Malpractices
-
AP: జెడ్పీ హైస్కూల్లో మాల్ ప్రాక్టీస్.. స్పందించిన విద్యాశాఖ
సాక్షి, కృష్ణా జిల్లా: పసుమర్రు జెడ్పీ హైస్కూల్లో మాల్ ప్రాక్టీస్‌పై విద్యా శాఖ స్పందించింది. ప్రశ్నా పత్రాలు బయటకు వెళ్తున్నాయని టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ వచ్చిందని డిఈవో తాహిరా సుల్తానా తెలిపారు. ఐదుగురు టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు గుర్తించామన్నారు. టీచర్ల ఫోన్లు పోలీసులకు అప్పగించామన్నారు. ఆరుగురు టీచర్లను సస్పెండ్ చేసినట్లు డిఈవో వెల్లడించారు. చదవండి: పన్నెండేళ్ల ప్రేమ.. పోలీసుల సమక్షంలో పెళ్లి.. -
అంతా ‘ఓపెన్’.. చూస్కో, రాస్కో
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షను అభ్యాసకులు ఎంచక్కా పుస్తకాలు, నోట్స్‌లను చూస్తూ రాశారు. మంగళవారం కారేపల్లిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో పలువురి చూచిరాతలపై సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా..మంగళవారం 20 మంది హాజరయ్యారు. సెల్‌ఫోన్, పుస్తకాలు దగ్గరపెట్టుకొని మరీ రాశారు. ఇన్విజిలేటర్లు సైతం చూసి చూడనట్లు వ్యవహరించారు. వారే దగ్గరుండి రాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (చదవండి: ఏం ఫ్యామిలీరా బాబూ..! భార్య ఇంట్లోకి వెళ్లి సర్దేస్తుంది.. అనంతరం కూతురితో కలిసి..) -
ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాల్ ప్రాక్టీస్
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిపోతోంది. ‘సాక్షి’ కథనం అక్షరాల నిజమవుతోంది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.. పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్నా సెంటర్లలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రాక్టికల్స్ జరిగే కేంద్రాల చుట్టూ కార్పొరేట్ కళాశాలలకుచెందిన అధ్యాపకులు, సిబ్బంది హల్చల్ చేస్తున్నారు. సెంటర్లలోకి బయట వ్యక్తులకు అనుమతి లేకున్నా ప్రైవేట్ కళాశాలకు చెందిన వారు హడావుడి చేస్తున్నారు. సోమవారం నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలకు చెందిన వ్యక్తులు విద్యార్థులతో నేరుగా ప్రాక్టికల్స్ హాల్ వైపు వెళ్లిన వైనం బయటపడింది. ర్యాంక్‌లే లక్ష్యంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేయించుకునేందుకు కార్పొరేట్ కళాశాలలు అక్రమాలకు తెగబడుతున్నాయి. చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లతో ఏ రోజుకారోజు సెల్ఫోన్లలో మంతనాలుజరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు(టౌన్): జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్స్ ఈ నెల 1వ తేదీన ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు 4 విడతల్లో పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 38 ప్రభుత్వ, 163 ప్రైవేట్ కళాశాలల నుంచి 26,716 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో ఎంపీసీ 19,802 మంది, బైపీసీ 4,696 మంది, ఒకేషనల్ 2,218 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం 48 సెంటర్లలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఇంటర్లో మార్కులు ప్రవేశ పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒక్కో సబ్జెక్టులో 30 మార్కులుంటాయి. ఈ నేపథ్యంలో కళాశాలల యాజమాన్యాలు ర్యాంక్ సాధించే విద్యార్థికి ఫుల్ మార్కులు, సాధారణ విద్యార్థికి ఒక్కో సబ్జెక్ట్‌లో 23 నుంచి 26 మార్కులు వేసే విధంగా చీఫ్ సూపరింటెండెంట్లు, ఎగ్జామినర్లతో ఒప్పందం చేసుకున్నారని తెలుస్తోంది. ఇందుకు ప్రతిగా వారికి రూ.300 నుంచి రూ.500 (ఒక్కో విద్యార్థికి) ముట్టజెబుతున్నట్టు సమాచారం. అయితే ప్రాక్టికల్స్ ఫిక్స్ అయ్యాయని గత నెల 30న ‘సాక్షి’లో ‘మార్కుల వేట’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఏమి జరుగుతోందంటే.. ప్రాక్టికల్స్ సెంటర్లలో సీసీ కెమెరాలు బిగించినా అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు పని చేయని పరిస్థితి ఉందని అధ్యాపకులే చెబుతున్నారు. తొలిసారిగా ప్రాక్టికల్స్ లైవ్‌లో జరుగుతున్నాయని ఇంటర్ అధికారులు చెబుతున్నా ప్రైవేట్ వ్యక్తులు కళాశాలల్లోనే హల్చల్ చేస్తున్నారంటే పరీక్షలు ఎంత పకడ్బందీగా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సీసీ కెమెరాలు ఏ మాత్రంపని చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ యాజమాన్యాలు మైక్రో జెరాక్స్‌లు చేయించి విద్యార్థులకు అందజేస్తున్నట్టు విశ్వశనీయ సమాచారం. కొన్ని సెంటర్లలో అయితే ఇన్విజిలేటర్లే చెబుతున్న పరిస్థితి ఉంది. స్క్వాడ్ బృందాలు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప అక్కడ జరుగుతున్న తంతు బయటపడే అవకాశం ఉందని కొందరు అధ్యాపకులే బహిరంగంగా చెబుతున్నారు. ఈ విషయంపై వివరణ కోరేందుకు ఆర్ఐఓ శ్రీనివాసరావును ఫోన్లో సంప్రదించగా ఆయన స్పందించలేదు. ప్రాక్టికల్స్‌కు 134 మంది గైర్హాజరు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 134 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్‌కు 2,832 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 2,749 మంది హాజరయ్యారు. -
కాలేజీ టాయిలెట్లో సీసీటీవీ కెమెరాలు
అలీగఢ్: ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా ఓ కళాశాల వింత చర్య తీసుకుంది. అలీగఢ్‌లోని ధర్మ్‌సమాజ్ డిగ్రీ కాలేజీ మూడ్రోజుల క్రితం అబ్బాయిల టాయిలెట్ గదిలో సీసీటీవీ కెమెరాలను అమర్చింది. చివరికి ఈ విషయం బయటకు పొక్కడంతో పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ హేమ్‌ప్రకాశ్ గుప్తా స్పందిస్తూ.. పరీక్షల సందర్భంగా పలువురు విద్యార్థులు జేబుల్లో, అండర్‌వేర్‌ల్లో స్లిప్పులు దాస్తున్నారని తెలిపారు. టాయిలెట్లోకి వచ్చి స్లిప్పుల ద్వారా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారని వెల్లడించారు. టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటుతో ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. కాగా, టాయిలెట్ గదిలో సీసీటీవీల ఏర్పాటును ఇంతటితో వదిలిపెట్టబోమనీ, కోర్టుకు ఈడుస్తామని పలు విద్యార్థి సంఘాల నేతలు సదరు కళాశాలను హెచ్చరించారు. -
‘ఉపాధి’ పనుల్లో అక్రమాలు
నార్నూర్, న్యూస్‌లైన్ : జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగాయి. సామాజిక తనిఖీ ప్రజావేదిక ద్వారా ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. స్పందించిన ఏపీడీ బాధ్యులైన సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులపై స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఏపీడీ జాదవ్ గణేశ్ అధ్యక్షతన మంగళవారం సామాజిక తనిఖీ, ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృందం సభ్యులు మండలంలో చేపట్టిన పనులు, సిబ్బంది అక్రమాలను వేదిక దృష్టికి తెచ్చారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో మండలంలోని 24 గ్రామ పంచాయతీల పధిలో రూ.2.16 కోట్ల విలువైన పనులు చేపట్టగా రూ.5,05,772 నిధులు దుర్వినియోగమైనట్లు పేర్కొన్నారు. స్పందించిన ఏపీడీ ఆ నిధులను సంబంధిత సిబ్బంది నుంచి రికవరీ చేయాలని ఆదేశించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందికి రూ.55,800 జరిమానా విధించారు. నార్నూర్ పంచాయతీ పరిధిలో కూలీలకు చెల్లింపులు సక్రమంగా చేయడంలేదని, పనులు సరిగా కేటాయించడంలేదని కూలీలు ఆరోపించగా.. ఫీల్డ్ అసిస్టెంట్ సాంబాను సస్పెండ్ చేస్తున్నట్లు ఏపీడీ ప్రకటించారు. డాబా పంచాయతీ పరిధిలో వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.2500 చొప్పున వసూలు చేసినందుకు ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణను సస్పెండ్ చేశారు. కూలీలకు సకాలంలో చెల్లింపులు జరపకపోవడంపై ఎంసీవో రమేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిహత్నూర్, మహగావ్, కొలామా సీఎస్పీలు కూలీల నుంచి రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారని బృందం సభ్యులు పేర్కొనగా కొలామా, మహగావ్ సీఎస్పీలను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కూలీలకు పేస్లిప్ ఇవ్వని తాడిహత్నూర్ ఎఫ్ఏ మోతిరామ్కి రూ.7 వేల జరిమానా విధించారు. మాన్కాపూర్ ఎఫ్ఏ సూరత్సింగ్కు రూ.5 వేల జరిమానా విధించారు. ప్రతీ కూలీకి పేస్లిప్ ఇచ్చాకే డబ్బులు చెల్లించాలని ఏపీవో రజినీకాంత్‌ను ఏపీడీ ఆదేశించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీడీ అనిల్ చౌహాన్, జిల్లా విజిలెన్స్ అధికారి నాగోరావ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యశాఖకు అవినీతి రోగం
సాక్షి, ఏలూరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. ఎందరు అధికారులు మారినా.. నిబంధనలు ఎంత కఠినతరం చేసినా వైద్య ఆరోగ్య శాఖలో అక్రమాలు ఆగడం లేదు. అక్రమాలే పరమావధిగా, అవినీతే ఆలంబనగా వ్యవహరిస్తున్న ఈ శాఖ ఉన్నతాధికారుల తీరుతో జిల్లా ప్రతిష్ట మంటగలుస్తున్నా మార్పు రావడం లేదు. తప్పుచేస్తే ఒకసారి కాకపోతే మరోసారైనా దొరికిపోవడం ఖాయమని తెలిసినా ఎవరూ బెదరడం లేదు. సాక్షాత్తూ ఆ శాఖ జిల్లా అధికారులే వరుసగా దొరికిపోతున్నా మళ్లీ అదే పునరావృతమవుతోంది. యథేచ్ఛగా నగదు డ్రా రెండేళ్ల క్రితం 2011 డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో పైలేరియా నివారణ కార్యక్రమం జరుగగా 12న దాదాపు రూ.11.50 లక్షల మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (డీఎంఏ) నిధులను నిబంధనలకు విరుద్ధంగా నగదు రూపంలో డ్రా చేశారు. ఆ నగదును కార్యాలయంలో ఉంచడంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) పద్మజ, ఇన్చార్జి డీఎంవో సి.ప్రసాద్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. రెండేళ్ల అనంతరం ఇటీవలే పద్మజకు డిమోషన్‌తో ఉత్తరాంధ్రలో పోస్టింగ్ ఇచ్చారు. పద్మజ వ్యవహారంతో మేల్కొన్న ఉన్నతాధికారులు నగదు లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే జరగాలని నిబంధన విధించారు. ఈ నిబంధనలను ఖాతరుచేయకుండా ఇటీవల దాదాపు రూ.26 లక్షలను డ్రా చేశారు. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ బయటపెట్టడంతో డీఎంహెచ్ఓ టి.శకుంతల, డెప్యూటీ డీఎంహెచ్‌వో, ఇన్చార్జి జిల్లా మలేరియా అధికారి టి.నాగేశ్వరరావు, మలేరియా అధికారి కార్యాలయం సూపరింటెండెంట్ కేవీవీ సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం సస్పెండ్ అయ్యారు. గతంలో డీఎంహెచ్‌వో విజయపాల్ 2008లో అవినీతి ఆరోపణలతో బదిలీ అయ్యారు. అంతకు ముందు 2006-07లో అప్పటి డీఎంహెచ్‌వో సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇక ఈ శాఖలో తరచుగా మెమోలు తీసుకునేవారు, సస్పెండైనవారు కిందిస్థాయిలో చాలామందే ఉన్నారు. తీవ్ర స్థాయిలో విభేదాలు ఇతర శాఖల కంటే ఈ శాఖలో సిబ్బంది మధ్య విభేదాలు కాస్త ఎక్కువే. అవినీతి సొమ్ము పంపకాల విషయంలో తలెత్తిన వివాదం, ఆధిపత్యం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే తమ శాఖలో అక్రమాలపై లీకులు ఇస్తున్నారని స్పష్టమవుతోంది. అలాగే తమకు నష్టం కలిగించినవారి బండారాలు బయటకు పొక్కేలా చేస్తున్నవారూ ఉన్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఆ శాఖ అత్యున్నత స్థాయి అధికారులు స్పందించి ప్రక్షాళన చేపట్టకపోతే ఈ శాఖ ద్వారా అందే సేవలపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. -
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
జిల్లాలో 81 కేంద్రాల్లో గురువారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పరీక్షను 65,256 మంది రాయాల్సి ఉండగా 560 మంది గైర్హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను బాధ్యతల నుంచి తప్పించారు.భానుగుడి (కాకినాడ), న్యూస్‌లైన్ : జిల్లాలో పదో తరగతి పరీక్షలు 81 కేంద్రాలలో గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగుపేపర్-1 పరీక్షకు 65,256 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 560 మంది గైర్హాజరయ్యారు. అవకతవకలకు పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశామని, విధులను సక్రమంగా నిర్వహించని ఇద్దరు ఇన్విజిలేటర్లను బాధ్యతల నుంచి తప్పించామని డీఈఓ కేవీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ రాదని, ఇన్విజిలేటర్లు విధి నిర్వహణలో అలసత్వం వహించరాదని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే కఠినచర్యలు తప్పవన్నారు. ‘ఫోన్‌కాల్‌తో బెంచీ’లకు స్పందన పరీక్షలు రాసే విద్యార్థులు ఇబ్బందులు పడరాదనే ఉద్దేశంతో నేషనల్ మెంటల్ హెల్త్ మూవ్మెంట్ ఇచ్చిన పిలుపునకు అనూహ్య స్పందన లభించిందని ఆ సంస్థ క న్వీనర్ చోడిశెట్టి కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు. అడ్డతీగల నుంచి అభ్యర్థన రాగానే హుటాహుటిన 25 బెంచీలు పంపినట్టు తెలిపారు. ఎక్కడైనా అసౌకర్యం ఉంటే 98481 83838 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డీబార్
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలో నల్లగొండలోని ఆల్ఫా బాలికల జూనియర్ కాలేజీ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా అధికారులు డీబార్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వచ్చిన తనిఖీ బృందం వీరిపై మాల్ ప్రాక్టీస్ కేస్‌ను బుక్‌చేశారు. 106 సెంటర్లలో నిర్వహించిన పరీక్షలో జనరల్ విభాగంలో 38311 మంది విద్యార్థులకుగాను 34617 (90 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషన్ విభాగంలో 4822 మందికి గాను 563 మంది హాజరుకాలేదు. 4259 (88 శాతం) హాజరయ్యారు. -
అక్కడ సిబ్బందే రాహుకేతువులు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం సిబ్బంది అవినీతి, అక్రమాలు ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారుు. రాహుకేతుపూజల ద్వారా ఆలయ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఆలయ ఆదాయం ఏటా అనూహ్యరీతిలో పెరుగుతోంది. ఏడాదికి సుమారు రూ.100 కోట్ల ఆదాయం వస్తోంది. కిందిస్థాయి అధికారి నుంచి ఈవో వరకు బదిలీ అవుతున్నా తీరుమారడం లేదు. రాహుకేతు పూజలకు సంబంధించి టెంకాయల సరఫరాలో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆలయాధికారులు కేసులు నమోదు చేయడంతో వివాదం కోర్టుకెక్కింది. ఆలయానికి సంబంధించి అనేక భూవివాదాలు కోర్టులో నడుస్తున్నాయి. రూ.120కోట్ల వెండి నిల్వలు ఆలయంలో మూలుగుతున్నాయి. వెండి కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాహుకేతు పూజలకు అవసరమైన సామగ్రి సరఫరాలోనూ అక్రమాలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా స్వామి, అమ్మవార్లకు భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా అందించే చీరలు, పంచెలను కూడా ఆలయసిబ్బంది మాయం చేసిన సంఘటనలు వెలుగుచూశాయి. వసతిగృహాలను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలున్నారుు. ఆలయ అధికారి ఒకరు రెండు నెలలపాటు ఆలయ అతిథిగృహంలో తిష్టవేసినట్లు ఇటీవల బయటపడింది. అతని నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో 800, మిగిలిన వారాల్లో 400 మంది భక్తులకు ఆలయం తరఫున అన్నదానం నిర్వహించాల్సి ఉంది. ఆ మేరకు భక్తులకు అన్నదానం చేయడంలేదు. బస్టాండ్ నుంచి ఆలయం వరకు భక్తుల కోసం ఉచిత బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ ఆటోవాలాల ఒత్తిడితో బస్సును సక్రమంగా నడపటంలేదు. గోశాలలోనూ నాశిరకం పశుదాణా కొనుగోలు చేసి కొందరు ఆలయాధికారులు జేబులు నింపుకున్నట్లు విమర్శలున్నాయి. స్కిట్ కళాశాలకూ మినహారుుంపు లేదు.. శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలోనూ అవినీతి అక్రమాలు తార స్థాయికి చేరారుు. పదోన్నతులు, పోస్టుల భర్తీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై జేఎన్టీయూ ఉన్నతాధికారులు పలుమార్లు రికార్డులను తనిఖీలు చేసిన సందర్భాలున్నాయి. ఆలయానికి అనుబంధంగా ఉన్న నర్సింగ్కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు భద్రత కరువైంది. ఇటీవల కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఆటోలో ఏరియా ఆస్పత్రికి శిక్షణ నిమిత్తం వెళుతుండగా కిడ్నాప్ యత్నం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దశలవారీగా అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నాం ఆలయంలో అవినీతి, అక్రమాలకు దశలవారీగా అడ్డుకట్ట వేస్తున్నాం. దళారీవ్యవస్థ భక్తులను దోచుకోకుండా పూర్తిగా నివారించాం. పూజాసామగ్రి, ఆలయ ఖర్చులు తదితర అంశాలపై దృష్టిసారించాం. భక్తుల సొమ్ము వృథా కాకుండా చర్యలు చేపడుతాం. - విజయ్‌కుమార్, ఆలయ ఈవో