Protein
-
వైరస్ల పనిపట్టే కృత్రిమ ప్రోటీన్.. పరిశోధకుల కీలక విజయం
పరమాణువులపై పరిశోధన చేస్తున్న ఢిల్లీ జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. ముందులకు లొంగకుండా వైరస్లు ‘వ్యాధి నిరోధకత’ను సంతరించుకుంటున్న పరిస్థితికి చెక్‌పెట్టే దిశగా పరిశోధకులు కీలక విజయం సాధించారు. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఒక పరిశోధనలో జేఎన్‌యూ సైంటిస్టులు హెచ్ఎస్పీ70 అనే మానవ ప్రోటీన్‌ను కనుగొన్నారు. మానవల్లో కోవిడ్, మలేరియా వంటి వైరస్ కారక వ్యాధులు ప్రబలడంలో హెచ్ఎస్పీ70 కీలకపాత్ర పోషిస్తోందని గుర్తించారు. వ్యాధికారక వైరస్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి హెచ్ఎస్పీ70 ప్రోటీన్ పరోక్షంగా సాయపడుతుంది. వ్యాధికారక ప్రోటీన్ జాడ తెలియడంతో ఈ ప్రోటీన్ చర్య, అభివృద్ధిని కట్టడిచేసే మరో ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధిచేశారు. జేఎన్‌యూలో స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసన్ విభాగ అధ్యయనకారులు ఈ కృత్రిమ ప్రోటీన్‌ను అభివృద్ధిచేశారు. ఇది హెచ్ఎస్పీ70 పనితీరును క్షీణింపజేస్తుంది. దాంతో అది వ్యాధికారక వైరస్‌లకు పూర్తిస్థాయిలో సాయపడటంతో విఫలమవుతుంది. దాంతో మానవశరీరంలో వ్యాధి విజృంభణ ఆగుతుంది. చికిత్సకు, మందులకు లొంగకుండా వైరస్ కనబరిచే ‘వ్యాధినిరోధకత’సామర్థ్యమూ తగ్గుతుంది. హీట్షాక్ ప్రోటీన్ హీట్షాక్ ప్రోటీన్‌కి పొట్టిరూపమే హెచ్ఎస్పీ. వ్యాధికారక వైరస్ ప్రబలినప్పుడు కణాల్లో అవి క్షణాల్లో రెండింతలు, మూడింతలు, ఇలా కోట్ల రెట్లు పెరిగేందుకు హెచ్ఎస్పీ ప్రోటీన్ సాయపడుతుంది. శరీరాన్ని వేడెక్కేలా చేసి వైరస్ల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వైరస్ తనలాంటి లక్షలాది వైరస్‌లను తయారుచేయడంలో, అచ్చం అలాగే ఉండటంలో, రెట్టింపు ప్రక్రియలో తప్పులు దొర్లకుండా హెచ్ఎస్పీ ప్రోటీన్ చూసుకుంటుంది. ఇంతటి కీలక ప్రోటీన్ జాడను కనిపెట్టి జేఎన్‌యూ పరిశోధకులు ఘన విజయం సాధించారు. ఈ పరిశోధనా వివరాలు ప్రఖ్యాత బయోలాజికల్ మైక్రోమాలిక్యూల్స్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ కారక సార్స్ కోవ్–2 వైరస్‌లోని కొమ్ములతో, మానవ కణంలోని ఏస్2 గ్రాహకాలకు మధ్య హెచ్ఎస్పీ అనుసంధానకర్తలా వ్యవహరిస్తోందని పరిశోధనలో తేలింది. కణాల్లోకి వైరస్ చొరబడాలంటే ఏస్2 రిసెప్టార్లదే కీలక పాత్ర. హెచ్ఎస్పీను నిలువరించడం ద్వారా వైరస్ల సంఖ్య పెరగడాన్ని అడ్డుకోగలిగామని జేఎన్‌యూ ప్రొఫెసర్లు ఆనంద్ రంగనాథన్, శైలజా సింగ్ చెప్పారు.‘‘హెచ్ఎస్పీని అడ్డుకునేలా పీఈఎస్–సీఐ అనే కొత్త ప్రోటీన్‌ను అభివృద్ధిచేశాం. దీనిని సార్స్–కోవ్2 సోకిన కణాల్లోకి జొప్పించాం. దీంతో సార్స్–కోవ్2 కణాల రెట్టింపు ప్రక్రియ గణనీయస్థాయిలో మందగించింది. సాంప్రదాయక ఔషధాలు నేరుగా వైరస్‌లపై దాడిచేస్తాయి. కానీ వైరస్‌లకు ఆతిథ్యమిచ్చే కణాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి కొత్తరకం విధానాల ద్వారా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం ముగియడంతో జనం దాదాపు కరోనా గురించి మర్చిపోయారు. కానీ పరిశోధనా ప్రపంచం ఎప్పుడూ రాబోయే కొత్తరకం వైరస్ల గురించి అప్రమత్తంగానే ఉంటుంది’’అని పరిశోధకులు అన్నారు.చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ ప్రమోద్ గార్గ్, పీహెచ్డీ స్కాలర్ ప్రేరణ జోషి సైతం ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చి విజృంభించే కొత్త రకం వైరస్ల కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రేరణజోషి అన్నారు. అంతర్జాతీయంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తినప్పుడు శాస్త్రసాంకేతి రంగం ఏ స్థాయిలో నూతన చికిత్సా విధానాలు, ఆవిష్కరణలతో సంసిద్ధంగా ఉండాలనే అంశాన్ని తాజా పరిశోధన మరోసారి నిరూపిస్తోంది. -
ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్
స్టాక్‌హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు ‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్‌లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024 నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్ డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు. చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
హెల్దీ తిండి.. కొత్త ట్రెండీ
వీలైతే నాలుగు రకాల స్నాక్స్.. కుదిరితే కప్పు కాఫీ.. సాయంత్రమైతే చాలు. విశాఖ వాసి మదిలో మెదిలో మొదటి ఆలోచన ఇదే. చిరుతిండి.. మన జీవితాల్లో భాగమైపోయింది. టీ తాగుతూ స్నాక్స్.. సాయంత్రం సరదాగా స్నాక్స్.. ఇంటికి చుట్టాలొస్తే స్నాక్స్.. చినుకుపడినా.. సమయమేదైనా.. స్నాక్స్ తిందాం మిత్రమా అన్నట్లుగా చిరుతిళ్లపై మనసు మళ్లిస్తున్నారు. అయితే.. ఈ మధ్య కాలంలో చిరుతిళ్లలోనూ ఆరోగ్యాన్ని వెదుకుతున్నారు. విశాఖ సహా 30 నగరాల్లో స్నాక్స్ విక్రయాలు, ప్రజల ఇష్టాయిష్టాలపై ప్రముఖ స్నాక్స్ తయారీ సంస్థ ఫార్మ్‌లే విడుదల చేసిన ది హెల్దీ స్నాకింగ్–2024 నివేదిక పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది. చిరుతిళ్లలో పోషకాల స్నాక్స్ వేరయా.. అవే మాకు ఇష్టమయా అంటూ 73 శాతం మంది చూసి మరీ తింటున్నారంట. మార్కెట్లోకి బెస్ట్ స్నాక్స్ ఏమొచ్చాయో అని ప్రతి 10 మందిలో తొమ్మిది మంది వెతుకుతున్నారని నివేదిక చెబుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. టీ, కాఫీ తాగుతున్నప్పుడు వేడి వేడి సమోసా లేదంటే.. బిస్కెట్లు ఉండాల్సిందే. లంచ్, డిన్నర్‌కి మధ్య స్నాక్స్ టైమ్ ఫిక్సయిపోయింది. అందుకే భారతీయులకు చిరుతిండి ఇష్టంగా మారిపోయింది. అయితే ఇటీవల ఆహార పదార్థాల కల్తీపై ఆందోళనల నేపథ్యంలో.. స్నాక్స్ ఎంపికలోనూ జాగ్రత్త పడుతున్నారు. భారతీయులు ఎలాంటి స్నాక్స్ ఇష్టపడుతున్నారనే వివరాలను తెలుసుకునేందుకు ఫార్మ్‌లే దేశవ్యాప్తంగా 30 నగరాల్లో సర్వే చేసింది.ఈ వివరాలతో ది హెల్దీ స్నాకింగ్–2024 అనే నివేదికను విడుదల చేసింది. నగరంలోనూ సర్వే నిర్వహించగా.. ఆకలేస్తే పక్కనే ఉన్న దుకాణానికి వెళ్లి రెండు బంగాళాదుంప చిప్స్ ప్యాకెట్లు లేదా బేకరీకి వెళ్లి సమోసా తినే రోజులు పోయాయని విశాఖ వాసులు చెప్పారంట.! కొనేది చిన్న ప్యాకెట్ అయినా.. అందులో ఏం ఇంగ్రిడియంట్స్ ఉన్నాయి? వాటిలో పోషకాల విలువెంత? అవి తింటే వచ్చే అనర్థాలేమైనా ఉన్నాయా? ఇలా ప్రతి విషయంలోనూ మిస్టర్ పర్ఫెక్ట్లమని తెగేసి చెబుతున్నారు. మార్కెట్ ట్రెండ్.. మారిపోయిందండోయ్.. ప్రస్తుతం ఫుడ్ ప్యాకేజీ మార్కెట్‌ని స్నాక్స్ సంస్థలే శాసిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రూ.3.75 ట్రిలియన్ల ఫుడ్ ప్యాకేజీ ఇండస్ట్రీ ఉండగా.. ఇందులో 33.4 శాతం వరకూ స్నాక్స్, స్వీట్స్ పరిశ్రమలు ఆక్రమించేసుకున్నాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని ఇష్టపడుతున్నారని తెలిసి.. వాటి తయారీ పైనే ఆసక్తి చూపిస్తున్నాయి. శరీరంలో తక్కువ కొవ్వు ఉత్పత్తి చేసే పాపింగ్, బేకింగ్, ఎయిర్ఫ్రైయింగ్, వాక్యూమ్ ఫ్రైయింగ్ మొదలైన ప్రాసెస్ విధానంలో తయారు చేసే స్నాక్స్ ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డీప్ ఫ్రై చేసిన స్నాక్స్‌తో పోలిస్తే 75 శాతం కేలరీలను తగ్గిస్తాయనే ఉద్దేశంతో ఎయిర్ ఫ్రయర్ స్నాక్స్‌కే మొగ్గు చూపుతున్నారు.బ్రాండెడ్ స్నాక్స్ కావాలి ఒకప్పుడు స్నాక్స్ ప్యాకెట్ తీసుకుంటే కేవలం ఎక్స్పైరీ డేట్ మాత్రమే చూసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. స్నాక్స్ కొనుగోలు చేసినప్పుడు ఫస్ట్ అవి బ్రాండెడ్ సంస్థలు తయారు చేస్తున్నాయా లేదా అని చూస్తున్నారు. అంతేకాదండోయ్.. ప్రతి 100 మందిలో 73 మంది మాత్రం అందులో పోషకాలు ఏం ఉన్నాయి.? సోడియం కంటెంట్ ఎంత ఉంది.? అవి తినడం వల్ల కొవ్వు శరీరంలో పెరుగుతుందా లేదా.? ఆరోగ్యానికి హానికరమైన ముడిపదార్థాలేమైనా ఉన్నాయా అనేది కచ్చితంగా చెక్ చేస్తున్నారు.మిల్లెట్ల వైపు దృష్టి.. ఇప్పుడిప్పుడే స్నాక్స్ ప్లేస్‌లో మిల్లెట్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం సమయంలో బిస్కెట్, సమోసా, బజ్జీ, ఆలూ చిప్స్ మొదలైన వాటి స్థానాలను బాదం, పిస్తా, ఖర్జూరం, జీడిపప్పు, తృణధాన్యాలు, మొలకలు ఆక్రమించేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఈ మిల్లెట్స్‌ను ప్యాకేజింగ్ ఫుడ్‌గా మార్చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 2025 నాటికి మిల్లెట్ స్నాక్స్ 20 శాతానికి చేరుతాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది.స్నాక్స్ ప్లేస్‌ను పప్పుగింజలు ఆక్రమించుకుంటున్నాయి ఒకప్పుడు ఇంట్లో స్నాక్స్ తయారు చేసి.. వాటినే తినేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. ప్యాకేజ్డ్ స్నాక్స్ రావడంతో వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరమని తెలుసుకున్నారు. దీంతో స్నాక్స్ స్థానాన్ని పప్పుగింజలు ఆక్రమించేసుకున్నాయి. ముఖ్యంగా బాదం, పిస్తా వంటివాటికే ఓటేస్తున్నారు. ప్రోటీన్, కాంప్లెక్స్, కార్బొహైడ్రేట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తగినంతగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్, విటమిన్ ఈ వంటివి ఉండే బాదంను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. తృణధాన్యాలు, పప్పుగింజలు పోషకాలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. అందుకే చిరుతిళ్లలో పప్పుగింజలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. – షీలా కృష్ణస్వామి, పోషకాహార నిపుణురాలు -
పచ్చిబఠానీలతో ప్రయోజనాలు
పచ్చి బఠానీలు ఆహారానికి రుచిని ఇస్తాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి. పచ్చి బఠానీల తింటుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బఠానీలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, దీనివల్ల గుండె΄ోటు, రక్త΄ోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది. బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి, దీని కారణంగా ఆకలి తగ్గుతుంది. ఇది జింక్, రాగి, మాంగనీస్, ఇనుము కలిగి ఉంటుంది. దానివల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు క్యాన్సర్ నిరోధిస్తాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు, వృద్ధాప్య ప్రభావం త్వరగా కనిపించదు. పచ్చి బఠానీలో ప్రోటీన్‌తో పాటు ఉండే విటమిన్ కె బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. పచ్చి బఠానీలను తినడం జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. గర్భిణులకు పచ్చి బఠానీలు మేలు చేస్తాయి. ఇది గర్భస్థ శిశువుకు తగిన ΄ోషణను కూడా అందిస్తుంది. ఇంకా ఇవి రుతుక్రమ సమస్యలలో కూడా సాయం చేస్తాయి. -
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
అదనపు చక్కెర సంకలితాలతో వచ్చే ప్రోటీన్ సప్లిమెంట్లు వినియోగించొద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ నేషన్ ఇన్స్టిట్యూట్ఆప్ న్యూట్రిషియన్(ఐపీఎంఆర్-ఎన్ఐఎన్) పిలుపునిచ్చింది. వీటివల్ల మూత్రపిండాలకు ఎముకలకు హాని కలుగుతుందని, ఆరోగ్యకరమైన వ్యక్తులకు వీటి అవసరం లేదని పేర్కొంది. ప్రోటీన్ల అవసరాన్ని భర్తీ చేసుకునేలా సమతుల్యమైన ఆహార సరిపోతుందని తెలిపింది. పైగా అందుకోసం కొత్త ఆహార మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. చాలామంది సహజసిద్ధంగా సమతుల్య ఆహారంలో వచ్చే పోషకాలను వదిలిపెట్టే కృత్రిమంగా ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ సప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారని డైటీషియన్లు చెబుతున్నారు. నిజానికి ఈ ప్రోటీన్ సప్లిమెంట్లన్నీ గుడ్లు, పాలు, పాల విరుగుడు లేదా సోయా, బఠానీలు లేదా బియ్యం వంటి మొక్కల మూలాలతోనే తయారు చేస్తారని అన్నారు. ఈ చక్కెర సంకలితాలతో కూడిన ఈ ప్రోటీన్ సట్లు మూత్రపిండాలు, ఎముకల ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పప్పుధాన్యాలు, పప్పులు, గింజలు, గుడ్లు, పౌల్ట్రీ, చేపలు మొదలైనవి అన్ని వయసుల వారికి కావాల్సిన ప్రోటీన్లను అందిస్తాయని అన్నారు. అలాగే ఏ రకమైన ప్రొటీన్ పౌడర్లు లేదా సప్లిమెంట్లను ఇవ్వడానికి ముందు ఒక వ్యక్తికి ప్రోటీన్ ఎంత మేర అవసరం అనేది అంచనా వేసి సదరు క్లినిక్ లేదా న్యూటీషియన్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. మంచి నాణ్యమైన ప్రోటీన్ పొందడానికి 3:1 నిష్పత్తిలో పప్పులతో కూడిన తృణధాన్యాల కలయిక శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందజేస్తాయని అన్నారు. ఆహారం ద్వారా తీసుకునే ప్రోటీన్ కండరాల నష్టాన్ని నివారిస్తుందని అన్నారు. అలాగే వినియోగించిన ప్రోటీన్‌ను సమర్థవంతంగా వినియోగించుకునేలా తగిన శారీరక శ్రమ కూడా ఉండాలని డైటీషియన్లు సూచించారు. సమతుల్య ఆహారం శరీర పనితీరుకు అవసరమైన 20 ముఖ్యమైన అమైనో ఆమ్లాల అవసరాన్ని తీరుస్తుందని చెప్పారు. ఇక మన శరీరం సంశ్లేషణ చేయలేని ఈ అమైనో ఆమ్లాలలో కొన్నింటిని పొందడానికి, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు ప్రోటీన్ వంటి విభిన్న ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా ముఖ్యం అని ఐపీఎంఆర్-ఎన్ఐఎన్ పేర్కొంది. సాదారణ ఆరోగ్యవంతమైన వ్యక్తులకు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చెయ్యకూడదని పేర్కొంది. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగుల స్థితిని అనుసరించి వైద్య నిపుణులు ప్రోటీన్ సప్లిమెంట్లను సిఫార్సు చేయాలని నూట్రిషియన్లు చెబుతున్నారు.(చదవండి: ఇన్స్టంట్ నూడుల్స్ మంచివి కావా? తింటే ఫుడ్ పాయిజనింగ్ అవుతుందా?) -
అలా జరిగితే.. మూత్రపిండాలు దెబ్బతిన్నట్లా?
ఇటీవల కాలంలో చాలామంది ఫేస్ చేస్తున్న సమస్యే మూత్రపిండాల వ్యాధి. ఇది ఒక్కటి పాడవ్వతే మొత్తం జీవన గమనమే మారిపోతుంది. దీని విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకుంటే అంత సుఖవంతమైన జీవితాన్ని గడపవచ్చు. అయితే మూత్రపిండాలు దెబ్బతింటున్నాయని మన శరీరం ముందుగానే కొన్ని సంకేతాలిస్తుందని ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి చెబుతున్నారు. దీన్ని గమనించినట్లయితే సత్వరమే ఈ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చని అంటున్నారు. ఏవిధమైన సంకేతాలిస్తుంది. ఆ తదుపరి కిడ్నీలు మెరుగుపడేలా ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది తదితర విషయాలు ఆయన మాటట్లోనే చూద్దాం. రక్తంలో ప్రోటీన్ కోల్పోవడాన్ని ప్రొటీనురియా అంటారు. ఈ స్థితిలో ప్రోటీన్, గణనీయమైన మొత్తంలో మూత్రం ద్వారా బయటకు పోవడం ప్రారంభమవుతుంది. ప్రోటీన్ నష్టం మూత్రపిండ దెబ్బతింటున్నాయని చెప్పేందుకు తొలి సంకేతం. మూత్రపిండాలు దెబ్బతినడం ప్రారంభించినప్పుడు రోగులు చూసే మొదటి లక్షణం ప్రోటీన్యూరియా. ప్రోటీన్యూరియా కారణాలు: డీహైడ్రేషన్ మీ శరీరం శరీరం నుంచి చాలా ద్రవాన్ని కోల్పోయినప్పుడు, అది నిర్జలీకరణానికి కారణమవుతుంది. మనందరికీ తెలిసినట్లుగా, ప్రోటీన్లు, అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు వంటి పోషకాలను మూత్రపిండాలకు అందించడానికి నీరు సహాయపడుతుంది, కానీ తగినంత నీరు లేకుండా, ఇది రక్తం యొక్క సంక్లిష్ట పనితీరును కలిగి ఉంటుంది. క్రమంగా, మూత్రపిండాలు సరిగ్గా ప్రోటీన్లను తిరిగి పొందలేవు. బదులుగా ప్రోటీన్ మూత్రంలో చేరుతుంది . అధిక రక్తపోటు: అధిక రక్తపోటు ప్రోటీన్ నష్టానికి ప్రధాన కారణం, ఎందుకంటే పెరిగిన రక్తపోటు కారణంగా మూత్రపిండాలపై పొర ఒత్తిడిని తట్టుకోలేకపోతుంది. ఫలితంగా అధిక మొత్తంలో ప్రోటీన్ మూత్రం ద్వారా వెళ్లిపోవడం ప్రారంభమవుతుంది. డయాబెటిస్ మెల్లిటస్: మధుమేహం మూత్రపిండ కణం పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం వల్ల ఇది మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. మూత్రం ద్వారా విపరీతమైన ప్రోటీన్ బయటకు వస్తుంది. నెఫ్రోపతీ ఐజీఐ నెఫ్రోపతిలో, ఇమ్యునోగ్లోబులిన్ శరీరంలో పేరుకుపోతుంది, మూత్రపిండాల కణజాలంలో వాపును కలిగిస్తుంది. ఇది కిడ్నీ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అధిక మొత్తంలో ప్రోటీన్ ఫిల్టర్ అయ్యి బయటకు వస్తుంది. పాలిసిస్టిక్ వ్యాధులు పాలిసిస్టిక్ వ్యాధిలో, మూత్రపిండము ఉపరితలంపై తిత్తుల సర్వర్ పెరుగుదల అభివృద్ధి చెందుతుంది. ఇది మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిలో తిత్తులు ఏర్పడటం వల్ల ప్రొటీనురియా ఏర్పడుతుంది. లక్షణాలు: బలహీనంగా మారడం ప్రొటీన్లను కోల్పోవడం రోగులను రోజురోజుకు బలహీనపరుస్తుంది. రోగులకు, వారిని ఆరోగ్యంగా చురుకుగా ఉంచడానికి ప్రోటీన్ కీలకం. నురుగు మూత్రం నురుగు లేదా ముదురు రంగు మూత్రం మూత్రపిండ వైఫల్యం కారణంగా పెద్ద మొత్తంలో ప్రోటీన్ బయటకు వస్తుందని చూపిస్తుంది. మీ మూత్రంలోని ప్రోటీన్ గాలితో చర్య జరిపి నురుగును సృష్టిస్తుంది. మూత్రవిసర్జనలో ఫ్రీక్వెన్సీ ప్రతి 24 గంటలకు 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జన చేయడం సాధారణం. దాని కంటే ఎక్కువగా ఉంటుంది. అదికూడా రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం (ఒకసారి కంటే ఎక్కువ) లేదా తరచుగా మూత్రవిసర్జన. ఇది రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసి చాలా అసౌకర్యంగా ఉంటుంది. వికారం వాంతులు అవయవాలు సరిగా పనిచేయకపోవడం వల్ల వాంతులు మరియు వికారం ఏర్పడవచ్చు. ఆకలి లేకపోవడం: శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల రోగులు ఆకలి లేకపోవడం అనుభూతి చెందుతారు. కళ్ల చుట్టూ ఉబ్బడం: కిడ్నీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న రోగులు ముఖ్యంగా ఉదయాన్నే కళ్ల చుట్టూ ఉబ్బినట్లు కనిపిస్తారు. వ్యర్థ పదార్థాల సేకరణ ఈ ప్రాంతాల్లో మంటను కలిగించవచ్చు. నివారణ: ప్రోటీన్ రహిత ఆహారం కిడ్నీ రోగికి ప్రొటీనురియా ఉంటే వారి ఆహారంలో 15 నుంచి 20% ప్రోటీన్ ఉండాలి. అధిక క్రియాటినిన్ స్థాయిలు ఉన్న రోగులు ప్రోటీన్ తీసుకోవడం పరిమితం చేయాలని సూచించారు. మూత్రపిండ రోగులకు సిఫార్సు చేయబడిన ఏకైక ప్రోటీన్ మూంగ్ కి దాల్. ఒక కప్పు పండు ఆహారంలో ఒక కప్పు పండు (ఏదైనా) కిడ్నీకి తగినంత మొత్తం. మీ సీరం బైకార్బోనేట్ స్థాయి సగటు ఉంటే, మీరు ఏదైనా పండు తీసుకోవచ్చు. కాకపోతే, వైద్యులు తమ రోగులకు ప్రతి ఆమ్ల పండును నివారించాలని సూచిస్తున్నారు. అధిక రక్తపోటును నియంత్రించండి మూత్రపిండ వైఫల్యంతో బాధపడుతున్న రోగులు వారి అధిక రక్తపోటును ఎలాగైనా నియంత్రించాలి. ఎందుకంటే పైన చెప్పాన సాధారణ కారణాలు మీ మూత్రపిండాలను దెబ్బతీస్తే, చెప్పిన వాటిని మెరుగుపరచడం ద్వారా మీ మూత్రపిండాలను మెరుగుపరుచుకోవచ్చు. ఆయుర్వేద కిడ్నీ చికిత్సలో మొదట కారణానికి చికిత్స చేస్తారు, ఆపై వ్యాధిని దశలవారీగా నయం చేస్తారు. మధుమేహాన్ని నియంత్రించండి మనకు ఇప్పటికే తెలిసినట్లుగా, అధిక చక్కెర స్థాయి మూత్రపిండాలకు హాని కలిగించే మూత్రపిండాల కణాల పొరను ప్రభావితం చేస్తుంది. రెగ్యులర్ యోగ రెగ్యులర్ యోగా శ్వాస వ్యాయామాలు మీ అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే అధిక రక్తపోటు కణాల పొరను దెబ్బతీస్తుంది. మూత్రపిండాల బలహీనమైన కణాలు ఖచ్చితంగా పని చేయలేవు. బరువు తగ్గడం మూత్రం నుంచి అధిక మొత్తంలో ప్రోటీన్ విడుదల కారణంగా, రోగి బలహీనంగా మారి బరువు తగ్గుతారు. తగినంత నీరు త్రాగాలి ప్రతి వైద్యుడికి, రోగి ఎంత నీరు త్రాగాలి అని లెక్కించడం అసాధ్యం. రోగికి రోగికి అవసరమైన నీటి పరిమాణం మారుతూ ఉంటుంది. మనకు ఇప్పుడు నీరు అవసరమా అని తనిఖీ చేయడానికి దేవుడు మనకు నాలుక, నోటిని సెన్సార్‌గా ఇచ్చాడు. కాబట్టి మీ నోరు పొడిబారినట్లు అనిపించినప్పుడు, ఒక సిప్ నీరు తీసుకోండి ఒకేసారి చాలా నీరు తాగొద్దు. యూరిక్ యాసిడ్ పూర్తిగా తగ్గేవరకు తీసుకోవాల్సినజాగ్రత్తలు: 1. కొన్ని వారాల పాటు అన్ని రకాల నాన్ వెజ్ ఆహారాలు (చికెన్, మటన్, లివర్, చేప, రొయ్యలు మొదలైనవి) పూర్తిగా ఆపివెయ్యండి. రోజుకు 1 లేదా 2 గుడ్లు వరకు పరవాలేదు. రోజుకు కనీసం 4 నుంచి 5 లీటర్ల నీటిని కచ్చితంగా త్రాగండి. తరచుగా నిమ్మకాయలు తీసుకోండి. పీచు పదార్థం అధికంగా ఉండే బీరకాయ, సొరకాయ, బెండ, బ్రోకలీ, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. కాలీఫ్లవర్, పాలకూర, పన్నీర్, పుట్టగొడుగులు వంటి కూరగాయలను కొన్నాళ్లు నివారించాలి. ---నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు (చదవండి: సంతానోత్పత్తి తగ్గుముఖం..! తొలిస్థానంలో భారత్..!!) -
అధిక దిగుబడి, అత్యధిక ప్రొటీన్ @ బీపీటీ 2848
సాక్షి ప్రతినిధి, బాపట్ల: దేశంలోనే మొదటిసారిగా అత్యధిక ప్రొటీన్ అందించే అరుదైన వరి వంగడాన్ని బాపట్ల వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సృష్టించారు. 12 ఏళ్లపాటు విస్తృత పరిశోధనలు చేసి అధిక దిగుబడి.. అత్యధిక ప్రొటీన్ అందించే వరి వంగడాలకు రూపకల్పన చేశారు. వీటిని బీపీటీ 2848 పేరుతో పిలుస్తున్నారు. గతేడాది డిసెంబర్లో ఢిల్లీలోని నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్‌లో దీన్ని నమోదు చేశారు. ఇలా ఒక కొత్త వంగడాన్ని సృష్టించి నమోదు చేయడం ఇదే ప్రథమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి నల్ల రకం వరి విత్తనంగా బీపీటీ 2848ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఆర్బీ బయో 2026/ఐఆర్జీసీ 48493 రకం వంగడాన్ని సంకరం చేసి ఈ కొత్త వంగడాన్ని సృష్టించారు. ఈ విత్తనాల పంట కాలం 125 నుంచి 130 రోజులు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే దేశీయ రకాల్లో నల్ల రకం ఉన్నా అవి ఎకరానికి 10 నుంచి 15 బస్తాలకు మించి దిగుబడి ఉండటం లేదు. సగటున 12 బస్తాలకు దిగుబడి మించే పరిస్థితి లేదు. పైగా ఇవి లావు రకాలు. కొత్తగా రూపొందించిన బీపీటీ 2848 సన్నరకం వంగడాలతో ఎకరానికి 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి వస్తుంది. ఈ సన్న రకం 1,000 బియ్యపు గింజల బరువు 13 గ్రాములు మాత్రమే ఉంటుంది. తినడానికి రుచిగా, అనువుగా ఉంటాయి. మిగిలిన వరి రకాల్లో ప్రొటీన్ల శాతం 6 నుంచి 7 శాతానికి మించదని.. బీపీటీ 2848 ముడి బియ్యంలో 13.7 శాతం ప్రొటీన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ముడి బియ్యాన్ని పాలిష్ చేసినా 10.5 శాతం తగ్గకుండా ప్రొటీన్లు ఉంటాయని పేర్కొంటున్నారు. పలు రాష్ట్రాల్లో పరిశోధనలు.. బీపీటీ 2848 రకం వంగడంపై జాతీయ స్థాయిలో పరిశోధనలు జరిగాయి. ప్రధానంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల్లో పరిశోధనలు చేశారు. అన్నిచోట్లా శాంపిల్స్ తీసి కటక్ (ఒడిశా)లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్ఆర్ఆర్ఐ)లో పరీక్షించారు. బీపీటీ 2848లో సగటున 10.5 శాతం ప్రొటీన్లు ఉన్నట్లు స్పష్టమైంది. గతంలో ఒడిశాలో సీఆర్ధన్ 310 రకం వంగడాన్ని అక్కడి శాస్త్రవేత్తలు సృష్టించారు. దీంట్లోనూ 10.5 శాతం ప్రోటీన్లు ఉన్నాయి. అయితే అది లావు రకం గింజ. అన్ని ప్రాంతాల వారు దాన్ని తినలేరు. ఇందుకు భిన్నంగా బాపట్ల వరి పరిశోధన కేంద్రం బీపీటీ 2848 వంగడాన్ని సృష్టించింది. ఈ విత్తనాలను వచ్చే ఏడాది నుంచి రైతులకు అందించనుంది. అత్యధిక ప్రొటీన్లు అందించే రైస్.. బీపీటీ 2848 రకం కొత్త వంగడాన్ని 12 ఏళ్ల కృషితో బాపట్ల వరి పరిశోదన కేంద్రంలో సృష్టించాం. ఇది బ్లాక్ రైస్. దేశంలోనే అత్యధిక ప్రొటీన్లు అందించే సన్నరకం రైస్ ఇవే. తినటానికి అనువుగా ఉంటుంది. వచ్చే ఏడాది నుంచి ఈ వంగడాలను రైతులకు అందుబాటులోకి తెస్తాం. – డాక్టర్ బి.కృష్ణవేణి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్, బాపట్ల వరి పరిశోధన కేంద్రం -
ఎప్పుడూ ‘యూత్‌ఫుల్’గానే ఉండాలంటే!
అప్పట్లో ఓ కోలా యాడ్‌లో ఓ ఇంగ్లిష్ జింగిల్ వస్తుండేది. ‘‘ఎనీ వేర్ ఇన్ ద వరల్డ్... ఇట్స్ గ్రేటు బి యంగ్’’ అని. పూర్తి శరీరాన్నంతటినీ, ఆమాటకొస్తే లోపలి అవయవాలనూ, వాటి కండరాలను కూడా కప్పి ఉంచే చర్మాన్ని యూత్‌ఫుల్‌గా ఉంచేది ‘కొలాజెన్’ అనే ప్రోటీన్. అదెలా పొందవచ్చో, తద్వారా చాలాకాలం టుమధ్యవయసు లుక్‌నూ,వృద్ధాప్య లక్షణాలనూ దూరంగా ఉంచడం ఎలాగో, వయసు పెరుగుతున్నా (ఏజింగ్ జరుగుతున్నా) యూత్‌ఫుల్‌గా నిత్యయౌవనులుగా కనిపించడం ఎలాగో తెలిపే కథనం ఇది. వయసు పెరుగుతుంటే కొందరిలో చుబుకం కింద, కొందరిలో కళ్ల కిందున్న చర్మం కాస్త కాస్తగా జారుతుంటుంది. స్కిన్ జారిపోవడానికి కారణంగా ‘కొలాజెన్’ అనే ప్రోటీన్ లోపించడమే. కొలాజెన్ స్వాభావికంగానే వృద్ధి చెందడానికి ఏయే ఆహారాలు తీసుకోవాలో, అప్పటికీ ప్రయోజనం లేకపోతే ఎలాంటి ప్రక్రియలు అవలంబించవచ్చో తెలుసుకుందాం. కొలాజెన్ అంటే... నిజానికి ఇదో ప్రోటీన్. చర్మంలో ఎక్కువగా ఉంటుంది. కేవలం చర్మంలోనే కాకుండా దేహంలోని అనేక అవయవాల్లో... అంటే కండరాల్లో, ఎముకల్లో, టెండన్స్, కణజాలాల్లో, రక్తనాళాల్లో, జీర్ణవ్యవస్థలోని అన్ని భాగాల్లో... ఆ మాటకొస్తే మనకు ఎక్కడైనా గాయం తగిలినప్పుడు, గాయం మానే సమయాల్లో ఇలా అన్ని ప్రదేశాల్లోనూ ఉంటుంది. ఆహారంతోనే కొలాజెన్ పొందడమెలా? మాంసాహారాల్లో... చికెన్ ♦ చేపలు (అందునా ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ట్యూనా, మాకరెల్స్తో టు షెల్ఫిష్ వంటివి) ♦ గుడ్డులోని తెల్లసొన భాగం శాకాహారాల్లో... ♦ అన్ని రకాల నిమ్మజాతి పండ్లు (అంటే నిమ్మ, నారింజ, బత్తాయి, కమలాల వంటివి) ♦ బెర్రీ పండ్లు (అంటే... రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటివి) ♦ ట్రాపికల్ ఫ్రూట్స్‌లో (అంటే... మామిడి, జామ, పైనాపిల్, ద్రాక్ష, కివీ... వీటిల్లో ఉండే జింక్ కూడా యాంటీ ఏజింగ్‌కు అదనంగా ఉపయోగపడే పోషకం) వంటలో వాడే పదార్థాల్లో : ♦ వెల్లుల్లి (ఇందులో కొలాజెన్‌ను సమకూర్చే పోషకాలు చాలా ఎక్కువ) ♦ ముదురు ఆకుపచ్చరంగులో ఉండే లకూర లాంటి అన్ని ఆకుకూరల్లో చిక్కుళ్లు ♦ టొమాటో ♦ బెల్పెప్పర్లతో టు ♦ జీడిపప్పు, బాదంపప్పు లాంటి నట్స్‌లో. ♦ ఇవేగాకప్రో టీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే అన్ని ఆహారాలూ కొలాజెన్ ఉత్పత్తికి బాగా తోడ్పడతాయి). కొలాజెన్‌కు ప్రతికూలంగా పనిచేసే ఆహారాలు ఇవీ: చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, బాగా రిఫైన్స్ చేసిన కార్బోహైడ్రేట్లు కొలాజెన్‌కు కొంత ప్రతికూలంగా పని చేస్తాయి. కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడే కొన్ని బ్యూటీ ప్రక్రియలు: అలోవేరా జెల్ : అలోవేరా జెల్‌ను చర్మంపై పూయడం, నోటి ద్వారా ‘ఆలో స్టెరాల్స్’ తీసుకోవడం. ఈ ప్రక్రియలు కనీసం ఎనిమిది వారాలు కొనసాగాలి. జిన్సెంగ్ : హెర్బల్ ఉత్పాదన అయిన జిన్సెంగ్ను తీసుకోవడం. దీన్ని టీ, టింక్చర్స్ లేదా సప్లిమెంట్స్‌గా తీసుకోవచ్చు. రెటినాల్స్ అండ్ కెరొటినాయిడ్ సప్లిమెంట్స్: బీటా కెరోటిన్ ఎక్కువగా దొరికే... మాంసాహారాల్లో కాలేయం, శాకాహారాల్లో చిలగడదుంప, గుమ్మడి, క్యారెట్స్ తీసుకోవడం. వైద్యచికిత్సా ప్రక్రియల సహాయంతో... థ్రెడ్స్ ట్రీట్మెంట్: వీటిల్లో ఫ్లోటింగ్, ఫ్రీ, కాగ్ థ్రెడ్స్ అని రకరకాల చికిత్సలు ఉంటాయి. పేషెంట్ అవసరాన్ని బట్టి డాక్టర్ వీటిల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేస్తారు. ప్రభావం నెల తర్వాత తెలుస్తుంది. ఈ చికిత్స ప్రభావం ఏడాది వరకే ఉంటుంది. కాబట్టి మళ్లీ మళ్లీ చేస్తుండాలి. పీఆర్పీ థెరపీ ఫర్ ఫేస్: ఈ చికిత్సలో పేషెంట్స్ నుంచి రక్తాన్ని సేకరించి, అందులోని ప్లేట్లెట్ సేకరించి ముఖానికి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు. ఇందులోనే పీఆర్ఎఫ్ (ఫైబ్రిన్), గ్రోత్ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ పీఆర్పీ అనే కొత్త కొత్త చికిత్సలూ అందుబాటులోకి వచ్చాయి. దీన్ని నెలకొకసారి చొప్పున కనీసం 4 – 5 సార్లు చేయాలి. మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ : రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఉపయోగించి ముఖంపై ముడుతలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఫ్రాక్షనల్ సీఓటూ లేజర్ : లేజర్‌ను ఉపయోగించి, ముఖాన్ని తేటగా చేయడానికి ఈ ప్రక్రియను ఉపయోగిస్తారు. హైఫూ : హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రాసౌండ్ అనే మాటకు హైఫూ సంక్షిప్త రూపం. దీన్ని వివిధ తీవ్రతలతో వాడుతూ, సాగిన చర్మాన్ని బిగుతుగా చేయడానికి, డబుల్‌చిన్ తొలగించడానికి ఉపయోగిస్తుంటారు. హైలూరానిక్ యాసిడ్ ట్రీట్మెంట్ : శరీరంపైన పూసే క్రీములు, ఆయింట్మెంట్ల రూపంలోనూ, ఇంజెక్షన్ల రూపంలోనూ, అలాగే స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్స్ ఇస్తారు. దీని వల్ల చర్మానికి మంచి హైడ్రేషన్ సమకూరి, ఏజింగ్ ఆలస్యం అవుతుంది. రెడ్ లైట్ థెరపీ : చర్మాన్ని ఇన్ఫ్రా రెడ్ కిరణాలతో కూడిన ఎరుపురంగులో ఉండే కాంతి కిరణాలకు ఎక్స్పోజ్ చేయడం వల్ల చర్మంలో, దేహంలో కొలాజెన్ కొంత ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే ఇదే ప్రధాన థెరపీలాగా కాకుండా... మిగతా చికిత్సలతో టు దీని ఓ అదనపు చికిత్సగానే పరిగణించాలి. ఓరల్ కొలాజెన్ పౌడర్స్ ఎన్రిచ్డ్ విత్ వైటమిన్ సి అండ్ యాంటీఆక్సిడెంట్స్ : ఇవి నోటి ద్వారా తీసుకునే పౌడర్లు. ఇవే గాక ఇలాంటి ఇంజెక్షన్లూ లభ్యమవుతాయి. చేయకూడనివి... లేత ఎండకు ఎక్స్పోజ్ కావడం పరవాలేదు. అది చర్మానికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ తీవ్రమైన ఎర్రటి ఎండ, దేహం కమిలిపోతున్నంత ఎండ వేడిమికి ఎక్స్పోజ్ కాకుండా కాడుకోవాలి. గమనిక : ఎప్పుడైనా, ఎక్కడైనా స్వాభావికాలే మేలు. వైద్య ప్రక్రియలను ఆచరించాలను కుంటే స్వాభావికమైన ఆహారాలనే తీసు కుంటూ, ఈ ప్రక్రియల్నీ తీసుకుంటేనే ఉపయోగం ఉంటుంది. అంతేతప్ప పూర్తిగా వైద్యపరమైన చికిత్సలే కొలాజెన్ పెరుగుదలకు ప్రామాణికాలు కావు. ఒకవేళ కొలాజెన్ వృద్ధి కోసం వైద్యపరమైన ప్రక్రియలను తీసుకోవాల్సి వస్తే పూర్తిగా క్వాలిఫైడ్ డర్మటాలజిస్టుల నేతృత్వంలోనే తీసుకోవాలి. - డాక్టర్ స్వప్నప్రియ సీనియర్ డర్మటాలజిస్ట్ -
హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల
మనకు ఏదైనా గాయం కాగానే... శరీరం తనను తాను రిపేరు చేసుకునే తీరు అద్భుతం. ప్రతివారి జీవితంలో ఏదో ఓ సందర్భంలో గాయం కాగానే... (అది మరీ పెద్దది కాకపోతే) కొద్దిరోజుల్లోనే దాని ఆనవాలు కూడా తెలియకుండా పోతుంది. భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోవడం... అవే కండరాలు మళ్లీ పునరుజ్జీవం పొందకపోవడం వల్లనే చాలామందిలో మరణం సంభవిస్తుంది. కానీ చాలా తక్కువగా లేదా ఓ మోస్తరుగా వచ్చిన హార్ట్ అటాక్‌లోనూ... శరీరం తనను తాను రిపేరు చేసుకునే ప్రక్రియ సాగుతుంది. ఇదెలా జరుగుతుందో తెలుసుకోడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇదెలా జరుగుతుందో తెలుసుకుంటే... స్వాభావికంగా జరిగే ఇదే ప్రక్రియను... వైద్య చికిత్సగా ఇవ్వడం ద్వారా గుండెను రిపేరు చేసుకోగలమన్నది శాస్త్రవేత్తల భావన. తమ పరిశోధనల ద్వారా అదెలా జరుగుతుందో... రిపేరుకు కారణమయ్యే ప్రోటీన్ ఏమిటో తెలుసుకున్నారు. దాని గురించి తెలిపేదే ఈ కథనం. మన దేహంలో ఏదైనా భాగం గాయపడగానే... వెంటనే మన వ్యాధి నిరోధక వ్యవస్థ స్పందిస్తుంది. ‘లింఫాటిక్ సిస్టమ్’ అనే వ్యవస్థ ఇందుకు తోడ్పడుతుంది. ఇది మన వ్యాధినిరోధక వ్యవస్థలో ఒక కీలక అంశం. దేహంలో అన్నిచోట్ల కండరాలకు రిపేరు జరిగినట్లే... దెబ్బతిన్న గుండె కండరాన్నీ రిపేరు చేయడానికి పూనుకుంటుందీ వ్యవస్థ. రిపేరు ప్రక్రియలో ఏం జరుగుతుంది...? ఎలా జరుగుతుంది? ఏదైనా భాగంలో దెబ్బతగలగానే లింఫాటిక్ సిస్టమ్ ద్వారా ‘మ్యాక్రోఫేజెస్’ అనే కణాలు ఎక్కువ స్థాయిలో విడుదల అవుతాయి. నిజానికి అవి మన వ్యాధినిరోధక వ్యవస్థలో భాగంగా... అవి తెల్లరక్తకణాలపై ఉండే అనుబంధ కణాలే. ‘మ్యాక్రో’ అంటే పెద్దవి... ‘ఫేజెస్’ అంటే హరించేవి అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే అవి హానికరమైన కణాలనూ/అంశాలనూ, బ్యాక్టీరియాను, అతి సూక్ష్మమైన హానికారక క్రిములను తినేయడం/హరించడం చేస్తాయి. అలాగే మన రోజువారీ జీవక్రియల్లో భాగంగా మనలో ప్రతిరోజూ 200 నుంచి 1000 వరకు క్యాన్సర్ కణాలూ వెలువడుతుంటాయి. వాటిని కూడా ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించేస్తాయి. (మన వ్యాధినిరోధక శక్తి తగినంత లేని సందర్భాలోనూ, లేదా అక్కడ పుట్టిన మొత్తం క్యాన్సర్ కణాలను ఈ మ్యాక్రోఫేజెస్ పూర్తిగా హరించలేని సందర్భాల్లోనే క్యాన్సర్ వస్తుందన్నమాట). హానిచేసే కణాలను మాత్రమేగాకుండా... ఏదైనా దెబ్బతగిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు) కలిగించే కారకాలనూ, దెబ్బతిన్న తర్వాత శిథిలమైపోయి పోగుబడ్డ కణాల గుట్టలనూ ఇవి నిర్మూలిస్తాయి. ఇన్ఫెక్షన్ కలిగించే వాటినీ తొలగిస్తాయి. అంతేకాదు... బయటి పదార్థాలనూ (ఫారిన్బాడీస్నూ) ఎదుర్కొంటాయి. ఇలా ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే... ఇవి పెద్దసంఖ్యలో పుట్టి... ఇలా క్లీన్ చేసే ప్రక్రియను ‘ఫ్యాగోసైటోసిస్’ అని అంటారు. మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి? ఇంతటి కీలకమైన భూమిక నిర్వహించే ఈ ‘మ్యాక్రోఫేజెస్’ ఎలా ఈ పని చేస్తాయన్నది శాస్త్రవేత్తలు ఇటీవలి తమ అధ్యయనాల్లో తెలుసుకున్నారు. ‘నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయీ’కి చెందిన ప్రముఖ పాథాలజిస్ట్ ఎడ్వర్డ్ థోర్ప్ ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో వివరించారు. ‘‘గుండెపోటు రాగానే ఇమ్యూన్ సెల్స్... సరిగ్గా చెప్పాలంటే ‘మ్యాక్రోఫేజెస్’ గుండెకండరం దెబ్బతిన్న చోటికి వెంటనే చేరుకుంటాయి. అక్కడ దెబ్బతిన్న కండరాలనూ, చచ్చుబడ్డ కణజాలాన్నీ (డెడ్ టిష్యూను) తినేయడం ప్రారంభిస్తాయి. ఇందుకోసం ఈ మ్యాక్రోఫేజెస్ ‘వీఈజీఎఫ్–సీ’ అనే ప్రోటీన్‌ను తయారు చేసి వెలువరిస్తాయి. ‘వాస్క్యులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్–సి’ అనే మాటకు సంక్షిప్తరూపమే ఈ ‘వీఈజీఎఫ్–సీ’. ‘డాక్టర్ జకిల్ అండ్ మిస్టర్ హైడ్’ నవలోలాగా... ఈ మ్యాక్రోఫేజెస్ ఇక్కడ రెండు పనులు ఒకేసారి చేస్తుంటాయి. మంచి మ్యాక్రోఫేజెస్... ‘వీఈజీఎఫ్–సి’ని ఉత్పత్తి చేస్తుంటాయి. కానీ అదే సమయంలో కొన్ని చెడు మ్యాక్రోఫేజెస్ ఇన్ఫ్లమేటరీ (మంట, వాపు) కలిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఇవి... అప్పటికే దెబ్బతిన్న గుండె కండరానికీ, ఆ పొరుగున ఉన్న కణజాలాలకు మరింత హాని చేసే అవకాశం ఉంది. ఇలా జరిగే సమయంలో అక్కడ దెబ్బతిని, నశించుకుపోయాక లేదా చచ్చుబడిపోయాక పోగుబడ్డ మృతకణజాలం అంతా తొలగిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఆ మృతకణజాలమంతా పూర్తిగా తొలగిపోయి, పరిశుభ్రమైపోయే ప్రక్రియను ‘ఎఫరోసైటోసిస్’ అంటారు. ఈ ప్రక్రియలోనే ‘మ్యాక్రోఫేజెస్’ కీలక భూమిక పోషిస్తాయి. ఈ ప్రక్రియ ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్‌తో ఎలా జరుగుతుందనే అంశాన్ని ల్యాబ్‌లో ఎలుకల సహాయంతో మేము కనుగొన్నాం’’ అంటున్నారు ఎడ్వర్డ్ థోర్ప్. ఈ అంశాల ఆధారంగా గుండెకు మేలు జరిగేదెలాగంటే...? ఇప్పటివరకు జరిగిన పరిశోధన ఆధారంగా... ఈ మ్యాక్రోఫేజెస్నూ, ‘వీఈజీఎఫ్–సీ’ ప్రోటీన్నూ ఉత్పత్తి అయ్యేలా చేస్తారు. వాటి సహాయంతో హార్ట్ ఎటాక్‌లో దెబ్బతిన్న గుండె కండరాల రిపేరు వేగంగా జరిగేలా చేయాలన్నది ఇప్పుడు పరిశోధకుల ముందున్న లక్ష్యం. అంతేకాదు... గుండెపోటు వచ్చినప్పుడు అక్కడ జరిగే జీవక్రియల (బయొలాజికల్) తీనుతెన్నులేమిటో తెలుసుకుని, దానికి విరుగుడుగా ‘ఎఫరోసైటోసిస్’ ద్వారా గుండెకండరాన్ని వేగంగా కోలుకునేలా చేయాలని కూడా పరిశోధకులు సంకల్పిస్తున్నారు. చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! చదవండి👉🏾Health Tips: రాత్రిపూట అన్నం తినొచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే ఏమవుతుంది? -
ప్రొటీన్ ఉంటే.. ‘పాడి’పంటే!
సాక్షి, అమరావతి: పాడి పశువులకు ప్రొటీన్ ఎంతో అవసరం. పశువుల సమగ్ర ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. పిండోత్పత్తి, పాల దిగుబడి, రోగ నిరోధక శక్తికి మాంసకృత్తులు కావాల్సి ఉంటుంది. నెమరువేసే జంతువుల్లో.. ప్రత్యేకించి పాడి పశువుల అన్నాశయాల్లో మేలు చేసే సూక్ష్మజీవులు(రూమెన్) అభివృద్ధి చెందాలంటే కనీసం 7 శాతం క్రూడ్ ప్రొటీన్(సీపీ) కావాలి. పది కిలోల పాల ఉత్పత్తికి కిలో క్రూడ్ ప్రొటీన్ అవసరమని పశు సంవర్థక శాఖ వైద్యాధికారి డాక్టర్ డి.నాగేశ్వరరావు చెప్పారు. ఈ సందర్భంగా పశువులకు ప్రొటీన్లు అందించే దాణా గురించి వివరించారు. వేరుశనగ చెక్కలో 45 శాతం సీపీ ఉంటుంది. కాల్షియం, విటమిన్ బీ–12 అధికంగా ఉంటాయి. రూమెన్ సూక్ష్మ జీవుల కోసం ప్రొటీన్ ఎక్కువగా లభిస్తుంది. సోయాబీన్ మీల్లో పుష్కలంగా పోషకాలుంటాయి. దీనిలో నాణ్యమైన ప్రొటీన్ లభిస్తుంది. పాలు పెరగడానికి ఇది తోడ్పడుతుంది. 40 శాతం సీపీ ఉంటుంది. పొద్దు తిరుగుడు చెక్కలో 40 శాతం ప్రొటీన్ ఉంటుంది. ఈ చెక్కలో పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫాటి ఆసిడ్స్ ఉన్నాయి. ఆవులకు ఆహారంగా దీనిని ఆహారంగా ఇచ్చాక తద్వారా లభించే పాలను మనుషుల ఆరోగ్యం కోసం వినియోగిస్తుంటారు. ఈ పాలు తాగితే గుండె జబ్బులు దూరమవుతాయంటారు. పత్తి చెక్క, కొబ్బరి పిండి, ఆవ పిండి వంటి వాటిని కూడా పాడి పశువులకు వినియోగిస్తారు. కాల్షియం తక్కువగా, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి పిండిని పాడిపశువులకు ఉత్తమ దాణాగా చెబుతుంటారు. దీనిలో ప్రొటీన్ నాణ్యమైంది. 90 శాతం వరకూ పొట్టలోనే జీర్ణమవుతుంది. కొబ్బరి పిండిని దాణాగా వాడటం వల్ల పశువుల్లో వెన్న బిరుసుగా ఉండి నాణ్యమైన నెయ్యి వస్తుంది. ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన పశువుల దాణా బ్రూవర్స్ గ్రెయిన్. సారా తయారీలో ఉపయోగించే తృణ ధాన్యాల నుంచి వచ్చే పిప్పి లాంటి పదార్థాలు.. నెమరువేసే జంతువులకు మంచి ఆహారం. క్రూడ్ ప్రొటీన్ 25, 30 శాతం, పీచు 25 నుంచి 27 శాతం వరకూ ఉంటుంది. తెలగ పిండిలో సీపీ 40 శాతం వరకూ ఉంటుంది. పైగా ఇది మంచి విరేచనకారి. ఎరుపు, నలుపు రకాల్లో ఇది దొరుకుతుంది. చేపపొడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చూడిని నిలబెడుతుంది. పచ్చి గడ్డి, జనుము, పిల్లి పెసర, అలసంద, పారగడ్డి, హైబ్రీడ్ నేపియర్, తవుడు, జొన్న చొప్ప, రాగి పిండి వంటి వాటిల్లో కూడా ప్రొటీన్ ఉంటుంది. -
చచ్చుబడిన కాళ్లలో మళ్లీ చైతన్యం
సాక్షి, హైదరాబాద్: వెన్నెముక గాయాలతో శరీరం దిగువభాగం, ముఖ్యంగా కాళ్లు చచ్చుబడిపోయిన వారికి శుభవార్త. జర్మనీలోని రుహర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని.. కాళ్లు చచ్చుబడిన ఎలుకలు ఒక్క ఇంజక్షన్‌తోనే మూడు వారాల్లో మళ్లీ నడవగలిగాయి. అద్భుతం అనేందుకు ఏమాత్రం తీసిపోని ఈ పరిశోధనకు కీలకం.. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్రొటీన్! హైపర్ ఇంటర్‌ల్యూకిన్–6 (హెచ్ఐఎల్–6) అని పిలిచే ఈ ప్రొటీన్ నాడీ కణాల పునరుత్పత్తికి అవసరమైన సంకేతాలు అందిస్తుంది. వాస్తవానికి ఈ ప్రొటీన్లు శరీరంలోనే ఉన్నప్పటికీ వాటికి ఈ సామర్థ్యం ఉండదు. రుహర్ శాస్త్రవేత్తలు ఈ ప్రొటీన్‌ను కృత్రిమంగా డిజైన్ చేసి, అభివృద్ధి చేయడమే కాకుండా.. దాన్ని ఓ సాధారణ వైరస్ సాయంతో ఎలుకల మెదళ్లలోకి జొప్పించారు. వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్న ఈ ఎలుకలకు ప్రొటీన్ అందించినప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన సెన్సరీ కార్టెక్స్ ప్రాంతంలో మోటార్ ఆక్సాన్ల (కదలికలకు సంబంధించిన సంకేతాలు ఇచ్చేవి) ఉత్పత్తి మొదలైంది. అంతేకాదు.. ఈ ఉత్పత్తి వెన్నెముక ప్రాంతంలోనికీ విస్తరించింది. నడకకు అవసరమైన భాగాలను చైతన్యం చేసింది. ఫలితంగా చచ్చుబడిన కాళ్లలో కొన్ని వారాల వ్యవధిలోనే కదలికలు వచ్చాయి. శరీరం దిగువభాగం చచ్చుబడిన ఎలుకల్లో రెండు మూడు వారాల్లోనే తాము కదలికలు చూశామని, ఇప్పటివరకూ ఇలా ఎప్పుడూ జరగలేదని పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త దైమర్ ఫిషర్ తెలిపారు. వెన్నెముక గాయమైన కొన్ని వారాల తరువాత ఈ చికిత్స అందిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చూసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నామని, వాటి ఆధారంగా మనుషులకూ ఈ చికిత్స విధానం విస్తరించడంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. పరిశోధన ఫలితాలు నేచర్ కమ్యూనికేషన్స్ తాజా జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అసాధ్యాన్ని సాధించారు... వెన్నెముక గాయాల కారణంగా శరీరం దిగువ భాగం చచ్చుబడడాన్ని మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. వెన్నెముక నుంచి మెదడుకు మధ్య సంకేతాల ఆదాన ప్రదానాలు నిలిచిపోవడం దీనికి కారణం. వెన్నెముకలోని నాడీ పోగులు (ఆక్సాన్లు) సమాచారాన్ని అటూ ఇటూ చేరవేస్తాయనేది తెలిసిందే. ఆక్సాన్లు దెబ్బతింటే శరీర భాగాలకు, మెదడుకు మధ్య సంబంధం తెగిపోతుందన్నమాట. ఒకసారి దెబ్బతిన్న ఆక్సాన్లు మళ్లీ పెరగవు కాబట్టి బాధితులు జీవితాంతం సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెన్నెముకను సరిచేసి, తద్వారా చచ్చుబడిన శరీర భాగం మళ్లీ చైతన్యవంతమయ్యేలా చేయడం ఇప్పటివరకూ అసాధ్యంగానే మిగిలింది. విద్యుత్తు ప్రచోదనాల ద్వారా చికిత్స చేసేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగినా సాధించిన ఫలితాలు అంతంతే. వెన్నెముక గాయమైన ప్రాంతాన్ని తప్పించి మిగిలిన నాడులను ఉత్తేజపరిచేలా చేసేందుకూ విఫలయత్నాలు జరిగాయి. రుహర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ రెండు పద్ధతులనూ కాదని జన్యుమార్పిడితో ప్రయత్నించి విజయం సాధించడం విశేషం. వీరు తయారు చేసిన హెచ్ఐఎల్–6 డిజైనర్ ప్రొటీన్ కేవలం కదలికలకు సంబంధించిన నాడీ కణాలపై మాత్రమే కాకుండా.. చూపునకు సంబంధించిన కణాలపైనా సానుకూల ప్రభావం చూపగలవని ఇప్పటికే రుజువైంది. అంటే అంధులకు మళ్లీ చూపునిచ్చేందుకూ ఈ ప్రొటీన్లను ఉపయోగించే అవకాశం ఉందన్నమాట. -
భారత్‌కు ప్రొటీన్ ఆధారిత టీకా ఉత్తమం
న్యూఢిల్లీ: భారత్‌లోని వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రొటీన్ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్ ఉత్తమమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భద్రత, ధర, దిగుమతికి, నిల్వకు అందుబాటులో ఉన్న అవకాశాలను బట్టి వ్యాక్సిన్‌ను ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. అమెరికాకు చెందిన నోవావాక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాను అధిక ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తేనే ప్రభావవంతంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం ఫైజర్–బయోఎన్‌టెక్, మోడెర్నా వంటి సంస్థలు కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. తమ వ్యాక్సిన్లు 90 శాతానికి పైగానే ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. అమెరికాకు చెందిన మోడెర్నా అభివృద్ధిచేస్తున్న టీకాను అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం లేదని, ఇండియాలోని వాతావరణ పరిస్థితులకు ఈ టీకా సరిపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. నోవావాక్స్ టీకా భారత్‌లో బాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఫైజర్ టీకా సురక్షితం కరోనా వైరస్‌ను అరికట్టడానికి తాము అభివృద్ధి చేస్తున్న టీకా సురక్షితమేనని 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు చివరి దశ ప్రయోగాల్లో తేటతెల్లమైందని ఫైజర్ కంపెనీ బుధవారం వెల్లడించింది. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ అనే సంస్థతో కలిసి ఫైజర్ కరోనా టీకాను అభివృద్ధిచేస్తున్న విషయం తెల్సిందే. 65 ఏళ్ల వయసుపైబడిన వారికి కరోనా ముప్పు అధికం. వీరిలో ఫైజర్ టీకా దాదాపు 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. అమెరికాలో తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం అతి త్వరలో దరఖాస్తు చేయనున్నట్లు ఫైజర్ తెలిపింది. తమ వ్యాక్సిన్‌కు సంబంధించిన పూర్తి డేటాను అమెరికాతోపాటు ప్రపంచ దేశాల్లోని వ్యాక్సిన్ నియంత్రణ సంస్థలకు అందజేస్తామని ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా వెల్లడించాయి. కోవాగ్జిన్ మూడో దశ ఈ నెల 20 నుంచి హరియాణాలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. మూడో దశ ప్రయోగ మొదటి వాలంటీర్‌గా ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వ్యాక్సిన్ ట్రయల్‌ను స్వీకరించనున్నారు. ఆయనతో పాటు మరో 25 సెంటర్లలో 26 వేల మంది వాలంటీర్లు వ్యాక్సిన్ ట్రయల్‌ను స్వీకరించనున్నారు. భారత్‌లో ఎక్కువ మంది ట్రయల్స్‌లో పాల్గొంటున్న వ్యాక్సిన్ తయారీదారు కోవాగ్జిన్ కావడం గమనార్హం. ఈ వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్.. ఐసీఎంఆర్‌తో సంయుక్తంగా తయారు చేస్తోంది. తమ వ్యాక్సిన్ మొదటి, రెండో దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయని వ్యాక్సిన్ తయారీ దారులు ఇటీవల వెల్లడించడం తెల్సిందే. -
బరువు తగ్గాలంటే ఇవి తినాల్సిందే..
ప్రస్తుతం అందరినీ వేధించి సమస్య అధిక బరువు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. మరి బరువు తగ్గాలనుకునేవారు తక్కువ తినడం కన్నా సరైన ఆహారం తినడం ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార, ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడంలో హెల్తీ స్నాక్ తినడం ఒక భాగమే. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు తోడ్పడుతాయి. సెనగలు: వీటిలో ప్రొటీన్స్, పీచు పదార్థాలుంటాయి. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవాలి. మినప పప్పు: మినపపప్పులో శరీరానికి అవసరమైన ప్రొటీన్ ఉంటుంది. మినప పప్పుతో సాయత్రం స్నాక్‌గా ఇడ్లీలు చేసుకుని తినొచ్చు. ఈ ఇడ్లీలు తొందరగా జీర్ణమవుతాయి. నట్స్: బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో గ్లూటెన్ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని వేగించి లేదా వీటికి కొద్దిగా మొక్కజొన్నలు కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి. మొలకెత్తిన విత్తనాలు: వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. తామర గింజలు: వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వులు, సోడియం వంటివి అస్సలుండవు. ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎండు బఠాణి: ప్రొటీన్స్, కొవ్వులు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. -
ఆ ప్రోటీన్‌తో దీర్ఘాయుష్షు?
వయసు పెరిగే కొద్దీ మన శరీర కణాల్లో సత్తువ సన్నగిల్లుతుంది. విషతుల్యమైన పదార్థాలు ఎక్కవ అవుతూంటాయి. ఫలితంగా జబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు. ఈ విషయం మనకందరికీ తెలుసు. కానీ శరీరంలో పెరిగిపోయే విషపదార్థాలు ఎప్పటికప్పుడు నాశనమైపోతూంటే? అబ్బో.. అద్భుతమైన ఆరోగ్యం మన సొంతం అవుతుంది. అయితే ఈ అద్భుతాన్ని సాధించడం ఎలా? స్టాన్‌ఫర్డ్ బర్న్‌హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరి ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఓ మార్గం కనుక్కున్నారు. మనుషుల్లో కాదుగానీ.. కొన్ని రకాల పురుగులు ఒక ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ఎక్కువ కాలం బతుకుతున్నట్లు వీరు గుర్తించారు. పీ62 అని పిలుస్తున్న ఈ ప్రొటీన్ విషతుల్యమన కణ ప్రొటీన్లను గుర్తించి నాశనమయ్యేలా చేస్తూండటం దీనికి కారణం. కణాల్లోని చెత్త చెదారాన్ని తొలగించేందుకు ఉన్న ఆటోఫేగీ వ్యవస్థను బలోపేతం చేస్తే జీవితకాలం పెరుగుతుందని ఇప్పటికే చాలా పరిశోధనలు రుజువు చేశాయని ఈ ప్రొటీన్ ద్వారా ఆటోఫేగీ బలోపేతమవుతోందని మెలేన్ హాన్సెన్ అనే శాస్త్రవేత్త తెలిపారు. నిన్నమొన్నటివరకూ శాస్త్రవేత్తలు ఈ కణ రీసైక్లింగ్ శరీరం మొత్తమ్మీద ఒకేలా ఉంటుందని అంచనావేశారుగానీ.. పీ62 ప్రొటీన్ వాడకం మొదలుకొని కొన్ని ఇతర పద్ధతులు కూడా ఉన్నాయని తాజా పరిశోధన ద్వారా తెలిసింది. పీ62 కణాల్లోని మైటోకాండ్రియా, విషతుల్యమైన ప్రొటీన్లను రీసైకిల్ చేసేందుకు తరలిస్తాయని మెలేన్ వివరించారు. ఈ పరిశోధన ద్వారా అల్జైమర్స్ వంటి వ్యాధులకు కొత్త చికిత్స లభిస్తుందని అంచనా. పరిశోధన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
కోడిగుడ్లలో మానవ ప్రోటీన్లు
రోజూ కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి మేలని చెబుతూంటారు. ఇందులో నిజం లేకపోలేదుగానీ.. త్వరలోనే కోడిగుడ్లతో మనిషికి ఇంకో ప్రయోజనమూ చేకూరనుంది. ఎడిన్‌బరో యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని కొన్ని రకాల వ్యాధులకు అవసరమైన మందులను కూడా ప్రొటీన్ల రూపంలో కోడి గుడ్ల నుంచి సేకరించవచ్చు. మానవ ప్రొటీన్లను మందులుగా చాలాకాలంగా వాడుతున్నా వాటిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. రకరకాలుగా ముడుతలు పడి ఉండే ప్రొటీన్లను చౌకగా తయారు చేయగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎడిన్‌బరో శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి చేసిన కోళ్ల ద్వారా మానవ ప్రొటీన్లు ఉన్న కోడిగుడ్లను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు ప్రారంభించారు. వీటిద్వారా ప్రొటీన్ల పనితీరుపై పరిశోధనలు చేయాలన్నది లక్ష్యం. అయితే కోడిగుడ్లలోకి చేరిన మానవ ప్రొటీన్లు అచ్చం మనిషిలోని ప్రొటీన్ల పనితీరును కనబరుస్తూండటంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఉత్పత్తి చేసిన రెండు ప్రొటీన్లు యాంటీవైరల్, యాంటీ కేన్సర్ లక్షణాలు ఉన్న నేపథ్యంలో వాటిపై విస్తృత పరిశోధనలు చేపట్టాలని నిర్ణయించారు. సులువైన పద్ధతి ద్వారా ఈ ప్రొటీన్లను వేరుచేసి వాడుకోవచ్చునని కోళ్లను ఉపయోగిస్తూండటం వల్ల ఖర్చు కూడా చాలా తక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హెలెన్ సాంగ్ తెలిపారు. ప్రస్తుతానికి ఈ ప్రొటీన్లను మనుషుల్లో వాడే పరిస్థితి లేదని కాకపోతే సమీప భవిష్యత్తులోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. -
ప్రొటీన్ పూతతో మందుకు పది రెట్ల బలం!
కేన్సర్ కణుతులను లక్ష్యంగా చేసుకుని పనిచేసే మందులు ఇప్పటికే బోలెడున్నాయి. వీటన్నింటితో ప్రయోజనం మాత్రం చాలా తక్కువ. దక్షిణ కొరియాకు చెందిన ఉల్సాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధనలు పూర్తిస్థాయిలో విజయవంతమైతే మాత్రం ఈ పరిస్థితి మారిపోతుంది. మందుల ప్రభావం పది రెట్లు పెరగడమే కాకుండా.. దుష్ప్రభావాలు కూడా గణనీయంగా తగ్గనున్నాయి. ఇప్పటివరకు ఉపయోగిస్తున్న మందులు కేన్సర్ కణితిని చేరే లోపు బోలెడన్ని ప్రొటీన్లు వాటికి అతుక్కుపోవడం వల్ల ప్రభావం తక్కువగా ఉందని చాలాకాలం క్రితమే గుర్తించారు. ఈ సమస్యను అధిగమించేందుకు కొరియా శాస్త్రవేత్తలు మందులపై ప్రత్యేకమైన ప్రొటీన్ పూత పూశారు. ఇది ఒంటరిగానే పనిచేస్తుంటుంది. నానోస్థాయి మందులపై ప్రొటీన్ పూత పూసి తాము ముందుగా కంప్యూటర్ లో సిములేట్ చేశామని రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి మరీ ఇవి కణితిపై దాడిచేయగలిగాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హ్యోయుంగ్ రో తెలిపారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాల్లోనూ తాము సానుకూల ఫలితాలు రాబట్టగలిగామని, ఈ పద్ధతిని కేవలం కేన్సర్‌కు మాత్రమే కాకుండా వేర్వేరు వ్యాధుల నిర్ధారణ, చికిత్సలకు ఉపయోగించవచ్చునని వివరించారు. -
రోజు విడిచి రోజు ఉపవాసంతో మేలే!
అప్పుడప్పుడూ ఉపవాసం చేయడం ఆరోగ్యానికి మంచిదని ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. తాజాగా షికాగోలోని ఇల్లినాయి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి రోజు విడిచి రోజు ఉపవాసం చేయడం శరీరంలో మంట/వాపును తగ్గిస్తుందని పరిశోధన పూర్వకంగా నిర్ధారించారు. మంట/వాపు తగ్గితే అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చునని, బరువు కూడా తగ్గవచ్చునని వీరు అంటున్నారు. కొంతమంది కార్యకర్తలను ఇలా రోజు విడిచి రోజు నిరాహారంగా ఉండాల్సిందిగా కోరిన శాస్త్రవేత్తలు పన్నెండు వారాల తరువాత వారి వివరాలు సేకరించారు. అధ్యయనం మొదలయ్యే సమయంతో పోలిస్తే వీరు వారానికి అరకిలో వరకూ బరువు తగ్గినట్లు గుర్తించారు. అయితే ఉపవాసం అంటే.. రోజంతా ఆహారమన్నది తీసుకోకుండా ఉండరు. మిగిలిన రోజులతో పోలిస్తే నాలుగోవంతు ఆహారం ఇంకోలా చెప్పాలంటే 400–600 కేలరీల ఆహారం అందించారు. ఇందులో కూడా 30% కేలరీలు కొవ్వుల ద్వారా 15% ప్రొటీన్లు, మిగిలిన 55% కార్బోహైడ్రేట్ల ద్వారా అందేలా చేశారు. దీంతో కార్యకర్తలకు ఆకలన్నది అనిపించలేదు. మొత్తమ్మీద తేలిందేమిటంటే.. ఈ రకమైన ఉపవాసం వల్ల శరీరంలోని కొవ్వు బాగా కరగడంతోపాటు కండరాల నష్టం తక్కువగా ఉందీ అని. -
రసాయన కాలుష్యాన్ని పీల్చే ప్రొటీన్ తెర..
లాస్ ఏంజిలెస్: రసాయన కాలుష్యాన్ని పీల్చుకుని తనలోనే బంధించే ప్రొటీన్‌తో కూడిన తెరను తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. ప్రొటీన్ తన సహజ వాతావరణంలో ఉన్నట్లుగానే బయటి వాతావరణంలోనూ ఉండేలా స్థిరీకరించేందుకుగాను శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా కృషి చేస్తున్నారు. అయితే ప్రొటీన్ తన సహజత్వాన్ని కోల్పోకుండా.. సింథెటిక్ పదార్థాలతో కలిపేలా వారు చేసిన పలు ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వలేదు. తాజా అధ్యయనంలో వారు చేసిన ప్రయోగం విజయవంతమైంది. సింథెటిక్ వాతావరణంలో ప్రొటీన్లు తమ సహజత్వాన్ని కోల్పోకుండా ఉంచే సరికొత్త మార్గాన్ని వారు కనిపెట్టారు. తమ పరిశోధనలో ఉపయోగించిన పదార్థాలు జీవరసాయనిక చర్యలను ప్రారంభించాయని.. దీంతో సహజ పదార్థాలను సింథెటిక్ పదార్థాలతో కలిపే చర్యలను తాము విజయవంతంగా చేధించినట్టు భావిస్తున్నామని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టింగ్ షు వెల్లడించారు. ఈ తెరలను భారీ ఆకారంలో తయారు చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో విష రసాయనాలను పీల్చుకునేందుకు ఉపయోగించవచ్చని తెలిపారు. -
మధుమేహానికి ప్రొటీన్‌తో విరుగుడు
వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచాన్ని మధుమేహ మహమ్మారి పట్టి పీడిస్తోంది. కొన్ని కోట్ల మంది దీని బారినపడి నరకయాతన అనుభవిస్తున్నారు. అయితే ఎశ్చిమిక్ టిష్యూలో రక్త సరఫరా తగ్గడం వల్లే చాలా మందికి డయాబెటిస్ వస్తోంది. దీన్ని నివారించడానికి రక్తనాళాలకు తిరిగి ఉత్పత్తి చేయగలిగే కిటుకును అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతరించిపోయిన రక్తనాళ ప్రదేశాల్లోనే కొత్త వాటిని ఉత్పత్తి చేస్తే ఎశ్చిమిక్ టిష్యూలో రక్తసరఫరా పెరిగి, డయాబెటిస్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో రక్తనాళాల పనితీరు జరగాలంటే కినాసే (ఆర్–ఆర్ఏఎస్) ప్రొటీన్ అవసరమని తెలిపారు. ప్రస్తుతం తాము కనగొన్న ఈ పద్ధతి వైద్యశాస్త్రంలో చాలా కీలకమని వివరించారు. ఇప్పటివరకు రక్త నాళికల అభివృద్ధి మీద చాలా పరిశోధనలు చేశామని, అయితే ఏవీ సఫలం కాలేదన్నారు. ప్రస్తుతం తాము పరిశోధనలు చేసిన ఆర్–ఆర్‌ఏఏస్‌ను రక్తనాళాలకు అందిస్తే డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని చెబుతున్నారు. దీనిపై భవిష్యత్తులో మరిన్నీ పరిశోధనలు చేసి జీన్ థెరపీ లేదా వీఈజీఎఫ్ థెరపీ ద్వారా ఆర్–ఆర్‌ఏఏస్‌ను రక్తనాళాలకు అందించడానికి పరిశోధనలు చేస్తామన్నారు. -
రుచిక్కుళ్ళు
చక చకా మార్కెట్‌కు వెళ్లి... చిక చికా వచ్చేయండి! ‘నోరు తిరగట్లేదు... ఏంటీ చక చక... చిక చికా’ అనుకుంటున్నారా! అదేనండీ... చిక్కుళ్ళతో వచ్చేయండి. చిక్కుడు వండాలంటే నోరు తిరగనక్కర్లేదు. చేయి తిరగనక్కర్లేదు! చాలా ఈజీ! చలికాలం... చిక్కుళ్ళ సీజన్! చీప్ అండ్ బెస్ట్! చిక్కుళ్ళు తెచ్చేయండి... చిక్కులు లేకుండా వండేయండి. చిక్కగా, చక్కగా... ఎంజాయ్ చేయండి. ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్... అంతా... గాడ్స్ ఓన్ ప్యాకేజీ చిక్కుళ్ళు! చిక్కుడుకాయ మెంతికూర కావల్సినవి: చిక్కుడుకాయ - పావుకేజీ, మెంతికూర - పెద్ద కట్ట (2 కప్పులు), ఉల్లిపాయ - 1 , పచ్చి మిర్చి - 2, అల్లం,వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, నూనె - టేబుల్ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, మినప్పప్పు - టీ స్పూన్, జీలకర్ర - అర టీ స్పూన్, ఎండుమిర్చి - 2 (మధ్యకు విరవాలి), పసుపు - పావు టీ స్పూన్, ఉప్పు - తగినంత, కారం - పావు టీ స్పూన్ తయారీ: చిక్కుడు కాయలను, మెంతికూరను శుభ్రం చేసి, సిద్ధంగా ఉంచుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం - వెల్లుల్లి పేస్ట్, చిక్కుడు కాయల ముక్కలు వేసి కలపాలి. ఉప్పు, పసుపు, అర కప్పు నీళ్లు పోసి, పైన మూత పెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత మంట తగ్గించి, నీళ్లన్నీ తగ్గేంత వరకు ఉంచాలి. దీంట్లో మెంతి ఆకులు, కారం వేసి కలపాలి. కూర పొడిగా అయ్యేంత వరకు ఉంచి దించాలి. చిక్కుడుకాయ కుడుములు కావల్సినవి: చిక్కుడుకాయలు - పావుకేజీ, పచ్చి మిర్చి - 4 , ఉల్లిపాయలు - 2 , బియ్యప్పిండి - కప్పు (తగినంత), కొత్తిమీర - గుప్పెడు, ఉప్పు - తగినంత, వెల్లుల్లి తరుగు - టీ స్పూన్, నూనె - టీ స్పూన్ తయారీ: చిక్కుడు కాయ నార తీసి, ముక్కలు చేయాలి. గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, చిక్కుడు కాయ వేసి ఉడికించి, పక్క నుంచాలి.పచ్చిమిర్చి, ఉప్పు కలిపి ముద్దగా నూరాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. ఉడికించిన చిక్కుడు కాయ రుబ్బుకోవాలి. గిన్నెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చిక్కుడు కాయ ముద్ద, బియ్యప్పిండి, ఉప్పు, కొత్తిమీర, వేసి బాగా కలపాలి. చిన్న చిన్న ఉండలు తీసుకొని, అదిమి, ఇడ్లీ ప్లేట్‌కు నూనె రాసి, దాంట్లో ఈ మిశ్రమాన్ని ఉంచాలి. పాత్ర అడుగున కొద్దిగా నీళ్లు పోసి, పైన సిద్ధంగా ఉంచిన ఇడ్లీ ప్లేట్ పెట్టి, మూత ఉంచాలి. పొయ్యి మీద 15 నిమిషాలు ఉడికించాలి. ఉడికించే ముందు మిశ్రమం పైన జీడిపప్పులు అలంకరించవచ్చు. ఉడికిన చిక్కుడు కుడుములను టొమాటో పచ్చడి, కెచప్‌తో వడ్డించాలి. చిక్కుడుకాయ గుడ్డుకూర కావల్సినవి: చిక్కుడు కాయలు - పావు కేజీ, ఉల్లిపాయలు - 1 (సన్నగా తరగాలి), టొమాటో - 1 (సన్నగా తరగాలి), మునక్కాడ - 1 (మూడు అంగుళాల పొడవున కట్ చేసుకోవాలి), పచ్చి మిర్చి - 2 (అంగుళం సైజు ముక్కలుగా కట్ చేయాలి), జీలకర్ర - అర టీ స్పూన్, అల్లం - వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్, కారం - టీ స్పూన్ (తగినంత), పసుపు - పావు టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - టేబుల్ స్పూన్ + టీ స్పూన్, ఉడికించిన గుడ్లు - 3, కొత్తిమీర తరుగు - టీ స్పూన్ తయారీ: చిక్కుడుకాయ రెండు వైపులా తొడిమ, నార తీసి, 2 అంగుళాల పొడవున కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి, మునక్కాడలు సిద్ధంగా ఉంచాలి. మందపాటి గిన్నె లేదా కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో చిటికెడు ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి, ఉడికించిన గుడ్లు వేసి 2-3 నిమిషాలు సన్నని మంట మీద వేయించి, తీసి పక్కనుంచాలి. అదే గిన్నెలో మిగిలిన నూనె కూడా వేసి వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, మునక్కాయలు వేసి వేయించాలి. ఇవి దోరగా వేగాక అల్లం - వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసి మరో 2-3 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. దీంట్లో కారం, ధనియాలపొడి, పావు కప్పు నీళ్లు పోసి ఉడికించాలి. 4 నిమిషాల తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. టొమాటో ముక్క ఉడికి, కూర చిక్కబడేంతవరకు ఆగి, వేయించిన గుడ్లు వేసి కలిపి దించాలి. చివరగా కొత్తిమీర చల్లుకోవచ్చు. చిక్కుడుకాయ పలావ్ కావల్సినవి: చిక్కుడు గింజలు - పావు కేజీ, బాస్మతి బియ్యం - 2 కప్పులు, నూనె - 3 టేబుల్ స్పూన్లు, యాలకులు - 6, లవంగాలు - 4, సాజీరా - అర టీ స్పూన్, బిర్యానీ ఆకులు - 3, దాల్చిన చెక్క - చిన్న ముక్క, పుదీనా ఆకులు - కప్పు, మెంతి ఆకులు - అర కప్పు , ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, పచ్చి మిర్చి - 6 (సన్నగా చీల్చాలి), నీళ్లు - 4 కప్పులు, కొత్తిమీర - అలంకరణకు తగినంత తయారీ: చిక్కుడు గింజలలో నీళ్లు పోసి, ఉడికించి, వార్చి పక్కనుంచాలి. (చిక్కుళ్లు పై పొర వచ్చేలా ఉడికించాలి.) బియ్యం కడిగి, నీళ్లు పోసి అరగంటపాటు నాననివ్వాలి. మసాలా దినుసులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి - అన్నీ కట్ చేసి సిద్ధంగా ఉంచాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి, నూనె పోసి వేడి చేయాలి. దీంట్లో సాజీర, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. దీంట్లో పుదీనా, మెంతి ఆకులు వేసి కలపాలి. ఉల్లిపాయలు వేసి బాగా వేగాక అల్లం - వెల్లుల్లి పేస్ట్, పచ్చి మిర్చి వేసి కలపాలి. దీంట్లో ఉడికించిన బీన్స్ వేయాలి. ఉప్పు, నానబెట్టిన బియ్యం వేసి ఉడికించాలి. నీళ్లనీ పూర్తిగా ఇంకిపోయి అన్నం ఉడికాక మంట తగ్గించాలి. మరో 5 నిమిషాలు ఉడికించి, చివరగా కొత్తిమీర చల్లి దించాలి. దీనిని ఏదైనా నచ్చిన గ్రేవీతో లేదా రైతాతో వడ్డించాలి. చిక్కుడుకాయ బెల్లంకూర కావల్సినవి: చిక్కుడు కాయ - పావు కేజీ, బెల్లం లేదా పంచదార - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి), పచ్చి మిర్చి - 1 (సన్నగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు - 8 (కచ్చాపచ్చాగా దంచాలి), కరివేపాకు - 2 రెమ్మలు, జీలకర్ర - టీ స్పూన్, మినప్పప్పు - టీ స్పూన్, కారం - టీ స్పూన్, ధనియాల పొడి - టీ స్పూన్, జీలకర్ర పొడి - పావు టీ స్పూన్, కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత తయారీ: చిక్కుడుకాయలను శుభ్రం చేసి, ముక్కలు చేయాలి. గిన్నెలో 2 కప్పుల నీళ్లు పోసి, చిక్కుడుకాయలను ఉడికించి దించాలి.బాణలిలో 2 టేబుల్స్పూన్ల నూనె వేసి, వేడయ్యాక జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి. దీంట్లో ఉల్లిపాయలు వేసి వేగాక, కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, బెల్లం లేదా పంచదార వేసి కలపాలి. ఉడికిం చిన చిక్కుళ్ళు వేసి కలిపి, 10 నిమిషాల సేపు ఉంచి, కొత్తిమీర చల్లి దించాలి. -
నల్లటి మచ్చలు... పోవాలంటే?
డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. నా కణతల మీద నల్లటి మచ్చలు వస్తున్నాయి. అవి కొన్ని నెలలుగా అలా ఉన్నాయి. ప్రస్తుతం అవి చెంపలపైన కూడా వస్తున్నాయి. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - రమ్య, వరంగల్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీకు కణతల మీద, బుగ్గల మీద ‘ఫొటో పిగ్మెంటేషన్’ వల్ల ఇలా నల్ల మచ్చలు వస్తున్నట్లు తెలుస్తోంది. మీరు ఈ కింది సూచనలు పాటించండి. మీరు రెండు శాతం గ్లైకోలిక్ యాసిడ్ ఉన్న మైల్డ్ ఫేస్ వాష్‌ను ఉపయోగించండి. ఎండలో బయటకు వెళ్లినా, వెళ్లకపోయినా 50 ఎస్పీఎఫ్ కంటే ఎక్కువగా ఉండే సన్ స్క్రీన్ లోషన్స్ రాయండి. ఇది ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆ లోషన్స్ రాస్తూ ఉండాలి. కోజిక్ యాసిడ్, ఆర్బ్యుటిన్‌తో పాటు విటమిన్-సి ఉండే క్రీమును ప్రతిరోజూ రాత్రివేళ ముఖానికి రాసుకుంటూ ఉండండి. ఇలా కనీసం నాలుగు వారాల పాటు రాసుకుంటూ ఉండాలి. కొన్ని వారాల తర్వాత మీరు కొన్ని కెమికల్ పీలింగ్, మైక్రో డెర్మా అబ్రేషన్, ఫ్రాక్షనల్ లేజర్ వంటి ప్రొసీజర్స్ చేయించుకోవాల్సి రావచ్చు. మన దేహంలోని అతి పెద్ద భాగం మన చర్మం. దాన్ని సంరక్షించుకోవడం మనందరికీ చాలా అవసరం. అది చాలా ప్రధానం కూడా. కేవలం సమస్య వచ్చినప్పుడు చర్మానికి చికిత్స చేయించుకోవడం కంటే సంపూర్ణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా కొన్ని పనులు చేయడం అవసరం. అవి... ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. అందులో ఆకుకూరలు, కాయగూరలు (క్యారట్, బీట్రూట్), తాజా పండ్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజూ పుష్కలంగా మంచినీళ్లు తాగాలి. కనీసం ఎనిమిది గంటలు తగ్గకుండా కంటి నిండా నిద్రపోవాలి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్,త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి, హైదరాబాద్ నొప్పిగా ఉందా? రక్తం పడుతోందా? ఆయుర్వేదం కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా మూలశంక (పైల్స్) వ్యాధితో బాధపడ్డాను. ఏడాది కిందట ఆపరేషన్ చేశారు. ఉపశమనం లభించింది. కానీ మళ్లీ రెండు నెలల నుంచి మలమార్గం దగ్గర చింతగింజ పరిమాణంలో వాపు, నొప్పి, దురద, మలబంధం లాంటి లక్షణాలున్నాయి. అప్పుడప్పుడు కొంచెం నెత్తురు పడుతూ ఉంటోంది. దీనికి ఆయుర్వేదంలో సంపూర్ణ పరిష్కారం తెలియజేయండి. - సురేశ్ అగర్వాల్, హైదరాబాద్ పైల్స్ వ్యాధిని ఆయుర్వేద పరిభాషలో ‘అర్శో రోగం’ అంటారు. ‘శత్రువులా హింసించే వ్యాధి కాబట్టే దీనిని ‘అర్శ’ అన్నారు. ‘అరివత్ ప్రాణినో మాంసకీలకా విశసంతి అర్శాంసి తస్మాత్ ఉచ్యంతే ..... మార్గ నిరోధతః’ (అష్టాంగ హృదయ గ్రంథం) - కొన్ని మొలకల వంటివి మలమార్గాన్ని అడ్డగించి హింసించడం వల్ల ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది. వ్యాధిస్థానం: మలమార్గంలో మూడు మడతలు ఉంటాయి. (త్రివలీ... అంటే 1. ప్రావరిణి, 2. విసర్జని 3. సంవరిణి). వీటిలో గల సిరలు ఉబ్బుతాయి. వాపు కలుగుతుంది. వ్యాధి తీవ్రతను బట్టి ఈ వాపు పరిమాణం, రూపం మారుతుంటాయి. ఉదా: ఆవగింజ, పెసర, మినప, కంది, బార్లీ గింజల్లా, పగడాలలాగ, చిలకముక్కులాగా ఉంటాయని శాస్త్రకారులు స్పష్టీకరించారు. వీటిని మాంసకీలలు అంటారు. భేదాలు : సహజ (పుట్టుకతో వచ్చినవి), జాతోత్తరకాలజ (వివిధ కారణాల వల్ల, వయసుల్లో వచ్చేవి), శుష్క (పొడిగా ఉండేవి), ఆర్ద్ర (తడిగా ఉండేవి). బాహ్య (బయటకు ఉండేవి), ఆభ్యంతర (లోపలి మడతల్లో ఉండేవి). వ్యాధి కారణాలు: జఠరాగ్ని మందగింపజేసే ఆహారవిహారాలు. అంటే ఉప్పు, పులుపు-కారాలు ఎక్కువగా తినడం, అజీర్తి కలిగించే బరువైన ఆహారం, విరుద్ధాహారం (అంటే కొన్ని కొన్ని పదార్థాల కలయిక శరీరానికి హాని కలిగిస్తుంది. ఉదాహరణకు ఇత్తడి పళ్లెంలో నిల్వ ఉంచిన పులిహోర; కొన్ని రకాల చేపలు తిన్న వెంటనే పాలు తాగడం, పాలు, పెరుగు వెంటవెంటనే సేవించడం), ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారికి (ముఖ్యంగా మెత్తటి ఆసనాల మీద), జంతువుల (గుర్రం మొదలైనవి) మీద ఎక్కువ సేపు ప్రయాణించడం, పిరుదుల మీద ఎక్కువ సేపు వేడి లేదా చల్లటి ఒత్తిడి పడటం (లారీ నడిపేవారు), మానసిక ఒత్తిడి (ఆందోళన, భయం, దుఃఖం, విచారం మొదలైనవి) చికిత్స విషయంలో సాధ్యాసాధ్యాలు: బాహ్య అర్శస్సులు, కొత్తగా పుట్టేవాటికి తేలిగ్గా చికిత్స చేయవచ్చు. సహజ, ఆభ్యంతర, చిరకాల అర్శస్సులు కష్టసాధ్యాలు, కొన్నింటికి చికిత్స అవసరం. ఉపద్రవాలు: సకాలంలో సరైన చికిత్స చేయకపోతే రక్తహీనత, దౌర్బల్యం, శరీరమంతా వాపులు, మానసిక వ్యాకులతలతో పాటు మరణానికి దారితీస్తుంది. వ్యాధి లక్షణాలు: మలమార్గం దగ్గర వాపు, తీవ్రమైన మలబంధం, దురద, మంట, ఆకలి లేకపోవడం, కోపం, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం మొదలైనవి. చికిత్స: పైన చెప్పిన కారణాలను గమనించి వాటిని దూరం చేయాలి. నూనెలు, ఉప్పు-పులుపు, కారం లేని, తేలికగా జీర్ణమయ్యే ఆహారం (పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే శాకాహారం, ఆకుకూరలు) తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం, తాజాఫలాలు ఎక్కువగా తినడం, తగినంత నిద్ర, ప్రశాంతత, ప్రాణాయామం మొదలైనవి. ఔషధాలు: కాంకయనవటి (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 బృహత్ సూరణ వటి (మాత్రలు) ఉదయం 1, రాత్రి 1 అర్శోహర వటి (మాత్రలు): ఉదయం 1, రాత్రి 1 త్రిఫలాచూర్ణం: 5 గ్రాములు నీటితో రెండుపూటలా శుంఠి చూర్ణం: 3 గ్రాములు, తేనెతో, రాత్రి ఒకసారి చిత్రమూల చూర్ణం: 2 గ్రాములు తేనెతో రాత్రి ఒకసారి డాక్టర్ వి.ఎల్.ఎన్.శాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ పసిపిల్లల్లో... వినికిడి సమస్యను కనిపెట్టేదెలా? ఈఎన్టి కౌన్సెలింగ్ మా బాబుకి రెండున్నర ఏళ్లు. వాడిని పిలిచినా పలకడం లేదు. కారణం చెప్పండి. దయచేసి పరిష్కారం చూపించండి. - సులక్షణ, ఖమ్మం సాధారణంగా పుట్టుకతో వినికిడి లోపం అన్నది జన్యుపరంగా వస్తుంది. వినికిడి నరంలో సమస్యతో ఇది వస్తుంది. పిల్లలకు వినికిడి లేకపోతే మాట కూడా రాదు. కారణాలు: మేనరికపు వివాహాల వల్ల జన్యుపరంగా వినికిడికి దోహదం చేసే నరం బలహీనమవుతుంది గర్భవతుల్లో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు, తలకు, చెవికి బలమైన దెబ్బ తగలడం మెదడువాపు వ్యాధి వంటి కారణాలతో ఈ సమస్య వస్తుంది. ఇలా జరిగినప్పుడు వినికిడి లోపానికి తగిన కారణాలు తెలుసుకొని దానికి అనుగుణంగా చికిత్స చేయడం, కాక్లియర్ ఇంప్లాంట్స్ శస్త్రచికిత్స చేయించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. సమస్యను ఎలా గుర్తించాలి? వినికిడి సమస్య అన్నది పిల్లలు గర్భంలో ఉన్నప్పటి నుంచి ఏర్పడుతుంది. శిశువు పుట్టిన తర్వాత... ఒక నెలలోపువారు శబ్దాన్ని గ్రహించి కంటి రెప్పలను కదిలిస్తారు మూడు నెలల లోపు వయసులో శబ్దం వచ్చే వైపునకు తిరుగుతారు ఆరు నెలలోపు వయసులో మ, బ, త లాంటి అక్షరాలు పలుకుతారు తొమ్మిది నెలలోపు వయసు గల వారు మమ, తత, బబ లాంటి చిన్న చిన్న పదాలు పలుకుతారు పన్నెండు నెలల వయసు వారు అర్థవంతమైన పదాలను పలకడం చేస్తుంటారు ఏడాదిన్నర వయసు ఉన్నవారు చిన్న చిన్న వాక్యాలు పలుకుతుంటారు రెండేళ్ల పిల్లల వారు చిన్న చిన్న కథల రూపంలో ఏదైనా చెబుతుంటారు. వీటిలో ఏది జరగకపోయినా పిల్లలకు వినికిడి సమస్య ఉందని అనుమానించి, వెంటనే డాక్టర్‌ను కలుసుకోవాలి. డాక్టర్ సత్యకిరణ్ అవ్వారు సీనియర్ ఈఎన్టీ అండ్ కాక్లియర్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
కృత్రిమం టు ప్రకృతి
హెర్బల్ ఉత్పత్తులు కండిషనర్‌తో కలగలిసి గాఢమైనదాన్నంటూ ఒగలుపోతూ ప్రొటీన్‌తో చిక్కనై జుట్టును నిగారింపజేస్తానంటూ షాంపూలు గొప్పలకు పోయాయి. గొడవచేశాయి. అంతలోనే ఏమైందో ఏమోగానీ... శీకాకాయ సహిత కుంకుడుకాయ పులుసే రూపుమార్చుకొని మళ్లీ బాత్రూమ్ అరుగుమీద మరోమారు ప్రత్యక్షమౌతోంది. పళ్లు తోమడం కోసం పేస్ట్ వంక చూడటానికి కను గుడ్డు కనుకొనలకు కదిలే లోపే ... వనమూలికా వజ్రదంతి అక్కడ దర్శనమిస్తోంది. స్వాభావిక సాంప్రదాయిక సహితమైన ఆ వస్తువులు పతంజలి ప్రాడక్ట్ అనో, హెర్బల్ కంజ్యూమర్ గూడ్ అనో... విపణి వీధుల్లో ఇప్పుడు ప్రతిరోజూ ఇబ్బడి ముబ్బడిగా కనిపిస్తున్నాయి. కనువిందు చేస్తున్నాయి. దాంతో... ప్రతి రోజూ సెల్వార్ కమీజ్ చున్నీ దుపట్టాలతో కనిపించే అమ్మాయి అకస్మాత్తుగా పరికిణీ పావడా, పట్టు వోణీ, అంచు నిండా జరీవిరి తీగలను కవిగాంచకపోయినా.... కన్సూమ‘రవి’ గాంచుతున్నాడు. న్యాచురల్, హెర్ ‘బల్’ థ్రిల్లింతలు కలిగిస్తున్న ఆ ప్రోడక్ట్‌ల తీరు తెన్నులు... ట్రెండీ వన్నెలపై ప్రత్యేక కథనమిది. దీప్తికి చిన్నప్పుడు తలంటు స్నానమంటే నాయనమ్మ కుంకుడు కాయలు, సీకాకాయ పొడితో తలరుద్ది స్నానమే! పెరుగుతున్న వయసు, మారిన కాలానికి తగ్గట్లు తరువాత షాంపూలు, శాషేలకు మారింది. ఇప్పుడు నాలుగు పదుల వయసొచ్చి, ఇద్దరు ఆడపిల్లల తల్లి అయ్యాక తనకూ, పిల్లలకూ తల స్నానమంటే దీప్తి ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు. హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం, అపార్ట్మెంట్లో బోర్ వాటర్, ఉత్తిపుణ్యానికే ఊడిపోతున్న జుట్టు మధ్య వారానికి రెండుసార్లయినా తప్పని తలస్నానం కోసం రకరకాల మార్గాలు అన్వేషించారు. భూమి గుండ్రంగా ఉన్నట్లు ఇప్పుడు మళ్ళీ ‘హెర్బల్’ ఉత్పత్తుల వైపు మొగ్గుతున్నారు. కాకపోతే, కుంకుడు కాయలు కొట్టి, నురుసు పోసుకొనే తీరిక, ఓపిక లేకపోవడంతో - కేశాలకు నష్టం చేయని హెర్బల్ షాంపూలు వాడడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు ఆయుర్వేద వనమూనికలున్న ‘వజ్రదంతి’ పళ్ళపొడి వాడి, పెద్దయ్యాక ఖరీదైన టూత్‌పేస్ట్‌లకు మారిన విశాఖపట్నం వాసి యాభై ఏళ్ళ శ్రీరామచంద్రమూర్తికి పంటి మీద ఎనామిల్ పోయి, ఏది నోట్లో పెట్టుకొన్నా పళ్ళు జివ్వున లాగేస్తున్నాయి. అందుకే, ఈ పంటి తీపులు తగ్గించుకోవడానికి వీలుగా మళ్ళీ చిన్నప్పటి వనమూలికల బాటపట్టారు. ఉదయాన్నే పళ్ళు తోముకోవడానికి హెర్బల్ టూత్‌పేస్ట్‌లను చేతపట్టారు. ఏడున్నర పదులు దాటిన విజయవాడ విఠలేశ్వరమ్మ గారు రోజూ ఉదయాన్నే ఆరోగ్యం కోసం తీసుకొనే తేనె కోసం పెద్ద సంస్థల ప్రొడక్ట్‌లను ఇప్పుడు కాదంటున్నారు. కొడుకుకి చెప్పి, అడవి నుంచి గిరిపుత్రులు సేకరించిన ఉత్పత్తులు అమ్మే గిరిజన్ స్టోర్స్ నుంచే ఒకప్పటిలా తేనె తెప్పించుకుంటున్నారు. తిరుపతిలో ఉంటున్న వేణుగోపాలరావు ఇంట్లో ఇప్పుడు పిల్లల బిస్కెట్ల దగ్గర నుంచి ఇంట్లో వాడే గోధుమ పిండి, వగైరా దాకా ప్రతీదీ ‘పతంజలి’ హెర్బల్ ప్రొడక్టే! దేశమంతటా... ‘హెర్బల్’ హవా! ఒక్క తెలుగునాటే కాదు... ఇప్పుడు దేశమంతటా ఇదే పరిస్థితి. హెర్బల్ ప్రొడక్ట్‌లదే హవా! అనారోగ్యాలు, రకరకాల శారీరక సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్ళీ ఒకప్పటి దేశవాళీ ఆరోగ్య, ఆహార విధానాలను జనం అక్కున చేర్చుకుంటున్నారు. పర్యావరణ పరిస్థితులు, ఆహార, విహారాల్లోని సమస్యలన్నిటికీ ఔషధ ఉత్పత్తులే పరిష్కారమని నమ్ముతున్నారు. వెరసి, ‘త్వరితగతిన అమ్ముడయ్యే వినియోగదారుల ఉత్పత్తుల’ (ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ - ఎఫ్.ఎం.సి.జి) విభాగంలో ఇప్పుడు హెర్బల్ ప్రొడక్ట్‌ల అమ్మకాలు తారాపథానికి దూసుకుపోతున్నాయి. నిజానికి, మన దేశంలో మొదటి నుంచి ఆయుర్వేద ఉత్పత్తులు, ఔషధ మూలికల ఉత్పత్తులకు పాపులారిటీ ఎక్కువే. ఆధునిక యుగంలో మధ్యలో కొంత వాటి ప్రాభవం తగ్గినట్లు అనిపించినా, ‘నేచురల్’ పద్ధతిలో అందం, ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరిగిన ఈ తరం మళ్ళీ ప్రాచీన విజ్ఞానానికే ఓటేస్తోంది. గత ఏడాది డిసెంబర్‌తో పూర్తయిన ఆరు నెలల కాలంలో వివాదాస్పద బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని ‘పతంజలి’ సంస్థ ఉత్పత్తుల అమ్మకం ఏకంగా 64 శాతం పెరిగింది. ఇక, డాబర్, హిమాలయా లాంటి ఇతర ఔషధ ఉత్పత్తుల సంస్థల అమ్మకాలు కూడా మార్కెట్లో రెండంకెల్లో పెరిగాయి. టూత్పేస్ట్లు, షాంపూలు, జుట్టుకు రాసుకొనే నూనెలు - ఇలా అన్నింటిలోనూ ఇదే వరుస. కీలకమైన కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ విభాగాలన్నిటిలో వీటి మార్కెట్ వాటా బాగా పెరుగుతోందని మార్కెట్ రిసెర్చ్ సంస్థ ‘నీల్సెన్’ కూడా లెక్కలతో సహా తేల్చింది. ఎందుకీ కొత్త మోజు! ఇంతకీ ఈ హెర్బల్ ప్రొడక్ట్‌ల అమ్మకాలకు ఉన్నట్టుండి ఇంత గిరాకీ ఎలా వచ్చినట్లు? దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. రసాయనాలతో తయారయ్యేవాటితో పోలిస్తే ఈ ఉత్పత్తుల్లో సహజ ముడి పదార్థాలు వాడతారు. ధర కూడా చౌక. పైగా, సైడ్ ఎఫెక్ట్లు ఉండవని జనానికి నమ్మకం. ఆరోగ్యపరంగా లాభాలు సరేసరి. అందుకే, ప్రస్తుతం ఈ ‘నేచురల్’ ఉత్పత్తులకు తెగ పాపులారిటీ, జనంలో మోజు! అందుకు తగ్గట్లే ఇప్పుడు ఏ పచారీ సామాన్ల కొట్టుకు వెళ్ళినా, ఈ ‘నేచురల్’ ప్రొడక్ట్‌లు తెగ కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఉన్న డాబర్, ఇమామి, మ్యారికో లాంటి భారతీయ సంస్థల ఉత్పత్తులు ఎలాగూ ఉంటాయి. కొత్తగా ఆధ్యాత్మిక రంగంలోని బాబా రామ్‌దేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ లాంటి వారి ‘పతంజలి’ తదితర సంస్థల డైలీ యూజ్ ప్రొడక్ట్‌లు దర్శనమిస్తున్నాయి. మన ‘వన’ బాటలోకి... మల్టీ నేషనల్స్ విశేషం ఏమిటంటే, ఒకప్పుడు కేవలం చిన్న సంస్థలనుకున్న ఈ హెర్బల్ ప్రొడక్ట్ సంస్థలన్నీ ఇప్పుడు ఆయుర్వేదేతర సంస్థల మార్కెట్ వాటాను నెమ్మదిగా తమ వశం చేసుకుంటున్నాయి. తాజా గణాంకాలు ఆ సంగతి స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు, ‘ఫేస్ వాష్’ లాంటి ఉత్పత్తుల విభాగంలో ఆయుర్వేదేతర ప్రొడక్ట్స్ అమ్మకాల పెరుగుదల ఒక్క ఏడాదిలోనే 21 శాతం నుంచి 16 శాతానికి పడిపోయింది. ఇక, షాంపూల లాంటి వాటిలో అయితే ఆయుర్వేద బ్రాండ్ల అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ‘భారతీయ మార్కెట్ రిసెర్చ్ బ్యూరో (ఐ.ఎం.ఆర్.బి) ఇంటర్నేషనల్’ సర్వే ఈ షాంపూల కథ బయటపెట్టింది. ఈ దెబ్బకు ఇప్పటి దాకా మార్కెట్‌ను శాసించిన బడా సంస్థలు కుదేలవుతున్నాయి. దాంతో, అవి కూడా మన వనమూలికలతో ‘నేచురల్’, ‘ఆయుర్వేద’, ‘హెర్బల్’ బాట పట్టాల్సి వస్తోంది. గతంలో ‘ప్రామిస్’, ‘యాంకర్’, ‘అమర్’ లాంటి స్థానిక టూత్‌పేస్ట్‌లన్నీ మల్టీ నేషనల్ కంపెనీల చేతిలో నలిగిపోయాయి. కానీ ఇప్పుడు అచ్చంగా సీన్ రివర్స్ అయింది. దంత సంరక్షణ ఉత్పత్తుల్లో ‘పతంజలి’ వారి ‘దంత కాంతి’ టూత్‌పేస్ట్ నుంచి పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి ‘కాల్గేట్ - పామోలివ్’ వారు ‘వేద్ శక్తి’తో ముందుకు రావాల్సి వచ్చింది. ఉప్పు, బొగ్గుపొడితో పళ్ళు తోముకొనే భారతీయ తరహా విధానాన్ని ఒకప్పుడు తెగ విమర్శించిన బహుళ జాతి సంస్థలు ఇప్పుడు ‘యాక్టివ్ సాల్ట్ అండ్ చార్కోల్ టూత్‌పేస్ట్’ అంటూ అచ్చం అవే తయారుచేస్తున్నాయి. దీన్నిబట్టి పరిస్థితి ఎంత ‘నేచురల్’గా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఆహార ఉత్పత్తుల్లోనూ... అదే వరస! కొన్నాళ్ళ క్రితం దాకా కేవలం చర్మ సంరక్షణ, కేశ సంరక్షణ, దంత సంరక్షణ లాంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ విషయంలోనే ఈ నేచురల్ ప్రొడక్ట్స్‌కు డిమాండ్ ఉండేది. కానీ, ఇటీవలి కాలంలో ఆహారం, పానీయాలు, గృహసంరక్షణ ఉత్పత్తుల విషయంలోనూ ‘నేచురల్’ వాటి వైపే జనం మొగ్గుతున్నారు. బాబా రామ్‌దేవ్ ‘పతంజలి’ ప్రొడక్ట్స్ కేవలం ఒక్క ఏడాదిలో దాదాపు 80 శాతం మేర దేశంలో చొచ్చుకుపోవడమే అందుకు నిదర్శనం. బిస్కెట్లు, పానీయాల దగ్గర నుంచి నెయ్యి, నూనె, తేనె దాకా, గోధుమ పిండి నుంచి రకరకాల పిండ్ల దాకా అన్నింటిలో దేశవాళీ ఉత్పత్తిగా ‘పతంజలి’ ప్రత్యక్షమవుతోంది. సర్వసాధారణంగా మార్కెట్లో పాతుకుపోయిన బ్రాండ్లను కాదని, ఇలా దేశవాళీ సరుకుల వైపు జనం అంత తొందరగా రారు. కానీ, ఇప్పుడు ఆ అసాధరణ సంఘటనే జరుగుతోంది. అదే ఇప్పుడు మహా మహా మార్కెట్ పండితుల్ని సైతం ముక్కున వేలేసుకొనేలా చేస్తోంది. ‘పతంజలి’ ప్రొడక్ట్స్ లాంటివి ఇక్కడ నుంచి కెనడా, అమెరికా, మారిషస్, బ్రిటన్ లాంటి అనేక దేశాలకు కూడా ఎగుమతి అవుతుండడం గమనించాల్సిన విషయం. వరుస చూస్తుంటే - తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలిలో కూడా కాలుష్యం పెరిగిపోతోందని వాపోతున్న ఆధునిక జీవన పరిస్థితుల్లో, జీవనశైలి రోగాలు పెరిగిపోతున్న రోజుల్లో - ఈ ‘నేచురల్’, ‘హెర్బల్’ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు రోజు రోజుకూ ఇంకా ఇంకా పెరిగేలా కనిపిస్తోంది. అదే జరిగితే, ఇప్పటికే సాంప్రదాయిక హెర్బల్ ఉత్పత్తుల రంగంలో పాతుకుపోయిన సంస్థలకూ, పరిశోధన - నూతన ఉత్పత్తుల రూపకల్పన విభాగంలో బలమున్న సంస్థలకూ భవిష్యత్తు మరింత ఉజ్జ్వలంగా ఉండనుంది. మార్కెట్లో ఎటుచూసినా అప్పుడు ‘నేచురల్’ ప్రొడక్ట్స్లే! వాటిలో మెరుగైనవి ఏమిటనే కొత్త ప్రశ్న మొదలవుతుంది. - రెంటాల ఎందెందు వెతకి చూసిన... అందందే! ఇవాళ సామాన్య జనంతో పాటు, స్టాక్ మార్కెట్ కంపెనీల జాబితాలో లేకపోయినా మార్కెట్ నిపుణులు కూడా ఆసక్తిగా చూస్తున్న సంస్థ - ‘పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్’ (పి.ఎ.ఎల్). తలనొప్పి, కీళ్ళనొప్పులు, ఆస్త్మా, ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్ లాంటి అన్నిటికీ మందులు అందిస్తోంది. చిత్రం ఏమిటంటే, ఒక్క ఆయుర్వేదం మందుల్లోనే కాదు... ‘ఇందుగలడందు లేడని సందేహంబు వలదు’ అన్నట్లుగా పప్పు ధాన్యాలు, మసాలా దినుసులు, చ్యవన్‌ప్రాశ్, టూత్పేస్ట్లు, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, ఇన్స్టంట్ నూడుల్స్, టీ, జామ్, కార్న్‌ఫ్లేక్స్, చివరకు వృద్ధాప్యం కనపడనివ్వని యాంటీ ఏజింగ్ సౌందర్య ఉత్పత్తులు - ఇలా అన్నింటా ‘పతంజలి’ ప్రొడక్ట్స్ ఇప్పుడు ప్రత్యక్షం. పదేళ్ళ క్రితం 2006లో రిజిస్టరైన ‘పతంజలి ఆయుర్వేద్’ సంస్థ ఏకంగా 350 రకాల ఉత్పత్తులు చేస్తోంది. చేతిలో 11 వేల పైగా సొంత దుకాణాలు, 20 వేల మందికి పైగా సిబ్బంది ఉన్నారు. హరిద్వార్ శివార్లలోని 150 ఎకరాల ప్రాంగణంలోని ఫ్యాక్టరీ నుంచి రోజూ 300 ట్రక్కుల సరుకులు రవాణా అవుతుంటాయి. సాంకేతికంగా చూస్తే - యోగా గురువు, టీవీ ప్రముఖుడైన బాబా రామ్‌దేవ్‌కు ఈ సంస్థలో వాటా లేదు. కానీ, నడిపేది ఆయన సహపాఠీ, శిష్యుడైన ఆచార్య బాలకృష్ణే. అలాగే ఈ ‘పతంజలి’ బ్రాండ్‌కు ఇంత పాపులారిటీ వచ్చిందంటే, అదంతా దేశవ్యాప్తంగా తన యోగా శిబిరాల్లో రామ్‌దేవ్ చేసిన మార్కెటింగ్ చలవే. దానికి తోడు బయటి ప్రొడక్ట్‌ల కన్నా వీటి రేటు కూడా సగటున 10 నుంచి 30 శాతం తక్కువ. అది కూడా కొనేవాళ్ళకు స్పెషల్ ఎట్రాక్షన్. అందుకే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ ఏకంగా రూ. 2 వేల కోట్ల ఆదాయం సంపాదించింది. లాభం సంగతికొస్తే, 2012 మార్చి నాటికి కోటి డాలర్ల పైగా ఉన్న ‘పతంజలి’ నికర లాభం, ఈ ఏడాది మార్చి నాటికి పదిన్నర కోట్ల డాలర్లకు దూసుకుపోయింది. రాగల రెండు ఆర్థిక సంవత్సరాల్లో దేశంలోని మరో 7 రాష్ట్రాల్లో కనీసం 1200 ఎకరాల్లో ఫ్యాక్టరీలు పెట్టాలని ‘పతంజలి’ ప్లాన్. అందులో ఒక ఫ్యాక్టరీ అచ్చంగా విదేశాలకు ‘పతంజలి’ ఉత్పత్తుల ఎగుమతికే! అప్పటి విజ్ఞానం... ఇప్పటి లేటెస్ట్ ఫ్యాషన్! ప్రాచీన కాలం నుంచి ఆయుర్వేద, వన మూలికల విజ్ఞానం భారతీయుల సొంతం. వాటిని జీవితంలో భాగం చేసుకొన్న జీవనశైలీ ఉండేది. క్రమంగా వాటికి దూరమవుతూ వచ్చాం. అయితే, ఇటీవల కొద్ది కాలంగా బాబా రామ్‌దేవ్, శ్రీశ్రీశ్రీ రవిశంకర్ లాంటి ఆధునిక యోగ గురువులు ఆయుర్వేదం, యోగాలను ఆధ్యాత్మిక రంగానికి కొనసాగింపుగా పాపులర్ చేశారు. అదే సమయంలో పాశ్చాత్య వైద్య విధానంలోని లోపాలనూ, కొన్నిసార్లు జరుగుతున్న మోసాలనూ, ఆ దుష్ర్పభావాలనూ రామ్‌దేవ్ లాంటి వారు పదేపదే ప్రస్తావిస్తూ, జనంలోకి బాగా ప్రచారం చేశారు. దానికి తోడు భారతీయ సంస్కృతి, సంప్రదాయం, దేశీయత లాంటివి ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం హోరుకు సరిపోయాయి. ఖరీదైన మల్టీ నేషనల్ ప్రొడక్ట్‌ల కన్నా, చిన్నప్పుడు తాతయ్య, నాయనమ్మ చెప్పిన మన వనమూలికల విజ్ఞానంతో తయారైన ఈ హెర్బల్ ప్రొడక్ట్‌లు మిన్న అనే భావం మామూలు మధ్యతరగతి అందరిలో కలుగుతోంది. ఇవాళ్టి లేటెస్ట్ ‘హెర్బల్’ హవా వెనక ఇంత కథ ఉంది! ఈ లెక్కలే సాక్ష్యం! భారతదేశంలో ఇవాళ ప్యాకేజ్డ్ కన్జ్యూమర్ గూడ్స్ మార్కెట్ విలువ దాదాపు రూ. 3.2 లక్షల కోట్లు హెర్బల్ ప్రొడక్ట్స్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఒక్క ‘పతంజలి’ బ్రాండ్ ఈ ఎఫ్.ఎం.సి.జి. మార్కెట్లో 5 శాతం పైగా వాటా చేజిక్కించుకుంది. 2020 నాటి కల్లా అది 13 శాతానికి పెరుగుతుందని అంచనా. అదే పద్ధతిలో మిగిలిన హెర్బల్ ఉత్పత్తి సంస్థల పురోగతి సరేసరి గత ఏడాది నవంబర్ నుంచి టీవీలో యాడ్స్ కూడా మొదలెట్టిన ‘పతంజలి’ అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి దాకా అయిదు నెలల్లో యాడ్స్‌కే దాదాపు రూ. 400 కోట్లు ఖర్చు పెట్టినట్లు పరిశ్రమ వర్గాల అంచనా. ఈ సొంత ఉత్పత్తులన్నిటికీ తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాబా రామ్‌దేవ్ మాత్రం రూ. 60 కోట్లే ఖర్చు చేశామంటున్నారు గడచిన నాలుగేళ్ళలో ‘పతంజలి’ పెరుగుదల ఏకంగా 1011 శాతం అన్న లెక్క చూశాక, ఆయుర్వేదేతర సంస్థలకు దిమ్మదిరిగిపోయింది. -
‘నవ’ ధాన్యాలు
1. గోధుమలు: పలు పాశ్చాత్య దేశాలతో పాటు ఉత్తర భారతీయుల ఆహారంలో ప్రధానమైనవి గోధుమలే. వీటిలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. బీ కాంప్లెక్స్‌లో బి-12 మినహా మిగిలిన విటమిన్లు, విటమిన్-ఈ, విటమిన్-కేతో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి కీలక ఖనిజాలు ఉంటాయి. 2. వరి: పలు తూర్పు దేశాలతో పాటు దక్షిణ భారతీయులు వరి ధాన్యం నుంచి వేరు చేసిన బియ్యాన్ని ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. వరిలో రకరకాల వంగడాలు ఉన్నా, వాటిలోని పోషక విలువలు దాదాపు ఒకే తీరులో ఉంటాయి. బియ్యంలో దాదాపు 80 శాతం పిండి పదార్థాలే ఉంటాయి. స్వల్పంగా ప్రొటీన్లు, కొవ్వులు, బి1, బి2, బి3, బి5, బి6 విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. 3. కందులు: కందులను దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ వినియోగిస్తారు. ఎక్కువగా పొట్టు తీసేసి పప్పుగా మార్చి వినియోగిస్తారు. కందులలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. బి1, బి2, బి3, బి5, బి6, బి9 సీ, ఈ, కే విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 4. పెసలు: పెసలను కూడా అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా వినియోగిస్తారు. పొట్టుతీయని గింజలను నానబెట్టి మొలకెత్తిన తర్వాత తినడంతో పాటు పొట్టుతీసిన పప్పును వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. పెసలలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 5. శనగలు: పెసల మాదిరిగానే శనగలను కూడా నానబెట్టి మొలకెత్తిన తర్వాత నేరుగా తినడంతో పాటు పొట్టుతీసేసిన పప్పును వివిధ వంటకాల్లో వినియోగిస్తారు. శనగల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగాను, కొవ్వులు నామమాత్రంగాను ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 6. బొబ్బర్లు: కందులు, పెసలు, శనగల మాదిరిగా బొబ్బర్లను అంత విరివిగా వాడకపోయినా, మన దేశంలో వీటిని తరచుగానే ఉపయోగిస్తారు. బొబ్బర్లను నానబెట్టి ఉడికించి వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. బొబ్బర్లలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. 7. నువ్వులు: నువ్వులు ప్రధానంగా నూనెగింజల జాతికి చెందుతాయి. నువ్వులను, నువ్వుల నూనెను కూడా మన దేశంలో విరివిగా వినియోగిస్తారు. నువ్వుల నూనెను ఊరగాయల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వులలో ప్రధానంగా కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 8. మినుములు: మినుముల వాడుక మన దేశంలో పురాతన కాలం నుంచి ఉంది. మినుములను లేదా పొట్టుతీసిన మినప్పప్పును నానబెట్టి వివిధ రకాల అల్పాహార వంటకాలకు ఉపయోగిస్తారు. మినప్పుప్పును పిండిగా చేసి అప్పడాలు, సున్నుండలు వంటివి తయారు చేస్తారు. మినుముల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. 9. ఉలవలు: ఉలవల వాడకం మన దేశంలో పురాతన కాలం నుంచే ఉన్నా, మిగిలిన పప్పుధాన్యాలతో పోలిస్తే వీటి వాడుక చాలా తక్కువ. ఉలవల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో బి1, బి2, బి3, బి5, బి6, బి9 విటమిన్లతో పాటు విటమిన్-సీ, విటమిన్-ఈ, విటమిన్-కే వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఉలవలను నానబెట్టి నేరుగా తింటే, మధుమేహం అదుపులోకి వస్తుందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పరిశోధనలో తేలింది. ఉషశ్రీ సీనియర్ కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ పిల్లల కోసం ‘నవ’ సూచనలు 1 ఐదేళ్ల వయసొచ్చే వరకు తలిదండ్రులు తమ పిల్లలను అపురూపంగా చూడాలి 2 ఐదేళ్లు వచ్చాక వారికి మంచి, చెడు చెప్పే ప్రయత్నం చేయాలి. నయానా భయానా దారికి తెచ్చుకోవాలి. వారి మంచిలోనూ, చెడులోనూ అన్ని సందర్భాలలోనూ వారికి అండగా ఉన్నామన్న భరోసా కల్పించాలి 3 వారిని విమర్శించడం, వ్యాఖ్యానించడం, ఇతరులతో పోల్చి చిన్నబుచ్చడం చేయకూడదు 4 పిల్లల శారీరక, మానసిక స్థితిగతులను బట్టి పెద్దయ్యాక వారు ఏమి కావాలన్న దానిపై ఒక ఆలోచన చేయాలి కానీ ముందు నుంచే వారిపై ఆశలు పెట్టుకుని, మోయలేనంత భారం మోపకూడదు 5 శారీరకంగా బలంగా అంటే బొద్దుగా, ముద్దుగా ఉన్నారు కదా అని మురిసిపోకూడదు. మానసికంగా కూడా దృఢంగా ఉండేలా చూడాలి. 6 భార్యాభర్తల కీచులాటలు, అత్తాకోడళ్ల తగవులు, ఇరుగుపొరుగుతో కయ్యాలు వంటివి లేకుండా ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూడాలి. 7 ఎప్పుడూ చదువు.. చదువు.. అని వారిని సాధించకుండా, వారికి నైతికవిలువలను, నీతినిజాయితీలను ప్రబోధించే కథలు చెబుతుండాలి. నిజాయితీగా ఉన్నందుకు చిన్న చిన్న బహుమతులిచ్చి ప్రోత్సహించాలి 8 క్రమశిక్షణ పేరుతో వారిని తీవ్రంగా మందలించడం, మీతో మాట్లాడాలంటేనే భయపడేలా చేయకూడదు. అలాగని అతి చనువు ఇచ్చి నెత్తిన ఎక్కించుకోకూడదు. క్రమశిక్షణకు క్రమశిక్షణే, చనువు చనువే అన్నట్లు వ్యవహరించాలి 9 చివరగా ఒక్క మాట.. వారితో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. వారి అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేసే స్వేచ్ఛను ఇవ్వండి. అవసరమైతే వారి ఆలోచనలను, అభిప్రాయాలను సరిదిద్దుతూ, సూచనలు, సలహాలు ఇస్తుండండి. డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ లూసిడ్ డయాగ్నొస్టిక్స్ బంజారాహిల్స్, హైదరాబాద్ -
పీచు తింటే పీస్ ఉంటుంది
మన డైట్లో పీచు పదార్థాలు ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. కొబ్బరి పీచు తీసుకుని గిన్నెల్లో జిడ్డు తోమేసినట్టు... పీచు పదార్థం కడుపు అనే గిన్నెని శుభ్రం చేసేస్తుంది. ఫన్నీ థింగ్ ఏంటంటే... పీచు పదార్థాల్లో పోషక విలువలు తక్కువ, పీచు ఎక్కువ ఉన్నా... శరీరాన్ని శుభ్రంగా ఉంచడానికి, అనారోగ్యాల నుంచి కాపాడటానికి... చాలా విలువలున్నాయి. కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చెయ్యడానికి, డయాబెటిస్‌ని దూరంగా ఉంచడానికి బరువు తగ్గించడానికి... ఇలా ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతేకాదు... మలబద్ధకం వల్ల వచ్చే బుద్ధి బద్ధకాన్నీ ఫ్లష్ చేసేస్తుంది. అందుకే... పీచు తినండి. పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోండి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రొటీన్స్, విటమిన్స్, మినరల్స్... ఇలాంటి పోషకాలన్నీ శరీరానికి తప్పనిసరిగా తగిన మోతాదుల్లో అవసరమే. ఆహారంలో ఇవన్నీ ఉన్నా, పీచుపదార్థాలు తగినన్ని లేకుంటే మాత్రం ఆరోగ్యం వికటించి గుండె పీచు... పీచుమనడం ఖాయం. ఇంతకీ ఈ పీచుపదార్థాలేమిటి? ఇవేమైనా శక్తినిస్తాయా? కండబలాన్నిస్తాయా? గుండెబలాన్నిస్తాయా? ఎందుకు వీటిని తీసుకోవాలి... అనుకుంటున్నారా? నిజమే! ఇవి తక్షణమే శక్తినివ్వవు. కండబలాన్నీ, గుండెబలాన్నీ ఇవ్వవు. ఇతర పదార్థాల్లా కనీసం జీర్ణమైనా కావు. అయినా, మన ఆరోగ్యం సజావుగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. పీచుపదార్థాలే లేకుంటే, మనం తిన్న ఆహారంలో జీర్ణమైపోయినవి జీర్ణమైపోగా, మిగిలిన వ్యర్థాలు బయటకుపోయే వీలే ఉండదు. కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపాలంటే పీచుపదార్థాలను తీసుకోక తప్పదు. కరిగేవీ... కరగనివీ... ఆహారంలోని పీచుపదార్థాలను నాన్-స్టార్చ్ పాలీశాచరైడ్స్ (ఎన్ఎస్పీ) అంటారు. ఇవి శాకాహార పదార్థాల్లో ఉంటాయి. వీటిలో సెల్యులోజ్, సెమీసెల్యులోజ్, పెక్టిన్స్, లిగ్నిన్స్, గమ్స్, మ్యూకిలేజెస్, బీటా-గ్లుకేన్స్ వంటి రకరకాల పీచుపదార్థాలు ఉంటాయి. అయితే, వీటిని స్థూలంగా నీటిలో కరిగే పీచుపదార్థాలు, నీటిలో కరగని పీచుపదార్థాలుగా విభజిస్తారు. నీటిలో కరిగే పీచుపదార్థాలు నీటిలో కలిసిన తర్వాత జెల్‌లాంటి మెత్తని పదార్థంగా మారుతాయి. ఇవి రక్తపోటును అదుపు చేయడంలోను, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలోను ఉపయోగపడతాయి. ఓట్స్, బీన్స్, వేరుశెనగలు, ఆపిల్స్, పుల్లని పండ్లు, క్యారట్లు, బార్లీ వంటి వాటిలో కరిగే పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇక నీటిలో కరగని పీచుపదార్థాలు మన జీర్ణకోశంలోని వ్యర్థాల కదలికకు దోహదపడతాయి. ఇవి మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. మలబద్ధకంతో బాధపడేవారికి నీటిలో కరగని పీచుపదార్థాలు చాలా ఉపయోగపడతాయి. పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజలు, బీన్స్, క్యాలీఫ్లవర్, బంగాళదుంపలు వంటి కూరగాయల్లో నీటిలో కరగని పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఓట్స్, బీన్స్ వంటి శాకాహార పదార్థాల్లో రెండురకాల పీచుపదార్థాలూ ఉంటాయి. శరీరానికి పీచుపదార్థాలు పుష్కలంగా అందాలంటే రకరకాల శాకాహార పదార్థాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. పులిసి మెలిసి... ఆహారంలో కలిసిమెలిసి పేగుల్లో ప్రయాణించే కొన్నిరకాల పీచుపదార్థాలు జీర్ణకోశంలోని బ్యాక్టీరియా ప్రభావంతో పులుస్తాయి. ఇలాంటి పులిసే పీచుపదార్థాలు ఎక్కువగా పళ్లు, కూరగాయలు, గింజలు, ఓట్స్ వంటి పదార్థాల్లో ఉంటాయి. పులిసే పీచుపదార్థాలు జీర్ణకోశంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను కాపాడతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొలెస్టరాల్ స్థాయిని కాపాడటంతో పాటు రక్తంలో గ్లూకోజ్ పరిమాణం నిలకడగా ఉండేలా దోహదపడతాయి. వీటికి భిన్నంగా గోధుమలు, ఓట్స్, బార్లీ వంటి పొట్టుధాన్యాల్లో ఉండే పీచుపదార్థాలు పెద్దగా పులవవు. అయితే, ఇవి మలబద్ధకాన్ని నివారించడానికి గణనీయంగా దోహదపడతాయి. రెసిస్టెంట్ స్టార్చ్ రెసిస్టెంట్ స్టార్చ్... ఇది దాదాపు పిండిపదార్థం. దీనిని పూర్తిస్థాయి పీచుపదార్థంగా పరిగణించరు. అయినా, ఇది కూడా పీచుపదార్థం తరహాలోనే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు దోహదపడుతుంది. పొట్టుధాన్యాలు, గింజలు, అరటికాయలు, బంగాళదుంపలు, పప్పులలో రెసిస్టెంట్ స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. రెసిస్టెంట్ స్టార్చ్ జీర్ణకోశంలో ఉండే బ్యాక్టీరియా ప్రభావం వల్ల ఫ్యాటీయాసిడ్స్‌గా మారుతుంది. ఈ ఫ్యాటీయాసిడ్స్ రక్తంలో కలిసి, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. ఇదీ మేలు పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను నివారించుకోవచ్చు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా కాపాడుకోవచ్చు. కొలోన్ కేన్సర్ వంటివి రాకుండా చూసుకోవచ్చు. పులిసేరకానికి చెందిన పీచుపదార్థాలు రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. వీటివల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నీటిలో కరగని పీచుపదార్థాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని అదుపు చేస్తాయి. ఫలితంగా టైప్-2 డయాబెటిస్ సోకే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తాయి. పీచుపదార్థాలను పుష్కలంగా తీసుకుంటే, త్వరగా కడుపు నిండినట్లవుతుంది. చాలాసేపటి వరకు ఆకలి వేయదు. అందువల్ల వీటిని ఎక్కువగా తీసుకుంటే, శరీరంలో అనవసరపు కొవ్వుచేరే అవకాశాలు దాదాపు ఉండవు. పీచు ప్రణాళిక చాలాకాలంగా పీచుపదార్థాలు దాదాపు లేని ఆహారం తినేవాళ్లు అకస్మాత్తుగా ఒకేసారి పుష్కలంగా పీచుపదార్థాలతో కూడిన ఆహారం తినడం ప్రారంభిస్తే, కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అందువల్ల అలాంటి వాళ్లు తమ ఆహారంలో పీచుపదార్థాల మోతాదును పెంచుకుంటూ పోవాలి. రోజుకు ఐదుగ్రాముల పీచుపదార్థాలు అదనంగా అందేలా, ప్రతిరోజూ పెంచుకుంటూ పోతే, వారం రోజుల్లోగా తగినన్ని పీచుపదార్థాలు ఆహారం ద్వారా తీసుకోవడం అలవాటవుతుంది. పీచు పదార్థాలను సప్లిమెంట్ల ద్వారా తీసుకునే బదులు సహజసిద్ధమైన ఆహార పదార్థాల ద్వారానే తీసుకోవడం మంచిది. సగటున రోజుకు పాతిక గ్రాముల పీచుపదార్థాలు అందేలా చూసుకోవాలంటే, ఇలాంటి ఆహార ప్రణాళికను అనుసరిస్తే చాలు... ఉదయం చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం, ఏదైనా ఒక పండు 5 గ్రాములు మధ్యాహ్నం మల్టీగ్రెయిన్ చపాతీ, బ్రౌన్‌రైస్,ఆకుకూరలు, కూరగాయలతో 5 గ్రాములు సాయంత్రం మొలకెత్తిన గింజలు, ఉడికించిన రాజ్మా, శనగలు వంటివి, వెజిటబుల్ సలాడ్ 5 గ్రాములు రాత్రి మల్టీగ్రెయిన్ చపాతీ, ఆకుకూరలు, కూరగాయలతో... 5 గ్రాములు ఏవైనా పళ్ల ముక్కలు ఒక కప్పు లేదా ఫ్రూట్సలాడ్ 5 గ్రాములు ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో 7 గ్రాముల వరకు పీచు పదార్థాలు ఉంటాయి. రోజువారీ ఆహారంలో పీచుపదార్థాలు తగ్గినట్లయితే, అవిసెగింజలను తీసుకోవచ్చు. వీటిని నేరుగా లేదా మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. పీచు ఫ్యాక్ట్స్ మాంసాహారంతో పోల్చితే శాకాహారంలో పీచు ఎక్కువ. కొన్ని ప్రత్యేక చికిత్సలలో తప్పించి, పీచును ఆహారం ద్వారా మాత్రమే పొందాలి. ఆరోగ్యరక్షణకు తోడ్పడే గ్జెనో బయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, సైటో ఈస్ట్రోజన్లు పీచునుండి లభిస్తాయి. ఫైబర్ టిప్స్ భోజనం చేశాక ఏదైనా ఒక పండు తినండి. తొక్కతోపాటు తినగలిగే పండు ఏదైనా దానిని తొక్కతో పాటే తినండి. ఆహారంలో కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. ఒకే రకం ఆకుకూరలు, కాయగూరలు కాకుండా వేర్వేరు రకాలు, పండ్లు తీసుకోండి. హోల్‌మీల్, మల్టీగ్రెయిన్ బ్రెడ్, బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి. - సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: సుజాతా స్టీఫెన్, సీనియర్ న్యూట్రిషనిస్ట్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్ -
వ్యాధులతో ఫైట్మిన్లు
యుద్ధం గెలవాలంటే యోధులు కావాలి కదా! ఏ, బీ, సీ, డీ... లాంటి యోధులు కావాలి. మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి రకరకాల వ్యాధులు, వైరస్లు, బ్యాక్టీరియాలు ప్రతినిత్యం దాడి చేస్తూనే ఉంటాయి. ఇలాంటి చొరబాటుదారులను తిప్పికొట్టాలంటే... ఇలాంటి శత్రుమూకలను తరిమి తరిమి కొట్టాలంటే... ఇలాంటి దుండగుల ముఠాను మట్టుబెట్టాలంటే... ఏ, బీ, సీ, డీ... లాంటి విటమిన్ల సైన్యం మనకు ఎంతో అవసరం. ఈ యుద్ధవీరులు ఎక్కడ దొరుకుతారు? వాళ్లను మన సైన్యంలో ఎలా చేర్చుకోవాలి? శరీరానికి రక్షణకవచంగా ఎలా వాడుకోవాలి? తెలిపేదే.. ఈ ‘ఫైట్మిన్లు’. విటమిన్స్... ఇవి కార్బోహైడ్రేట్స్లాగ కేలరీలనివ్వవు. ప్రొటీన్స్లాగ కండబలాన్నీ ఇవ్వవు. అయినా మన ఆరోగ్యానికి ఇవి అత్యవసరం. ఇవి లేనిదే ప్రధాన పోషకాలైన ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ ఎంత పనిచేసినా నిరుపయోగమే. ఆరోగ్యం సజావుగా ఉండాలంటే ఇవి అత్యంత కీలకం. ఇంత కీలకమైన ఈ విటమిన్స్ మనకు అసరమయ్యేది మాత్రంచాలా తక్కువ మోతాదులోనే అయినా, పలురకాల ఆహార పదార్థాల ద్వారా శరీరానికి కావల్సిన విటమిన్లన్నింటినీ తీసుకోవాల్సిందే. పధ్నాలుగు.. బతుకుబండిని ముందుకు లాగించే విటమిన్స్ మొత్తం పధ్నాలుగు. వీటిలో నీటిలో కరిగేవి, కొవ్వుల్లో కరిగేవి అని రెండు రకాలుగా ఉంటాయి. బీ1, బీ2, బీ6, బీ12, విటమిన్ సి, బయోటిన్, బి9 మొదలైనవి నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వుల్లాగ ఇవి శరీరంలో నిల్వ ఉండవు. ఎక్కువైనవి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. ఎ, డి, ఇ, కె విటమిన్లు కొవ్వుల్లో కరుగుతాయి. కొవ్వుతో పాటే ఇవి శరీరంలో నిల్వ ఉంటాయి. ఈ విటమిన్లను మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దేని పని దానిదే.. విటమిన్ల పని చాలా నిర్దిష్టంగా ఉంటుంది. ఒక విటమిన్ పనిని ఇంకో విటమిన్ చేయలేదు. ఉదాహరణకు ఒక వ్యక్తికి డి విటమిన్ పుష్కలంగా ఉండి సి విటమిన్ లోపముంటే సి విటమిన్‌ను భర్తీ చేసుకోవాల్సిందే తప్ప దాన్ని డి విటమిన్ భర్తీ చేయలేదు. తక్కువైనా ఎక్కువైనా.. విటమిన్లు తక్కువైతే ఎన్ని జబ్బులు వస్తాయో అవసరానికి మించి తీసుకున్న విటమిన్లూ అన్నే ప్రమాదాలను తెచ్చిపెడ్తాయి. అతిగా తీసుకున్నవి ఒకరకంగా శరీరానికి విషతుల్యాలే. నీటిలో కరిగే విటమిన్లు.. విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఐరన్‌ను గ్రహించి గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇది లోపిస్తే స్కర్వీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. విటమిన్ సి దొరుకు పదార్థాలు: జామ, నారింజ, ద్రాక్ష, మామిడి, బొప్పాయి వంటి పళ్లు, టొమాటా, బంగాళదుంపలు వంటి కాయగూరలు, పాలకూర వంటి ఆకుకూరలు. విటమిన్ బి9 ఎర్రరక్తకణాల నిర్మాణానికి, ప్రొటీన్ల జీవక్రియకు, జీవకణాల వృద్ధికీ తోడ్పడుతుంది. గర్భిణులకు ఈ విటమిన్ అత్యవసరం. గర్భస్థ శిశువుల్లో వెన్నుపూస సరిగ్గా వృద్ధి చెందని ‘స్పైనా బైఫిడా’ వ్యాధి రిస్క్‌ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇది బి6, బి12 విటమిన్లతో కలిసి గుండెజబ్బులు, పక్షవాతం బారిన పడకుండా చూస్తుంది. బీ9 లోపం ఉన్నవారు మెగాలోబ్లాస్టిక్ ఎనీమియా అంటే ఎర్రరక్తకణాలు ఎన్లార్జ్ అయ్యే వ్యాధికి లోనవుతారు.బి9 దొరికే పదార్థాలు: లివర్, చిక్కుళ్లు, ఆకు కూరలు, పుల్లటి పళ్లు, సోయాబీన్స్, పొద్దు తిరుగుడు గింజలు, మొక్కజొన్నలు, పచ్చి బఠాణీలు. విటమిన్ బి1 కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, ఆల్కహాల్ రక్తంలో కలిసేలా దోహదపడుతుంది. బి1 లోపం ఉన్నవాళ్లు బెరిబెరి, గుండెజబ్బులు, నాడీ సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. అయితే విటమిన్ బి1 మోతాదుకు మించి తీసుకుంటే తలనొప్పి, నిద్రలేమి, నీరసం, చర్మ సమస్యలు వచ్చే ప్రమాదాలున్నాయి. విటమిన్‌బి1 దొరికే పదార్థాలు: పాల ఉత్పత్తులు, పొట్టు ధాన్యాలు, లివర్, పంది మాంసం, ఎండిన చిక్కుళ్లు, నట్స్, బఠాణీలు. విటమిన్ బి2 ఆహారపదార్థాల్లోని కొవ్వులు, ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ నుంచి శక్తి లాగేది విటమిన్ బి2నే. ఇది తక్కువైతే చర్మ వ్యాధులు వస్తాయి. ప్రత్యేకించి మూతి చుట్టూ ఉన్న చర్మానికి. అయితే విటమిన్ బి2 మోతాదు ఎక్కువైతే నష్టం జరిగినట్లు దాఖలాల్లేవు. బి2 దొరికే పదార్థాలు: పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు, చికెన్, చేపలు, పాలకూర, పుట్టగొడుగులు, పొట్టు ధాన్యాలు. విటమిన్ బి6 ప్రొటీన్‌ను కరిగించి, హెమోగ్లోబిన్ జీవక్రియను పెంచుతుంది. శక్తిని ఉత్పత్తి చేయడంలో, మెదడు సక్రమంగా పనిచేయడంలోనూ సాయపడుతుంది. జీర్ణాశయంలోని బ్యాక్టీరియా ద్వారా బి6 తయారవుతుంది. ఇది తక్కువైతే మాత్రం చర్మ సమస్యలు, నాడీ సమస్యలు తలెత్తుతాయి. మోతాదుకి మించి బి6ని తీసుకుంటే నరాలు క్షీణించే ప్రమాదం ఉంది. బి6 దొరుకు పదార్థాలు: పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు,లివర్, పందిమాంసం, సోయాబీన్స్, ఓట్స్, పొట్టు ధాన్యాల ఉత్పత్తులు, పొద్దు తిరుగుడుపువ్వు గింజలు, బంగాళదుంపలు, అరటి పళ్లు. విటమిన్ బి12 ఎర్ర రక్తకణాల ఉత్పత్తి, కణాల జీవక్రియకు, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో విటమిన్ బి12 కీలకంగా పనిచేస్తుంది. అయితే, కొంతమంది బి12 విటమిన్‌ను గ్రహించలేరు. అలాగే శాకాహారులకు కూడా ఇది తగినంత అందదు. అలాంటివారు బి12 సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.బి12 దొరుకు పదార్థాలు: మాంసం, చేపలు, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు. విటమిన్ బి3 చర్మ పోషణలో పాత్ర వహిస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. సాధారణంగా బి3 లోపం ఏర్పడదు. మోతాదు మించితే మాత్రం లివర్ సమస్యలు తలెత్తుతాయి.బి3 దొరుకు పదార్థాలు: చికెన్, పౌల్ట్రీ ఉత్పత్తులు, మాంసం, చేపలు, పల్లీలు, పొట్టు ధాన్యాలు, తృణ ధాన్యాలు, పుట్ట గొడుగులు. విటమిన్ బి5 కొవ్వులు, కార్బోహైడ్రేట్ మెటబాలిజం చురుగ్గా ఉండేలా చేస్తుంది. దీనికికి నిర్దిష్టమైన మోతాదేమీ సూచించలేదు. మోతాదు ఎక్కువైతే దుష్ఫలితాలు సంభవించిన దాఖలాలూ లేవు. బి5 దొరుకు పదార్థాలు: మాంసం, లివర్, పాల ఉత్పత్తులు, పల్లీలు, బాదంపప్పు, చిరుధాన్యాలు. కొవ్వుల్లో కరిగే విటమిన్లు విటమిన్ ఎ చక్కటి కంటి చూపు, ఎముకల వృద్ధికి, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, రోగనిరోధక శక్తి మెరుగుదలకు ‘ఎ’ విటమిన్ అత్యంత అవసరం. దీని లోపం వల్ల రేచీకటి వస్తుంది. మోతాదు మించితే కాలేయ సమస్యలు, ఎముకలు దెబ్బతినడం, వైకల్యంతో ఉన్న పిల్లలు పుట్టడం వంటి ప్రమాదాలున్నాయి. విటమిన్ ఎ దొరుకు పదార్థాలు: పాలకూర, క్యారెట్స్, మామిడిపళ్లు, టొమాటా.. వంటి ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు రంగుల్లో ఉన్న అన్ని ఆకు కూరలు, కూరగాయలు, పళ్లు మొదలైన వాటిలో పుష్కలంగా ఉంటుంది. అలాగే లివర్, చేపలు, పాల ఉత్పత్తుల్లో కూడా లభ్యమవుతుంది. విటమిన్ డి ఎముకల వృద్ధికి అత్యంత అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్‌లు మోతాదు మించకుండా నియంత్రిస్తుంది. ఇది లోపిస్తే పిల్లల్లో రికెట్స్, పెద్దవాళ్లల్లో ఎముకలు మెత్తబడే ఆస్టియోమలేషియా జబ్బుల వస్తాయి. మోతాదు మించితే వికారం, తలనొప్పి, రక్తపోటు, కిడ్నీసమస్యలు తలెత్తుతాయి.విటమిన్ డి దొరుకు పదార్థాలు: పాల ఉత్పత్తులు, గుడ్డులోని పచ్చసొన, ఫిష్‌లివర్ ఆయిల్, చిరుధాన్యాలు. విటమిన్ ఇ ఎర్ర రక్తకణాల రక్షణలో, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సక్రమంగా ఉండడంలోనూ విటిమిన్ ఇ సహాయం చాలా ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తుంది. విటమిన్ ఇ లోపం చాలా అరుదు. మోతాదు ఎక్కువైతే అధిక రక్తస్రావానికి, జీర్ణకోశ సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్ ఇ దొరుకు పదార్థాలు: వెజిటేబుల్ ఆయిల్స్, కాయగూరలు, ఆకు కూరలు, తృణ ధాన్యాలు, పొట్టు ధాన్యాల ఉత్పత్తులు, నట్స్, పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, పల్లీలు. విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి తోడ్పడుతుంది. నవజాత శిశువుల్లో, జీవక్రియ మందగించిన వాళ్లలో దీని డెఫిషియెన్సీ కనపడుతుంది. విటమిన్ డిలోపం చిన్న దెబ్బకే తీవ్ర గాయాలవడం, రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ కె దొరుకు పదార్థాలు: ఆకు కూరలు, పంది మాంసం, మాంసం, లివర్, బ్రకోలి, సోయా బీన్స్, ఆకు కూరలు. ఇన్పుట్స్: సుజాత స్టీఫెన్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్ మధురిమ సిన్హా, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ సి విటమిన్ విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారపదార్థాలు తిన్న వారికి క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువని, అదే సమయంలో అధికమొత్తంలో విటమిన్ సి తీసుకోవడం వల్ల డయేరియా, కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదమూ ఉంటుందని కొన్ని అధ్యయానాలు చెప్తున్నాయి డి విటమిన్ ఒక్క డి విటమిన్ తప్ప ఇంకే విటమిన్ శరీరంలో తయారు కాదు. చర్మం మీద సూర్యరశ్మి పడడం వల్ల డి విటమిన్ తయారవుతుంది. జీర్ణాశయంలోని బాక్టీరియా వల్ల కూడా కొన్ని విటమిన్స్ తయారవుతాయి. కానీ చాలా వరకు విటమిన్స్‌ను ఆహారం ద్వారా బయట నుంచే పొందాల్సిందే.