అంతా ‘ఓపెన్‌’.. చూస్కో, రాస్కో | Malpractice In Open University Degree Examination In Khammam | Sakshi
Sakshi News home page

అంతా ‘ఓపెన్‌’.. చూస్కో, రాస్కో

Published Wed, Nov 17 2021 1:00 PM | Last Updated on Wed, Nov 17 2021 7:05 PM

Malpractice In Open University Degree Examination In Khammam - Sakshi

నోట్స్, సెల్‌ చూస్తూ ఓపెన్‌ డిగ్రీ పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి

సాక్షి, కారేపల్లి(ఖమ్మం): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్‌ డిగ్రీ పరీక్షను అభ్యాసకులు ఎంచక్కా పుస్తకాలు, నోట్స్‌లను చూస్తూ రాశారు. మంగళవారం కారేపల్లిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో పలువురి చూచిరాతలపై సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఈ నెల 11వ తేదీ నుంచి ఓపెన్‌ డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా..మంగళవారం 20 మంది హాజరయ్యారు. సెల్‌ఫోన్, పుస్తకాలు దగ్గరపెట్టుకొని మరీ రాశారు. ఇన్విజిలేటర్లు సైతం చూసి చూడనట్లు వ్యవహరించారు. వారే దగ్గరుండి రాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.  
(చదవండి: ఏం ఫ్యామిలీరా బాబూ..! భార్య ఇంట్లోకి వెళ్లి సర్దేస్తుంది.. అనంతరం కూతురితో కలిసి..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement