వెంట్రుకలు చిట్లుతున్నాయి.. | Hair Problems | Sakshi
Sakshi News home page

వెంట్రుకలు చిట్లుతున్నాయి..

Published Wed, Jun 4 2014 11:03 PM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

వెంట్రుకలు చిట్లుతున్నాయి..

వెంట్రుకలు చిట్లుతున్నాయి..

నా జుట్టు బాగా పొడిబారి, వెంట్రుక మధ్య నుంచి చిట్లుతోంది. వెంట్రుకల చివర్లు బాగా దెబ్బతిన్నాయి. ఇంట్లోనే చేసుకోదగిన చిట్కాలు చెప్పండి.
  - క్షేత్ర, ఇ-మెయిల్

 
శిరోజాలకు తగినంత ప్రొటీన్ అందనప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముందుగా ప్రొటీన్లు ఉన్న ఆహారంపై దృష్టిపెట్టండి. కోడిగుడ్డు, బాదంపప్పు ... వంటివి రోజూ తగు మోతాదులో తీసుకోండి. జుట్టు బాగా పొడిబారడం వల్ల చిట్లుతోందని గ్రహించండి. చిట్లిన వెంట్రుకలను కత్తిరించక అలాగే వదిలేయడం వల్ల చివర్లు పెరిగి, వెంట్రుక మధ్యలోకి విరిగినట్టుగా కనిపిస్తోంది. మీరు తల దువ్వుకోవడానికి కలపతో తయారుచేసిన వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను వాడండి. మాడు నుంచి, కింది వరకు జుట్టులో చిక్కులు లేకుండా దువ్వండి. దీని వల్ల మాడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. లోహంతో తయారైన హెయిర్ పిన్స్‌ను ఉపయోగించకుండా వెడల్పాటి రబ్బర్ బ్యాండ్స్ వాడండి. మాడుకు కాకుండా వారానికి ఒకసారి పెరుగుతో జుట్టుకు ప్యాక్ వేసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. ఈ జాగ్రత్తలు మీ శిరోజాలను ఆరోగ్యవంతంగా మారుస్తాయి.
 
నాకు ముక్కుపైన మాత్రమే మొటిమలు ఎక్కువ అవుతున్నాయి. దీని వల్ల ముక్కు ఎర్రగా కనిపిస్తుంటుంది. మొటిమల లోపల పస్ కూడా ఉంటుంది. మచ్చలు కూడా ఉన్నాయి.
 - వి.సౌమ్య, విశాఖపట్నం


మీకు ముక్కు మీద నూనె గ్రంథులు ఎక్కువ స్రవిస్తున్నాయి. శుభ్రపరుచుకోకపోవడం వల్ల మొటిమల సమస్య పెరుగుతోంది. మొటిమల్లోని పస్ తీయకండి. అలా చేస్తే మచ్చలు ఏర్పడతాయి. మార్కెట్‌లో డెర్మలాజికల్ స్పా రెమెడీ క్రీమ్ దొరుకుతుంది. ఈ క్రీమ్‌ను రోజుకు రెండుసార్లు రాయండి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement