open university
-
కష్టపడి చదివి.. ఎస్సై పోస్టుకు ఎంపికై ..
కందుకూరు రూరల్: ఆ యువకుడి తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. తల్లి కష్టపడి చదివించింది. అతను ఇటీవల విడుదలైన ఎస్సై ఫలితాల్లో 398వ ర్యాంక్ సాధించాడు. వివరాలిలా ఉన్నాయి. వలేటివారిపాళెం మండలం పోలినేనివారిపాళెం గ్రామానికి చెందిన నేలకూరి వెంకటేశ్వర్లు, సుశీల కుమారుడు ఏడుకొండలు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 8 నుంచి 10 వరకు కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో అభ్యసించాడు. ఇంటర్మీడియట్ టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, టీటీసీ సింగరాయకొండ పీఎన్‌సీఏలో పూర్తి చేశాడు. ఉపాధ్యాయ పోస్ట్ సాధించాలని కోచింగ్ తీసుకొని రెండుసార్లు డీఎస్సీలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం దక్కలేదు. అనంతరం ఆర్థిక పరిస్థితులతో చదువు కొనసాగించలేక, ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తూనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి చిన్నతనంలోనే మరణించడంతో బాధ్యతంతా తల్లి మీదే పడింది. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఎస్సై పోస్టుకు దరఖాస్తు చేసుకుని కాకినాడలో కోచింగ్‌కు వెళ్లాడు. తల్లి ప్రతి నెలా కోచింగ్, మెస్ ఫీజులకు నగదు పంపేది. ఏడుకొండలు పరిస్థితిని గమనించి గ్రామానికి చెందిన అనుమోలు రవీంద్ర, మాదాల లక్ష్మీనరసింహం ఆర్థిక సాయం అందించి భరోసానిచ్చారు. చదువే ఆయుధం కష్టాలు ఉన్నాయని కుంగిపోతే చదువుకోలేం. ఇష్టపడి చదవాలి. తల్లి రెక్కల కష్టం నాకు తెలిసొచ్చింది. అందుకే పట్టుదలతో చదివి ఎస్సై పోస్టు సాధించాను. పేదలకు చదువే ఆయుధం. – నేలకూరి ఏడుకొండలు -
అంతా ‘ఓపెన్’.. చూస్కో, రాస్కో
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షను అభ్యాసకులు ఎంచక్కా పుస్తకాలు, నోట్స్‌లను చూస్తూ రాశారు. మంగళవారం కారేపల్లిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో పలువురి చూచిరాతలపై సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా..మంగళవారం 20 మంది హాజరయ్యారు. సెల్‌ఫోన్, పుస్తకాలు దగ్గరపెట్టుకొని మరీ రాశారు. ఇన్విజిలేటర్లు సైతం చూసి చూడనట్లు వ్యవహరించారు. వారే దగ్గరుండి రాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (చదవండి: ఏం ఫ్యామిలీరా బాబూ..! భార్య ఇంట్లోకి వెళ్లి సర్దేస్తుంది.. అనంతరం కూతురితో కలిసి..) -
జులై 17న దూరవిద్య పీజీ పరీక్షలు ప్రారంభం
కల్లూరు (రూరల్): సిల్వర్ జూబ్లీ కళాశాలలోని అంబేడ్కర్ రీజనల్ సెంటర్లో దూర విద్య సప్లిమెంటరీ పరీక్షలు జులై 17నుంచి ప్రారంభమవుతాయని కేంద్ర సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.అజంతకుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్ష ఫీజు ఏపీ ఆన్లైన్లో చెల్లించడానికి ఈ నెల 28న ఆఖరని, ప్రతి పరీక్షకు రూ.150 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పీజీ మొదటి సంవత్సరం జులై 17 నుంచి 22వరకు, ద్వితీయ సంవత్సరం 24 నుంచి 29 వరకు, ఎంబీఏ మూడవ సంవత్సరం 31 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరవ్వాలని, ఇతర వివరాలకు అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. -
ఏప్రిల్ 25 నుంచి దూరవిద్య పరీక్షలు
కర్నూలు (ఆర్యూ) : అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటి దూర విద్య వార్షిక పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి నిర్వహిస్తునట్లు కర్నూలు రీజనల్ సెంటర్ సహాయ సంచాలకులు డా.ఎం.అజంతకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫీజు కింద ప్రతి పేపర్‌కు రూ.100 ప్రకారం ఏప్రిల్ 1వ తేదీలోగా ఏపీ ఆన్లైన్లో చెల్లించాలన్నారు. మూడవ సంవత్సరం రెగ్యులర్ సప్లిమెంటరీ పరీక్షలు ఏప్రిల్ 25 నుంచి 30వ తేదీ వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మే నెల 2 నుంచి 7వ తేదీ వరకు, మొదటి సంవత్సర పరీక్షలు మే నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. వివరాలకు బీ.క్యాంపు సిల్వర్ జూబ్లీ కళాశాలలోని స్టడీ సెంటర్లో సంప్రదించాలన్నారు. -
ఓపెన్ యూనివర్సిటీ తరగతులు రద్దు
అనంతపురం ఎడ్యుకేషన్ : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం ఆర్ట్స్ కళాశాల అధ్యయన కేంద్రంలో ఈనెల 6న తరగతులు రద్దు చేసినట్లు కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోజు కానిస్టేబుల్ నియామక పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఓపెన్ యూనివర్సిటీ తరగతులు రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి తరగతులు షెడ్యూలు ప్రకారం జరుగుతాయన్నారు. -
‘జవాబు’దారీతనం ఏదీ?
→ మూల్యాంకన నిబంధనలకు తిలోదకాలు → ఆలస్యం కానున్న దూరవిద్య పీజీ కోర్సుల ఫలితం ఎస్కేయూ : శ్రీకష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య పీజీ కోర్సులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనంలో ఆ విభాగం అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. పరీక్ష నిర్వహణ, మూల్యాంకన ప్రక్రియ, ఫలితాలు ప్రకటనలో కచ్చితంగా విధానాలు అనుసరించాల్సి ఉంది. కానీ వీటినన్నింటినీ పక్కనబెట్టి నిబంధనలకు విరుద్ధంగా మూల్యాంకనం చేపట్టారు. దూరవిద్య పీజీ మొదటి సంవత్సరం 13 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఒక్కో విద్యార్థి కోర్సుకు సంబంధించి ఐదు టైటిల్స్ రాశారు. అంటే 65 వేలు జవాబు పత్రాలు మూల్యాంకనం చేయించారు. ప్రైవేటు అధ్యాపకులతో.. వాస్తవానికి పీజీ జవాబు పత్రాలు రెండు దఫాలుగా మూల్యాంకనం చేయించాలి. ఇంటర్నల్ (వర్సిటీ ఆచార్యులు, అధ్యాపకులు) ఎక్స్టర్నల్ (బీఓఎస్ గుర్తించిన) అధ్యాపకులతో మూల్యాంకనం నిర్వహించాల్సి ఉంది. పీజీ కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం జవాబు పత్రాల ఎక్స్టర్నల్ మూల్యాంకనం బోర్డ్ ఆఫ్ స్టడీస్ సూచించిన శాశ్వత అధ్యాపకులతో మూల్యాంకనం చేయించాలని నిబంధనలు ఉన్నాయి. వీటిని పక్కనపెట్టి ప్రైవేటు డిగ్రీ కళాశాల అధ్యాపకులతో పీజీ జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఎక్స్టర్నల్ మూల్యాంకనం అయిన తరువాత ఇంటర్నల్ మూల్యాంకనం కోసం జవాబు పత్రాలు వర్సిటీ ప్రొఫెసర్ల వద్దకు పంపారు. అనర్హులైన వారితో మూల్యాంకనం చేయించారని ప్రొఫెసర్లు నిర్ధారించి ఇంటర్నల్ మూల్యాంకనం చేయమని కరాఖండిగా స్పష్టం చేస్తున్నారు. దీంతో నిబంధనల అతిక్రమణ బహిర్గతమైంది. ఫలితాలు ప్రకటన ఎలా ? పీజీకి సంబంధించి ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మూల్యాంకనాలు నిర్వహిస్తేనే ఫలితాలు ప్రకటించడానికి సాధ్యమవుతుంది. ఎక్స్టర్నల్ మూల్యాంకనంలో తప్పిదాలు చోటు చేసుకోవడంతో ఇంటర్నల్ మూల్యాంకనానికి చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో ఫలితాలు ప్రకటన ఆలస్యం కానున్నట్లు తెలిసింది. -
ఇగ్నో కోర్సులకు ప్రవేశాలు ప్రారంభం
ఎంవీపీకాలనీ : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో పలు కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభించినట్టు ప్రాంతీయ చాలకులు డాక్టర్ ఎస్.రాజారావు తెలిపారు. ఉషోదయా కూడలి వద్ద ఉన్న ఇగ్నో ప్రాంతీయ కేంద్రంలో మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల పరిధి విశాఖ కేంద్రంగా 2011లో ప్రారంభమైన ఇగ్నోకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 32 అధ్యయన కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది కొత్తగా ఇంటర్ అర్హత కలిగిన విద్యార్థులకు డిప్లొమా ఇన్ అక్వాకల్చర్, డిప్లొమా ఇన్ డెయిరీ వంటి కోర్సులు ప్రవేశపెట్టినట్టు తెలిపారు. అక్వాకల్చర్ కోర్సు ఆంగ్లమాధ్యమంలో ఉంటుందన్నారు. ప్రవేశ రుసుము రూ. 6500. కాగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రాయితీ ఉందన్నారు. డిప్లొమా ఇన్ డెయిరీ కోర్సును తెలుగు మాధ్యమంలో ప్రవేశపెడుతున్నామన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఫీజులో 50 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. అదేవిధంగా పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా కోర్సులలో చేరగోరు అభ్యర్థులకు ఆగస్టు 17 చివరి తేదీ కాగా, ఆగష్టు 31వ వరకు రూ. 300 అపరాధ రుసుముతో ప్రవేశాలు పొందవచ్చన్నారు. ఇగ్నో సహాయ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ డి.ఆనంద్ మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి సీఏ అభ్యర్థులకు సీపీటీ ప్రవేశపరీక్ష ద్వారా బీకాం కోర్సు అందిస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తులను ఉషోదయా కూడలిలోని ఇగ్నో ప్రాంతీయ కేంద్రం లేదా ఇగ్నో అధ్యయన కేంద్రాల్లో రూ. 200 చెల్లించి ప్రాస్పెక్టస్ పొందవచ్చునని తెలిపారు. మరిన్ని వివరాలకు 0891–2511200– 300– 400 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. సమావేశంలో ఇగ్నో సహాయ రిజిస్ట్రార్ లక్ష్మిపతిరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
న్యాయం చేయండి
ఆర్మూర్: సమాధాన పత్రాలు చింపివేయడంతో తాము ఫెయిల్ అయ్యామని, తమకు న్యాయం చేయాలని పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుతున్న 15 మంది డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. జూన్‌లో ఎంపీసీ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసిన 15 మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేసి యూనివర్సిటీకి పంపించిన విషయాన్ని గురువారం ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జవాబు పత్రాలు చింపివేయబడ్డ 15 మంది విద్యార్థులు టెట్–1 క్వాలిఫై అయినవారే కావడం గమనార్హం. సమాధాన పత్రాలు చింపి వేయడంతో తాము ఫెయిల్ అయినట్లు తెలుసుకున్న విద్యార్థులు రెండు రోజులుగా స్టడీ సెంటర్, యూనివర్సిటీ చుట్టూ తిరుగుతున్నారు. బాధితులకు పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం నాయకులు అండగా నిలిచారు. గురువారం అంబేద్కర్ వర్సిటీ ఆర్మూర్ స్టడీ సెంటర్లో సెంటర్ కోఆర్డినేటర్ రాజ, క్లర్క్ శ్యాం, అటెండర్ రూపేశ్‌తో వాగ్వాదానికి దిగారు. ఆర్మూర్ సెంటర్లోనే సమాధాన పత్రాలు చినిగి వచ్చాయని వర్సిటీ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు పేర్కొన్నారు. సమాధాన పత్రాలను భద్రపరిచిన క్లర్క్ శ్యాం, హాల్ టికెట్టు నంబర్లు సేకరించిన అటెండర్లపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేశారు. పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి కారణం చెప్పకుండానే అటెండర్ రూపేశ్ తమ హాల్ టికెట్ నెంబర్లు ఎందుకు నోట్ చేసుకున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులను రీవాల్యూయేషన్‌లో పాస్ చేయిస్తానంటూ క్లర్క్ శ్యాం చెప్పేవాడని ఆరోపించారు. ఈ సంఘటనపై కలెక్టర్ యోగితారాణాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో ధర్నా.. సమాధాన పత్రాలను చింపివేయడంతో విద్యా సంవత్సరం వృథా అవుతున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ చంద్రన్న వర్గం నాయకులు డిగ్రీ కళాశాల ఎదుట ధర్నా చేశారు. అనంతరం వైస్ ప్రిన్సిపాల్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ రాజకు వినతి పత్రం సమర్పించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో పీడీఎస్‌యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు స్వామి, రమాకాంత్, చందు, దినేశ్ తదితరులున్నారు. -
ఉందిలే చదివే కాలం..
ఓపెన్ స్కూల్ పది, ఇంటర్లలో ప్రవేశానికి అవకాశం సెప్టెంబరు 19 వరకు గడువు రాయవరం : అనుకోని అవాంతరాలు, ఆర్థిక ఇబ్బందులతో చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసిన వారు.. వివాహమైన తర్వాత.. పెద్దవయసు వచ్చేసిన తర్వాత చదువుకోలేకపోయామే అని దిగులు పడేవారు అనేక మంది ఉన్నారు. ఇలాంటి వారి చింత తీర్చేందుకే ఓపెన్‌స్కూల్ విధానం అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఓపెన్ యూనివర్శిటీ ద్వారా పది, ఇంటర్లలో చేరేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చేనెల 19వరకు అవకాశం ఎటువంటి అపరాధ రుసుం లేకుండా వచ్చేనెల 19 వరకు ఓపెన్స్కూల్లో చేరేందుకు అవకాశం ఉంది. అక్టోబరు 10 వరకు అపరాధ రు సుంతో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంది. ఎటువంటి విద్యార్హత లేనప్పటికీ 14 ఏళ్ల వయస్సు పైబడిన వారందరూ పదో తరగతిలో ప్రవేశం పొందవచ్చు. 2015 ఆగస్టు 31కి 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ఇంటర్లో ప్రవేశానికి 2015 ఆగస్టు 31 నాటికి 15 ఏళ్లు నిండి, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. దీంతో ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాలూ పొందొచ్చు. భాషా మాధ్యమం ఎంపికకు అవకాశం.. ఓపెన్ స్కూల్ ద్వారా 10, ఇంటర్లో చేరే సమయంలో మనం చదివే మీడియం(మాధ్యమం)ను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. సెలవు దినాల్లో స్టడీ సెంటర్లలో తరగతులు నిర్వహిస్తారు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేస్తారు. విద్యార్థులు వృత్తి విద్యా సబ్జెక్టును గ్రూపు-సీ నుంచి ఆప్షన్‌గా ఎంచుకోవ చ్చు. ఒకేసారి అన్ని సబ్జెక్టుల పరీక్షలు రాయాలనే నిబంధన లేదు. ఒకటి, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులను సౌలభ్యం ప్రకారం రాసుకోవచ్చు. ప్రవేశం పొందాక ఐదేళ్లలోపు ఎప్పుడైనా ఉత్తీర్ణులు కావచ్చు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఉత్తీర్ణులైనప్పుడే సర్టిఫికేట్, మెమో ఇస్తారు. ప్రవేశ రుసుం ఇలా.. పదో తరగతిలో ప్రవేశానికి ప్రతిఒక్కరూ రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ప్రవేశ రుసుం జన రల్ విభాగం పురుషులు రూ.1,300, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, డిజేబుల్డ్ పర్సన్లు అయితే రూ.900 చెల్లించాలి. ఇంటర్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 200 చెల్లించాలి. ప్రవేశ రుసుం జనరల్ విభాగం పురుషులకు రూ.1,400, స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, డిజేబుల్డ్ పర్సన్లు రూ.1,100 చెల్లించాలి. ప్రవేశ దరఖాస్తులు జిల్లాలో ఉన్న స్టడీ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. ఏటేటా ప్రవేశాలు పెరుగుతున్నాయి ఓపెన్ స్కూల్ ప్రవేశాల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. కొత్తగా అడ్మిషన్ పొందగోరే అభ్యర్థులు నిర్ణీత గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - కొమ్మనాపల్లి జనార్దనరావు, ఏపీ ఓపెన్ స్కూల్, డిస్ట్రిక్ట్ కో-ఆర్డినేటర్, కాకినాడ -
వైకల్యం మెదడుకు కాదు..
చెస్‌లో దూసుకెళుతున్న స్నేహిత్ ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీలో ప్రాతినిధ్యం కొడుకు కోసం ఉద్యోగాన్ని వీడిన తండ్రి అంగవైకల్యం కారణంగా అందరిలా నడవలేడు... ఆడలేడు.. చక్రాల కుర్చీకే పరిమితం.. హైడ్రో కెఫాలస్ వ్యాధితో జన్మించిన స్నేహిత్ పరిస్థితి చిన్నప్పటి నుంచీ ఇంతే.. అయితేనేం అతడు నిరాశను దరిచేరనీయలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి చెస్ ఆటగాడిగా ఎదిగాడు. - మహ్మద్ సాబేర్ మొహియోద్దీన్, మహబూబ్‌నగర్ చదరంగం క్రీడలో స్ఫూర్తిదాయక విజయాలతో దూసుకెళుతున్న స్నేహిత్ స్వస్థలం మహబూబ్‌నగర్ లోని క్రిస్టియన్‌పల్లి. హైడ్రో కెఫాలస్ వ్యాధితో జన్మించిన తను అందరిలా నడవలేడు. అంగవైకల్యం కారణంగా చక్రాల కుర్చీనే ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితిలో తల్లిదండ్రులు అతడికి పూర్తి ఆత్మవిశ్వాసాన్ని అందించారు. ఇంటి వద్దనే చదువు చెప్పించారు. కాస్త కాలక్షేపంగా ఉంటుందని చెస్‌ను పరిచయం చేశారు. అయితే ఈ క్రీడను తను మాత్రం సీరియస్‌గా తీసుకున్నాడు. తల్లి రమాదేవి శిక్షణ స్నేహిత్‌ను మరింత రాటుదేలేలా చేసింది. దీంతో తక్కువ కాలంలోనే నైపుణ్యం కలిగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో కాకుండా అంతర్జాతీయ ఈవెంట్స్‌లోనూ మెరిశాడు. ప్రస్తుతం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న సే్నిహ త్ దగ్గర ఎప్పుడూ ఒకరు అందుబాటులో ఉండాల్సి రావడంతో తండ్రి రవీందర్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి కొడుకు ప్రగతికి తోడ్పాటు నందిస్తున్నారు. సాధించిన విజయాలు... 2002లో లయన్స్ క్లబ్ నిర్వహించిన మండల స్థాయి, జిల్లా స్థాయి చెస్ పోటీల్లో స్నేహిత్ విజేతగా నిలిచాడు. 2003లో నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ చాంపియన్‌షిప్‌లోనూ రాణించి ద్వితీయ స్థానం పొందాడు. మహబూబ్‌నగర్‌లో మల్లికార్జున్ మెమోరియల్ పేరిట నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో, ఏపీ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. 2005లో ‘బ్రహ్మ మెంటల్లీ రిలేటెడ్ సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ టోర్నీలో పాల్గొని మొదటి స్థానాన్ని పొందాడు. 2006లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి చెస్ పోటీల్లో పాల్గొని రెండోస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక 2010లో జిల్లా కేంద్రంలో నిర్వహించిన చెస్ టోర్నీలో విజేతగా నిలిచి రాష్ట్ర స్థాయి వికలాంగుల టోర్నీకి ఎంపికయ్యాడు. ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీకి... 2013 అక్టోబర్‌లో జర్మనీలోని డ్రెస్డెన్లో జరిగిన ప్రపంచ వికలాంగుల చెస్ టోర్నీలో స్నేహిత్ పాల్గొన్నాడు. ఆ టోర్నీలో వివిధ దేశాలకు చెందిన ఏడుగురు క్రీడాకారులతో తలపడ్డాడు. స్నేహిత్ ప్రతిభను గుర్తించిన అక్కడి మీడియా అతడిపై ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. -
పద్మ వికాసం
అంగన్ వాడీ టీచర్ నుంచి జెడ్పీ చైర్‌పర్సన్‌గా.. రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామానికి చెందిన శాగ మాణిక్యమ్మ, యాదగిరి దంపతుల నలుగురు సంతానంలో పద్మ పెద్దది. ఈమెకు చెల్లెలు అనిత, రజిత, తమ్ముడు సతీష్ ఉన్నారు. పేదరికంలో మగ్గుతూనే పద్మ ఇంటర్ వరకు చదువుకున్నారు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేశారు. 1994లో నర్మెట మండలం గండి రామారం గ్రామానికి చెందిన గద్దల నర్సిం గరావును వివాహం చేసుకున్నారు. వీరికి అఖిల్, నిఖిల్‌లు జన్మించారు. ప్రస్తుతం పెద్ద కుమారుడు అఖిల్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి, నిఖిల్ జనగామలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నారు. 1998 నుంచి 2006 వరకు నర్సింగరావు వివిధ పత్రికలో విలేకరిగా పనిచేశారు. ప్రస్తుతం వీరు జనగామలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. 2001లో తొలిసారిగా.. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2000 సంవత్సరంలో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ ర్పాటు చేయగా నర్సింగారావు ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో చురుకైనా నాయకుడిగా ఎదిగారు. ఈ క్రమంలో 2001లో తన భార్య పద్మను పార్టీ తరపున ఎంపీటీసీగా బరిలో నిలిపే అవకాశం వచ్చింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన పద్మ అబ్దుల్ నాగారం ఎంపీటీసీ సభ్యురాలిగా 2006 వరకు కొనసాగారు. ఈ సమయంలో రాజకీయాలపై ఆమెకు కొంత అవగాహన ఏర్పడినప్పటికీ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాలేదు. దీంతో గృహిణిగానే ఉండిపోయారు. 2010లో గండిరామారం అంగన్వాడీ-2 సెంటర్లో టీచర్‌గా ఉద్యోగం పొందిన ఆమె మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ఉద్యోగం చేశారు. నర్మెట జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతోఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎన్నికల బరిలో నిలిచి జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. కలిసి వచ్చిన రిజర్వేషన్.. పార్టీ సమీకరణల నేపథ్యంలో శనివారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆమె ఓ సాధారణ గృహిణి.. అతి పేద కుటుంబానికి చెందిన మహిళ. నిన్న మొన్నటి వరకు అంగన్వాడీ టీచర్. పిల్లలకు నాలుగు అక్షరాలు నేర్పే పంతులమ్మ. ఉండేది అద్దె ఇంట్లో. నేడు.. తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా జిల్లా పరిషత్ చైర్పర్సన్. రాజకీయాలంటే ఏమాత్రం అవగాహన లేని ఆమెకు రిజర్వేషన్ రూపంలో అదృష్టం కలిసొచ్చింది. ఎంపీపీగా రాజకీయ ఆరంగేట్రం చేసినా తర్వాత ఐదేళ్ల విరామం.. మళ్లీ సాధారణ జీవితం. ఇప్పుడు ఏకంగా జెడ్పీ చైర్‌పర్సన్‌గా రికార్డుల్లోకి ఎక్కిన ఆమె మరెవరో కాదు.. నర్మెట మండలం గండి రామారానికి చెందిన గద్దల పద్మ. - జనగామ