Russians
-
రామ్‌లీలా ప్రదర్శనతో అలరించిన రష్యన్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళి ముందు రోజు నిర్వహించనున్న దీపోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమారు 12 మంది రష్యన్ కళాకారుల బృందం రామలీలాను ప్రదర్శించింది. ఈ మేరకు శనివారం రష్యన్ కళాకారుల బృందం సాంప్రదాయ దుస్తులతో వేషాలు వేసుకుని రామలీలా ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. మాస్కోలోని ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ సొసైటీ అధ్యక్షుడు పద్మశ్రీ గెన్నాడి మిఖైలోవిచ్ పెచ్చికోవ్ మెమోరియల్ ఆధ్వర్యంలో రష్యా కళాకారుల బృందం ప్రదర్శన ఇచ్చింది. ఈ క్రమంలో ప్రదర్శన దర్శకుడు, నిర్మాత రామేశ్వర సింగ్ మాట్లాడుతూ...యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తమకు రష్యన్ బృందం చేత రామ్‌లీలా నాటకాన్ని ప్రదర్శించేలా భారత్‌లో ఒక వేదికను అందించారని అన్నారు. 1960 నుంచి రష్యాలో రామ్‌లీలా చాలా ప్రముఖంగా ప్రదర్శించబడుతున్నట్లు సింగ్ తెలిపారు. వారందరికి భాష కష్టం కాలేదు గానీ పాత్రలను పోషించడంలో ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఈ మేరకు ఒక రష్యన్ నటి మాట్లాడుతూ తాను సీతగా నటించడాని సుమారు మూడు నెలలు ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అంతేగాదు దీపావళి రోజున జరిగే దీపోత్సవ్ వేడుకలకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా 15 లక్షలకు పైగా దీపాలను వెలిగించనున్నారు. దీన్నీ వీక్షించేందుకు ప్రధాని మోదీ కూడా ఆదివారం అయోధ్య సందర్శించనున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: మహిళపై మంత్రి చేతివాటం ... తర్వాత పాదాలను తాకి...) -
దేశం వీడి పారిపోతున్న రష్యన్లు.. లక్షలు వెచ్చించి విమాన టికెట్లు కొనుగోలు
మాస్కో: యుద్ధానికి సిద్ధం కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల అధికారిక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మరునాటి నుంచే చాలా మంది రష్యన్లు దేశం వీడి పారిపోతున్నారు. కొద్ది రోజుల్లో దేశ సరిహద్దులు మూసివేస్తారని తెలిసి రూ.లక్షలు ఖర్చు చేసి మరీ విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సంపన్నులు ఎంత ఖర్చయినా లెక్క చేయకుండా ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. ఇదే అదనుగా భావించిన విమాన సంస్థలు టికెట్ల ధరలు, ప్రైవేటు జెట్ల ఛార్జీలను భారీగా పెంచాయి. ఆర్మేనియా, టర్కీ, అజర్బైజన్ వంటి దేశాలకు రష్యా పౌరులు వీసా లేకుండానే వెళ్లవచ్చు. దీంతో ఆయా దేశాలకు ఛార్జీలను ఏకంగా 20వేల పౌండ్ల(రూ.17.5లక్షలు) నుంచి 25వేల పౌండ్ల(రూ.22లక్షలు) మధ్య నిర్ణయించాయి విమానయాన సంస్థలు. 8 సీట్ల ప్రైవేటు జెట్ విమానానికి ఏకంగా రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ ఛార్జీలతో పోల్చితే ఇది చాలా రెట్లు అధికం. ఛార్జీలు ఇంత అధికంగా ఉన్నా రష్యన్లు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. యుద్ధంలో పాల్గొనకుండా హాయిగా బతికేందుకు డబ్బు గురించి ఆలోచించకుండా దేశం వీడి పారిపోతున్నారు. పుతిన్ ప్రకటన తర్వాత ఇప్పటికే 2.6లక్షల మంది రష్యన్లు దేశాన్ని వీడినట్లు కీవ్‌కు చెందిన వార్తా సంస్థ తెలిపింది. ఇంతకుముందు తమకు రోజుకు 50 మంది నుంచి మాత్రమే విజ్ఞప్తులు వచ్చేవని, కానీ ఇప్పుడు రోజుకు 5వేల మంది టికెట్ల కోసం ఫోన్లు చేస్తున్నారని ఓ జెట్ కంపెనీ డైరెక్టర్ తెలిపాడు. తమ జెట్లలో అత్యంత చౌకైన టికెట్ ధర రూ.2.6లక్షలు అని చెప్పాడు. డిమాండ్ విపరీతంగా ఉందని, ప్రస్తుత పరిస్థితి క్రేజీగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఐరోపా విమానయాన సంస్థలు ప్రస్తుతం సేవలు అందించడం లేదని, అందుకే డిమాండ్ ఇంతగా పెరిగిందని వివరించాడు. చదవండి: 'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత -
విరక్తిలో రష్యన్లు.. పుతిన్‌కు గడ్డుకాలం
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు స్వదేశంలో చేదు అనుభవం ఎదురవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను రష్యన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పుతిన్ తీరును తప్పుబడుతూ వీధులు, రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రష్యాకు చెందిన సెలబ్రేటీలు, మీడియా ప్రముఖులు బహిరంగంగానే పుతిన్ చర్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధానికి నిరసనగా వేల సంఖ్యలో రష్యన్లు బహిరంగ లేఖలు రాస్తున్నారు. దీంతో, అక్కడి పోలీసులు.. నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత మందిని అరెస్ట్ చేస్తారంటూ అసభ్యకర పదజాలంతో నిరసనలు తెలిపారు. మరోవైపు.. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతంలో రష్యన్ భారీ సంఖ్యలో బయటకు వచ్చారు. యుద్దంపై విరక్తితో వెంటనే దాడులను నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. కాగా, ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యన్లు చాలా వరకు సేవలను కోల్పోతున్నారు. ఇక ఇటీవలే.. అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్ కీలక ప్రకటన చేసింది. రష్యా మార్కెట్ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు సోమవారం ప్రకటించేసింది. ముప్ఫై ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఓ ప్రకటనలో మెక్‌డొనాల్డ్స్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతకుముందు అమెరికన్ పేమెంట్ సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్ సంస్థలు.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల ఆక్రమణ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన దాడులకు ఈరోజుతో మూడు నెలలు గడిచింది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని చవిచూసింది. దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌లోనే పెద్దదైన అజోస్తోవ్ స్టీట్ ప్లాంట్ తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా ప్రకటించింది. దీంతో, అక్కడ(మరియుపోల్‌లో) యుద్ధం ముగిసిందని రష్యా సైన్యం వెల్లడించింది. Not everyone in #Russia is falling for the Kremlin's lies. During a concert the crowd can be heard chanting "F*ck the war!" "They can't arrest us all!" Inspiring. Please share! 🚜🎼#PuckFutin #Putler#StandWithUkraine #activism #RussiaProtests #Ukraine #Putin #WarCrimes pic.twitter.com/YYg1xv6VPH — TACTICAL STRIKE MEDIA (@tsm3301) May 23, 2022 ఇది కూడా చదవండి: భారత్‌కు మాత్రమే అది సాధ్యమైంది.. వెల్డన్ మోదీ జీ -
పుతిన్ ఆంక్షలు... రష్యన్లు దేశం విడిచి వెళ్లకుండా కట్టడి!
Putin has banned Russians from leaving country: ఉక్రెయిన్ రష్యాల మధ్య పోరు నివరవధికంగా సాగుతూనే ఉంది. ప్రపంచదేశాల ఆంక్షలు, హెచ్చరికలు లక్ష్య పెట్టక తనదైన యుద్ధ వ్యూహ రచనతో ఉక్రెయిన్‌పై దాడి కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే ప్రపంచదేశాలన్ని పలు ఆంక్షలతో రష్యాని కట్టడిచేసేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాక బ్యాంకులను దిగ్బంధం చేసి స్విఫ్ట్ కొరడ ఝళిపించేందుకు యత్నిస్తోంది. దీంతో ఇప్పుడు పుతిన్ సుమారు రూ.7 లక్షలకు పైగా విదేశీ కరెన్సీతో రష్యన్లు ఎవరు దేశం విడిచి పారిపోకుండా ఉండేలా నిషేధించారని ఉక్రెయిన్ స్థానిక మీడియా పేర్కొంది. అందుకు సంబంధించిన డిక్రి పై కూడా పుతిన్ సంతకం చేశారని తెలిపింది. ఉక్రెయిన్‌పై దాడి చేసినందుకు రష్యాపై అమెరికా దాని మిత్రదేశాలు, ఈయూ , ఇతర దేశాలు విధించిన ఆంక్షలను అనుసరించి పుతిన్ ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయన్‌కు బహిరంగంగా తన మద్ధతను బలపరిచారు. రష్యాపై పోరాటంలో యూఎస్ ప్రమేయం లేదని చెప్పారు. అయితే తమ దేశం తన మిత్రదేశాలతో కలిసి నాటో భూభాగాలను కాపాడుతుందని చెప్పారు. ఈ మేరకు జోబైడెన్ మాట్లాడుతూ...ఉక్రేనియన్లు స్వచ్ఛమైన ధైర్యంతో పోరాడుతున్నారని,రాబోయే కొద్ది రోజులు, వారాలు లేదా నెలలు వారికి కఠినంగా ఉండొచ్చు. అంతేకాదు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను ట్యాంకులతో చుట్టు ముట్టవచ్చునేమో కానీ ఉక్రెయిన్ ప్రజల మనస్సులను గెలవలేడు. ప్రపంచ దేశాల ధృఢ సంకల్పాన్ని పుతిన్ ఎన్నటికీ బలహీనపరచలేడు అని అన్నారు. (చదవండి: మెళ్లకు మైళ్లు నడిచి..) -
బ్యాంక్ దిగ్బంధనం... ఏటీఎంకి క్యూ కట్టిన రష్యన్ వాసులు
రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య కెనడా, బ్రిటన్లు..స్విఫ్ట్(సోసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తీసేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రష్యాన్ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ పై దాడికి కఠినమైన పాశ్చాత్య ప్రతిస్పందనగా గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ స్విప్ట్ నుంచి రష్యాను మినహాయించే ఒప్పందం గురించి వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వందల కొలది రష్యన్ వాసులు ఏటీఎం మిషన్ల వద్ధ బారులు తీరి ఉన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా అంతటా అంతర్గత భయాందోళనలు మొదలైయ్యాయి. శనివారం, రష్యా మిలిటరీ ఉక్రెయిన్ నగరాలపై దాడిని వేగవంతం చేయడంతో, పాశ్చాత్య మిత్రదేశాలు దేశ బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాయి. ఈ మేరకు డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే అంతర్జాతీయ వ్యవస్థ అయిన స్విప్ట్ నుంచి ఎంపిక చేయబడిన బ్యాంకులను తగ్గించడం ద్వారా రష్యా అంతర్జాతీయ వాణిజ్య సామర్థ్యాన్ని తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతేకాదు సుమారు 200 దేశాలలో దాదాపు 11వేల కంటే ఎక్కువ ఆర్థిక సంస్థలు స్విఫ్ట్‌ని ఉపయోగిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ రాస్విఫ్ట్ ప్రకారం, రష్యా వినియోగదారుల సంఖ్య పరంగా యునైటెడ్ స్టేట్స్ తర్వాత రెండవ అతిపెద్ద దేశం రష్యా, దాదాపు 300 రష్యన్ ఆర్థిక సంస్థలు ఈ వ్యవస్థకు చెందినవి. దీంతో రష్యా అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం కష్టమైపోతుంది. ఈ భయాందోళనలతో రష్యా వాసులు ఏటీఎంకు క్యూలు కడుతున్నారు. (చదవండి: అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు..) -
బంజారా పాట.. అదిరిపోయే స్టెప్పులతో రష్యన్ల ఆట!
మాస్కో: కళకు సరిహద్దులు, భాషా బేధం లేదు. ఆ కళలలో సంగీతం కూడా ఒకటి. అలాగే భారతీయ సంగీతంలో ఓ మాయాజాలం ఉంది. పాట సాహిత్యాన్ని అర్థ చేసుకోకపోయినా.. భారతీయ పాటల బీట్స్‌కి ఎవరైనా కాలు కదపవచ్చు. అయితే తాజాగా ఓ రష్యన్ల బృందం పంజాబీలో ‘‘ముండియన్ తు బాచ్ కే’’ అనే ప్రసిద్థ పాటకు అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. డ్యాన్స్ గ్రూపులోని పురుషులు, మహిళలు భారతీయ వేషధారణలో ఉన్నారు. మహిళలు ఎరుపు లెహోంగా-చోలి ధరించగా.. పురుషులు కుర్తా-పైజామా ధరించి, సరియైన భావ వ్యక్తీకరణలతో నృత్యం చేస్తున్నారు. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారి నాట్యానికి, నటనకు ఫిదా అవుతున్నారు. వందలాది మంది అభినందనలు తెలుపుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘కళకు సరిహద్దులు లేవు.. మీ డ్యాన్స్‌కి నేను ఫిదా!’’ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ ‘‘ భారతీయ సంస్కృతిలో 64 కళలు.. ఆ కళలలో సంగీతం కూడా ఒకటి. మీ నృత్య ప్రదర్శన భలే ఉంది.’’ అని రాసుకొచ్చారు. #Russians and #Bhangra beats. pic.twitter.com/fb4lqFgPSn — Rupin Sharma IPS (@rupin1992) July 6, 2021 -
గూగుల్‌లో చూసి.. రష్యా నుంచి హార్సిలీహిల్స్‌కు!
బి.కొత్తకోట : ఎన్నో పర్యాటక ప్రాంతాల్లో పర్యటించినా ఏపీ టూరిజంలా ఎక్కడా లేదని రష్యాకు చెందిన పర్యాటకులు డేనియల్, దిమిత్రి తెలిపారు. మిత్రులైన వీరు రష్యాలోని మాస్కోలో వృత్తిపరమైన వ్యాపారం చేసుకొంటూ జీవిస్తున్నారు. వీరికి పర్యాటక ప్రాంతాల సందర్శన అంటే ఇష్టం. పర్యాటక స్థలాల గురించి గూగుల్‌లో వెతుకుతుండగా చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్ గురించి తెలుసుకొన్నారు. బెంగళూరులో ఉన్న ప్రాంతాలు చూసుకుని ఆదివారం హార్సిలీహిల్స్ చేరుకున్నారు. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని కొండపైనున్న ఆహ్లాదకర వాతావరణంలో ఇక్కడి మొక్కలు, యూకలిప్టస్ వృక్షాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. విలేకరులతో మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలను సందర్శించడం తమ హాబీ అని తెలిపారు. గూగుల్‌లో హార్సిలీహిల్స్ గురించి తెలుసుకొని వచ్చామన్నారు. ఇక్కడి ప్రకృతి అందాలు, చల్లటి వాతావరణం మరెక్కడా చూడలేదని వివరించారు. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ టూరిజంశాఖ నిర్వహణ, పనితీరు బాగుందని వారు ప్రశంసించారు. -
పుతిన్‌కు భారీగా తగ్గిన ప్రజాదరణ
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రజాదరణ ఒక్కసారిగా పడిపోయింది. పింఛను సంస్కరణల నేపథ్యంలో సాధారణ ప్రజానీకంలో 39 శాతం మంది మాత్రమే ఆయన్ను నమ్ముతున్నట్లు ఓ సర్వేలో వెల్లడయింది. 2014లో ఉక్రెయిన్ నుంచి క్రిమియాను ఆక్రమించుకున్న తర్వాత ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే ప్రథమం. పుతిన్ ప్రజాదరణ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 9 పాయింట్లు తగ్గిందని లెవడ–సెంటర్ అనే స్వతంత్ర సంస్థ చేపట్టిన సర్వే తెలిపింది. 2017 నవంబర్ నుంచి సెప్టెంబర్ వరకు చూస్తే మొత్తంగా 20 పాయింట్లు పడిపోయినట్లు పేర్కొంది. రిటైర్మెంట్ వయస్సును పురుషులకు 65 ఏళ్లు, మహిళలకు 60 ఏళ్లకు పెంచుతూ పుతిన్ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. -
శ్రీకాళహస్తి టెంపుల్ వెరీ బ్యూటిఫుల్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయ సౌందర్యం చాలాబాగుందని, వెరీ బ్యూటిఫుల్ అని పలువురు రష్యన్లు కొనియాడారు. రష్యా రాజధాని మాస్కోకు చెందిన 30మంది మంగళవారం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి విచ్చేశారు. ఆలయాధికారులు వారికి స్వాగతం పలికారు. రూ.500 టిక్కెట్ ద్వారా శ్రీకృష్ణదేవరాయుల మండపంలో రాహుకేతు సర్పదోషనివారణ పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి,అమ్మవార్లను దర్శించుకున్నారు. పరివారదేవతా మూర్తులను సైతం దర్శించుకున్నారు. తర్వాత వారు మాట్లాడుతూ శిఖర దర్శనాలు, ఆలయ శిల్ప సౌందర్యం అద్భుతంగా ఉందన్నారు. తమిళనాడుకు చెందిన పలువురు మాస్కోలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారి సూచనల మేరకు శ్రీకాళహస్తీశ్వరాలయానికి విచ్చేసినట్లు చెప్పా రు. ప్రధానంగా రాహుకేతు పూజలు చేయించుకుంటే వివాహం కానివారికి వివాహం, సంతానం లేనివారికి సంతానం, ఆరో గ్యం సమస్యలు ఉన్నా కుదుటపడుతాయని చెప్పడంతో విచ్చేశామని పేర్కొన్నారు. ఆలయ ఆవరణలోని శిల్ప సౌందర్యాన్ని కెమెరాల్లో బంధించారు. -
మాస్కో టు శ్రీకాళహస్తి
-
మాస్కో టు శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి (చిత్తూరు): ఇప్పటికే ఖండాంతరాలకు పాకిన శ్రీకాళహస్తీశ్వర మహత్యానికి సోమవారం మరో రుజువు లభించింది. శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజలు చేస్తే శుభం జరుగుతుందనే విశ్వాసంతో రష్యాకు చెందిన 16 మంది భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస్కో నగరం నుంచి వచ్చిన వీరు రూ.2,500 టిక్కెట్ కొనుగోలు చేసి రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం ఆలయుంలోని స్వామి, అవ్మువార్లతోపాటు పరివార దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఆలయు ఆవరణలో 30 నిమిషాలపాటు ధ్యానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహుకేతు పూజలు చేసుకుంటే వివాహం కాని వారికి పెళ్లవుతుందనీ, సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుందని మాస్కోలో ఉంటున్న చెన్నైకి చెందిన వారు చెప్పారని, అందుకే ఇక్కడికి వచ్చామని, ఆలయు శిల్పసౌందర్యం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.