అదనపు చక్కెర సంకలితాలతో వచ్చే ప్రోటీన్ సప్లిమెంట్లు వినియోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషన్ ఇన్‌స్టిట్యూట్‌ఆప్ న్యూట్రిషియన్(ఐపీఎంఆర్-ఎన్‌ఐఎన్) పిలుపునిచ్చింది. వీటివల్ల మూత్రపిండాలకు ఎముకలకు హాని కలుగుతుందని, ఆరోగ్యకరమైన వ్యక్తులకు వీటి అవసరం లేదని పేర్కొంది. ప్రోటీన్ల అవసరాన్ని భర్తీ చేసుకునేలా సమతుల్యమైన ఆహార సరిపోతుందని తెలిపింది. పైగా అందుకోసం కొత్త ఆహార మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
చాలామంది సహజసిద్ధంగా సమతుల్య ఆహారంలో వచ్చే పోషకాలను వదిలిపెట్టే కృత్రిమంగా ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారని డైటీషియన్లు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రోటీన్ సప్లిమెంట్‌లన్నీ గుడ్లు, పాలు, పాల విరుగుడు లేదా సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతోనే తయారు చేస్తారని అన్నారు. ఈ చక్కెర సంకలితాలతో కూడిన ఈ ప్రోటీన్ సట్లు మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పప్పుధాన్యాలు, పప్పులు, గింజలు, గుడ్లు, పౌల్ట్రీ, చేపలు మొదలైనవి అన్ని వయసుల వారికి కావాల్సిన ప్రోటీన్లను అందిస్తాయని అన్నారు.
అలాగే ఏ రకమైన ప్రొటీన్ పౌడర్లు లేదా సప్లిమెంట్లను ఇవ్వడానికి ముందు ఒక వ్యక్తికి ప్రోటీన్ ఎంత మేర అవసరం అనేది అంచనా వేసి సదరు క్లినిక్ లేదా న్యూటీషియన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మంచి నాణ్యమైన ప్రోటీన్ పొందడానికి 3:1 నిష్పత్తిలో పప్పులతో కూడిన తృణధాన్యాల కలయిక శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందజేస్తాయని అన్నారు. ఆహారం ద్వారా తీసుకునే ప్రోటీన్ కండరాల నష్టాన్ని నివారిస్తుందని అన్నారు. అలాగే వినియోగించిన ప్రోటీన్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేలా తగిన శారీరక శ్రమ కూడా ఉండాలని డైటీషియన్లు సూచించారు.
సమతుల్య ఆహారం శరీర పనితీరుకు అవసరమైన 20 ముఖ్యమైన అమైనో ఆమ్లాల అవసరాన్ని తీరుస్తుందని చెప్పారు. ఇక మన శరీరం సంశ్లేషణ చేయలేని ఈ అమైనో ఆమ్లాలలో కొన్నింటిని పొందడానికి, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ప్రోటీన్ వంటి విభిన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం అని ఐపీఎంఆర్-ఎన్‌ఐఎన్ పేర్కొంది. సాదారణ ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చెయ్యకూడదని పేర్కొంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల స్థితిని అనుసరించి వైద్య నిపుణులు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చేయాలని నూట్రిషియన్లు చెబుతున్నారు.
(చదవండి: ఇన్‌స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?)
Comments
Please login to add a commentAdd a comment