ముగిసిన పది పరీక్షలు
ముగిసిన పది పరీక్షలు
Published Thu, Mar 30 2017 9:14 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
– చివరి రోజున 233 మంది విద్యార్థులు గైర్హాజరు
– వచ్చే నెల 3నుంచి స్పాట్ మొదలు అయ్యే అవకాశం
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచి మొదలై.. గురువారం సోషల్ పేపర్–2తో ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఏడాది సీసీఈ విధానంలో పరీక్షలు జరిగాయి. కొత్త విధానం అయినా.. ఎక్కడా పెద్దగా ఆందోళనలు జరగక పోవడంతో విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రెగ్యులర్ డీఈఓ లేకపోవడంతో ఏవిధంగా పరీక్షలు నిర్వహిస్తారోననే ఆందోళన ఉన్నా ఇంచార్జీ డీఈఓ, డిప్యూటీ ,ఈఓలు, సీనియర్ హెచ్‌ఎంల సహకారంతో ప్రశాంతంగా నిర్వహించారు. చివరి రోజున 50,079 మంది విద్యార్థులకుగాను 49,846 మంది విద్యార్థులు హాజరు కాగా.. 233 మంది గైర్హాజరైయ్యారు. డీఈఓ తాహెరా సుల్తానా ఐదు కేంద్రాలు, ఎస్‌సీఈఆర్‌టీ నుంచి జిల్లా అబ్జర్వర్‌గా వచ్చిన లక్ష్మీవాట్స్ ఏడు కేంద్రాలను తనిఖీ చేశారు. వచ్చే నెల 3నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
Advertisement