జులై 17న దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం
Published Thu, Jun 15 2017 1:04 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM
కల్లూరు (రూరల్): సిల్వర్ జూబ్లీ కళాశాలలోని అంబేడ్కర్ రీజనల్ సెంటర్‌లో దూర విద్య సప్లిమెంటరీ పరీక్షలు జులై 17నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.అజంతకుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఏపీ ఆన్‌లైన్‌లో చెల్లించడానికి ఈ నెల 28న ఆఖరని, ప్రతి పరీక్షకు రూ.150 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పీజీ మొదటి సంవత్సరం జులై 17 నుంచి 22వరకు, ద్వితీయ సంవత్సరం 24 నుంచి 29 వరకు, ఎంబీఏ మూడవ సంవత్సరం 31 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరవ్వాలని, ఇతర వివరాలకు అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
Advertisement