Ram Kapoor: 140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా .! | Ram Kapoor Have Been Morbid Obese 140 Kilo Man For 20 Years | Sakshi
Sakshi News home page

140 కిలోల బరువుతో ఒబెసిటీతో బాధపడ్డాడు..ఇవాళ ఏకంగా 55 కిలోలు..!

Published Thu, Feb 6 2025 12:55 PM | Last Updated on Thu, Feb 6 2025 2:27 PM

Ram Kapoor Have Been Morbid Obese 140 Kilo Man For 20 Years

వెయిట్‌లాస్‌ జర్నీలో సక్సెస్‌ అవ్వడం అంత ఈజీ కాదు. కొందరు బరవు తగ్గినట్లు తగ్గి మళ్లీ యథావిధి బరువుకి వచ్చేస్తుంటారు. అందరి శరీరతత్వం ఒకలా ఉండదు. ఒకరికి సాధ్యమైనట్లు మరొకరి బాడీకి సాధ్యం కాకపోవచ్చు. అలానే ప్రయత్నం మానకుండా బరువు తగ్గాలని బలంగా అనుకున్నవారే విజయవంతమవుతారు. అలాంటి కోవకు చెందినవారే బాలీవుడ్‌ నటుడు రామ్‌ కపూర్‌. ఆయన 140 కిలోల బరువతో ఊబకాయంతో నానా ఇబ్బందులు పడ్డారు. తగ్గే ప్రయత్నం చేసిన ప్రతిసారి..తగ్గినట్లుగా అనిపించేలోపే మళ్లీ యథావిధిగా అదే బరువుకి వచ్చేసేవారు. అయినా విసుగు చెందకుండా విజయవంతంగా బరువు తగ్గి స్లమ్‌గా మారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. మరీ ఆయన ఫిట్‌నెస్‌ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందామా..!

నటుడు రామ్‌ కపూర్‌(Ram Kapoor) తన అధిక బరువు గురించి తనభార్య గౌతమి(Gautami) ఎన్నడూ ఏమి అనలేదు గానీ తన ఆరోగ్యం గురించి కలత చెందేదని అన్నారు. ఎందుకంటే.. అధిక బరువు కారణంగా ఒబెసిటీ, టైప్‌2 డయాబెటిస్‌(type 2 diabetes) వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవాడినని చెప్పారు. వాటికి చెక్‌ పెట్టాలంటే బరువు తగ్గక తప్పదని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో తన వెయిట్‌లాస్‌ జర్నీ గురించి చాలా ఆస్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. 

గత 15 ఏళ్లుగా అధిక బరువుతో నిరాటంకంగా పనిచేశాను. కానీ కనీసం ఇప్పుడైనా ఆరోగ్యం కోసం తన ఒంటిపై దృష్టి పెట్టాలని గట్టిగా అనుకున్నట్లు తెలిపారు. అందుకోసం తాను రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని అన్నారు. తాను రెండు సార్లు 30 కిలోలు వరకు తగ్గి మళ్లీ నార్మల్‌ బరువుకి తిరిగి వచ్చేసిట్లు చెప్పారు. అయితే ఎప్పుడు డైట్‌తో బరువు తగ్గుతారని అనుకోవడం సరైనది కాదని అంటున్నారు.

ఇక్కడ కేవలం మన సంకల్ప శక్తి(willpower.), సానుకూల మనస్తత్వం వల్లే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. తాను రోజుకు రెండు పూటలా భోజనం చేసేవాడినని అన్నారు. ఒకటి ఉదయం 10.30 గంటలకు, మరొకటి సాయంత్రం 6.30 గంటలకని చెప్పారు. మధ్యలో నీళ్లు, కాఫీ లేదా టీ తాగేవాడినని అన్నారు. 

అయితే సాయంత్రం మాత్రం 6.30 గంటల కల్లా భోజనం చేసేస్తానని చెప్పారు. అస్సలు అల్పాహారం తినని అన్నారు. సూర్యాస్తమయం తర్వాత అస్సలు తినని చెప్పారు. దీన్ని కరెక్ట్‌గా‌ చేసేలా మన మైండ్‌ సెట్‌ స్ట్రాంగ్‌ ఉండేలా చూడాలని చెప్పారు. డైట్‌లు, ఆహారపు అలవాట్ల కంటే..మనసుని నియంత్రించగలిగే శక్తే బరువు తగ్గడానికి అత్యంత కీలకమైనదని అన్నారు. వాటివల్ల తాను 55 కిలోల మేర బరువు తగ్గడమే కాకుండా ఆ బరువునే మెయింటైన్‌ చేయగలిగానని అన్నారు. 

నిపుణుల ఏమంటున్నారంటే..
నిపుణులు సానుకూల మనస్తత్వంతోనే బరువు తగ్గడం అనేది సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన శరీరాన్ని కాపడుకోవడానికి అంకితభావంతో కూడిన మనస్తత్వం అవసరమని చెప్పారు. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తగ్గించి ట్రాన్స్‌ఫ్యాట్‌లను నివారించాలన్నారు. ఇక్కడ వ్యాయామాన్ని శిక్షగా కాకుండా ఇష్టంతో చేయాలని చెప్పారు. ఒక్కోసారి చీట్‌ మీల్స్‌ ఉండొచ్చు. 

అయినా దాన్ని బర్న్‌ చేసేలా శారీరక శ్రమ చేయడం ముఖ్యం అని చెబుతున్నారు. మనసు మన మాట వినేలా ఎంత బలంగా చేసుకోగలిగితే అంతలా డైట్‌ని నియమబద్ధంగా ఫాలో అవ్వడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. దీంతోపాటు సరిగా నిద్రపోవడం, తగినంత నీరు తాగడం తదితర జీవనశైలి చర్యలు ఉంటే అనుకున్న రీతిలో బరువు తగ్గగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

(చదవండి: మానవ ఐవీఎఫ్‌ సాయంతో కంగారూ పిండాలు..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement