శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం సిబ్బంది అవినీతి, అక్రమాలు ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారుు. రాహుకేతుపూజల ద్వారా ఆలయ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఆలయ ఆదాయం ఏటా అనూహ్యరీతిలో పెరుగుతోంది. ఏడాదికి సుమారు రూ.100 కోట్ల ఆదాయం వస్తోంది. కిందిస్థాయి అధికారి నుంచి ఈవో వరకు బదిలీ అవుతున్నా తీరుమారడం లేదు.
రాహుకేతు పూజలకు సంబంధించి టెంకాయల సరఫరాలో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆలయాధికారులు కేసులు నమోదు చేయడంతో వివాదం కోర్టుకెక్కింది.
ఆలయానికి సంబంధించి అనేక భూవివాదాలు కోర్టులో నడుస్తున్నాయి.
రూ.120కోట్ల వెండి నిల్వలు ఆలయంలో మూలుగుతున్నాయి. వెండి కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాహుకేతు పూజలకు అవసరమైన సామగ్రి సరఫరాలోనూ అక్రమాలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
తాజాగా స్వామి, అమ్మవార్లకు భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా అందించే చీరలు, పంచెలను కూడా ఆలయసిబ్బంది మాయం చేసిన సంఘటనలు వెలుగుచూశాయి.
వసతిగృహాలను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలున్నారుు. ఆలయ అధికారి ఒకరు రెండు నెలలపాటు ఆలయ అతిథిగృహంలో తిష్టవేసినట్లు ఇటీవల బయటపడింది. అతని నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
సోమ, మంగళవారాల్లో 800, మిగిలిన వారాల్లో 400 మంది భక్తులకు ఆలయం తరఫున అన్నదానం నిర్వహించాల్సి ఉంది. ఆ మేరకు భక్తులకు అన్నదానం చేయడంలేదు.
బస్టాండ్ నుంచి ఆలయం వరకు భక్తుల కోసం ఉచిత బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ ఆటోవాలాల ఒత్తిడితో బస్సును సక్రమంగా నడపటంలేదు.
గోశాలలోనూ నాశిరకం పశుదాణా కొనుగోలు చేసి కొందరు ఆలయాధికారులు జేబులు నింపుకున్నట్లు విమర్శలున్నాయి.
స్కిట్ కళాశాలకూ మినహారుుంపు లేదు..
శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలోనూ అవినీతి అక్రమాలు తార స్థాయికి చేరారుు. పదోన్నతులు, పోస్టుల భర్తీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు పలుమార్లు రికార్డులను తనిఖీలు చేసిన సందర్భాలున్నాయి. ఆలయానికి అనుబంధంగా ఉన్న నర్సింగ్‌కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు భద్రత కరువైంది. ఇటీవల కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఆటోలో ఏరియా ఆస్పత్రికి శిక్షణ నిమిత్తం వెళుతుండగా కిడ్నాప్ యత్నం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
దశలవారీగా అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నాం
ఆలయంలో అవినీతి, అక్రమాలకు దశలవారీగా అడ్డుకట్ట వేస్తున్నాం. దళారీవ్యవస్థ భక్తులను దోచుకోకుండా పూర్తిగా నివారించాం. పూజాసామగ్రి, ఆలయ ఖర్చులు తదితర అంశాలపై దృష్టిసారించాం. భక్తుల సొమ్ము వృథా కాకుండా చర్యలు చేపడుతాం. - విజయ్‌కుమార్, ఆలయ ఈవో
అక్కడ సిబ్బందే రాహుకేతువులు
Published Sat, Jan 25 2014 3:56 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement