నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
Published Tue, Jun 13 2017 11:29 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
- జిల్లాలో 22 కేంద్రాలు
- పరీక్షలకు 4260 మంది విద్యార్థులు
కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాధికారి తరఫున ఏడీ కె.సరోజినిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 28 వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 22 కేంద్రాలు ఎంపిక చేశామన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్‌టికెట్ లేని పక్షంలో అనుమతించబోమని తెలిపారు. పరీక్షలకు జిల్లా నుంచి 4260 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు.
Advertisement
Advertisement