈ విధానం వల్ల విద్యార్థులు కొంత మేర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయి. క్రమేణా ఈ విధానం వల్ల తెలివితేటలు పెరిగి బట్టీపట్టే విధానానికి దూరమయ్యే అవకాశాలున్నాయి. – దడాల వాడపల్లి, డీవైఈవో కాకినాడ డివిజ¯ŒS -
పదిలో ‘ప్రయివేట్ స్టడీ’ ఆవుట్
– సీసీఈ పద్ధతిలో ఇంటర్నల్ మార్కుల ఫలితం – ఇకపై ప్రయివేట్ విద్యార్థులకు ఓపెన్ స్కూల్ విధానమొక్కటే మార్గం – ఈ నెల 30వరకు ఓపెన్ స్కూల్‌కు దరఖాస్తుల స్వీకరణ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): నిరంతర సమగ్ర మూల్యాంకనం (కాంప్రహెన్సివ్ కంటిన్యూవస్ ఎవాల్యూషన్(సీసీఈ)) ఫలితంగా పదో తరగతిలో ప్రయివేట్ స్టడీకి పులిస్టాప్ పడింది. ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచే నూతన విధానం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసినట్లు విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ స్టడీ చేద్దామనుకున్న విద్యార్థులకు ఇకపై ఓపెన్ స్కూల్ విధానం ఒక్కటే మార్గం. సీసీఈ ఎఫెక్ట్.. ఈ ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం 6 నుంచి 10వ తరగతి వరకు నిర్వహించే పరీక్షల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నిరంతర సమగ్ర మూల్యాంకన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో అంతర్గత, బహిర్గత మూల్యాంకనాలున్నాయి. బహిర్గత మూల్యాంకనంలో ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అంతర్గత మూల్యాంకనానికి 20 మార్కులుంటాయి. విద్యార్థికి ఏడాది పొడవునా నిర్వహించే ఫార్మెటీవ్, సమ్మేటీవ్ పరీక్షలు, రికార్డులు, ప్రాజెక్టులు, ఇతర బోధనంశాల నుంచి అంతర్గత మూల్యాంకనంలో 20 మార్కులు కేటాయిస్తారు. ఈ నేపథ్యంలో ప్రయివేట్ స్టడీ అభ్యర్థులకు ఇంటర్నల్ మార్కులు వేసేందుకు వీలు పడదు. వీరు ఏకంగా పబ్లిక్ పరీక్షలకు హాజరవుతుండడంతో ఇబ్బందులు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా పదో తరగతిలో ప్రయివేట్ స్టడీ విధానాన్ని రద్దు చేసింది. ఓపెన్ స్కూలే దిక్కు.. జిల్లాలో ఏటా 3500 నుంచి 4000 మంది విద్యార్థులు పదో తరగతిని ప్రయివేట్ స్టడీ విధానంలో పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇలాంటి విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఒక్కటే దిక్కుగా మారింది. లేదంటే రెగ్యులర్‌గా చదవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతిని చదివేందుకు ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు సమీప అధ్యయన కేంద్రాలు, డీఈఓ కార్యాలయంలో సంప్రదించవచ్చు. అవును ఆ విధానం రద్దయింది: రవీంద్రనాథ్‌రెడ్డి, డీఈఓ ఈ ఏడాది నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రయివేట్ స్టడీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. సీసీఈ పద్ధతిలో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు తలెత్తిన ఇబ్బందుల కారణంగా సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు విద్యార్థులంతా ఇకపై ఓపెన్ స్కూల్ విధానంలో టెన్త్ పూర్తి చేసుకోవాల్సిందే. రెగ్యులర్, ఓపెన్‌స్కూల్ సర్టిఫికెట్‌కు ఎలాంటి తేడా ఉండదు. -
స్కూళ్ళలో యోగాకు గ్రేడ్స్ ఇవ్వండి!
యోగాపై విద్యా సంస్థలు, వర్శిటీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలంటూ యూజీసీ సర్క్యులర్ జారీ చేయడం, యోగా చేసే ముందు ఓంకారం, శ్లోకాలతో ప్రార్థన చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచన చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఓపక్క పార్టీలు, మత పెద్దలు ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగానే... ఆరవతరగతినుంచి సీబీఎస్ఈ స్కూళ్ళలోని రోజువారీ సీసీఈ కార్యక్రమాల్లో యోగాను భాగం చేయడంతోపాటు గ్రేడ్స్ ను సైతం అందించాలని ఎఫ్లియేటెడ్ పాఠశాలల ప్రిన్సిపల్స్ కు సర్క్యులర్ అందడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సీబీఎస్ఈ పాఠశాలలకు వచ్చిన యోగా సర్క్యులర్ పై కార్యదర్శి జోసెఫ్ ఇమ్మాన్యూల్ స్పందించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో పాల్గొనేందుకు విద్యార్థులు సంవత్సరమంతా రోజువారీ కార్యక్రమంగా యోగాను చేయాలా అంటూ ప్రశ్నించారు. ఆయుష్ ప్రోటోకాల్ ను ప్రస్తావించిన ఆయన... పిల్లలు వారానికోసారి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే సరిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే ముస్లిం మత పెద్దలు, పార్టీల అభ్యంతరాలతో యోగా కార్యక్రమంలో 'ఓం' ను, వైదిక మంత్రాలను పఠించడం తప్పనిసరి కాదని, ఎవరి ఇష్టం వారిదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్సష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే... ఇప్పటికే సీసీఈ కార్యకలాపాల్లో యోగా భాగంగా ఉందని, మొత్తం పాఠశాల విద్యార్థులు ప్రతిరోజూ యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేకపోయినా, వారానికోసారి ఉదయం అసెంబ్లీలో భాగంగా యోగా నిర్వహించవచ్చని సీనియర్ సీబీఎస్ఈ అధికారి తెలిపారు. మరోవైపు క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో ఆయుష్ మంత్రిత్వశాఖ సూచనల ప్రకారం విద్యార్థులను సర్టిఫికేషన్ కోర్సు చేయించాలంటే.. సీబీఎస్ఈ స్కూళ్ళలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ను కూడ అప్పాయింట్ చేయాలని సీబీఎస్ఈ కోరింది. -
విషయ వికాసమే విజయ సోపానం...
సాంఘిక శాస్త్రంలో సీసీఈ (ఇఇఉ) లక్ష్యాలు ప్రస్తుతం విద్యార్థులు పాఠశాలల్లో నేర్చుకున్న సమాచారాన్ని ఎంతవరకు జ్ఞాపకం ఉంచుకోగలరనే సామర్థ్యంపై ఆధారపడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తున్న ఈ పద్ధతి వల్ల పిల్లలు తీవ్రమైన ఒత్తిడి, మానసిక వ్యాకులతకు గురవుతున్నారు. దీన్ని నివారించి శారీరక, మానసిక, ఉద్వేగ వికాసాల ఆధారంగా విద్యార్థులు విద్య నేర్చుకోవాలి. పరీక్షలను ఆహ్లాదంగా రాయాలి. ఇలాంటి వైఖరి విద్యార్థులలో పెంపొందించడ మే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) ముఖ్య ఉద్దేశం. నూతన సిలబస్ - విశ్లేషణ గతంలో సాంఘికశాస్త్త్ర పాఠ్యాంశాలను భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం అనే విభాగాల కింద విభజించి పాఠ్య పుస్తకంలో పొందుపరిచారు. ఇప్పుడు అలా కాకుండా భూగోళ శాస్త్రం, అర్థ శాస్త్రాలను మొదటి భాగంలో, చరిత్ర, పౌరశాస్త్రాలను రెండో భాగంలో చేర్చి మొత్తం 22 చాప్టర్లను రూపొందించారు. భాగం-1 భూగోళ, అర్థశాస్త్రాలు (1 నుంచి 12 చాప్టర్లు) భూగోళ శాస్త్రంలో భారత దేశ భౌగోళిక స్థితిగతులు, శీతోష్ణస్థితి, నదులు, నీటిపారుదల వ్యవస్థ, జనాభా, వ్యవసాయం-పంటలు- ఆహార భద్రత పాఠ్యాంశాలను చేర్చారు. అర్థశాస్త్రంలో స్థూల జాతీయోత్పత్తి, జాతీయాదాయం, తలసరి ఆదాయం, ఉపాధి, ప్రజల వలసలు, విదేశీ వాణిజ్యం-ప్రపంచీకరణ, పర్యావరణ హక్కులు, ప్రజాపంపిణీ వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి గురించి వివరించారు. భాగం-2 చరిత్ర-పౌరశాస్త్రాలు 13 నుంచి 22 చాప్టర్లు ఈ భాగంలో ఆధునిక ప్రపంచ చరిత్ర (క్రీ.శ. 1900 - 1950 సం॥వివిధ వలస పాలన వ్యతిరేక ఉద్యమాలు, భారత జాతీయోద్యమం గురించి పేర్కొన్నారు. అలాగే భారత రాజ్యాంగ నిర్మాణం, 30 సం॥స్వతంత్ర భారతదేశం (క్రీ.శ. 1947 నుంచి 1977 వరకు), దేశంలో వివిధ రాజకీయ ధోరణులు (క్రీ.శ. 1977 నుంచి 2000 వరకు), ఐక్యరాజ్య సమితి-విదేశాలతో భారత సంబంధాలు,భారత దేశంలో సమకాలీన సామాజిక ఉద్యమాలు, సమాచార హక్కు చట్టం, న్యాయసేవ ప్రాధికార సంస్థల గురించి వివరంగా తెలిపారు. పరీక్షా విధానం - ప్రశ్నల రూపకల్పన జవాబులు రాసే తీరు:సీసీఈ విధానంలో నిర్వహించే వార్షిక పరీక్షల్లో కూడా గతంలో మాదిరిగానే రెండు పేపర్లుంటాయి.పేపర్-1లో భూగోళ, అర్థశాస్త్రంలోని పాఠ్యాంశాల నుంచి, పేపర్-2లో చరిత్ర, పౌరశాస్త్రాల నుంచి ప్రశ్నలను ఇస్తారు. జవాబులను బట్టీపట్టి రాయడానికి అవకాశం లేదు. ఒక ప్రశ్నకు అందరు విద్యార్థులు ఒకేలా సమాధానం రాయాలన్న నిబంధన ఏమీ లేదు. సమాధాన పత్రాల మూల్యాంకన విధానాన్ని కూడా మారుస్తున్నారు. ప్రశ్నలు కూడా బహుళ సమాధానాలు వచ్చే విధంగా ‘ఓపెన్ ఎండెడ్’గా ఉంటాయి. వాటికి విద్యార్థులు బాగా ఆలోచించి, విశ్లేషించి, అన్వయించుకుని, వ్యాఖ్యానిస్తూ జవాబులు రాయాలి. 80 ఎక్స్టర్నల్... 20 ఇంటర్నల్ టేబుల్ వేయాలి పేపర్-1కు 40 మార్కులు, పేపర్-2కు 40 మార్కులు ఉంటాయి. అంటే వార్షిక పరీక్షలో సాంఘిక శాస్త్రానికి రెండు పేపర్లలో కలిపి 80 మార్కులు ఉంటాయి. ఈ రెండింటిలో 35శాతం అంటే 28 మార్కులు సాధించాలి. వీటిని ఎక్స్టర్నల్ పరీక్ష మార్కులుగా భావించాలి. ఇవేకాకుండా 20 మార్కులను ఇంటర్నల్స్‌కు కేటాయించారు. ఈ మార్కులను సంబంధిత పాఠశాల సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు విద్యా సంవత్సరంలో నిర్వహించిన నాలుగు నిర్మాణాత్మక మూల్యాంకనాల (ఫార్మేటీవ్ అసెస్మెంట్ -ఎఫ్ఎ)లోని సగటును నిర్ధారించి 20 మార్కులకు కుదిస్తారు. ఈ ఇంటర్నల్స్‌లో కనీసం 7 మార్కులను విద్యార్థులు సాధించాలి. ఆ విధంగా మొత్తం 100మార్కులకు కనీ సం 35 మార్కులు (28 ఎక్స్టర్నల్ మార్కులు+ 7 ఇంటర్నల్ మార్కులు) సాధించిన వారే ఉత్తీర్ణులవుతారు. ఒక్కో పేపర్‌కు సమయం గం. 2.45 ని. ప్రతి పేపర్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి 2 గం. 45ని.ల సమయాన్ని కేటాయించారు. ఇందులో మొదటి 15 నిమిషాలు ప్రశ్నపత్రాన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి విద్యార్థులు ఉపయోగించుకోవాలి. 15 నిమిషాల తర్వాతనే సమాధాన పత్రాన్ని ఇస్తారు. మార్కులు: పేపర్-1లోనూ, పేపర్-2లోనూ ప్రశ్నల సంఖ్య, మార్కులు ఈ విధంగా ఉంటాయి. ప్రశ్నల రకం ఒక్కోదానికి మార్కులు మొత్తం మార్కులు 4 4 16 6 2 12 7 1 07 1/2 10 05 మొత్తం మార్కులు 40 పైవాటిలో 4 మార్కుల ప్రశ్నలలో మాత్రమే చాయిస్ ఉంటుంది. ఆ నాలుగు ప్రశ్నల్లో ఒక్కోదాని కింద ఎ, బి రూపంలో ప్రశ్నలుంటాయి. ఎదైనా ఒకే ప్రశ్నకు సమాధానం రాయాలి. రెండింటికి సమాధానాలు రాసినా ఎక్కువ మార్కులు వచ్చిన ప్రశ్ననే పరిగణనలోకి తీసుకుంటారు. అలా మొత్తం 8 ప్రశ్నల్లో నాలుగింటికి మాత్రమే జవాబులు రాయాలి. 1/2 మార్కు, 1 మార్కు, 2 మార్కుల ప్రశ్నల్లో ఎలాంటి చాయిస్ ఉండదు. అన్నింటికీ తప్పనిసరిగా సమాధానాలు రాయాలి. ప్రశ్నలకు సమాధానాల పరిధి ఇలా ఉండాలి: 4 మార్కుల ప్రశ్నకు 12 నుంచి 15 వాక్యాల సమాధానం రాయాలి. 2 మార్కుల ప్రశ్నకు 5 నుంచి 6 వాక్యాల సమాధానం రాయాలి. 1 మార్కు ప్రశ్నకు 2 నుంచి 3 వాక్యాల సమాధానం రాయాలి. విద్యా ప్రమాణాలు వాటికి కేటాయించిన మార్కులు వార్షిక పరీక్షలలో విద్యా ప్రమాణాల వారీగా మార్కుల కేటాయింపు (పేపర్ 1, 2) విద్యా ప్రమాణాలు కేటాయించిన మార్కులు విషయావగాహన 16 మార్కులు ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం4 మార్కులు సమాచార సేకరణ నైపుణ్యం 6 మార్కులు సమకాలీన అంశాలపై ప్రతిస్పందన -ప్రశ్నించడం4 మార్కులు పట నైపుణ్యాలు 6 మార్కులు ప్రశంస/ అభినందన -సున్నితత్వం 4 మార్కులు మొత్తం 40 మార్కులు విద్యా ప్రమాణాల వారీ ప్రశ్నలు- ఉదాహరణలు ప్రశ్నలు ఏ రకమైన విద్యాప్రమాణాలను సంతృప్త పరుస్తున్నాయో తెలుసుకోవడానికి మొదటి చాప్టర్ భారతదేశం-భౌగోళిక స్వరూపాలలోని ప్రశ్నలను ఉదాహరణగా తీసుకుంటే.... 1.విషయావగాహన ప్రశ్న: భారత దేశ ప్రధాన భౌగోళిక విభజనలేవి? 2.ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం ప్రపంచ భూభాగమంతా రెండు ప్రధాన భూ ఖండాల నుంచి ఏర్పడ్డాయి. అవి 1. అంగారా భూమి (లోరేసియా), 2. గోండ్వానా భూమి. భారత దేశ ద్వీప కల్పం గోండ్వానా భూభాగంలో ఉంది. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి, భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఈశాన్య దిశగా పయనించి చాలా పెద్దదైన యూరేసియా ఫలకం (అంగారా భూమి)తో ఢీకొంది. తదేశంలోని విస్తారమైన ఉత్తర సమతల మైదానాలతో కలిగే లాభాలు ఏమిటి? 3.సమాచార సేకరణ నైపుణ్యాలు: శివాలిక్ శ్రేణిలోని పర్వతాలను జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలని, అరుణాచల్‌ప్రదేశ్‌లో మిష్మి కొండలని పిలుస్తారు. ఆఫ్గాన్‌లో కచార్ కొండలని అంటారు. ఈ ప్రాంతంలో పెద్దపెద్దరాళ్లు, ఒండ్రు మట్టి ఉంటుంది. నిమ్న హిమాలయ, శివాలిక్ శ్రేణుల మధ్య ఉండే లోయలను స్థానికంగా డూన్లు అంటారు. వీటిలో ప్రసిద్ధి గాంచిన డూన్లకు ఉదాహరణః డెహ్రాడూన్, కోట్లీ డూన్, పొట్లిడూన్ మొదలైనవి. డూన్ అనగానేమి? అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న ఏవైనా మూడు కొండల పేర్లను పేర్కొనండి? మన రాష్ట్రంలో ఉన్న ఏవైనా రెండు కొండలను తెలిపి అవి ఏఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయో వివరించండి? 4.సమకాలీన అంశాలపై ప్రతిస్పందన- ప్రశ్నించడం: పశ్చిమాన ఉన్న గుజరాత్లో కంటే అరుణాచల్ ప్రదేశ్‌లో సూర్యోదయం రెండు గంటల ముందు అవుతుంది. కానీ గడియారాలు ఒకే సమయం సూచిస్తాయి. ఎందుకు? 5.పట నైపుణ్యాలు: భారతదేశ పటంలో కింది వాటిని గుర్తించండి? ఆరావళి పర్వతాలు ఐఐ. లక్ష దీవులు ఐఐఐ. మాల్వా పీఠభూమి ఐగ. థార్ ఎడారి 6.ప్రశంస/ అభినందన -సున్నితత్వం:భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? మీ ఉపాధ్యాయుల సహాయంతో అన్ని యూనిట్ల పాఠ్యాంశాలలో విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ప్రశ్నలను గుర్తించి, సమాధానం కోసం సాధన చేయాలి. వారి సలహాల ప్రకారం తప్పులను సరిదిద్దుకోవాలి. అధిక మార్కుల సాధనకు సూచనలు ుూనిట్ వారీ ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్నంగా చదవాలి. పాఠం చివర ఉన్న కీలక పదాల నిర్వచనాలను ప్రత్యేక దృష్టితో చదవాలి. పాఠ్యాంశాలపై ఉపాధ్యాయుల విశ్లేషణలను సావధానంగా విని, తమ ప్రతిస్పందనలు సరైనవో, కావో నిర్ధారించుకోవాలి. పాఠాలలోని ముఖ్యాంశాలు, ఉదాహరణలు, గణాంకాలు, చిత్రాలు, పటాలపై పూర్తి అవగాహన కోసం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు, మిత్రులతో చర్చించాలి. పట నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇంటి దగ్గర, తరగతి గదిలో ప్రపంచ పటాన్ని, భారతదేశ పటాన్ని, అట్లాస్‌ను నిత్యం సాధన చేయాలి. సమకాలీన అంశాల అవగాహన కోసం ప్రతిరోజు ఒక ప్రామాణిక దినపత్రికను చదవాలి. పాఠ్యాంశాలకు సంబంధించిన అనుబంధ, అదనపు సమాచారాన్ని ఉపాధ్యాయులు లేదా పాఠశాల లైబ్రరీ ద్వారాగానీ సేకరించి నోట్స్ రాసుకోవాలి. పాఠ్యాంశం చివరలో ఉన్న ప్రశ్నలకు సొంతంగా సమాధానం రాయడానికి ప్రయత్నించండి. అలా చేస్తే వ్రాత నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. పాఠశాల నిర్వహించే కమ్యూనిటీ సర్వేలలో, క్షేత్ర పర్యటనలలో విధిగా పాల్గొనాలి. సాంఘికశాస్త్ర పదజాలాన్ని, వాక్య నిర్మాణాన్ని ఉపయోగించి సమాధానాలను రాస్తే ఎక్కువ మార్కులు పొందే అవకాశముంది. సమాధానం రాసేటప్పుడు దానికి సంబంధించిన ప్రాంతాలను గుర్తిస్తూ పటం గీసి విశ్లేషిస్తే గరిష్ట మార్కులు సాధించవచ్చు. సమాచార సేకరణ పని/ప్రాజెక్ట్ పనిని స్వతహాగా, నిబద్ధతతో, పారదర్శకంగా చేపట్టాలి. -
సబ్జెక్ట్ సామర్థ్యాలతోనే ఆంగ్లంలో అగ్రస్థానం
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్ట్ విషయంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు టెక్ట్స్‌బుక్ ఒక్కటే. అదేవిధంగా పరీక్ష విధానం కూడా ఒకే రకంగా ఉంటుంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా పరీక్ష నిర్వహణకు సంబంధించి ఒకే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇందుకు సరైన వనరులు లేవని భావించాల్సిన అవసరం లేదు. ప్రణాళికా ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే ఇంగ్లిష్‌లో సులువుగానే ఎ-1 గ్రేడ్ సొంతం చేసుకోవచ్చు. నూతన విధానం: పరీక్ష నిర్వహణకు సంబంధించి అనుసరించే నూతన పద్ధతిని సీసీఈ(CCE- Continuous ComprehensiveEvaluation)గా పేర్కొంటారు. ఇందులో ఇంటర్నల్స్‌కు 20మార్కులు,ఎక్స్‌టర్నల్‌కు 80మార్కులు కేటాయించారు. 8 నిర్మాణాత్మక మూల్యాంకనం: యూనిట్ టెస్ట్‌ల స్థానంలో నిర్మాణాత్మక మూల్యాంకనం(FormativeAssessme-nt)విధానాన్ని చేర్చారు. ఒక్కో ఫార్మేటివ్ అసెస్మెంట్ 50 మార్కులు. ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి. అవి.. 1. స్టూడెంట్ రిఫ్లెక్షన్స్: తరగతిలో విద్యార్థి స్పందనలు (10 మార్కులు) 2. రిటెన్ వర్క్స్: నోట్ బుక్-రాతపనికి సంబంధించి ఇతర అసైన్మెంట్స్ (10 మార్కులు) 3. {పాజెక్ట్ వర్క్స్: ప్రతి యూనిట్ చివర ఇచ్చిన ప్రాజెక్ట్ పనులు (10 మార్కులు) 4. స్లిప్ టెస్ట్: యూనిట్ల పరిధిలో ఉండే కాంప్రెహెన్సివ్, ఇతర లాంగ్వేజ్ డిస్కోర్సెస్పై ప్రశ్నలు(10మార్కులు) ఫార్మెటివ్ అసెస్మెంట్: సంవత్సరం చివర నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్లలో వచ్చిన మార్కుల్ని కలిపి వాటిని ఒక్కో దాన్ని (భాగాల వారీగా) 5 మార్కులకు కుదిస్తారు. ఈ నాలుగు విభాగాలు కలిపి 20 మార్కులు. ఇందులో కనీసం 7 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. ఎక్స్‌టర్నల్‌లో 80 మార్కుల్లో కనీసం 28 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించవచ్చు. ఇంటర్నల్-ఎక్స్టర్నల్ రెండిట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలి. ఏ ఒక్కదాంట్లో కనీస మార్కులు తగ్గినా ఫెయిల్ అయినట్లే. సంగ్రహణాత్మక మూల్యాంకనం: ఎక్స్టర్నల్ పరీక్షను సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్ఏ -సమ్మేటివ్ అసెస్మెంట్) అంటారు. ఇది మొత్తం 80 మార్కులకు ఉంటుంది. అయితే గతంలో పరీక్షలో రెండు పేపర్లు ఉండేవి. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒకే పేపర్‌గా పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం సుదీర్ఘంగా ఉంటుంది. కాబట్టి దాన్ని చదువుకోవడానికి 15 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. సమాధానాలు రాయడానికి 3 గంటలు కేటాయించారు. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. సమాధానాలను నిర్దేశించిన ఆన్సర్ బుక్‌లెట్‌లోనే రాయాలి. రఫ్ వర్క్ కోసం చివరి పేజీలను ఉపయోగించుకోవచ్చు. గతంలో త్రైమాసిక, అర్థ వార్షిక పరీక్షల మాదిరిగా ఎస్ఏ-1, ఎస్ఏ-2 నిర్వహిస్తారు. వాటిని రాయడం ద్వారా నూతన విధానంపై అవగాహన ఏర్పడుతుంది. వార్షిక పరీక్షను ఎస్ఏ-3గా వ్యవహరిస్తారు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 3 భాగాలు ఉంటాయి. అవి.. రీడింగ్ కాంప్రెహెన్షన్ (సెక్షన్-ఎ). వొక్యాబులరీ అండ్ గ్రామర్ (సెక్షన్-బి). యేటివ్ రైటింగ్ (డిస్కోర్సెస్, సెక్షన్-సి). రీడింగ్ కాంప్రెహెన్షన్ దీనికి 30 మార్కులు కేటాయించారు. ఇందులో మొత్తం నాలుగు ప్యాసేజ్‌లు ఇస్తారు. వాటిపై కాంప్రెహెన్షన్ ప్రశ్నలు ఉంటాయి. రెండు ప్యాసేజ్‌లు టెక్ట్స్ బుక్ నుంచి ఇస్తే మిగతా రెండు అన్‌సీన్ ప్యాసేజ్‌లు. 1వ ప్రశ్న:ఇందులో 8 యూనిట్లలో నుంచి ఏదో ఒక ప్యాసేజ్ (200-250 పదాలు) ఇస్తారు. దీనిపై నాలుగు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. తర్వాత మూడు లఘు ప్రశ్నలు ఇస్తారు. వీటికి 1 లేదా 2 రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. 2వ ప్రశ్న:ఇందులోని ప్యాసేజ్ (100-120 పదాలు) కూడా టెక్ట్స్ బుక్ నుంచే ఉంటుంది. దీనిపై మూడు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. తర్వాత రెండు లఘు ప్రశ్నలు ఇస్తారు. వీటికి 1 లేదా 2 రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. పొయెట్రీ నుంచి కూడా ప్యాసేజ్ వచ్చే అవకాశం ఉంది. 8 మరో ముఖ్యమైన విషయం.. పై ప్యాసేజ్‌లు టెక్ట్స్‌బుక్ నుంచే ఇస్తారు. కానీ టెక్ట్స్‌బుక్‌లోని ప్రశ్నలు ఇవ్వరు. కాబట్టి వాటిని బట్టీపట్టడం వంటివి చేయొద్దు. 3వ ప్రశ్న:అన్‌సీన్ ప్యాసేజ్ (200-250 పదాలు). ఇది టెక్ట్స్బుక్లో ఉండదు. దీనిపై నాలుగు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. తర్వాత మూడు లఘు ప్రశ్నలు ఇస్తారు. వీటికి 1లేదా 2 రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. 4వ ప్రశ్న:అన్‌సీన్ ప్యాసేజ్ (100-120 పదాలు). ఇది కూడా టెక్ట్స్బుక్లో ఉండదు. దీనిపై మూడు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. తర్వాత రెండు లఘు ప్రశ్నలు ఇస్తారు. వీటికి 1లేదా 2 రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. 8 ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఏదైనా ఒక ప్యాసేజ్ తీసుకుని దానిపై స్వయంగా ప్రశ్నలు తయారు చేసుకోవాలి. వాటికి సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి. ఇందుకు గ్రూప్ యాక్టివిటీ చక్కగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు గ్రూప్‌గా ఏర్పడి ఒకరు ప్రశ్నలు రూపొందిస్తే.. మరొకరు సమాధానాలు రాయడం చేయాలి. చివరగా ప్రశ్నలు-జవాబుల మీద చర్చించుకోవడం బాగా లాభిస్తుంది. ఇలా చేయడం ద్వారా ప్యాసేజ్ నేపథ్యం (సెంట్రల్ ఐడియా), కీలక పదాలు (Key Words) వెంటనే స్ఫురణకు వస్తాయి. వొకాబ్యులరీ అండ్ గ్రామర్ దీనికి 20 మార్కులు కేటాయించారు. ఇందులో నాలుగు ప్యాసేజ్‌లు ఇస్తారు. వాటిలో రెండు పాఠ్యపుస్తకం నుంచి ఇస్తే మరో రెండు అన్‌సీన్ ప్యాసేజ్‌లు. ఒక్కో ప్యాసేజ్‌కు 5 మార్కులు. ఇందులోని ప్రశ్నలు.. 5వ ప్రశ్న:ఇందులో టెక్ట్స్‌బుక్ నుంచి ఏదైనా ఒక ప్యాసేజ్ ఇస్తారు. అందులో కొన్ని వాక్యాలకు 1 నుంచి 5 సంఖ్యలు ఇస్తారు. సంఖ్యలు ఉన్నచోట తప్పు (ఎర్రర్) ఉంటుంది. దాన్ని కనుక్కొని సరైన పదం/పదబంధం/వాక్యం (Word/ Phrase/ Sentence) రాయాలి. 6వ ప్రశ్న:టెక్ట్స్‌బుక్ నుంచి ఏదైనా ఒక ప్యాసేజ్ ఇస్తారు. అందులో అక్కడక్కడా కొన్ని ఖాళీలు (ఆ్చజుట) ఉంటాయి. ప్రతి ఖాళీకి 1 నుంచి 5 సంఖ్యలు ఇస్తారు. ప్యాసేజ్ కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్‌ల్లోంచి సరైన దాన్ని ఎన్నుకొని రాయాలి. దీన్ని క్లోజ్ టెస్ట్ అంటారు.7వ ప్రశ్న: ఇది 5వ ప్రశ్న మాదిరిగానే ఉంటుంది. కాకపోతే అడిగే ప్యాసేజ్ టెక్ట్స్బుక్లో ఉండదు. అందులో కొన్ని వాక్యాలకు 1 నుంచి 5 సంఖ్యలు ఇస్తారు. సంఖ్యలు ఉన్నచోట తప్పు (ఎర్రర్) ఉంటుంది. దాన్ని కనుక్కొని సరైన పదం/పదబంధం/వాక్యం రాయాలి. 8వ ప్రశ్న: ఇది 6వ ప్రశ్న వంటి క్లోజ్ టెస్ట్. అయితే అన్‌సీన్ ప్యాసేజ్ ఇస్తారు. అందులో అక్కడక్కడా కొన్ని ఖాళీలు ఉంటాయి. ప్రతి ఖాళీకి 1 నుంచి 5 సంఖ్యలు ఇస్తారు. ప్యాసేజ్ కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్‌ల్లోంచి సరైన దాన్ని ఎన్నుకొని రాయాలి. 8 ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందాలంటే మొదటి యూనిట్ నుంచి చివరి యూనిట్ వరకు ఉన్న పాఠాల్లో తెలియని పదాల అర్ధాలు తెలుసుకోవాలి. వాటిని సొంత వాక్యాల్లో ప్రయోగించడం నేర్చుకోవాలి. అదేవిధంగా వాక్యనిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక నియమాలు, ప్యాసేజ్‌లలో వాక్యాల అమరికపై చక్కటి అవగాహన అవసరం. ముఖ్యం. డిక్షనరీ ఉపయోగించడం అలవాటుగా చేసుకోవడం తప్పనిసరి. కూడా అవగాహన ఉండటం ప్రయోజనకరం. క్రియేటివ్ రైటింగ్ (డిస్కోర్సెస్) దీనికి 30 మార్కులు కేటాయించారు. పదో తరగతి పూర్తయ్యే విద్యార్థికి రిటెన్ ఇంగ్లిష్ (Writ-ten English) పరంగా సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ విభాగాన్ని రూపొందించారు. ఇందులో మొత్తం 4 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో రెండు మేజర్ డిస్కోర్సెస్, రెండు మైనర్ డిస్కోర్సెస్. మేజర్ డిస్కోర్సెస్‌ను ఎ,బిలుగా విభజించారు. విద్యార్థులు ఈ రెండింటిలోని డిస్కోర్సెస్‌ను నేర్చుకోవాలి. అవి.. 8 Major discourses A: Story/ narrative; Conversation; Description; Drama script/ Play; Interview and Choreography. 8 Major discourses B: Biography; Essay; Re-port/ news report; Letter and Speech (script) 9వ ప్రశ్న:ఒక ప్యాసేజ్/న్యూస్ రిపోర్ట్/బయోగ్రఫీ వంటి ఏదో ఒకటి ఇచ్చి దానిపై మేజర్ డిస్కోర్సెస్ గ్రూప్-ఎ నుంచి రెండు డిస్కోర్సెస్ అడుగుతారు. దీనిలో ఒక దానికి సమాధానం రాయాలి. దీనికి 10 మార్కులు.10వ ప్రశ్న:ఇందులో పిక్చర్(ఇమేజ్)తో కూడిన అంశాన్ని ఇస్తారు. మేజర్ డిస్కోర్సెస్ గ్రూప్-బి నుంచి రెండు డిస్కోర్సెస్ అడుగుతారు. దీనిలో ఒక దానికి సమాధానం రాయాలి. దీనికి 10 మార్కులు. 8 మైనర్ డిస్కోర్సెస్‌ను కూడా ఎ,బిలుగా విభజించారు. అవి.. Minor discourses A: Message; Notice and Diary. Minor discourses B: Poster; Invitation and Profile. 11వ ప్రశ్న:దులో ఏదైనా ఒక నరేటివ్ (Narrativ) ఇచ్చి దానిపై మైనర్ డిస్కోర్సెస్ గ్రూప్-ఎ నుంచి ఏదైనా ఒక ప్రశ్న అడుగుతారు. చాయిస్ లేదు. దీనికి 5 మార్కులు.12వ ప్రశ్న: ఇందులో ఏదైనా ఒక సందర్భానిచ్చి దానిపై మైనర్ డిస్కోర్సెస్లోని గ్రూప్-బి నుంచి ఏదైనా ఒక డిస్కోర్సెస్ రాయమంటారు. దీనికి కూడా చాయిస్ లేదు. 8 ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. టెక్ట్స్‌బుక్ యూనిట్లలో ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్‌లను స్వయంగా చేయాలి. ఈ క్రమంలో సొంతంగా ఆలోచించడం, ఆ ఆలోచనలను పేపర్‌పై పెట్టడం, వాటిని క్రమ పద్ధతిలో అమర్చడం, మేజర్-మైనర్ డిస్కోర్సెస్లుగా వాటిని ప్రెజెంట్ చేయడం వంటివి నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ఇందులో అడిగే ప్రశ్నలు దాదాపుగా ఓపెన్ ఎండెడ్. వీటికి ఏవిధంగా సమాధానం రాసినా సరిపోతుంది. కాకపోతే సమాధానాన్ని ఏవిధంగా రాసామనేది కీలకం. కాబట్టి భాషాపరమైన దోషాలు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కాబట్టి విద్యార్థి స్వీయ ఆలోచనలను పేపర్‌పై వివిధ డిస్కోర్సెస్ రూపంలో పెట్టడం ప్రయోజనకరం. ఇందుకోసం నలుగురైదుగురు విద్యార్థులు జట్టుగా ఏర్పడి చర్చించుకోవడం కూడా లాభిస్తుంది. గుర్తుంచుకోవాల్సినవి రోజు వారీ పాఠాలను ఎప్పటికప్పుడు చదవాలి. ఏ రోజు నోట్స్ ఆ రోజు పూర్తి చేయాలి. తెలియని విషయాలను స్నేహితులు లేదా ఉపాధ్యాయులతో చర్చించి తెలుసుకోవాలి. పాజెక్ట్ వర్క్‌ను కూడా తప్పకుండా చేయాలి. తరగతి గదిలో ప్రతి యాక్టివిటీలో పాల్గొనాలి. -
ఆలోచించి, చర్చించి, రాయండి...
ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమైన దశ. ఈ తరుణంలో మారిన పాఠ్యపుస్తకాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం (Continuous Comprehensive Evaluation-CCE) విధానంలో ప్రశ్నపత్రంపై అవగాహన పెంపొందించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే గణితం సబ్జెక్టు అత్యంత ముఖ్యమైనది. సీసీఈ పద్ధతిలో సమస్యలను సాధిస్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తే వందకు వంద మార్కులు సాధించవచ్చు. గణితంలో 10 గ్రేడ్ పాయింట్లు సాధించడానికి అవసరమైన సూచనలు మీకోసం.. 2014-15 విద్యా సంవత్సరం నుంచి నూతన గణిత పాఠ్యపుస్తకం అందుబాటులోకి వచ్చింది. పరీక్ష విధానంలోనూ సంస్కరణలు ప్రవేశపెట్టారు. సీసీఈ పద్ధతిలో పరీక్ష ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో భాగంగా సమస్య సాధన (Problem solving); కారణాలు చెప్పడం- నిరూపణ చేయడం (Reasoning-Proof); వ్యక్త పరచడం (Com-munication); అనుసంధానం (Connection); దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం (Visualisation and Repre-sentation) విద్యా ప్రమాణాల ఆధారంగా సమస్యలను సాధించాల్సి ఉంటుంది. వీటిపై సమగ్ర అవగాహన ఏర్పడాలంటే ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి. రోజూ కొంత సమయాన్ని గణితానికి కేటాయించి, సమస్యలను సాధిస్తే మంచి మార్కులు సొంతమవుతాయి. అధ్యాయాల విశ్లేషణ కొత్త గణిత పాఠ్యపుస్తకంలో మొత్తం 14 అధ్యాయాలున్నాయి. సిలబస్‌ను పరిశీలిస్తే వాస్తవ సంఖ్యలు అధ్యాయంలోని సంవర్గమానాలు; సమితులు, రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత, క్షేత్రమితి, సంభావ్యత అధ్యాయాలు తప్ప మిగిలిన అధ్యాయాలన్నీ గత పాఠ్యపుస్తకంలోనివే. మొత్తం 14 అధ్యాయాలను పేపర్-1, పేపర్-2గా విభజించారు. పేపర్-1 1. వాస్తవ సంఖ్యలు 2. సమితులు 3. బహుపదులు 4. రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత 5. వర్గ సమీకరణాలు 6. శ్రేఢులు 7. నిరూపక జ్యామితి పేపర్-2 8. సరూప త్రిభుజాలు 9. వృత్తానికి స్పర్శరేఖలు, ఛేదన రేఖలు 10. క్షేత్రమితి 11. త్రికోణమితి 12. త్రికోణమితి అనువర్తనాలు 13. సంభావ్యత 14. సాంఖ్యక శాస్త్రం కొత్త విధానంలో ప్రత్యేకంగా అధ్యాయాలకు వెయిటేజీ లేదు. ఏ అధ్యాయం నుంచైనా, ఎలాంటి ప్రశ్నలైనా, ఎన్ని ప్రశ్నలైనా ఇవ్వొచ్చు. అందువల్ల విద్యార్థులు ఏదైనా సమస్యను సాధించేటప్పుడు అది ఏ విద్యా ప్రమాణం కిందకొస్తుందో గుర్తించాలి. దానికి అనుగుణంగా సాధించాలి. పాఠ్యపుస్తకంలోని సమస్యలు కాకుండా అలాంటి స్వభావం ఉన్న ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ప్రతి అధ్యాయాన్ని క్షుణ్నంగా నేర్చుకోవాలి. పబ్లిక్ పరీక్షకు సన్నద్ధం: పబ్లిక్ పరీక్ష ప్రశ్నపత్రంలో రెండు మార్కులు, ఒక మార్కు, బహుళైచ్ఛిక ప్రశ్నలకు చాయిస్ ఉండదు. 4 మార్కుల ప్రశ్నలకు అంతర్గత ఎంపిక (ఇంటర్నల్ చాయిస్) ఉంటుంది. అందువల్ల ప్రతి అధ్యాయాన్నీ క్షుణ్నంగా నేర్చుకోవాల్సిందే. పేపర్-1లో సమితులు, వర్గ సమీకరణాలు, శ్రేఢులు, నిరూపకజ్యామితి అధ్యాయాలు సాధారణ విద్యార్థికి అర్థమయ్యే అధ్యాయాలు. కొద్దిపాటి ప్రాక్టీస్‌తో వీటిపై పూర్తిస్థాయిలో పట్టుసాధించవచ్చు. వాస్తవ సంఖ్యల అధ్యాయంలోని సంవర్గమానాలు; మూడో అధ్యాయంలో రేఖీయ, వర్గబహుపదుల గ్రాఫ్, 4వ అధ్యాయంలోని గ్రాఫు పద్ధతి ద్వారా రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జతను సాధించే విధానం ముఖ్యమైనవి. ముఖ్యమైనవి: పేపర్-2లో సాంఖ్యక శాస్త్రం అధ్యాయం మాత్రమే తేలికైనది. మిగిలిన అధ్యాయాలలోని అంశాలపై ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా పట్టుసాధించవచ్చు. 8వ అధ్యాయంలోని ప్రాథమిక అనుపాత సిద్ధాంతం, పైథాగరస్ సిద్ధాంతం వాటిపై ఆధారపడిన సమస్యలు, దత్తరేఖా ఖండాన్ని కోరిన నిష్పత్తిలో విభజించే నిర్మాణం.9వ అధ్యాయంలోని అధిక వృత్త ఖండ వైశాల్యం కనుగొనుట, క్షేత్రమితిలోని ఘనాకార వస్తువుల కలయిక వల్ల ఏర్పడే నూతన వస్తువుల ఉపరితల వైశాల్యం, ఘనపరిమాణం, 11వ అధ్యాయంలోని త్రికోణమితి నిష్పత్తులు, వివిధ కోణాలకు త్రికోణమితి నిష్పత్తుల సమస్యలు.12వ అధ్యాయంలోని ఎత్తులు-దూరాల సమస్యలు, 13వ అధ్యాయంలోని సంభావ్యత ప్రాథమిక భావనలు ముఖ్యమైనవి. గుర్తుంచుకోండి! ప్రతి అధ్యాయంలోని నిర్వచనాలు, ప్రాథమిక భావనలు, సూత్రాలు నేర్చుకుంటే ఒక మార్కు ప్రశ్నలకు ఉపయోగకరం.సమితులు, శ్రేఢులు, నిరూపక జ్యామితి, సరూప త్రిభుజాల అధ్యాయంలోని సిద్ధాంతాలు, క్షేత్రమితి, త్రికోణమితి అనువర్తనాలు, సాంఖ్యకశాస్త్రంలోని వ్యాసరూప ప్రశ్నలు ఎక్కువగా ‘సమస్యా సాధన’ విద్యా ప్రమాణం పరిధిలోకి వచ్చే వ్యాసరూప ప్రశ్నలు.బహుపదులు, 5వ అధ్యాయంలోని గ్రాఫు సమస్యలు, సరూప త్రిభుజాల్లోని నిర్మాణాలు, సాంఖ్యకశాస్త్రంలోని ఓజీవ్ వక్రం ‘దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం’ అనే విద్యా ప్రమాణం కిందకు వచ్చే సమస్యలు. పరీక్షా విధానం విద్యా సంవత్సరంలో నాలుగు యూనిట్ టెస్ట్‌లకు బదులుగా 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు; క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షలకు బదులుగా రెండు సమ్మేటివ్ అసెస్మెంట్లు ఉంటాయి. మూడో సమ్మేటివ్ అసెస్మెంట్ను పబ్లిక్ పరీక్షగా నిర్వహిస్తారు. ఒక్కొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్కు 20 మార్కులు, ఒక్కొక్క సమ్మేటివ్ అసెస్మెంట్కు 80 మార్కులు (పేపర్- 1కు 40; పేపర్- 2కు 40) కేటాయించారు. పబ్లిక్ పరీక్షగా నిర్వహించే మూడో సమ్మేటివ్ అసెస్మెంట్కు 80 మార్కులు, నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ల సరాసరి 20 మార్కులు కలిపి మొత్తం 100 మార్కులకు గ్రేడ్‌ను నిర్ణయిస్తారు. ఫార్మేటివ్ అసెస్మెంట్లను పాఠశాల స్థాయిలో తరగతి గదిలో నూతన సమస్యలు రూపొందించుట- సాధించుట, రాత పనులు, ప్రాజెక్టు పని, లఘు పరీక్ష అనే నాలుగు అంశాల ఆధారంగా ఉపాధ్యాయుడు నిర్వహిస్తాడు. ఇందులో ప్రతి అంశానికి 5 మార్కులు. విద్యా ప్రమాణాల వెయిటేజీ ఆధారంగా పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం విశ్లేషణ: పబ్లిక్ పరీక్షను మార్చి/ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. పేపర్-1కు 40 మార్కులు, పేపర్-2కు 40 మార్కులు కేటాయించారు. ప్రశ్నల స్వరూపం {పశ్నలు మార్కులు మొత్తం మార్కులు వ్యాసరూప ప్రశ్నలు 4 4 16 లఘు సమాధాన ప్రశ్నలు 6 2 12 అతి లఘు సమాధాన ప్రశ్నలు 7 1 7 బహుళైచ్చిక ప్రశ్నలు 10 1/2 5 ప్రశ్నపత్రంలో విద్యా ప్రమాణాల ఆధారంగా భారత్వం: విద్యా ప్రమాణం భారత్వ శాతం మార్కులు సమస్యా సాధన 40 16 కారణాలు చెప్పడం- నిరూపణ చేయడం 20 8 వ్యక్తపరచడం 10 4 అనుసంధానం 15 6 దృశ్యీకరణ, ప్రాతనిధ్యపరచడం 15 6 వ్యక్తపరచడం, అనుసంధానం, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం విద్యా ప్రమాణాల భారత్వ శాతం 5 శాతం అటూఇటూ మారవచ్చు. పేపర్-1కు నిర్వహించే రెండు ఎఫ్ఏల సరాసరిని 10 మార్కులకు, పేపర్-2కు నిర్వహించే రెండు ఎఫ్ఏల సరాసరిని 10 మార్కులకు క్రోడీకరించి ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులుగా నిర్ణయిస్తారు. సమ్మేటివ్ అసెస్మెంట్కు సంబంధించి రెండు పేపర్లలో విడివిడిగా 40 మార్కులకు 14 మార్కులు, ఫార్మేటివ్ అసెస్మెంట్లో పది మార్కులకు 4 మార్కులు సాధించాలి. ప్రిపరేషన్ ప్రణాళిక వ్యాసరూప ప్రశ్నలు: ప్రశ్నపత్రంలో వ్యాసరూప ప్రశ్నలకు ఎక్కువ వెయిటేజీ ఉంది. సమస్యా సాధన, కారణాలు చెప్పడం విద్యా ప్రమాణాల పరిధిలోకి వచ్చే వ్యాసరూప ప్రశ్నలను ప్రతి అధ్యాయంలోనూ సాధించాలి. సమితులు, శ్రేఢులు, నిరూపక జ్యామితి, సరూప త్రిభుజాలు, సిద్ధాంతాలు, క్షేత్రమితి, త్రికోణమితి అనువర్తనాలు, సాంఖ్యక శాస్త్రం నుంచి ఎక్కువ వ్యాసరూప ప్రశ్నలు వచ్చే అవకాశముంది. లఘు, అతి లఘు, బహుళైచ్చిక ప్రశ్నలు: ప్రతి అధ్యాయంలోని నిర్వచనాలు, సూత్రాలు, ప్రాథమిక భావనలను నేర్చుకోవడం వల్ల లఘు సమాధాన, అతి లఘు సమాధాన, బహుళైచ్చిక ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయొచ్చు. ఇవి ఎక్కువగా వ్యక్తపరచడం, అనుసంధానం విద్యాప్రమాణాలకు సంబంధించినవి ఉంటాయి. గ్రాఫ్‌లు, సిద్ధాంతాలు, నిర్మాణాలు: పేపర్-1లో 3, 4, 7 అధ్యాయాల నుంచి ఇచ్చే గ్రాఫ్ ప్రశ్నలు, పేపర్-2లో 8, 9, 14 అధ్యాయాల నుంచి ఇచ్చే రేఖాగణితం సమస్యలు ‘ప్రాతినిధ్యపరచడం’ విద్యా ప్రమాణం కిందకొస్తాయి. సూత్రాలు: గణితం.. సూత్రాలపై ఆధారపడిన సబ్జెక్టు. అందువల్ల ప్రతి అధ్యాయంలోని సూత్రాలను ఒక పుస్తకంలో రాసుకొని, తరచూ పునశ్చరణ చేయాలి. ఇదే విధంగా ప్రతి అధ్యాయంలోని నిర్వచనాలను, ప్రాథమిక భావనలను ఒక చోట రాసుకొని ప్రాక్టీస్ చేయాలి. పది గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే 92-100 మార్కుల మధ్య మార్కులు వస్తే పది గ్రేడ్ పాయింట్లు సాధించినట్లే. 1 మార్కు, 2 మార్కుల, బహుళైచ్చిక ప్రశ్నల్లో కొన్ని తప్పులుదొర్లినప్పటికీ తేలిగ్గా 92 మార్కులు సాధించవచ్చు. దీనికోసం కొత్త సిలబస్‌పై పట్టుసాధించాలి. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయడం వల్ల అధిక మార్కులు సాధించొచ్చు. పాఠ్యపుస్తకంలోని ‘ఇవి చేయండి’, ‘ప్రయత్నించండి’, ‘ఆలోచించి, చర్చించి, రాయండి’లోని సమస్యలను విధిగా సాధించాలి. సాధారణ విద్యార్థుల ప్రిపరేషన్: సాధారణ విద్యార్థులకు సమితులు, వర్గ సమీకరణాలు, శ్రేఢులు,నిరూపక జ్యామితి, క్షేత్రమితి, సాంఖ్యకశాస్త్రం తది తర అధ్యాయాల్లోని అంశాలు తేలిగ్గా అర్థమవుతాయి. కాబ ట్టి వాటిలోని అన్ని భావనలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. పొందికగా రాయాలి.. నేర్చుకున్న అంశాలను చక్కగా పరీక్షలో పొందుపరచలేకపోతే మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. తొలుత బాగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. సమాధాన పత్రంలో కొట్టివేతలు లేకుండా చూసుకోవాలి. నిర్దేశ కాల వ్యవధిలో సమాధానాలు రాయడం పూర్తయ్యేటట్లు టైం మేనేజ్మెంట్ పాటించాలి. బహుళైచ్చిక ప్రశ్నలకు సమాధానాలను సమాధానపత్రంలో ఒకేచోట రాయాలి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు తప్ప మిగిలిన రంగుల స్కెచ్ పెన్నులు ఉపయోగించి ముఖ్యమైన అంశాలను, నిర్వచనాలను అండర్లైన్ చేయాలి. సీబీఎస్ఈ గత ప్రశ్నపత్రాలతో మేలు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటి వరకు విద్యార్థులు గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి, ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు కాబట్టి ఎస్సీఈఆర్టీ నమూనా ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి. కొత్త పాఠ్యపుస్తకంలోని అంశాలు, సీబీఎస్ఈ సిలబస్‌లోని అంశాలు ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి సీబీఎస్ఈ గత ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి. -
బట్టీ చదువులకు చెక్!
తెరపైకి కొత్త పద్ధతి - సీసీఈ విధానానికి శ్రీకారం - ఉపాధ్యాయులకు శిక్షణ కెరమెరి : టెస్ట్ పేపర్ కొని వరుసగా నాలుగు మోడల్ పేపర్లు బట్టీ పట్టేస్తే వార్షిక పరీక్షలో ఈజీగా పాసయ్యేవారు. కానీ ఆ పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇక నుంచి విద్యార్థి మేథో సంపత్తి, తార్కిక శక్తిని నిశితంగా పరిశీలించేందుకు కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆ విధానమే ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నవ్య విధానంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంతో కథనం. ఇదీ నిరంతర సమగ్ర మూల్యాంకనం పాఠశాలలో జరిగే అభ్యాసన ప్రక్రియలకు, లక్ష్యాలకు, బోధనలకు, ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థి మేథో మథనానికి తోడ్పడే విధానమే నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ). ఈ విధానం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఈ ఏడాది 9, 10 తరగతులకూ వర్తింపజేశారు. పదో త రగతి పాఠ్యపుస్తకాలు మారడంతో పరీక్ష విధానం కూడా సీసీఈ పద్ధతిలోనే ఉండనుంది. ఇందుకోసం ఉపాధ్యాయులకు కొత్త పాఠ్యపుస్తకాల బోధన విధానం, మూ ల్యాంకనంపై అవగాహన కోసం ఈ నెల 16 నుంచి శిక్ష ణ ఇస్తున్నారు. ప్రతీ సబ్జెక్టులో నిర్మాణాత్మక మూల్యాం కనం (ఫార్మెటీవ్ అసిస్మెంట్) ద్వారా ఏడాదిలో నాలు గు సార్లు లఘు పరీక్ష పెడుతారు. ఇక సంగ్రాహనాత్మక మూల్యాంకనమంటే విషయావగాహన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార సేక రణ, ప్రాజెక్టు పనులు, విలువలు, మొదలగు విద్యాప్రమాణాలను అనుసరించి ఏడాదికి మూడు సార్లు పరీక్ష నిర్వహించే విధానం. ఇందులో విద్యార్థి ప్ర శ్నలు ఆలోచించి రాయాల్సి ఉంటుంది. ఈ విధానంలో పుస్తకంలో ఉన్న ప్రశ్నలను నేరుగా ఇవ్వరు. అలాగే ఒకసారి ఇచ్చిన ప్రశ్న రెండోసారి పునారావృతం కాదు. మార్కుల విధానం.. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగానే ఈ ఏడాది 9, 10 తరగతులకు 100 మార్కులకు బదులు 80 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. మిగిలిన 20 మార్కులు విద్యార్థుల జ్ఞాపకశక్తి, ప్రతిస్పందనలు, రాత అంశాలు, ప్రాజెకు పనులకు సంబంధించి మార్కులు ఉంటాయి. జీవితానికి అన్వయించుకునేలా.. విద్యార్థి పాఠ్యాంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తను నేర్చుకున్న అంశాలను తన జీవితానికి అన్వయించుకునేందుకు ఈ విధానం దోహదపడుతుంది. విద్యార్థులను టీచర్లు కొన్ని కోణాల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, విషయ పరిశీలన, పరిశోధనా శక్తి మెరుగుపడుతుంది. అయితే 20 మార్కులకు సంబంధించి ఉపాధ్యాయుడు విద్యార్థుల విషయంలో ఎంతో నిశితంగా పరిశీలనతో వ్యవహరించాల్సి ఉంటుంది. - చంద్రశేఖర్, ఉపాధ్యాయుడు, అనార్పల్లి ఆలోచన విధానానికే మార్కులు గత బోధన విధానం ప్రకారం పాఠాల వెనుక ఉన్న నిరంతరం వచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడమనేది మూస పద్ధతి. కానీ ప్రస్తుత విధానంలో విషయ సంసిద్ధతతో ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్లాలి. గణితంలో ప్రస్తుతం సమస్యకు సంబంధించిన సూత్రాలు కూడా ఉపాధ్యాయులే విద్యార్థుల ద్వారా రాబట్టాల్సి ఉంటుంది. అందువల్ల విద్యార్థుల ఆలోచన శక్తి పెరిగేలా ఉపాధ్యాయుడు ఎంతో చొరవ చూపాలి. - తిరుపతి, ఉపాధ్యాయుడు, గోయగాం నిశిత పరిశీలన అవసరం ఈ విధానం మేథోసంపత్తి ఉన్న నేటి తరం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో కీలకం. పాఠశాల వెలుపల, లోపల విద్యార్థులను నిశితంగా పరిశీలించాలి. ఇంతకు ముందులా నోట్స్, గైడ్స్ ఉండవు. తరగతి గదిలో విద్యార్థులు నేర్చుకున్న దానిని తన మేథో ఆధారంగా రాయాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యార్థిలో ఉన్న జ్ఞానం వెలికి వచ్చి ఒక ప్రశ్నకు ఒక్కో విద్యార్థి ఒక్కో రీతిలో సమాధానమిస్తాడు. ఇది విద్యార్థి తార్కిక ఆలోచనకు, పరిశోధన శక్తికి దోహదపడుతుంది. - ఆర్.రమేశ్, ఉపాధ్యాయుడు, కెరమెరి -
సింగిల్ టీచర్లకు.. బడి భారం
విజయనగరం అర్బన్: విద్యార్థులకు ఒక వైపు పాఠాలు చెప్పేది..క్రమశిక్షణ నేర్పేది ఆయనే..మరోవైపు నూతన విద్యాబోధన విధానం నిరంతర సమగ్ర మూల్యాంకన(సీసీఈ)ం మేరకు ప్రతి విద్యార్థి ప్రతిభను వ్యక్తిగతంగా పరిశీలించి గ్రేడింగ్ వేయాల్సిన అదనపు పనిభారం. పని ఒత్తిడి నేపథ్యంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు బోధనకు దూరంగా ఉంటున్నాయి. మరో టీచర్ అవసరమని అడిగినా అదిగో..ఇదిగో అంటూ వాయిదాలు వేస్తారే కానీ, సిబ్బందిని మాత్రం కేటాయించరు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి మించి అదనంగా టీచర్లు ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పాఠశాలల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జిల్లాలో గత ఏడాదిలో ప్రతినెలాఖరున నిర్వహించిన సబ్జెక్టు టీచర్ల పదోన్నతుల భర్తీ వల్ల ఉన్నత పాఠశాలల్లో టీచర్ల కొరత కొంతమేరకు తీరింది. కానీ పదోన్నతుల భర్తీ వల్ల ప్రాథమిక పాఠశాలల్లో 624 పోస్టుల వరకు జిల్లాలో ఎస్జీటీ పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటితో పాటు ఇప్పటికే ఈ పాఠశాలల్లో గత ఏడాది రద్దయిన విద్యావలంటీర్ల పోస్టుల ఎస్జీటీ స్థానాలు మరో 700 వరకు ఉన్నాయి. జిల్లాలో 2,844 ప్రాథమిక పాఠశాలల్లో గత సెప్టెంబర్‌లో నమోదైన డైస్ నివేదిక ప్రకారం 1.55 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరికి ఆరువేల మంది ఎస్జీటీ ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయుల నిష్పత్తి లేదని రెండేళ్ల క్రితం 700 మంది విద్యావలంటీర్లతో బోధన ప్రక్రియను సాగించారు. అయితే విద్యాహక్కు చట్టం అమలు నేపథ్యంలో విద్యాశాఖ ఈ విధానానికి గత ఏడాది మంగళం పలికింది. ప్రత్యామ్నాయంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ పేరుతో నిరుద్యోగ ఉపాధ్యాయలను వేసుకోవాలనే వెసులుబాటు ఇచ్చారు. కానీ రాష్ట్రస్థాయి అధికారులు అనుమతించిన 73 మంది పరిమితి సంఖ్యలో ప్రాథమిక పాఠశాలల ఎస్జీటీలకు కాకుండా కేవలం ఉన్నత పాఠశాలల్లోని సబ్జెక్టు టీచర్పోస్టులకు మాత్రమే వర్తింపజేశారు. పూర్వపు రోజుల మాదిరిగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రస్తుతం దర్శనమిస్తూ ప్రభుత్వ పనితీరును వెక్కిరిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 2,844 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఏకోపాధ్యాయ పాఠశాలలు 624 ఉన్నాయి. గత ఏడాది అధిక సంఖ్యలో పదోన్నతులు ఇవ్వడంతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల సంఖ్య తగ్గింది. 25,257 మంది విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలలు ఐటీడీఏ ప్రాంతాల్లో, ప్రభుత్వ పాఠశాలలు కలిపి 306, మండల ప్రజాపరిషత్ స్కూళ్లు 314, మున్సిపాలిటీల్లో 4 ఉన్నాయి. అసలు ఉపాధ్యాయులు లేని పాఠశాలలు 10వరకు ఉండగా, 50 నుంచి 70 మంది విద్యార్థులున్న పాఠశాలలు డజను వరకు ఉన్నాయి. వీటి స్థానాల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. అయితే దీనిపై విద్యాశాఖ నుంచి స్పందన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుడు అత్యవసర సమయంలో సెలవు పెట్టిన రోజున ఇతర పాఠశాలల్లోని టీచర్లు ఇక్కడికి రావడానికి ససేమిరా.. అంటున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవట్లేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో ఉపాధ్యాయుడు సెలవు పెట్టిన ప్రతిసారీ పాఠశాల మూసేయవలసిందే..! ఒకటి నుంచి ఐదోతరగతి వరకు ఒక్కరే ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పాలంటే తలకు మించిన భారం. అన్ని తరగతుల విద్యార్థుల్ని ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం ఉపాధ్యాయుల ఓపికకు సవాల్‌గా మారింది. మళ్లీ డీఎస్సీ నిర్వహిస్తే గాని పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలు కనిపించ డం లేదు. ఒకేసారి బోధిస్తే, పాఠాలు ఎలా అర్థమవు తాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రేషనలైజేషన్‌తో పరిష్కారం జిల్లాలో ప్రమోషన్లు, ఉద్యోగ విరమణల వల్ల పలు స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం వల్ల విద్యావలంటీర్లను వేయలేని పరిస్థితి ఉంది. దీంతో ఏకోపాధ్యాయ సమస్యలను పరిష్కరించలేక పోయాం. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా సర్దుబాటు (రేషనలైజేషన్) ప్రక్రియ త్వరలో చేపట్టే అవకాశం ఉంది. సమస్య పరిష్కారం అవుతుంది. -జి. కృష్ణారావు, డీఈఓ -
కొత్త పాఠ్యపుస్తకాలు, సీసీఈపై టీచర్లకు టెలీకాన్ఫరెన్స్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 2014-15 విద్యాసంవత్సరంలో అమలులోకి రానున్న కొత్త పాఠ్యపుస్తకాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)పై ఉపాధ్యాయులకు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎస్సీఈఆర్టీ డెరైక్టర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశించినట్లు డీఈఓ డాక్టర్ ఎ.రాజేశ్వరరావు తెలిపారు. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ వాణీమోహన్, ఎస్సీఈఆర్టీ డెరైక్టర్ గోపాల్‌రెడ్డిలతో శుక్రవారం వీడియో సమావేశం నిర్వహించారు. డైట్ ప్రిన్సిపాల్ బీ విజయభాస్కర్, ఇ.సాల్మన్, షేక్ చాంద్‌బేగం, వి.రామ్మోహన్, డైట్ అధ్యాపకులు పాల్గొన్నారు. సమావేశం వివరాలను డీఈఓ వెల్లడించారు. ఉపాధ్యాయులు ఈ నెల 20 నుంచి 30 వరకు ఆయా మండల కేంద్రాల్లో టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కేజీబీవీలు, ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులందరూ ఈ టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలి. షెడ్యూలు ఇదీ... ఈ నెల 20న తెలుగు, 21న ఇంగ్లిష్, 22న గణితం, 23న ఫిజికల్ సైన్సు, 24న సాంఘికశాస్త్రం, 25న బయోలాజికల్ సైన్సు, 27న హిందీ ఆయా సబ్జెక్టుల హైస్కూలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే స్కూలు అసిస్టెంట్లు, కొత్త టెస్ట్‌బుక్స్, నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)పై నిర్వహించే టెలీకాన్ఫరెన్స్‌కు హాజరుకావాలని డీఈఓ కోరారు. ఈ నెల 28న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, 29న ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పని చేసే సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు 50 శాతం మంది 30న, మిగిలిన 50 శాతం మంది ఉపాధ్యాయులు పాఠశాలలు మూతపడకుండా విధిగా హాజరుకావాల్సిందిగా ఆదేశించారు. ఉదయం 9 గంటలకు సంబంధిత టెలీకాన్ఫరెన్స్ ప్రదేశాన్ని చేరుకోవాలని డీఈఓ కోరారు. టెలీకాన్ఫరెన్స్ కేంద్రాల్లో మంచినీరు, టాయిలెట్ వసతి కల్పించాల్సిందిగా ఎంఈఓలను ఆదేశించారు.