పది పరీక్షలు ప్రారంభం
పది పరీక్షలు ప్రారంభం
Published Sat, Mar 18 2017 12:00 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
99.7 శాతం హాజరు
భానుగుడి (కాకినాడ): తమ జీవితంలో తొలి పబ్లిక్ పరీక్షను పదో తరగతి విద్యార్థులు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సన్నిహితులు తోడురాగా ఆత్మస్థైర్యంతో పరీక్షా కేంద్రాలవైపు అడుగులు వేశారు.జిల్లాలో 304 కేంద్రాల్లో శుక్రవారం నుంచి ప్రారభమైన ఈ పరీక్షలకు 67,148 మంది విద్యార్థులకు 66,929 మంది హాజరయ్యారు. 219 మంది గైర్హాజరయ్యారు. తొలి పరీక్షలో 99.7 శాతం విద్యార్థులు హాజరైనట్టు డీఈవో అబ్రహం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో అబ్రహం, అబ్జర్వర్ వవజాక్షి జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించాయి.
Advertisement
Advertisement