![Super Star Rajinikanth Attended For Vijay Kumar grand Daughter wedding - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/19/rajinikanth.jpg.webp?itok=d1TxPngn)
కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా చెన్నైలో సందడి చేశారు. సీనియర్ నటుడు విజయకుమార్ మనవరాలు దియా పెళ్లికి ఆయన హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. బంధువులు, సినీ ప్రముఖుల సమక్షంలో విజయ్ కుమార్ కూతుర్లలో ఒకరైన అనితా కుమార్తె దియా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ వివాహా వేడుకలో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని ఓ ఖరీదైన హోటల్‌లో ఈ వివాహా వేడుక జరిగింది.
కాగా.. రజనీకాంత్, విజయకుమార్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. నటుడిగా విజయకుమార్ తమిళ చిత్రసీమలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందారు. కోలీవుడ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో దాదాపు 400కి పైగా చిత్రాలలో కనిపించారు. ఆయన ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు.
కాగా.. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు టీజే జ్ఞానవేల్ చిత్రం'వెట్టయన్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి'తలైవర్ 170' అనే సినిమా చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment