పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు
పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు
Published Mon, Mar 27 2017 11:31 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
-మాస్ కాపీయింగ్ నిరోధానికి పటిష్ట చర్యలు
-డీఈఓ అబ్రహం
మామిడికుదురు : జిల్లాలో పదో తరగతి పరీక్షలు పారదర్శకంగా జరుగుతున్నాయని డీఈఓ ఎస్.అబ్రహం తెలిపారు. ఆయన సోమవారం మామిడికుదురు, మొగలికుదురు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. మొగలికుదురు పరీక్షా కేంద్రంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆ కేంద్రాన్ని స్వయంగా పరిశీలించానని, అక్కడ ఏవిధమైన మాస్ కాపీయింగ్ జరగడం లేదని చెప్పారు. నిరంతర సమగ్ర మూల్యాంకన వి«ధానం వల్ల విద్యార్థులు ఏ విధమైన ఇబ్బందులూ పడడం లేదన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెరిగేందుకు పలు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చదివించామన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఉత్తీర్ణత శాతం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇంత వరకు ముగ్గురు విద్యార్థులను డీబార్ చేశామని, ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డీఓ, ఆరుగురు ఇన్విజిలేటర్లపై చర్యలు తీసుకున్నామని తెలిపారు.
Advertisement
Advertisement