degree exam
-
అంతా ‘ఓపెన్’.. చూస్కో, రాస్కో
సాక్షి, కారేపల్లి(ఖమ్మం): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షను అభ్యాసకులు ఎంచక్కా పుస్తకాలు, నోట్స్‌లను చూస్తూ రాశారు. మంగళవారం కారేపల్లిలోని ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలోని పరీక్ష కేంద్రంలో పలువురి చూచిరాతలపై సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నెల 11వ తేదీ నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు జరుగుతుండగా..మంగళవారం 20 మంది హాజరయ్యారు. సెల్‌ఫోన్, పుస్తకాలు దగ్గరపెట్టుకొని మరీ రాశారు. ఇన్విజిలేటర్లు సైతం చూసి చూడనట్లు వ్యవహరించారు. వారే దగ్గరుండి రాయించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. (చదవండి: ఏం ఫ్యామిలీరా బాబూ..! భార్య ఇంట్లోకి వెళ్లి సర్దేస్తుంది.. అనంతరం కూతురితో కలిసి..) -
పరీక్ష రాస్తుండగా పేపర్ లాగేశారు
ఒంగోలు మెట్రో: పీజీ పరీక్షలు వారం రోజులు ముందుకు జరిపి నిర్వాకం ప్రదర్శించిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అధికారులు ఇప్పుడు ఏకంగా డిగ్రీ పరీక్షలు రాస్తుండగానే రద్దు చేసి మరో సంచలనానికి కారణమయ్యారు. కరోనా కష్టకాలంలో అసలే రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలూ పడి కేంద్రాలకు చేరుకుని పరీక్ష రాస్తున్న విద్యార్థులను విశ్వవిద్యాలయ అధికారుల తీరు కన్నీరు పెట్టించింది. ఏకాగ్రతతో పరీక్ష రాస్తున్న సమయంలో కేంద్రాల నిర్వాహకులు ఓఎంఆర్ షీట్లు లాగేసుకుంటుంటే చేష్టలుడిగి చూడటం విద్యార్థుల వంతైంది. యూనివర్సిటీ పరీక్షాధికారుల తప్పిదం వల్ల జిల్లాలో వేలాది మంది డిగ్రీ కోర్సుల విద్యార్థులు తీవ్ర అవస్ధలు పడ్డారు. దాదాపు ఆరు నెలల తర్వాత జరుగుతున్న పరీక్షలనైనా ప్రణాళికాబద్దంగా నిర్వహించాల్సిన అధికారులు తీవ్ర అలసత్వంతో నిర్వహిస్తూ పరీక్షల ప్రక్రియనే అపహాస్యం చేశారంటూ విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు. (అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు) పశ్చిమ ప్రకాశంలో గంట గడిచాక.. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు కరోనా కారణంగా ఆగిపోగా, తిరిగి సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభించారు. మార్చి 21 నుంచి ఏప్రిల్ 8వరకు నిర్వహించాల్సిన పరీక్షలను సెప్టెంబర్ 7 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు రీ–షెడ్యూల్ చేశారు. గత వారంలో డిగ్రీ మూడో సంవత్సర విద్యార్థులకు గత వారం పరీక్షలు పూర్తయ్యాయి. డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు పరీక్షలు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో సెప్టెంబర్ 15 సోమవారం బీకాం విద్యార్థులకు ఎనలిటికల్ స్కిల్స్, బీఎస్సీ విద్యార్థులకు కెమిస్ట్రీ పరీక్ష నిర్వస్తున్నారు. జిల్లాలో చీరాల, కంభం, అద్దంకి, కందుకూరు, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, ఒంగోలు తదితర పదికి పైగా కేంద్రాల్లో వేలాదిమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కరోనా కారణంగా రవాణా సదుపాయాలు లేక నానా తిప్పలు పడి కేంద్రాలకు చేరుకుని పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో ఎంపిక చేసిన అన్ని పరీక్షల కేంద్రాల్లో విద్యార్థులు యథాతధంగా పరీక్ష రాస్తుండగా, ఆయా కేంద్రాల నిర్వాహకులు పరీక్ష రద్దయిందంటూ జవాబు పత్రాలు లాక్కుంటుండటంతో విద్యార్థులు అవాక్కయ్యారు. కంభం, గిద్దలూరు, మార్కాపురం తదితర కేంద్రాల్లో విద్యార్థులు సగానికి పైబడి పరీక్షను పూర్తి చేశారు. ఇక ఒంగోలులోని పలు కేంద్రాల్లో విద్యార్థులు గంటకు పైగా పరీక్ష రాసేశారు. ఒంగోలులో నోడల్ కాలేజీ నుంచి పరీక్ష రద్దయిందంటూ సమాచారం వచ్చిందని పేపర్లు లాగేసుకున్నారు. దీంతో విస్తుపోవటం విద్యార్థుల వంతయింది. మారని అధికారుల తీరు.. జిల్లాలోని డిగ్రీ, పీజీ విద్యార్థులపై విశ్వవిద్యాలయ అధికారుల తీరు మారటం లేదు. విద్యార్థులకు, కాలేజీల యాజమాన్యాలకు ఉపయుక్తంగా ఒంగోలులో ఒక పరిపాలనా కార్యాలయం పెట్టమని, ఎప్పటికప్పుడు తగిన విధంగా సమాచారం ఇవ్వమని దశాబ్దాలుగా జిల్లా విద్యార్థులు, యాజమాన్యాలు ఎంత మెరపెట్టుకుంటున్నప్పటికీ, నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు పట్టించుకోవటం లేదు. ఈ క్రమంలో ఆయా కేంద్రాల్లో ఎంపిక చేసిన నోడల్ కాలేజీలు సైతం యూనివర్సిటీకే లేదు. తమకెందుకు బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఇక డిగ్రీ విద్యను పట్టించుకోవాల్సిన రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఎప్పుడో చుట్టపుచూపుగా తప్ప జిల్లాకు వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో జిల్లాలో డిగ్రీ, పీజీ విద్యలో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుత పరీక్షల నిర్వహణలో అయితే పరీక్షల పరిశీకులు, స్క్వాడ్ మెంబర్లుగా ప్రభుత్వ, ఎయిడెడ్ లెక్చరర్లుని నియమించాల్సిన అధికారులు తమకు తెల్సిన ఒకరిద్దరు ప్రవేటు లెక్చరర్లను నియమించి చేతులు దులుపుకున్నారు. కనిపించని సమన్వయం.. జిల్లాలో 200 డిగ్రీ కళాశాలలు, 60కి పైగా పీజీ కళాశాలలు, మరో 60 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. దాదాపు ప్రతియేటా పాతిక వేలమందికి పైగా విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాలల్లో చదువుతున్నారు. వీరి కోర్సుల నిర్వహణ, పరీక్షలు, మూల్యాంకనం తదితర అంశాల్లో జిల్లాకు చెందిన అధ్యాపకుల, యాజమాన్యాల సమన్వయం లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈసారి యూనివర్సిటీ పాలకమండలి సభ్యులలో జిల్లా నుంచి కనీసం ఒక్కరిని కూడా నియమించలేదు. తద్వా రా జిల్లాలోని డిగ్రీ, పీజీ, బీఈడీ విద్య నిర్వహణ, పరిపాలన విషయాల్లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ అధికారులు కనీసం సవతితల్లి ప్రేమనైనా చూపడం లేదు. దీంతో విద్యా ర్థులు, కాలేజీల నిర్వాహకుల అవస్థలు వర్ణనాతీతం. ఇటువంటి నిర్లక్ష్యంలో భాగంగానే సోమవారం పరీక్షను గంట ముందు రద్దు చేసి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పాలు చేశారు. (శ్రీసిటీని సందర్శించిన జపాన్ కాన్సుల్ జనరల్) 18న మళ్లీ పరీక్ష నిర్వహిస్తాం గుంటూరులో వర్షం కారణంగా సెప్టెంబర్ 15 సోమవారం రద్దు చేసిన పరీక్షను సెప్టెంబర్ 18న నిర్వహిస్తామని విశ్వవిద్యాలయ పరీక్షల అదనపు నియంత్రణ అధికారి ఎ.వెంకటేశ్వర్లు, పరీక్షల సమన్వయకర్త కె.మధుబాబు తెలిపారు. ఇక రీ–షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్న పరీక్షలను యథాతధంగా నిర్వహించనున్నట్టు వారు పేర్కొన్నారు. – ఎఎన్యూ పరీక్షల విభాగం -
తప్పులు.. తిప్పలు
– డిగ్రీ రెండో సెమిస్టర్ హిందీ ప్రశ్నాపత్రంలో సిలబస్‌లో లేని ప్రశ్నలు – పరీక్షను వాయిదా వేసిన పరీక్షల విభాగం అధికారులు ఎస్కేయూ : డిగ్రీ పరీక్షల విభాగం అస్తవ్యస్తంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయి. ప్రశ్న పత్రాల్లో తరచూ తప్పులు వస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హిందీ పరీక్ష వాయిదా : డిగ్రీ రెండో సెమిస్టర్ పరీక్ష మంగళవారం ప్రారంభమైంది. పోయిట్రీ మూడో సెమిస్టర్‌లోనూ, ప్రోసన్ రెండో సెమిస్టర్లో సిలబస్‌ను ఖరారు చేశారు. అయితే రెండూ కలిపిన సిలబస్‌తో కూడిన ప్రశ్నపత్రాన్ని తాజాగా మంగళవారం జరిగిన పరీక్షలో విద్యార్థులకు అందజేయడంతో గందరగోళం నెలకొంది. పాఠ్యాంశాలకు విరుద్ధంగా ప్రశ్నలు రావడంతో విద్యార్థులకు దిక్కుతోచలేదు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని వర్సిటీ పరీక్షల విభాగం అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరీక్షను వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా వేసిన పరీక్షను మే 6న నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. గతంలోనూ ఇదే తంతు ఇయర్లీ ఎగ్జామ్స్ (సాంవత్సరిక పరీక్షలు)ల్లోనూ ఇవే తప్పిదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 10న జరిగిన డిగ్రీ ఫైనలియర్ స్టాటిస్టిక్స్ ప్రశ్నప్రతంలో పూర్తీగా గణితం సిలబస్‌ను ఇచ్చారు. ఈ నెల 12న జరిగిన పేపర్–4 ప్రశ్నాపత్రం బదులు, మూడో పేపర్‌ను ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన కూడా నిర్వహించారు. సెమిస్టర్ పరీక్షల్లో అయినా .. ఈ తప్పిదాలకు చోటు చేసుకోకుండా సజావుగా జరుగుతాయని భావించిన నేపథ్యంలో మళ్లీ తప్పులు పునరావృతం అయ్యాయి. సెమిస్టర్ పరీక్ష ప్రారంభంలోనే ఇంగ్లీష్ ప్రశ్నపత్రంలో (ఈ నెల 15న జరిగిన పరీక్ష) 15 మార్కులు సిలబస్‌లో లేని ప్రశ్నలు వచ్చాయి. దీంతో విద్యార్థులు పూర్తీగా నష్టపోతున్నారు. కాలం చెల్లిన విధానాలు ప్రశ్నాపత్రం రూపకల్పనలో కాలం చెల్లిన విధానాలు అనుసరిస్తుండడంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రశ్నాప్రతం రూపకల్పన అనంతరం సంబంధిత సబ్జెక్టు బోర్డ్ ఆఫ్ స్టడీస్ , పరీక్షల డీన్ సమక్షంలో పరిశీలన జరగాలి. అనంతరం ప్రశ్నాపత్రం ప్రింటింగ్ ప్రెస్‌కు పంపాలి. ఇలాంటి సాంప్రదాయం కొన్ని వర్సిటీలలో విజయవంతంగా అమలు చేస్తున్నారు. కానీ అధ్యాపకుడు రూపొందించిన ప్రశ్నాపత్రాన్ని నేరుగా ప్రెస్‌కు పంపుతుండటంతో ప్రశ్నాపత్రాల్లో తప్పులు వస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పశ్నాపత్రం తయారు చేసిన వారిదే తప్పు సెమిస్టర్ పరీక్షలో సాంవత్సరిక సిలబస్‌తో కూడిన ప్రశ్నాపత్రం రూపకల్పన చేశారు. ఇది పూర్తీగా ప్రశ్నాపత్రం తయారు చేసిన వారి తప్పిదమే. అందుకే పరీక్షను వాయిదా వేశాము. తిరిగి 6న హిందీ పరీక్ష నిర్వహిస్తాం. – ఆచార్య రెడ్డివెంకటరాజు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ -
ఆ రెండు కాలేజీలపై మక్కువ ఎందుకో..?
శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఈనెల 11 నుంచి నిర్వహించనున్న డిగ్రీ పరీక్షల్లో వర్సిటీ అధికారులు 52 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో కేవలం రెండు కళాశాలలకు మాత్రమే సెల్ఫ్ సెంటర్లను కేటాయించడంతో నాలుగు రోజులుగా విద్యార్థి సంఘాలకు, యూనివర్సిటీ అధికారులకు వివాదం తలెత్తింది. వర్సిటీ పరిధిలోని 120 కళాశాలల్లో కేవలం రెండు కళాశాలలకు సెల్ఫ్ సెంటర్లు ఇవ్వడంలో అంతర్యమేమిటని విద్యార్థి సంఘాలు, మిగతా కళాశాలల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నా.. వర్సిటీ అధికారులు నోరు విప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాయికల్‌లోని జ్ఞానోదయ డిగ్రీ కళాశాలతో పాటు ఎల్లారెడ్డిపేట మండలంలోని గాయత్రి డిగ్రీ కళాశాలకు సెల్ఫ్ సెంటర్లు అలాట్ చేశారు. గాయత్రి కళాశాలలో గతేడాది వార్షిక పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జోరుగా జరిగిందని ఆరోపిస్తూ మండలంలోని వేరొక కళాశాల లిఖితపూర్వకంగా మంత్రి కేటీఆర్‌కు విన్నవించింది. ఈ నేపథ్యంలో ఆరు నెలల క్రితం జరిగిన సప్లమెంటరీ డిగ్రీ పరీక్షలకు సదరు కళాశాల సెంటర్‌ను వర్సిటీ అధికారులు రద్దు చేశారు. కానీ ఈ వార్షిక పరీక్షలకు మళ్లీ సెల్ఫ్ సెంటర్‌ను ఇవ్వడంతో ఇటు విద్యార్థి సంఘాలు, ఇతర డిగ్రీ కళాశాలల నిర్వాహకులు వర్సిటీ అధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. గురువారం ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయిబాబా ఆధ్వర్యంలో వీసీ చాంబర్ ముందు బైఠాయించడంతో వర్సిటీ అధికారులు సంప్రదింపులు జరిపారు. సెంటర్ల కేటాయింపుల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, విద్యార్థుల సంఖ్య ఆధారంగానే సెంటర్లను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. పారదర్శకతను నిరూపించుకోవడానికి వర్సిటీ అధికారులతో విద్యార్థి సంఘ నాయకులు, మీడియా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తి వివరాలు సేకరించిన ఆనంతరం సెంటర్ల రద్దు విషయాన్ని ఆలోచిస్తామన్నారు. గురువారం సాయంత్రమే వర్సిటీ అధికారులు ఆయా సెంటర్ల పర్యవేక్షణకు వస్తామని చెప్పడంతో ఏబీవీపీ నాయకులు ఆయా సెంటర్స్‌కు చేరుకున్నారు. రాత్రి వరకు వర్సిటీ అధికారులు ఎవరూ రాయికల్, ఎల్లారెడ్డిపేట మండలాలకు రాకపోవడంతో అసలేం జరిగిందని అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించారు. క్షేత్రస్థాయి పర్యటనకు అధికారులు రాలేదని, సదరు కళాశాల యజమాన్యాలనే పరిపాలన విభాగానికి పిలుపించుకొని మంతనాలు జరిపినట్లు విద్యార్థి నాయకులు ఆరోపించారు. పారదర్శకత నిరూపించుకుంటామన్న వర్సిటీ అధికారులు ఎందుకిలా చేశారని పరీక్షల నియంత్రణ బోర్డు అధికారి భరత్‌ను సంప్రదించగా.. దురుసుగా మాట్లాడుతూ ఫోన్ కట్ చేసినట్లు ఆరోపించారు. బేషరతుగా రద్దు చేయాలి రాయికల్, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని డిగ్రీ కళాశాలల సెల్ఫ్ సెంటర్లను వర్సిటీ అధికారులు బేషరతుగా రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఏబీవీపీ కార్యవర్గ సభ్యుడు సాయిబాబా హెచ్చరించారు. ఆమ్యామ్యాలకు తలొగ్గి వర్సిటీ అధికారులు సెల్ఫ్ సెంటర్లు ఇచ్చారని ఆరోపించారు. ఆరునెలల నుంచి మాస్‌కాపీయింగ్, సెల్ఫ్ సెంటర్లు, విద్యా ప్రమాణాల విషయంలో వీసీ వీరారెడ్డికి, ఇతర అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని ఆవేదన చెందారు.