బరువు తగ్గాలంటే ఇవి తినాల్సిందే.. | Protein Diet For Quick Weight Loss | Sakshi
Sakshi News home page

బరువు తగ్గాలంటే ఈ స్నాక్ తినాల్సిందే..

Published Sun, Feb 23 2020 11:45 AM | Last Updated on Sun, Feb 23 2020 2:04 PM

Protein Diet For Quick Weight Loss - Sakshi

ప్రస్తుతం అందరినీ వేధించి సమస్య అధిక బరువు.  గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి.

ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్‌ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. మరి బరువు తగ్గాలనుకునేవారు తక్కువ తినడం కన్నా సరైన ఆహారం తినడం ముఖ్యమని చెబుతున్నారు పోషకాహార, ఆరోగ్య నిపుణులు. బరువు తగ్గడంలో హెల్తీ స్నాక్‌ తినడం ఒక భాగమే. ఇవి ఆకలిని తగ్గించమేగాక జీవక్రియలు సవ్యంగా జరిగేందుకు తోడ్పడుతాయి.


సెనగలు: వీటిలో ప్రొటీన్స్, పీచు పదార్థాలుంటాయి. ఇవి తింటే తొందరగా ఆకలి వేయదు. కూరగాయ ముక్కలు లేదా నిమ్మరసంతో ఉడికించిన సెనగల్ని తీసుకోవాలి.


మినప పప్పు: మినపపప్పులో శరీరానికి అవసరమైన ప్రొటీన్‌ ఉంటుంది. మినప పప్పుతో సాయత్రం స్నాక్‌గా ఇడ్లీలు చేసుకుని తినొచ్చు. ఈ ఇడ్లీలు తొందరగా జీర్ణమవుతాయి.

నట్స్‌:
బఠాణీ, బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లో గ్లూటెన్‌ ఉండదు. వీటిలో ముఖ్యమైన ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని వేగించి లేదా వీటికి కొద్దిగా మొక్కజొన్నలు కలిపి తింటే మరింత రుచిగా ఉంటాయి.

మొలకెత్తిన విత్తనాలు:
వీటిలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. బరువు పెరుగుతామనే ఆందోళన లేకుండా వీటిని తినొచ్చు. ఈ విత్తనాల్లో ప్రొటీన్లతో పాటు, జీర్ణక్రియకు ఉపకరించే పీచు ఉంటుంది. వీటితో కూరగాయ ముక్కల్ని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

తామర గింజలు
: వీటిలో కొలెస్ట్రాల్, కొవ్వులు, సోడియం వంటివి అస్సలుండవు. ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటాయి.

ఎండు బఠాణి:
ప్రొటీన్స్, కొవ్వులు, పీచుపదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఇవి తింటే బరువు తగ్గడంతో పాటు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement