పచ్చిబఠానీలతో ప్రయోజనాలు | Amazing Health Benefits Of Green Peas And Its Nutritional Facts In Telugu | Sakshi
Sakshi News home page

Green Peas Health Benefits: పచ్చిబఠానీలతో ప్రయోజనాలు

Published Sat, Jun 22 2024 10:28 AM | Last Updated on Sat, Jun 22 2024 11:31 AM

Health Benefits Of Green Peas

పచ్చి బఠానీలు ఆహారానికి రుచిని ఇస్తాయి. ఆరోగ్యాన్ని పెంచుతాయి. పచ్చి బఠానీల తింటుంటే కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. బఠానీలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి, దీనివల్ల గుండె΄ోటు, రక్త΄ోటు వంటి వ్యాధులను నివారించవచ్చు. పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల షుగర్‌ లెవెల్‌ కూడా అదుపులో ఉంటుంది.
 
బఠానీలలో ప్రోటీన్, ఫైబర్‌ అధికంగా ఉంటాయి, దీని కారణంగా ఆకలి తగ్గుతుంది. ఇది జింక్, రాగి, మాంగనీస్, ఇనుము కలిగి ఉంటుంది. దానివల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల క్యాన్సర్‌ రిస్క్‌ తగ్గుతుంది. ముఖ్యంగా కడుపు క్యాన్సర్‌ నిరోధిస్తాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు, వృద్ధాప్య ప్రభావం త్వరగా కనిపించదు.
 
పచ్చి బఠానీలో ప్రోటీన్తో పాటు ఉండే విటమిన్‌ కె బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. పచ్చి బఠానీలను తినడం జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది. గర్భిణులకు పచ్చి బఠానీలు మేలు చేస్తాయి. ఇది గర్భస్థ శిశువుకు తగిన ΄ోషణను కూడా అందిస్తుంది. ఇంకా ఇవి రుతుక్రమ సమస్యలలో కూడా సాయం చేస్తాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement