సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో సీబీఐ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌పై శనివారం రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ విచారించారు. సీబీఐ అభియోగాలు మోపిన మనీష్ సిసోడియా, ఆడిటర్ బుచ్చిబాబు, అర్జున్ పాండే, అమన్‌దీప్‌లకు సమన్లు జారీ చేస్తూ తదుపరి విచారణను జూన్ 2కు వాయిదా వేశారు.
ఈ సప్లిమెంటరీ చార్జిషీట్‌లో సౌత్‌గ్రూప్ ప్రస్తావన వచ్చినప్పటికీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే మద్యం విధానం రూపకల్పనలో ఆడిటర్ బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని సీబీఐ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment