Hair problems
-
ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్..!
కొందరికి గిరజాల జుట్టు అంటే ఇష్టంగా ఉంటుంది. నిజానికి వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్ స్టైల్‌ని మార్చేవాళ్లకు చిత్రంలోని ఈ హెడ్ బ్యాండ్ భలే చక్కగా పని చేస్తుంది. అందుకే చాలామంది కేశాలంకరణ ప్రియులు, హెయిర్ స్ట్రెయిటనర్తో పాటు హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు. ఈ కర్లర్ హీట్‌లెస్ బ్యాండ్‌ను వెంట ఉంచుకుంటే, ఎలక్ట్రిక్ కర్లర్‌తో పని ఉండదు. దాంతో జుట్టు పాడవదు. పైగా ఈ రోలర్ టూల్‌ను ఉపయోగిస్తే చక్కటి హెయిర్ స్టైల్‌తో అందంగా మెరిసిపోవచ్చు.ఈ బ్యాండ్స్ చాలా రకాలు, చాలా రంగుల్లో లభిస్తున్నాయి. ఆయా బ్యాండ్స్‌ని ఆయా పద్ధతుల్లోనే తలకు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం జుట్టును కొన్ని చిన్నచిన్న పాయలుగా విడదీసుకుని, బ్యాండ్ కిందకు వేలాడుతున్న లేసులకు ఆ పాయలను బిగించి చుట్టి, 2 లేదా 3 గంటల పాటు అలా ఉంచుకోవాలి. అనంతరం లేసుల నుంచి జుట్టును పాయలు పాయలుగా విడదీసేస్తే, జుట్టు మొత్తం కర్లీగా మారిపోతుంది. ఈ టూల్‌ని చిత్రంలో చూపిన విధంగా తల వెంట్రుకలకు బిగించుకుని ఇంటిపనులు, వంటపనులు చేసుకోవచ్చు, లేదా చక్కగా నిద్రపోవచ్చు. ఈ ఉంగరాలు తిరిగిన జుట్టు ఎక్కువ సమయం ఉండాలన్నా, ఎక్కువ రింగులు తిరగాలన్నా రాత్రి పూట తలకు ఈ బ్యాండ్ పెట్టుకుని పడుకుంటే, ఉదయం లేచేసరికి అందమైన హెయిర్ స్టైల్ మీ సొంతమవుతుంది. ఈ ప్రీమియం కర్లింగ్ మెటీరియల్ 100% సహజమైన, నాణ్యత కలిగిన స్పాంజ్‌తో రూపొందింది. ఇది ఎలాంటి ప్లాస్టిక్ వాసన రాదు. హానికరం కాదు. పైగా ఇది వాడుకోడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బ్యాండ్ కేవలం రూ.500 కంటే తక్కువ ధరలోనే ఆన్లైన్లో అందుబాటులో ఉంది. నచ్చినవాళ్లకు ఈ టూల్‌ని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. (చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్...) -
హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ చేయించుకుంటున్నారా? వైద్యులు వార్నింగ్
ఇటీవల కాలంలో రకరకాల హెయిర్ స్టైయిలిష్లు వచ్చేశాయి. అందుకోసం కొన్ని రకాల కెమికల్స్ వాడటం జరుగుతుంది. అయితే అవి కొందరికి రియాక్షన్ ఇచ్చి సమస్యలు తెచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవి అంత సీరియస్ ఇష్యూని రైజ్ చేయలేదు కానీ, హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ మాత్రం డేంజరస్ అని ఓ మహిళ విషయంలో వెల్లడయ్యింది. తాజా అధ్యయనంలో వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. పైగా దయచేసి మహిళలెవరూ ఈ హెయిర్ స్ట్రెయిటెనింగ్ చేయించుకోవద్దు, సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకని? ఏమవుతుందంటే.. సెలూన్లో హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ ట్రీట్మెంట్ కోసం వెళ్లి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఈ హెయిర్ స్ట్రైయిట్‌నింగ్ ట్రీట్మెంట్లో వాడే రసాయనం వల్ల శరీరంలోని అతి ముఖ్యమైన అవయవం పనితీరుపై ప్రభావం చూపుతుందని పరిశోధలనో తేలింది. 26 ఏళ్ల మహిళ పలు దఫాలుగా అంటే..జూన్ జూన్ 2020, ఏప్రిల్ 2021, జూలై 2022లో సెలూన్లో హెయిర్ స్ట్రయిట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకునే ముందు ఎలాంటి అనారోగ్య సమస్య ఎదుర్కొన్న చరిత్ర లేదు. ఇలా చేయించకున్న కొన్నాళ్ల తర్వాత నుంచి వాంతులు, విరేచనాలు, జ్వరం, వెన్నునొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంది. ఈ హెయిర్ స్ట్రెయిట్నింగ్ కారణంగా నెత్తిపై మంట, గడ్డలు ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత మూత్రంలో రక్తం పడటం వంటివి జరిగాయి. దీంతో వైద్యులను సంప్రదించగా ఆమె కేసుని క్షణ్ణంగా స్టడీ చేశారు. అందులో భాగంగా హెయిర్ స్ట్రెయిట్నింగ్లో వాడే క్రీమ్ గ్లైక్సిలిక్ యాసిడ్‌పై అధ్యయనం చేశారు వైద్యులు. దీని కారణంగానే ఆమె నెత్తిపై మంట, గడ్డలు ఏర్పడ్డాయని భావించారు. పైగా ఈ హెయిర్ క్రీమ్ కారణంగా ఏమైన దుష్పరిణామాలు ఉన్నాయేమోనని ఎలుకలపై ప్రయోగం చేశారు. ఆ పరిశోధనలో ఆ యాసిడ్ చర్మం ద్వారా మూత్రపిండాలకు చేరి, దాని పనితీరుపై ప్రభావం చూపిస్తున్నట్లు గుర్తించారు. ఈ రసాయనం కారణంగానే బాధిత మహిళ మూత్రపిండ నాళికలలో కాల్షియం ఆక్సలేట్ స్పటికాలు పేరుకుపోయి మాత్రపిండాల పనితీరు దెబ్బతినేందుకు దారితీసిందిన తేలింది. ప్రస్తుతం సదరు మహిళ తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ అధ్యయనం ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ ప్రచురితమయ్యింది. వైద్యులు తమ పరిశోధనలో జుట్టుని నిటారుగా చేయడంలో గ్లైక్సిలిక్ యాసిడ్ బాధ్యత వహిస్తుందని, ఐతే ఇది ఆరోగ్యానికి ఎట్టిపరిస్థితుల్లోనూ సురక్షితం కాదని తేలింది. అందువల్ల దయచేసి హెయిర్‌కి సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్‌లలో ఈ గ్లైక్సిలిక్ యాసిడ్ వాడకాన్ని నిషేదించాలని తయారీదారులను కోరుతున్నారు ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జాషువా డేవిడ్ కింగ్ లైవ్. ఈ టెక్రిక్ని 1890ల నుంచి ఉపయోగిస్తున్నారు. కురులకు సొగసైన రూపు ఇచ్చేలా స్ట్రైయిట్‌నింగ్ చేయడం కారణంగా అనారోగ్య సమస్యలు బారిన పడే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: వయసుని తగ్గించుకోవడంలో సక్సెస్ అయిన బ్రియాన్ జాన్సన్! ఏకంగా..) -
ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా? ఆ తప్పు అస్సలు చేయకండి
శీతాకాలంలో చర్మ సమస్యలు సాధారణం. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కాలంలో చర్మానికే కాదు.. జుట్టుకూ సమస్యల చిక్కులు తప్పవు. ముఖ్యంగా చలికాలంలో జుట్టు రాలిపోవడం కాస్త ఎక్కువగానే ఉంటుంది. శీతాకాలంలో శిరోజాలను సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... తదితర విషయాలు తెలుసుకుందాం... శీతాకాలంలో ఉండే చల్లగాలుల వల్ల శరీరంలోనే కాదు, శిరోజాల్లో కూడా తేమ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా జుట్టంతా అట్టకట్టినట్లు పొడిగా తయారవుతుంది. అంతే కాదు, కుదుళ్ళు బలహీనపడి జుట్టు రాలిపోయే సమస్య అధికం అవుతుంది కాబట్టి చలి బారి నుంచి శిరోజాలను కూడా సంరక్షించుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం. తరచూ తలస్నానం శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా చేయకూడదు. వారానికి రెండుసార్లు చేస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువసార్లు చేయడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. వేడినీటి స్నానం శీతాకాలంలో స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి. వేడి నీటి స్నానం వల్ల చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి కురులు పొడిగా... నిర్జీవంగా మారిపోతాయి. హెయిర్ డ్రయ్యర్స్ శీతాకాలంలో జుట్టుకు ఉపయోగించే డ్రయర్స్, కర్లర్స్స్ట్రెయిటనర్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. టవల్‌తో తుడుచుకుని ఆరబెట్టుకునే విధానానికే పరిమితం కావాలి. కండీషనింగ్ తలస్నానానికి ముందు జుట్టుకు కండీషనర్ తప్పకుండా అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా ఉంటాయి. హెయిర్ ఆయిల్ చలికాలంలో శిరోజాలకు తరచు నూనె పెడితే మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి ఉపకరిస్తుంది. అలాగే దువ్వుకోవడానికి సన్న పళ్ల దువ్వెన కాకుండా పళ్లు కాస్త దూరంగా... వెడల్పుగా ఉన్న దువ్వెన వాడటం మంచిది. అట్ట కట్టినట్టు ఉంటే : చలిగాలులకు జుట్టు అట్టకట్టినట్లుగా కాకుండా ఉండాలంటే రోజూ రాత్రిళ్లు విటమిన్ ఇ ఉన్న నూనెను రాసుకోవాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కురులను కవర్ చేసేలా స్కార్ఫ్, టోపీ వంటివి ధరించాలి. కుదరని పక్షంలో బాడీలోషన్ కొద్దిగా తీసుకుని చేతులకు రుద్దుకోవాలి. తర్వాత ఆ చేతులతో జుట్టును మెల్లగా దువ్వుతున్నట్లు సవరించుకోవాలి. ఇలా చేయడం వల్ల పెళుసుదనం పోయి, శిరోజాలు ప్రకాశవంతంగా మారుతాయి. ఈ జాగ్రత్తలతో ఈ కాలంలోనూ కురులు నిగనిగలాడతాయి. -
అలోవెరా జెల్‌తో ఇలా చేస్తే..అందమైన కురులు మీ సొంతం!
వర్షాకాలంలో జుట్టు డల్‌గా ఉంటుంది. దీనికి తోడు వర్షంలో అప్పడప్పుడూ తడవడంతో చుండ్రు, చిట్లడం, రఫ్‌గా తయారవ్వడం వంటి సమస్యలు ఎదరువ్వతాయి. ఈ సమస్యల నుంచి మీ శిరోజాలను కాపాడుకోవాలంటే ఈ జ్రాగత్తలు తీసుకోవాల్సిందే. మనం నిత్యం చూసే, అందుబాటులో ఉండే వాటితో ఈజీ జుట్టు సమస్యల నుంచి బయటపడొచ్చు. వర్షాకాలం శిరోజాల సౌందర్యం కాపాడుకోవాలంటే.. ►తలస్నానం చేయడానికి రెండు గంటల ముందు గోరువెచ్చని నూనె వెంట్రుకు కుదుళ్లకు పట్టించి, మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల కురులు మృదుత్వాన్ని కోల్పోవు. ►తలస్నానం చేసిన తర్వాత అలోవెరా జెల్ రాసుకొని, పది నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలొవెరా జెల్లో ఉండే ఔషధ గుణాలు చుండ్రును, వెంట్రుకలు చిట్లడాన్ని నివారిస్తాయి. దీంతో పాటు శిరోజాలలో ఉండే బాక్టీరియా, మాడుపై దురద.. వంటి సమస్యలను నివారిస్తాయి. వెంట్రుకలు పెరగడానికి కూడా దోహదం చేస్తాయి. ►తలస్నానానికి రసాయన గాఢత తక్కువగా ఉన్న షాంపూలనే వాడాలి. ►తీసుకునే ఆహారంలో ప్రొటీన్ల శాతం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. సోయాబీన్, గుడ్లు, కొవ్వు తక్కువగా ఉండే ఛీజ్, బీన్స్.. వంటివి ఉండేలా జాగ్రత్తపడాలి. ►తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో చేసిన సలాడ్స్ ఈ కాలం తీసుకోవడం చాలా అవసరం. అలాగే మొలకెత్తిన గింజలను సలాడ్ రూపంలో తీసుకోవాలి. ఆహారంలో ఈ తరహా పదార్థాలు చేర్చడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అంది జుట్టు రాలడం తగ్గుతుంది. ►కాఫీ, టీ లలో ఉండే కెఫిన్ వెంట్రుకలు రాలడానికి దోహదం చేస్తుంది. కాఫీ, టీలకు బదులుగా పండ్లరసాలు, పాలు, హెర్బల్ టీ... వంటి కెఫెన్ లేని ద్రవపదార్థాలను తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలో ఎదురయ్యే శిరోజాల సమస్యల నుంచి సులభంగా బయటపడోచ్చు. చిట్కాల తోపాటు పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. (చదవండి: వానాకాలం..వ్యాధులు ప్రబలే కాలం..మీ పిల్లలు జరభద్రం!) -
చుండ్రు నిమిషాల్లో మాయం
-
జుట్టు రాలుతోందా? సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..
వేసవిలో జుట్టు సమస్యలు రావడం సర్వసాధారణమైపోయింది. జుట్టు సమస్యలతో బాధపడేవారు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా జుట్టు చిట్లిపోవడం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా చాలామందిలో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం ΄పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సాధనాలను, కాస్మెటిక్ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయినా, సరైన ఫలితాలను పొందలేకపోతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం, కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం ద్వారా కూడా జుట్టు రాలకుండా చూసుకోవచ్చు. ►ఎక్కువ చక్కెర కలిగిన ఆహారాలు తినడం వల్ల తీవ్ర చర్మ సమస్యలతో పాటు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు చక్కెర గల ఆహారాలు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది. ►జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల జట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు జంక్ ఫుడ్స్‌కు దూరంగా ఉండడం చాలా మంచిది. ►ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోవడం వల్ల వాటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా జుట్టుకు కూడా హాని కలిగిస్తుంది. కాబట్టి ఇప్పటికే జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడేవారు ఆహారంలో పచ్చి గుడ్లను తీసుకోకపోవడం ఉత్తమం. ►ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం మొదలవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే హానికరమైన విషపదార్థాలు తీవ్ర జుట్టు సమస్యలకు దారి తీస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి కాబట్టి జుట్టును కా΄ాడుకోవాలనుకునేవారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మేలు. ►తేనె, పెరుగు హెయిర్ మాస్క్‌తో సులభంగా ఉపశమనం లభిస్తుంది: ►ప్రస్తుతం చాలామందిలో జుట్టు చివరి భాగాల్లో చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. వీటినే స్పి›్లట్ ఎండ్స్ అంటారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తేనె, పెరుగు హెయిర్ మాస్క్ వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ మాస్క్‌ను ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరకప్పు పెరుగు, 6 చెంచాల తేనె వేసి రెండూ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేళ్లతో తీసుకుని జుట్టు కుదుళ్లకు పట్టేలా రాసుకుని మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తర్వాత ఒక గంట΄ాటు అలా వదిలేయాలి. బాగా ఆరిన తర్వాత జుట్టును తక్కువ గాఢత గల షాంపూతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. వేసవిలో జుట్టు రాలడానికి సాధారణ కారణాలు ►అధిక ఉష్ణోగ్రత, సూర్యరశ్మికి గురికావడం వల్ల జుట్టు చిట్లడం, పల్చబడడం జరుగుతుంది. ►స్విమ్మింగ్ వల్ల కూడా జుట్టు రాలుతుంది. ఎందుకంటే పూల్ నీటిలో ఉండే క్లోరిన్ జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపి జుట్టు రాలేలా చేస్తుంది. ►వేసవిలో చెమట వల్ల జుట్టు రాలడం అనేది సర్వసాధారణం. ►వేడి వాతావరణం చుండ్రును తీవ్రతరం చేస్తుందని అంటారు, దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే, తాత్కాలికంగా జుట్టు రాలిపోతుంది. అలోవెరా జెల్ అలోవెరా జెల్‌ను జుట్టు మీద అప్లై చేయడం చాలా మంచిది. దానివల్ల జుట్టు మెరవడంతోబాటు మృదువుగా కూడా మారుతుంది. అంతేకాదు, చుండ్రు లేదా జుట్టు రాలడానికి కారణమయ్యే ఇతర ఫంగల్ ఇన్ఫెక్షన్తో పోరాడుతుంది. అలోవెరా జ్యూస్ తాగడం వల్ల జుట్టు లోపలి భాగంలో బలపడుతుంది. కొబ్బరి పాలతో మసాజ్ జుట్టు రాలడానికి శీఘ్ర రెమెడీ కొబ్బరి ΄ాలతో తలకు సున్నితంగా మసాజ్ చేయడం. ఆ తర్వాత తలకు వెచ్చని టవల్ చుట్టడం. రెగ్యులర్ హెయిర్ వాష్, కండిషనింగ్‌తో ఈ చిట్కాను అనుసరించడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య అదుపులోకి వస్తుంది. -
చుండ్రు సమస్యకు 2 చిట్కాలు! సింపుల్‌గా వదిలించేద్దాం
► అరకప్పు మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం నీళ్లు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. ► దీనిలో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. ► అరగంట తరువాత సాధారణ షాంపుతో తలస్నానం చేయాలి. ► అరకప్పు నానిన మెంతులను పేస్టులా రుబ్బుకోవాలి. ► దానికి, పావు కప్పు అలోవెరా పేస్టు కలిపి కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. చదవండి👉🏻 పొడి చర్మానికి తక్షణ నిగారింపు కోసం ఇలా చేయండి.. ► అరగంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి . ► ఈ రెండు ప్యాక్‌లలో ఏదైనా ఒకదానిని వారానికి రెండుసార్లు తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు తగ్గుముఖం పడుతుంది. దురద కూడా తగ్గుతుంది. చదవండి👉🏼 పైనాపిల్ – బత్తాయి.. పోషకాల జ్యూస్! -
జుట్టు రాలుతుందా? అయితే ఇది ట్రై చేయండి
ఈ మధ్యకాలంలో జట్టు రాలడం సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనూ జుట్టు తెల్లబడటం, ఎక్కువగా రాలిపోవడం, దురద, చుండ్రు లాంటి అనేక సమస్యలకు పెరుగు చాలా చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వేలకు వేలు పోసి జుట్టుపై కెమికల్స్ ప్రయోగించినా ఎలాంటి ఫలితం ఉండకపోగా దీర్ఘకాలిక సమస్యలు, సైడ్ ఎఫెక్స్ వస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పెరుగులోని ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. పాల నుంచి తయారయ్యే పెరుగులో ఉండే జింక్, బయోటిన్ గుణాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. (సరస్సులో సినిమా) మన శరీర దృఢత్వానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరగడానికి అంతే పోషకాలు అవసరం. పెరుగులో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ గుణాలు కుదుళ్లను బలపరిచి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. జుట్టులో పేరుకుపోయిన బాక్టీరియాను దూరం చేసి తేమగా, మృదువుగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా తలస్నానం చేశాక జుట్టుకు కండీషనింగ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే కుదుళ్లు చిట్లిపోయి జుట్టు రాలుతుంది. దీనికి పెరుగు చక్కటి పరిష్కారం. పెరుగు గొప్ప కండీషనర్‌గా పని చేస్తుంది. దీంతో మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం వీకెండ్స్‌లో పార్లర్లు, స్పాలకు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే దొరికే పెరుగుతో హెయిర్ ప్యాక్ ప్రయత్నించి ఆరోగమైన కురులకు వెల్కమ్ చెప్పేయండి. (‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’) -
వెంట్రుకలు చిట్లుతున్నాయి..
నా జుట్టు బాగా పొడిబారి, వెంట్రుక మధ్య నుంచి చిట్లుతోంది. వెంట్రుకల చివర్లు బాగా దెబ్బతిన్నాయి. ఇంట్లోనే చేసుకోదగిన చిట్కాలు చెప్పండి. - క్షేత్ర, ఇ-మెయిల్ శిరోజాలకు తగినంత ప్రొటీన్ అందనప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముందుగా ప్రొటీన్లు ఉన్న ఆహారంపై దృష్టిపెట్టండి. కోడిగుడ్డు, బాదంపప్పు ... వంటివి రోజూ తగు మోతాదులో తీసుకోండి. జుట్టు బాగా పొడిబారడం వల్ల చిట్లుతోందని గ్రహించండి. చిట్లిన వెంట్రుకలను కత్తిరించక అలాగే వదిలేయడం వల్ల చివర్లు పెరిగి, వెంట్రుక మధ్యలోకి విరిగినట్టుగా కనిపిస్తోంది. మీరు తల దువ్వుకోవడానికి కలపతో తయారుచేసిన వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను వాడండి. మాడు నుంచి, కింది వరకు జుట్టులో చిక్కులు లేకుండా దువ్వండి. దీని వల్ల మాడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. లోహంతో తయారైన హెయిర్ పిన్స్‌ను ఉపయోగించకుండా వెడల్పాటి రబ్బర్ బ్యాండ్స్ వాడండి. మాడుకు కాకుండా వారానికి ఒకసారి పెరుగుతో జుట్టుకు ప్యాక్ వేసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. ఈ జాగ్రత్తలు మీ శిరోజాలను ఆరోగ్యవంతంగా మారుస్తాయి. నాకు ముక్కుపైన మాత్రమే మొటిమలు ఎక్కువ అవుతున్నాయి. దీని వల్ల ముక్కు ఎర్రగా కనిపిస్తుంటుంది. మొటిమల లోపల పస్ కూడా ఉంటుంది. మచ్చలు కూడా ఉన్నాయి. - వి.సౌమ్య, విశాఖపట్నం మీకు ముక్కు మీద నూనె గ్రంథులు ఎక్కువ స్రవిస్తున్నాయి. శుభ్రపరుచుకోకపోవడం వల్ల మొటిమల సమస్య పెరుగుతోంది. మొటిమల్లోని పస్ తీయకండి. అలా చేస్తే మచ్చలు ఏర్పడతాయి. మార్కెట్లో డెర్మలాజికల్ స్పా రెమెడీ క్రీమ్ దొరుకుతుంది. ఈ క్రీమ్‌ను రోజుకు రెండుసార్లు రాయండి.