Supplementary
-
AP: ఒక్క క్లిక్‌తో ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఒక్క క్లిక్‌తో జనరల్ ఫలితాలుఒక్క క్లిక్‌తో ఒకేషనల్ ఫలితాలు ఏపీ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్టు ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించారు. ఈ పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. -
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అదనపు చక్కెర సంకలితాలతో వచ్చే ప్రోటీన్ సప్లిమెంట్లు వినియోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషన్ ఇన్స్టిట్యూట్ఆప్ న్యూట్రిషియన్(ఐపీఎంఆర్-ఎన్ఐఎన్) పిలుపునిచ్చింది. వీటివల్ల మూత్రపిండాలకు ఎముకలకు హాని కలుగుతుందని, ఆరోగ్యకరమైన వ్యక్తులకు వీటి అవసరం లేదని పేర్కొంది. ప్రోటీన్ల అవసరాన్ని భర్తీ చేసుకునేలా సమతుల్యమైన ఆహార సరిపోతుందని తెలిపింది. పైగా అందుకోసం కొత్త ఆహార మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. చాలామంది సహజసిద్ధంగా సమతుల్య ఆహారంలో వచ్చే పోషకాలను వదిలిపెట్టే కృత్రిమంగా ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారని డైటీషియన్లు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రోటీన్ సప్లిమెంట్లన్నీ గుడ్లు, పాలు, పాల విరుగుడు లేదా సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతోనే తయారు చేస్తారని అన్నారు. ఈ చక్కెర సంకలితాలతో కూడిన ఈ ప్రోటీన్ సట్లు మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పప్పుధాన్యాలు, పప్పులు, గింజలు, గుడ్లు, పౌల్ట్రీ, చేపలు మొదలైనవి అన్ని వయసుల వారికి కావాల్సిన ప్రోటీన్లను అందిస్తాయని అన్నారు. అలాగే ఏ రకమైన ప్రొటీన్ పౌడర్లు లేదా సప్లిమెంట్లను ఇవ్వడానికి ముందు ఒక వ్యక్తికి ప్రోటీన్ ఎంత మేర అవసరం అనేది అంచనా వేసి సదరు క్లినిక్ లేదా న్యూటీషియన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మంచి నాణ్యమైన ప్రోటీన్ పొందడానికి 3:1 నిష్పత్తిలో పప్పులతో కూడిన తృణధాన్యాల కలయిక శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందజేస్తాయని అన్నారు. ఆహారం ద్వారా తీసుకునే ప్రోటీన్ కండరాల నష్టాన్ని నివారిస్తుందని అన్నారు. అలాగే వినియోగించిన ప్రోటీన్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేలా తగిన శారీరక శ్రమ కూడా ఉండాలని డైటీషియన్లు సూచించారు. సమతుల్య ఆహారం శరీర పనితీరుకు అవసరమైన 20 ముఖ్యమైన అమైనో ఆమ్లాల అవసరాన్ని తీరుస్తుందని చెప్పారు. ఇక మన శరీరం సంశ్లేషణ చేయలేని ఈ అమైనో ఆమ్లాలలో కొన్నింటిని పొందడానికి, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ప్రోటీన్ వంటి విభిన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం అని ఐపీఎంఆర్-ఎన్ఐఎన్ పేర్కొంది. సాదారణ ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చెయ్యకూడదని పేర్కొంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల స్థితిని అనుసరించి వైద్య నిపుణులు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చేయాలని నూట్రిషియన్లు చెబుతున్నారు.(చదవండి: ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?) -
18 నుంచి ఇంటర్ ‘సప్లిమెంటరీ’ ఫీజు చెల్లింపు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఓ ప్రకటనలో తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇదే తేదీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. జవాబు పత్రాల (ఒక్కో పేపర్) రీ వెరిఫికేషన్‌కు రూ.1300, రీకౌంటింగ్‌కు రూ.260 చెల్లించాలన్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.550, ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం రూ.550 పరీక్ష ఫీజుతో పాటు పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే.. సైన్స్ విద్యార్థులు రూ.1440, ఆర్ట్స్ విద్యార్థులు రూ.1240 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు తమతమ కళాశాలల్లో సంప్రదించాలని సూచించారు. కాగా, మే 25 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని, ఈ విషయం అన్ని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ గుర్తించాలని సౌరభ్ గౌర్ విజ్ఞప్తి చేశారు. -
లిక్కర్ స్కాంలో సీబీఐ సప్లిమెంటరీ చార్జిషీట్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో సీబీఐ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌పై శనివారం రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ విచారించారు. సీబీఐ అభియోగాలు మోపిన మనీష్ సిసోడియా, ఆడిటర్ బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్‌లకు సమన్లు జారీ చేస్తూ తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేశారు. ఈ సప్లిమెంటరీ చార్జిషీట్లో సౌత్‌గ్రూప్ ప్రస్తావన వచ్చినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే మద్యం విధానం రూపకల్పనలో ఆడిటర్ బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని సీబీఐ పేర్కొంది. -
AP: టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను www.sakshieducation.com లో చెక్ చేసుకోవచ్చు. టెన్త్ సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.. 191800 మంది పరీక్షలు రాశారు. బాలురులో పాసైన వారి సంఖ్య 66458 ఉత్తీర్ణతా శాతం 60.83 శాతం. పాసైన బాలికల సంఖ్య 56678. ఉత్తీర్ణత శాతం 68.76 శాతం. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. చదవండి: మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్.. 4 రోజులు తిరక్కముందే రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకుని మొత్తంగా పదవ తరగతి పరీక్షలకి 6,06,070 పరీక్షలకి హాజరు కాగా.. 5,37,491 మంది ఉత్తీర్ణతా సాధించారు. మొత్తంగా ఉత్తీర్ణతా శాతం 88.68. ఈ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైనవారిని రెగ్యులర్ పాస్‌గా పరిగణిస్తామని, కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. -
ఉన్నచోటనే ఆక్సిజన్! డీఆర్డీవో వినూత్న పరికరం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 వ్యాధి ముదిరి ఆసుపత్రి పాలు కావద్దనుకుంటే రక్తంలోని ఆక్సిజన్ మోతాదు 94 శాతానికి తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే పల్స్ ఆక్సీమీటర్ పరికరంతో రక్తంలోని ఆక్సిజన్ ఎంతుందో తెలుసుకోవచ్చు కానీ.. తక్కువ ఉంటే అప్పటికప్పుడు ఆక్సిజన్ కావాలంటే మాత్రం ఆసుపత్రికి పరుగెత్తాల్సిందే. అయితే డీఆర్డీవో పుణ్యమా అని ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకనుంది. సరిహద్దులోని పర్వత ప్రాంతాల్లో గస్తీ కాసే సైనికులకు ఆక్సిజన్ అందించేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఓ పరికరం ఇప్పుడు కరోనా బాధితులకు వరంగా మారనుంది. బెంగళూరులోని డీఆర్డీవోకు చెందిన ‘ది డిఫెన్స్ బయో ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ లేబొరేటరీ’తయరుచేసిన ‘ఎస్పీవో-2 సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టం’లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్‌కు అనుసంధానమై ఉండే ఈ పరికరం రక్తంలోని ఆక్సిజన్ నిర్ణీత మోతాదు కంటే తక్కువైన వెంటనే తనంతట తానే ఆక్సిజన్ సరఫరా మొదలుపెడుతుంది. ముంజేతికి కట్టుకునే ఓ పరికరం ద్వారా ఎప్పటికప్పుడు ఎస్పీఓ2ను పరిశీలిస్తూ హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుంటుంది. దీంతో వైద్యసిబ్బందిపై ఒత్తిడి తీవ్రంగా తగ్గుతుంది. ఒక లీటర్ నుంచి మొదలుకొని 1,500 లీటర్ల ఆక్సిజన్‌ను సరఫరా చేయగల సామర్థ్యం ఉంటుంది. కోవిడ్ రోగులకు ఇళ్లలోనే చికిత్స అందించే సందర్భాల్లో ఈ యంత్రం ఉపయుక్తంగా ఉంటుందని డీర్డీవో ఓ ప్రకటనలో తెలిపింది. రోగికి అవసరమైనంత ఆక్సిజన్ మాత్రమే ఉపయోగిస్తున్న కారణంగా వృథా తగ్గుతుందని తెలిపింది. డీఆర్డీవో అభివృద్ధి చేసిన ఈ యంత్రాన్ని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
జులై 17న దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం
కల్లూరు (రూరల్): సిల్వర్ జూబ్లీ కళాశాలలోని అంబేడ్కర్ రీజనల్ సెంటర్లో దూర విద్య సప్లిమెంటరీ పరీక్షలు జులై 17నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.అజంతకుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఏపీ ఆన్లైన్లో చెల్లించడానికి ఈ నెల 28న ఆఖరని, ప్రతి పరీక్షకు రూ.150 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పీజీ మొదటి సంవత్సరం జులై 17 నుంచి 22వరకు, ద్వితీయ సంవత్సరం 24 నుంచి 29 వరకు, ఎంబీఏ మూడవ సంవత్సరం 31 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరవ్వాలని, ఇతర వివరాలకు అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. -
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
- జిల్లాలో 22 కేంద్రాలు - పరీక్షలకు 4260 మంది విద్యార్థులు కర్నూలు సిటీ: పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాధికారి తరఫున ఏడీ కె.సరోజినిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 28 వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 22 కేంద్రాలు ఎంపిక చేశామన్నారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్‌టికెట్ లేని పక్షంలో అనుమతించబోమని తెలిపారు. పరీక్షలకు జిల్లా నుంచి 4260 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. -
మే 15 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- 23 వరకు కొనసాగనున్న పరీక్షలు - ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ ఎగ్జామ్స్ - పరీక్ష ఫీజుకు గడువు ఈ నెల 22 సాక్షి, హైదరాబాద్: ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఆదివారం ఇంటర్మీడియెట్ బోర్డు విడుదల చేసింది. మే 15 నుంచి మే 23 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియ ర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు. మూడ్రోజుల్లో మెమోలు మూడ్రోజుల్లో మార్కుల జాబితాలు, మెమోలు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి, నోడల్ అధికారులకు పంపిస్తామని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. మార్కుల జాబితా, మెమోలను కాలేజీ ప్రిన్సిపాళ్లు ఈ నెల 19 నుంచి జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి, నోడల్ అధికారుల నుంచి పొందాలని ఆయన సూచించారు. మెమోల్లో తప్పిదాలుంటే మే 17లోగా ఇంటర్మీడియెట్ బోర్డుకు సంబంధిత ప్రిన్స్పాళ్లు నివేదించాలన్నారు. అపరాధ రుసుముతో ఫీజుకు నో చాన్స్ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు తమ ఫీజును ఈ నెల 22లోగా తప్పనిసరిగా చెల్లించాలని బోర్డు కార్యదర్శి సూచించారు. గడువు తర్వాత అపరాధ రుసుముతో ఫీజులు తీసుకునే అవకాశం లేదన్నారు. సంబంధిత కాలేజీల్లోనే ఫీజు చెల్లించాలని, కోర్సు కేటగిరీల వారీగా ప్రత్యేకంగా ఫీజులు నిర్దేశించినట్లు వివరించారు. మార్చి పరీక్షల హాల్ టికెట్ నంబర్లే సప్లిమెంటరీకి వర్తిస్తాయన్నారు. ఫస్టియర్‌లో ఇంప్రూవ్మెంట్/ఫెయిల్ అయిన సబ్జెక్టు పరీక్షలు రాయాలనుకున్న వారు జనరల్ ఫీజుతో పాటు అదనంగా ప్రతి సబ్జెక్టుకు రూ.120 చొప్పున ఫీజు చెల్లించాలి. ఇంప్రూవ్‌మెంట్‌లో పాత/కొత్త మార్కుల్లో ఎక్కువ మార్కులున్న వాటినే విద్యార్థికి కేటాయిస్తామని, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన వారికే బెస్ట్ స్కోర్ ఇస్తామని ఇంటర్మీడియెట్ బోర్డు తెలిపింది. సెకండియర్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు రెండేళ్ల వరకు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశం ఉంది. మేలో జరిగే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 2015 మార్చిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు చివరిసారిగా ఇంప్రూవ్మెంట్ రాసే వీలుంది. వారికి తాజా పరీక్షల్లో వచ్చే ఫలితాలనే పరిగణలోకి తీసుకుంటామని బోర్డు తెలిపింది. -
35%పాస్
♦ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ♦ ఫస్టియర్‌లో 79.59 శాతం ఉత్తీర్ణత సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియెట్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 26,815 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 9,349 మాత్రమే పాసై 35 శాతం ఉత్తీర్ణత సాధించారు. వార్షిక పరీక్షల్లో సంతృప్తికరంగా ఫలితాలుండగా.. అడ్వాన్సడ్ సప్లిమెంటరీలో మాత్రం అతి తక్కువ ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. అదేవిధంగా ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌కు సంబంధించి 88,364 మంది అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫెయిల్ అయిన వారితోపాటు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసినవారున్నారు. ఈక్రమంలో 70,329 మంది పాసై 79.59శాతం ఉత్తీర్ణత సాధించారు. -
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. శుక్రవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాష్ట్ర ఇంటర్ బోర్టు కార్యాలయంలో ఈ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ లో 66.23, సెకండియర్ లో 42.77 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. విభాగాల వారీగా ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి.. సీనియర్ ఇంటర్ జనరల్ సీనియర్ ఇంటర్ ఒకేషనల్ జూనియర్ ఇంటర్ జనరల్ జూనియర్ ఇంటర్ ఒకేషనల్ -
ప్రారంభమైన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
హైదరాబాద్: తెలంగాణలో ఎస్ఎస్సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 1, 41,601 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శేషుకుమారి తెలిపారు. వీరి కోసం 599 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల హాల్ టికెట్ పై సంబంధిత ప్రధానోపాధ్యాయుడి సంతకం చేయించుకుని పరీక్షకు వెళ్లాలని పేర్కొన్నారు. కొత్త సిలబస్ లో ద్వితీయభాషకు అదనంగా 30 నిమిషాల సమయం ఇస్తున్నామని వెల్లడించారు. పాత, కొత్త సిలబస్ వారికి ఆబ్జెక్టివ్ పేపరు వేరుగా ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పరీక్షా కేంద్రాలకు 500 ల గజాల పరిధిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. జూలై 2 వ తేదీ పరీక్షలు ముగిసే వరకు ఈ నిబంధన అమలులో ఉంటుంది. సెంటర్ల సమీపంలో గుంపులుగా ఉండరాదని, ఎవరైనా 144 సెక్షన్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోనూ నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్టు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు 73,395 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 374 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు. -
నేటి నుంచి డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుండగా, యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో 75 కేంద్రాలు ఏర్పాటుచేశామని పరీక్షల నియంత్రణాధికారి ఎంవీ.రంగారావు, అదనపు పరీక్షల నియంత్రణాధికారి వెంకట్రాంరెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లాలో 41,743 మంది విద్యార్థులు, ఆదిలాబాద్‌లో 35,223మంది, ఖమ్మంలో 30,194 మంది, కరీంనగర్ లో 6,717మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, పరీక్షలు సాఫీగా జరిగేలా పర్యవేక్షించేందుకు స్క్వాడ్ బృందాలతో పాటు పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మొదటి సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వారు వివరించారు. -
15లోగా డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించాలి
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: నగరంలోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో నవంబర్‌లో జరిగే డిగ్రీ సెకండ్ స్పెల్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును అక్టోబర్ 15వ తేదీలోగా చెల్లించాలని కో ఆర్డినేటర్ కె. ఉమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం అడ్మిషన్ ఫీజును అక్టోబర్ 10వ తేదీ వరకు అపరాధ రుసుముతో చెల్లించవచ్చన్నారు. కళాశాల స్టడీ సెంటర్లోకానీ, ఫోన్ (98855 07527) ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.