రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య కెనడా, బ్రిటన్‌లు..స్విఫ్ట్(సోసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తీసేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రష్యాన్ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ పై దాడికి కఠినమైన పాశ్చాత్య ప్రతిస్పందనగా గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ స్విప్ట్ నుంచి రష్యాను మినహాయించే ఒప్పందం గురించి వార్తలు గుప్పుమన్నాయి.
దీంతో వందల కొలది రష్యన్ వాసులు ఏటీఎం మిషన్ల వద్ధ బారులు తీరి ఉన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా అంతటా అంతర్గత భయాందోళనలు మొదలైయ్యాయి. శనివారం, రష్యా మిలిటరీ ఉక్రెయిన్ నగరాలపై దాడిని వేగవంతం చేయడంతో, పాశ్చాత్య మిత్రదేశాలు దేశ బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాయి. ఈ మేరకు డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే అంతర్జాతీయ వ్యవస్థ అయిన స్విప్ట్ నుంచి ఎంపిక చేయబడిన బ్యాంకులను తగ్గించడం ద్వారా రష్యా అంతర్జాతీయ వాణిజ్య సామర్థ్యాన్ని తీవ్రంగా అడ్డుకుంటుంది.
అంతేకాదు సుమారు 200 దేశాలలో దాదాపు 11వేల కంటే ఎక్కువ ఆర్థిక సంస్థలు స్విఫ్ట్‌ని ఉపయోగిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ రాస్‌విఫ్ట్ ప్రకారం, రష్యా వినియోగదారుల సంఖ్య పరంగా యునైటెడ్ స్టేట్స్ తర్వాత రెండవ అతిపెద్ద దేశం రష్యా, దాదాపు 300 రష్యన్ ఆర్థిక సంస్థలు ఈ వ్యవస్థకు చెందినవి. దీంతో రష్యా అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం కష్టమైపోతుంది. ఈ భయాందోళనలతో రష్యా వాసులు ఏటీఎంకు క్యూలు కడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment