CBSE schools
-
Telangana: సీబీఎస్ఈ స్కూళ్లలో తెలుగు తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి పదోతరగతి వరకు తెలుగు సబ్జెక్టు తప్పని సరిగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా విద్యాధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది. తెలుగు సబ్జెక్టు బోధించని స్కూళ్లకు రూ.లక్ష వరకూ జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేసింది. ఈ నిబంధనను ప్రత్యేకించి సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర బోర్డు పాఠశాలల్లో అమలు చేసేందుకు సంబంధించి రూపొందించడం గమనార్హం. కేజీబీవీ సమస్యలు పరిష్కరించాలి: పీఆర్టీయూ సాక్షి, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో సమస్యలను పరిష్కరించాలని పీఆర్టీయూ టీఎస్.. విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరింది. సంఘం నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు బుధవారం ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డితో కలిసి మంత్రిని కలిశారు. కేజీబీవీల్లో కేర్టేకర్ల నియామకం, ఆర్థిక, ఆపరేషన్ల గైడ్‌లైన్స్ మార్పు, ఉద్యోగులకు హెల్త్ కార్డులు వంటి సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సంఘం నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఎడ్‌సెట్–2022 గడువు 22 వరకు పొడిగింపు ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్): టీఎస్ ఎడ్‌సెట్–2022 గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు కన్వీనర్ రామకృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15తో ఎడ్‌సెట్–2022 గడువు ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు వారం పాటు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అధికారులు అవకాశమిచ్చారు. ఇప్పటివరకు ఎడ్‌సెట్‌కు 24 వేలమంది దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. (క్లిక్: నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!) -
అంకుర దశలోనే ఆధునిక కోర్సులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి ఆధునిక సాంకేతిక విద్యా కోర్సులు పాఠశాల స్థాయి నుంచే చదువుకునేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆరో తరగతి నుంచే ఆ కోర్సుకు సంబంధించిన పరిచయ అంశాలను సీబీఎస్ఈ పాఠశాలల్లో బోధించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలను పెంచి, ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు, శారీరక దృఢత్వం కలిగి ఉండేలా వారిని తీర్చిదిద్దేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డిజైన్ అండ్ థింకింగ్, ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్ కోర్సులను తీసుకువచ్చింది. 2020–21 విద్యా ఏడాది నుంచి వీటిని అమల్లోకి తీసుకువస్తోంది. స్కిల్ కోర్సులను రెగ్యులర్ విద్యలో భాగం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలిమెంటరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ స్థాయిలో స్కిల్ కోర్సులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ స్కూళ్లన్నింటిలో వీటిని అమలు చేయనుంది. కొత్త విద్యావిధానానికి అనుగుణంగా.. పాఠ్య కార్యక్రమాలు, సహపాఠ్య, అదనపు పాఠ్య కార్యక్రమాలకు మధ్య, వృత్తి విద్యా, సంప్రదాయ విద్యకు మధ్య వ్యత్యాసం ఉండొద్దని, విద్యార్థిని అన్నింటిలో మేటిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాల్సిందేనని నూతన విద్యా విధానం (ఎన్ఈపీ) స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా ప్రణాళిక చట్రాన్ని (నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్ వర్క్) సవరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు సంప్రదాయ విద్యలో వృత్తి విద్యను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టింది. వృత్తి విద్య అంటే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఎలక్ట్రీషియన్, సెల్‌ఫోన్ మెకానిక్ వంటి కోర్సులే ఉండగా ఇకపై వాటి రూపు మారుతోంది. 21వ శతాబ్దంలో క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్ కీలకమైన ప్రక్రియ. దానిని సీబీఎస్ డిజైన్–థింకింగ్ పేరుతో సబ్జెక్టుగా తీసుకొస్తోంది. తరగతులను అనుసరించి... ప్రాథమిక (6, 7, 8) తరగతుల్లో స్కిల్ కోర్సులకు సంబంధించిన పరిచయ పాఠాలు ఉండనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఐటీ తదితర కోర్సులకు సంబంధించి 12 గంటల బోధన ఉండనుంది. ఏఐతో సహా మొత్తంగా 9 కోర్సులకు సంబంధించిన పరిచయ పాఠాలు బోధిస్తారు. ఇందులో 15 మార్కులు థియరీకి, 35 మార్కులు ప్రాక్టికల్స్‌కు ఉంటాయి. కొత్త సబ్జెక్టులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిజికల్ యాక్టివిటీ ట్రైనర్ సబ్జెక్టులు కలుపుకొని సెకండరీ స్థాయిలో 18 సబ్జెక్టులు అందుబాటులోకి రానున్నాయి. సీనియర్ సెకండరీ స్థాయిలో 40 సబ్జెక్టులను అందుబాటులోకి తెచ్చింది. అయితే సెకండరీ స్థాయిలో విద్యార్థులు తమ తప్పనిసరి సబ్జెక్టులైన లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2, సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్‌తోపాటు ఆరో (అదనపు) సబ్జెక్టును (స్కిల్ సబ్జెక్టుగా) ఎంచుకోవాల్సి ఉంటుంది. సీనియర్ సెకండరీ స్థాయిలో సబ్జెక్టు–1గా లాంగ్వేజ్–1, సబ్జెక్టు–2గా లాంగ్వేజ్–2 ఉంటాయి. సబ్జెక్టు–3, 4, 5లుగా రెండు అకడమిక్ సబ్జెక్టులు (ఎలక్టివ్), ఒక స్కిల్ సబ్జెక్టు ఎంచుకోవాలి. లేదా ఒక అకడమిక్ సబ్జెక్టు, రెండు స్కిల్ సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. లేదా మూడు స్కిల్ సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఆరో అదనపు సబ్జెక్టుగా (ఆప్షనల్) ఒక భాషను లేదా అకడమిక్ సబ్జెక్టును లేదా స్కిల్ సబ్జెక్టును ఎంచుకోవచ్చు. ఇందులో స్కిల్ సబ్జెక్టులో 50 మార్కులు థియరీకి, 50 మార్కులు ప్రాక్టికల్స్‌కు కేటాయించారు. అకడమిక్ సబ్జెక్టుగానే అప్లైడ్ మ్యాథమెటిక్స్ ► 2020–21 నుంచి 11వ తరగతిలో అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్కిల్ సబ్జెక్టుగా ఉండదు. అకడమిక్ సబ్జెక్టుగా ఉంటుంది. అలాగే ఎక్స్‌రే టెక్నీషియన్, మ్యూజిక్ ప్రొడక్షన్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్కిల్ సబ్జెక్టులుగా ఉండవు. ► పదో తరగతిలో విద్యార్థులు ఎవరైనా తప్పనిసరి సబ్జెక్టులైన మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్‌సైన్స్‌లో ఫెయిల్ అయితే ఆరో సబ్జెక్టుగా చదువుకున్న స్కిల్ సబ్జెక్టును అందులో పరిగణనలోకి తీసుకొని పాస్ చేస్తారు. అయితే విద్యార్థి ఫెయిల్ అయిన ఆ సబ్జెక్టు పరీక్ష రాయాలనుకుంటే రాసుకోవచ్చు. -
మోత, రాత లేదిక!
సాక్షి, హైదరాబాద్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) స్కూళ్లలో ఒకటి, రెండో తరగతి చిన్నారులకు బండెడు పుస్తకాల మోత, పేజీలకొద్దీ హోంవర్క్ రాత నుంచి ఊరట లభించింది. వారు ఇక వీపులు ఒంగిపోయేలా బ్యాగుల భారం మోయాల్సిన పనిలేదు. చిట్టిచిట్టి చేతులు నొప్పిపుట్టేలా హోంవర్క్ రాయాల్సిన అవసరంలేదు. ఇకపై వారు స్కూల్ టైమ్ ముగిసిన వెంటనే ఇంటికొచ్చి ఎంచక్కా ఆటపాటలతో గడిపేయొచ్చు. ఎందుకంటే... సీబీఎస్ఈ యాజమాన్యం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి నో స్కూల్ బ్యాగ్, నో హోంవర్క్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఎస్ఈ పరిధిలోకి వచ్చే స్కూళ్లన్నీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని బోర్డు స్పష్టం చేసింది. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఆర్మీ స్కూళ్లతోపాటు సీబీఎస్ఈ గుర్తింపు ఉన్న ప్రతి స్కూల్లో నో స్కూల్ బ్యాగ్, నో హోంవర్క్ విధానం అమల్లోకి రానుంది. కోర్టు తీర్పుతో కదలిక... నో స్కూల్ బ్యాగ్, నో హోంవర్క్ విధానంపై సీబీఎస్ఈ గతంలోనే స్పష్టత ఇచ్చింది. చిన్న పిల్లలకు బరువైన పుస్తకాల బ్యాగు వద్దని, వీలైనంత వరకు తగ్గించాలని సూచించినప్పటికీ క్షేత్రస్థాయిలో విద్యా సంస్థలు ఈ నిబంధనలను పాటించలేదు. ఈ క్రమంలో కొందరు విద్యావేత్తలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో ఇటీవల తీర్పు ఇచ్చింది. దీంతో స్పందించిన సీబీఎస్ఈ యాజమాన్యం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం రెండో తరగతి వరకు నిబంధనలు పరిమితం చేసినప్పటికీ మిగతా తరగతులకు సంబంధించి స్పష్టత ఇవ్వలేదు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు పరిమితికి మించి ఉన్నట్లు విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పదో తరగతి వరకు బ్యాగుల బరువు ఎంత ఉండాలనే అంశంపై స్పష్టత ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. -
సీబీఎస్ఈ స్కూళ్లలో ఆధార్ నమోదు కేంద్రాలు!
న్యూఢిల్లీ: తమ ప్రాంగణాల్లోనే ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటుచేయాలని సీబీఎస్ఈ తన అనుబంధ పాఠశాలలను ఆదేశించింది. ఆధార్ సంఖ్య లేని విద్యార్థులు అందుకు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని కోరింది. అయితే ఇలాంటి కేంద్రాల ఏర్పాటు స్వచ్ఛందమేనని గురువారం పాఠశాలలకు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ఇందుకు అవసరమైన పరికరాలను ఆధార్ ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారమే సేకరించాలని సూచించింది. స్కూళ్లలో ఆధార్ నమోదును ఉచితంగా చేస్తారు. బదులుగా సీబీఎస్ఈ ఒక్కో నమోదుకు పాఠశాలలకు రూ. 30 చెల్లిస్తుంది. ఇతర నమోదు కేంద్రాల్లో అమలయ్యే నియమ నిబంధనలనే ఇక్కడా పాటించాలి. ప్రత్యక్షంగా లేదా నమోదు ఏజెన్సీల ద్వారా ప్రజల బయోమెట్రిక్ వివరాలు సేకరించడానికి సీబీఎస్ఈ, ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)తో ఇది వరకే ఒప్పందం కుదుర్చుకుంది.మధ్యాహ్న భోజన పథకం, ఉపకార వేతనాలకు కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో సీబీఎస్ఈ ఇలాంటి చర్యలను చేపట్టింది. -
సీబీఎస్ఈ పాఠశాలల్లో సీసీఈ విధానం రద్దు
న్యూఢిల్లీ: అన్ని సీబీఎస్ఈ స్కూళ్లలో 6–9 తరగతులకు సమగ్ర నిరంతర మూల్యాంకనం (సీసీఈ) విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు సీబీఎస్ఈ బుధవారం తెలిపింది. బోధన, ముల్యాంకనాలను ప్రామాణీకరించడం కోసం చేపట్టనున్న ఈ మార్పులు వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని సీబీఎస్ఈ పాఠశాలల్లో అమల్లోకి రానున్నాయి. పదో తరగతి పరీక్షలను పునరుద్ధరించడంతో ఈ మార్పులు అత్యవసరమయ్యాయని సీబీఎస్ఈ తెలిపింది. సీసీఈ విద్యా విధానంలోని లోపాల కారణంగా ఓ పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారే 6–9 తరగతుల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీబీఎస్ఈ అధికారి ఒకరు అన్నారు. నూతన విద్యావిధానంలో రాత పరీక్షకు 90 శాతం మార్కులు ఉండగా, 10 శాతం మార్కుల్ని ఉపాధ్యాయులు ఇతర కార్యక్రమాలకు కేటాయించనున్నారు.