
ఈ మధ్యకాలంలో జట్టు రాలడం సర్వసాధారణమైంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనూ జుట్టు తెల్లబడటం, ఎక్కువగా రాలిపోవడం, దురద, చుండ్రు లాంటి అనేక సమస్యలకు పెరుగు చాలా చక్కటి పరిష్కారం అంటున్నారు నిపుణులు. వేలకు వేలు పోసి జుట్టుపై కెమికల్స్ ప్రయోగించినా ఎలాంటి ఫలితం ఉండకపోగా దీర్ఘకాలిక సమస్యలు, సైడ్ ఎఫెక్స్ వస్తుంటాయి. వీటన్నింటికి చెక్ పెడుతూ అందరికి అందుబాటులో ఉండే పెరుగుతోనే మీ కురుల సమస్యలను పరిష్కరించుకోవచ్చు. పెరుగులోని ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. పాల నుంచి తయారయ్యే పెరుగులో ఉండే జింక్, బయోటిన్ గుణాలు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తాయి. (సరస్సులో సినిమా)
మన శరీర దృఢత్వానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో జుట్టు కూడా ఆరోగ్యంగా పెరగడానికి అంతే పోషకాలు అవసరం. పెరుగులో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని లాక్టిక్ యాసిడ్ గుణాలు కుదుళ్లను బలపరిచి వెంట్రుకలు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. జుట్టులో పేరుకుపోయిన బాక్టీరియాను దూరం చేసి తేమగా, మృదువుగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా తలస్నానం చేశాక జుట్టుకు కండీషనింగ్ చేయడం చాలా ముఖ్యం. లేదంటే కుదుళ్లు చిట్లిపోయి జుట్టు రాలుతుంది. దీనికి పెరుగు చక్కటి పరిష్కారం. పెరుగు గొప్ప కండీషనర్‌గా పని చేస్తుంది. దీంతో మీ జుట్టు పట్టుకుచ్చులా మెరవడం ఖాయం. మరి ఇంకెందుకు ఆలస్యం వీకెండ్స్‌లో పార్లర్లు, స్పాలకు వెళ్లకుండా కేవలం ఇంట్లోనే దొరికే పెరుగుతో హెయిర్ ప్యాక్ ప్రయత్నించి ఆరోగమైన కురులకు వెల్‌కమ్ చెప్పేయండి. (‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’)