రాహుకేతు పూజల్లో రష్యన్లు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ సౌందర్యం చాలాబాగుందని, వెరీ బ్యూటిఫుల్ అని పలువురు రష్యన్లు కొనియాడారు. రష్యా రాజధాని మాస్కోకు చెందిన 30మంది మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. ఆలయాధికారులు వారికి స్వాగతం పలికారు. రూ.500 టిక్కెట్ ద్వారా శ్రీకృష్ణదేవరాయుల మండపంలో రాహుకేతు సర్పదోషనివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. పరివారదేవతా మూర్తులను సైతం దర్శించుకున్నారు.
తర్వాత వారు మాట్లాడుతూ శిఖర దర్శనాలు, ఆలయ శిల్ప సౌందర్యం అద్భుతంగా ఉందన్నారు. తమిళనాడుకు చెందిన పలువురు మాస్కోలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారి సూచనల మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసినట్లు చెప్పా రు. ప్రధానంగా రాహుకేతు పూజలు చేయించుకుంటే వివాహం కానివారికి వివాహం, సంతానం లేనివారికి సంతానం, ఆరో గ్యం సమస్యలు ఉన్నా కుదుటపడుతాయని చెప్పడంతో విచ్చేశామని పేర్కొన్నారు. ఆలయ ఆవరణలోని శిల్ప సౌందర్యాన్ని కెమెరాల్లో బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment