sri kalahasteeswara temple
-
శ్రీకాళహస్తి టెంపుల్ వెరీ బ్యూటిఫుల్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ సౌందర్యం చాలాబాగుందని, వెరీ బ్యూటిఫుల్ అని పలువురు రష్యన్లు కొనియాడారు. రష్యా రాజధాని మాస్కోకు చెందిన 30మంది మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. ఆలయాధికారులు వారికి స్వాగతం పలికారు. రూ.500 టిక్కెట్ ద్వారా శ్రీకృష్ణదేవరాయుల మండపంలో రాహుకేతు సర్పదోషనివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. పరివారదేవతా మూర్తులను సైతం దర్శించుకున్నారు. తర్వాత వారు మాట్లాడుతూ శిఖర దర్శనాలు, ఆలయ శిల్ప సౌందర్యం అద్భుతంగా ఉందన్నారు. తమిళనాడుకు చెందిన పలువురు మాస్కోలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారి సూచనల మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసినట్లు చెప్పా రు. ప్రధానంగా రాహుకేతు పూజలు చేయించుకుంటే వివాహం కానివారికి వివాహం, సంతానం లేనివారికి సంతానం, ఆరో గ్యం సమస్యలు ఉన్నా కుదుటపడుతాయని చెప్పడంతో విచ్చేశామని పేర్కొన్నారు. ఆలయ ఆవరణలోని శిల్ప సౌందర్యాన్ని కెమెరాల్లో బంధించారు. -
శ్రీకాళహస్తి దేవస్థానంలో ఏసీబీ తనిఖీలు
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో తాజాగా ఏసీబీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. దేవస్థానం పరిపాలన భవనంలో మంగళవారం రాత్రి నుంచి ఏసీబీ అధికారులు వివిధ రికార్డులను పరిశీలిస్తున్నారు. దేవస్థానంలో 2010 నుంచి 2013 వరకు జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేస్తున్నారు. అవినీతి నిరోధకశాఖ(తిరుపతి) సీఐ చంద్రశేఖర్ నేతృత్వంలో బుధవారం పలు కీలకమైన రికార్డులను పరిశీలించారు. శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానంలో రెండేళ్లుగా తనిఖీలు...విచారణలు జరుగుతూనే ఉన్నాయి. 2010 నుంచి 2013 వరకు జరిగి అక్రమాలపై మొదట్లో విజిలెన్స్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఏడాది పాటు పలు సార్లు రికార్డులను తనిఖీలు చేశారు. పలు రికార్డులను హైదరాబాద్‌కు సైతం తరలించి నిశితంగా పరిశీలించారు. తాజాగా ఏసీబీ నేతృత్వంలో విచారణ సాగుతుంది. ప్రధానంగా అప్పట్లో వెండి కొనుగోలులో అక్రమాలు, మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు అవసరానికి మించి ఖర్చులు చేసినట్లు రికార్డులు చూపడం, ఉద్యోగాల నియామకాలు, హరితాభివృద్ధిలో ఉద్యోగాలు, హరితాభివృద్ధి నుంచి పలువురిని ఆలయంలోకి డెప్యూటేషన్‌పై బదిలీ చేయడం తదితర అంశాలపై విచారణ చేస్తున్నారు. అప్పటి ఈవో శ్రీరామచంద్రమూర్తి పాలన కాలంలోనే అవినీతి అధికంగా జరిగినట్లు భావిస్తూ పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. దీంతో అవినీతి అక్రమాలకు పాల్పడినవారి గుండెల్లో గుబులు పుడుతోంది. -
భక్తుల నిలువుదోపిడీ
రాహు-కేతు పూజల్లో బలవంతపు వసూళ్లు పనిచేయని సీసీ కెమెరాలు అధికారులకూ వాటాలు! శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా అర్చకులు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. వాటా అందుతున్న కారణంగానే ఆలయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాళహస్తీశ్వరాలయం రాహు-కేతు పూజలకు పేరుగాంచింది. ఇతర రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేసుకుంటుంటారు. ఈ క్రమంలో భక్తులు అనేక మోసాలకు గురవుతున్నారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పూజారులు అందినకాడికి దోచుకుంటున్నారు. అడుగడుగునా దోపిడీ పట్టణంలోని దేవస్థానం సమాచారకేంద్రం నుంచి ఆలయం వరకు, సన్నిధివీధిలో నేతి దీపాలు, కొబ్బరికాయలు, గరిక, జిల్లేడు మాలలు విక్రయించే దుకాణాలు అనేకం ఉన్నాయి. వీటిని ఆలయంలోకి అనుమతించరు. రాహు-కేతు పూజలు చేయించుకునే భక్తులు వీటిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. దేవస్థానం వారే పూజా సామగ్రిని అందజేస్తారు. అయినా రాహు-కేతు టికెట్లు తీసుకున్న భక్తులకు దుకాణదారులు వీటిని బలవంతంగా అంటగడుతున్నారు. బలవంతంగా దక్షిణ రూ.300, రూ.750, రూ.1500, రూ.2,500 టికెట్లపై రాహు-కేతు పూజలు జరుగుతున్నాయి. పూజలు చేయించుకున్న భక్తులు చివర్లో తప్పనిసరిగా దక్షిణ(డబ్బు) సమర్పించుకోవాల్సి ఉంటుంది. పూజ పూర్తయిన తర్వాత దోషం పోవాలంటే బ్రాహ్మణులకు గోదానం, భూదానం, సువర్ణదానం చేయాల్సిఉంటుందని పూజారులు బాహాటంగానే చెబుతుం టారు. వాటిని ఇవ్వడం వీలుకాదు కాబట్టి దక్షిణ ఇవ్వాలని వారే సలహా ఇస్తుంటారు. ఏమవుతుందో ఏమోనని భక్తులు తోచినంత ఇచ్చి వెళుతున్నారు. పూజకో రేటు రాహు-కేతు పూజా టికెట్లు మూడు రకాలుగా ఉన్నా యి. మూడు ప్రాంతాల్లో పూజలు జరుగుతున్నాయి. ఒక్కో పూజ చేసుకునే భక్తులు ఒక్కో రకమైన దక్షిణ సమర్పించుకోవాలి. రూ.300 పూజ చేసుకునే భక్తులు రూ.50, రూ.750 పూజ వారు రూ.100, రూ.1500 పూజ చేసుకునే భక్తులు రూ.200 నుంచి 300 వరకు దక్షిణ ఇవ్వాలి. పనిచేయని సీసీ కెమెరాలు మృత్యుంజయ మండపంలోని సీసీ కెమెరాలు మాత్రమే పనిచేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఆలయానికి వచ్చే భక్తులు ఎక్కువగా రూ.300, రూ.1500 టికెట్లు కొని రాహుకేతు పూజలు చేయించుకుంటుంటారు. వీటిని ఆలయంలోని మృత్యుంజయ మండపంలో చేస్తారు. ఇక్కడే ప్రధానంగా ఆలయ కిందిస్థాయి సిబ్బంది, దళారులు, అర్చకులు భక్తుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. భక్తుల నుంచి అధికమొత్తంలో దక్షిణ రూపంలో, దానధర్మం పేరిట వసూలు చేస్తున్నారు. దీనిపై ఆలయ ఉన్నతాధికారులకు తెలిసినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులకూ వాటాలు ఆలయంలోని స్వామి అమ్మవార్ల సన్నిధిలోనే కాకుండా పరివార దేవతల వద్ద పూజారులు, పరిచారకులు ఉన్నారు. హారతి పళ్లాలను నిషేధించారు. దీనివల్ల భక్తులకు దక్షిణలు ఇచ్చే బాధ తప్పిందని భావించారు. అయితే మళ్లీ ఈ తంతు సాధారణమై పోయింది. హారతి పళ్లాలు, రాహు-కేతు పూజల్లో వచ్చే వసూళ్లు కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు వెళుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఆలయంలోని మృత్యుంజయ మండపంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని ఇటీవల నా దృష్టికి వచ్చింది. వాటిని త్వరలో బాగు చేయిస్తాం. ఆలయంలో జరిగే రాహుకేతు పూజల్లో భక్తుల నుంచి దక్షిణ వసూలు చేయరాదని అర్చకులను ఆదేశించాం. ఎక్కడైనా దక్షిణ వసూలు చేస్తుంటే భక్తులు ఫిర్యాదు చేయవచ్చు. విచారించి చర్యలు తీసుకుంటాం. - పూర్ణచంద్రరావు, ఇన్చార్జి ఈవో -
అక్కడ సిబ్బందే రాహుకేతువులు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం సిబ్బంది అవినీతి, అక్రమాలు ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్నారుు. రాహుకేతుపూజల ద్వారా ఆలయ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఆలయ ఆదాయం ఏటా అనూహ్యరీతిలో పెరుగుతోంది. ఏడాదికి సుమారు రూ.100 కోట్ల ఆదాయం వస్తోంది. కిందిస్థాయి అధికారి నుంచి ఈవో వరకు బదిలీ అవుతున్నా తీరుమారడం లేదు. రాహుకేతు పూజలకు సంబంధించి టెంకాయల సరఫరాలో కాంట్రాక్టర్లు అక్రమాలకు పాల్పడ్డారని ఆలయాధికారులు కేసులు నమోదు చేయడంతో వివాదం కోర్టుకెక్కింది. ఆలయానికి సంబంధించి అనేక భూవివాదాలు కోర్టులో నడుస్తున్నాయి. రూ.120కోట్ల వెండి నిల్వలు ఆలయంలో మూలుగుతున్నాయి. వెండి కొనుగోళ్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాహుకేతు పూజలకు అవసరమైన సామగ్రి సరఫరాలోనూ అక్రమాలు జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా స్వామి, అమ్మవార్లకు భక్తులు ఎంతో ప్రీతిపాత్రంగా అందించే చీరలు, పంచెలను కూడా ఆలయసిబ్బంది మాయం చేసిన సంఘటనలు వెలుగుచూశాయి. వసతిగృహాలను దుర్వినియోగం చేస్తున్నట్లు విమర్శలున్నారుు. ఆలయ అధికారి ఒకరు రెండు నెలలపాటు ఆలయ అతిథిగృహంలో తిష్టవేసినట్లు ఇటీవల బయటపడింది. అతని నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో 800, మిగిలిన వారాల్లో 400 మంది భక్తులకు ఆలయం తరఫున అన్నదానం నిర్వహించాల్సి ఉంది. ఆ మేరకు భక్తులకు అన్నదానం చేయడంలేదు. బస్టాండ్ నుంచి ఆలయం వరకు భక్తుల కోసం ఉచిత బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ ఆటోవాలాల ఒత్తిడితో బస్సును సక్రమంగా నడపటంలేదు. గోశాలలోనూ నాశిరకం పశుదాణా కొనుగోలు చేసి కొందరు ఆలయాధికారులు జేబులు నింపుకున్నట్లు విమర్శలున్నాయి. స్కిట్ కళాశాలకూ మినహారుుంపు లేదు.. శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలోనూ అవినీతి అక్రమాలు తార స్థాయికి చేరారుు. పదోన్నతులు, పోస్టుల భర్తీలో అవకతవకలు చోటుచేసుకున్నాయి. దీనిపై జేఎన్టీయూ ఉన్నతాధికారులు పలుమార్లు రికార్డులను తనిఖీలు చేసిన సందర్భాలున్నాయి. ఆలయానికి అనుబంధంగా ఉన్న నర్సింగ్కళాశాలలో చదువుతున్న విద్యార్థినులకు భద్రత కరువైంది. ఇటీవల కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఆటోలో ఏరియా ఆస్పత్రికి శిక్షణ నిమిత్తం వెళుతుండగా కిడ్నాప్ యత్నం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దశలవారీగా అవినీతికి అడ్డుకట్ట వేస్తున్నాం ఆలయంలో అవినీతి, అక్రమాలకు దశలవారీగా అడ్డుకట్ట వేస్తున్నాం. దళారీవ్యవస్థ భక్తులను దోచుకోకుండా పూర్తిగా నివారించాం. పూజాసామగ్రి, ఆలయ ఖర్చులు తదితర అంశాలపై దృష్టిసారించాం. భక్తుల సొమ్ము వృథా కాకుండా చర్యలు చేపడుతాం. - విజయ్‌కుమార్, ఆలయ ఈవో