నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలో నల్లగొండలోని ఆల్ఫా బాలికల జూనియర్ కాలేజీ సెంటర్‌లో ముగ్గురు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా అధికారులు డీబార్ చేశారు.
ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వచ్చిన తనిఖీ బృందం వీరిపై మాల్ ప్రాక్టీస్ కేస్‌ను బుక్‌చేశారు. 106 సెంటర్లలో నిర్వహించిన పరీక్షలో జనరల్ విభాగంలో 38311 మంది విద్యార్థులకుగాను 34617 (90 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. ఒకేషన్ విభాగంలో 4822 మందికి గాను 563 మంది హాజరుకాలేదు. 4259 (88 శాతం) హాజరయ్యారు.
ఇంటర్ పరీక్షల్లో ముగ్గురు డీబార్
Published Sun, Mar 16 2014 2:16 AM | Last Updated on Wed, Apr 3 2019 8:51 PM
Advertisement