ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్‌..! | Hairstyle Product: The Best Heatless Curlers Headbands | Sakshi
Sakshi News home page

ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్‌..!

Published Sun, Nov 24 2024 12:53 PM | Last Updated on Sun, Nov 24 2024 1:29 PM

 Hairstyle Product: The Best Heatless Curlers Headbands

కొందరికి గిరజాల జుట్టు అంటే ఇష్టంగా ఉంటుంది. నిజానికి వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్‌ స్టైల్‌ని మార్చేవాళ్లకు చిత్రంలోని ఈ హెడ్‌ బ్యాండ్‌ భలే చక్కగా పని చేస్తుంది. అందుకే చాలామంది కేశాలంకరణ ప్రియులు, హెయిర్‌ స్ట్రెయిటనర్‌తో పాటు హెయిర్‌ కర్లర్‌ వాడుతూ ఉంటారు. ఈ కర్లర్‌ హీట్‌లెస్‌ బ్యాండ్‌ను వెంట ఉంచుకుంటే, ఎలక్ట్రిక్‌ కర్లర్‌తో పని ఉండదు. దాంతో జుట్టు పాడవదు. పైగా ఈ రోలర్‌ టూల్‌ను ఉపయోగిస్తే చక్కటి హెయిర్‌ స్టైల్‌తో అందంగా మెరిసిపోవచ్చు.

ఈ బ్యాండ్స్‌ చాలా రకాలు, చాలా రంగుల్లో లభిస్తున్నాయి. ఆయా బ్యాండ్స్‌ని ఆయా పద్ధతుల్లోనే తలకు అటాచ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం జుట్టును కొన్ని చిన్నచిన్న పాయలుగా విడదీసుకుని, బ్యాండ్‌ కిందకు వేలాడుతున్న లేసులకు ఆ పాయలను బిగించి చుట్టి, 2 లేదా 3 గంటల పాటు అలా ఉంచుకోవాలి. అనంతరం లేసుల నుంచి జుట్టును పాయలు పాయలుగా విడదీసేస్తే, జుట్టు మొత్తం కర్లీగా మారిపోతుంది. ఈ టూల్‌ని చిత్రంలో చూపిన విధంగా తల వెంట్రుకలకు బిగించుకుని ఇంటిపనులు, వంటపనులు చేసుకోవచ్చు, లేదా చక్కగా నిద్రపోవచ్చు. 

ఈ ఉంగరాలు తిరిగిన జుట్టు ఎక్కువ సమయం ఉండాలన్నా, ఎక్కువ రింగులు తిరగాలన్నా రాత్రి పూట తలకు ఈ బ్యాండ్‌ పెట్టుకుని పడుకుంటే, ఉదయం లేచేసరికి అందమైన హెయిర్‌ స్టైల్‌ మీ సొంతమవుతుంది. ఈ ప్రీమియం కర్లింగ్‌ మెటీరియల్‌ 100% సహజమైన, నాణ్యత కలిగిన స్పాంజ్‌తో రూపొందింది. ఇది ఎలాంటి ప్లాస్టిక్‌ వాసన రాదు. హానికరం కాదు. పైగా ఇది వాడుకోడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బ్యాండ్‌ కేవలం రూ.500 కంటే తక్కువ ధరలోనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. నచ్చినవాళ్లకు ఈ టూల్‌ని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. 

(చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్‌...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement