సీబీఎస్‌ఈ పాఠశాలల్లో సీసీఈ విధానం రద్దు | CCE in CBSE schools Cancellation Policy | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈ పాఠశాలల్లో సీసీఈ విధానం రద్దు

Published Thu, Mar 23 2017 3:24 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM

CCE in CBSE schools  Cancellation Policy

న్యూఢిల్లీ: అన్ని సీబీఎస్‌ఈ స్కూళ్లలో 6–9 తరగతులకు సమగ్ర నిరంతర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సీబీఎస్‌ఈ బుధవారం తెలిపింది. బోధన, ముల్యాంకనాలను ప్రామాణీకరించడం కోసం చేపట్టనున్న ఈ మార్పులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సీబీఎస్‌ఈ పాఠశాలల్లో అమల్లోకి రానున్నాయి. పదో తరగతి పరీక్షలను పునరుద్ధరించడంతో ఈ మార్పులు అత్యవసరమయ్యాయని సీబీఎస్‌ఈ తెలిపింది. సీసీఈ విద్యా విధానంలోని లోపాల కారణంగా ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారే 6–9 తరగతుల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీబీఎస్‌ఈ అధికారి ఒకరు అన్నారు. నూతన విద్యావిధానంలో రాత పరీక్షకు 90 శాతం మార్కులు ఉండగా, 10 శాతం మార్కుల్ని ఉపాధ్యాయులు ఇతర కార్యక్రమాలకు కేటాయించనున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement