సబ్జెక్ట్ సామర్థ్యాలతోనే ఆంగ్లంలో అగ్రస్థానం | Subject samarthyalatone English top | Sakshi
Sakshi News home page

సబ్జెక్ట్ సామర్థ్యాలతోనే ఆంగ్లంలో అగ్రస్థానం

Published Wed, Jul 23 2014 11:59 PM | Last Updated on Fri, Nov 9 2018 4:59 PM

సబ్జెక్ట్ సామర్థ్యాలతోనే ఆంగ్లంలో అగ్రస్థానం - Sakshi

సబ్జెక్ట్ సామర్థ్యాలతోనే ఆంగ్లంలో అగ్రస్థానం

ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ సబ్జెక్ట్ విషయంలో తెలుగు, ఇంగ్లిష్ మీడియం విద్యార్థులకు టెక్ట్స్‌బుక్ ఒక్కటే. అదేవిధంగా పరీక్ష విధానం కూడా ఒకే రకంగా ఉంటుంది. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా పరీక్ష నిర్వహణకు సంబంధించి ఒకే పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఇందుకు సరైన వనరులు లేవని భావించాల్సిన అవసరం లేదు. ప్రణాళికా ప్రకారం ప్రిపరేషన్ సాగిస్తే ఇంగ్లిష్‌లో సులువుగానే ఎ-1 గ్రేడ్ సొంతం చేసుకోవచ్చు.
 
 నూతన విధానం:
 పరీక్ష నిర్వహణకు సంబంధించి అనుసరించే నూతన పద్ధతిని సీసీఈ(CCE- Continuous ComprehensiveEvaluation)గా పేర్కొంటారు. ఇందులో ఇంటర్నల్స్‌కు 20మార్కులు,ఎక్స్‌టర్నల్‌కు 80మార్కులు కేటాయించారు.  8 నిర్మాణాత్మక మూల్యాంకనం: యూనిట్ టెస్ట్‌ల స్థానంలో నిర్మాణాత్మక మూల్యాంకనం(FormativeAssessme-nt)విధానాన్ని చేర్చారు. ఒక్కో ఫార్మేటివ్ అసెస్‌మెంట్ 50 మార్కులు. ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి. అవి..
 
 1.    స్టూడెంట్ రిఫ్లెక్షన్స్: తరగతిలో విద్యార్థి స్పందనలు (10 మార్కులు)
 2.    రిటెన్ వర్క్స్: నోట్ బుక్-రాతపనికి సంబంధించి ఇతర అసైన్‌మెంట్స్ (10 మార్కులు)
 3.    {పాజెక్ట్ వర్క్స్: ప్రతి యూనిట్ చివర ఇచ్చిన ప్రాజెక్ట్ పనులు (10 మార్కులు)
 4.    స్లిప్ టెస్ట్: యూనిట్ల పరిధిలో ఉండే కాంప్రెహెన్సివ్, ఇతర లాంగ్వేజ్ డిస్కోర్సెస్‌పై ప్రశ్నలు(10మార్కులు)
 
 ఫార్మెటివ్ అసెస్‌మెంట్:

 సంవత్సరం చివర నాలుగు ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌లలో వచ్చిన మార్కుల్ని కలిపి వాటిని ఒక్కో దాన్ని (భాగాల వారీగా) 5 మార్కులకు కుదిస్తారు. ఈ నాలుగు విభాగాలు కలిపి 20 మార్కులు. ఇందులో కనీసం 7 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. ఎక్స్‌టర్నల్‌లో 80 మార్కుల్లో కనీసం 28 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించవచ్చు. ఇంటర్నల్-ఎక్స్‌టర్నల్ రెండిట్లో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలి. ఏ ఒక్కదాంట్లో కనీస మార్కులు తగ్గినా ఫెయిల్ అయినట్లే.
 
 సంగ్రహణాత్మక మూల్యాంకనం:
 ఎక్స్‌టర్నల్ పరీక్షను సంగ్రహణాత్మక మూల్యాంకనం (ఎస్‌ఏ -సమ్మేటివ్ అసెస్‌మెంట్) అంటారు. ఇది మొత్తం 80 మార్కులకు ఉంటుంది. అయితే గతంలో పరీక్షలో రెండు పేపర్లు ఉండేవి. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి ఒకే పేపర్‌గా పరీక్షను నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం సుదీర్ఘంగా ఉంటుంది. కాబట్టి దాన్ని చదువుకోవడానికి 15 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. సమాధానాలు రాయడానికి 3 గంటలు కేటాయించారు. ఇందులో మూడు భాగాలు ఉంటాయి. సమాధానాలను నిర్దేశించిన ఆన్సర్ బుక్‌లెట్‌లోనే రాయాలి. రఫ్ వర్క్ కోసం చివరి పేజీలను ఉపయోగించుకోవచ్చు.
 
 గతంలో త్రైమాసిక, అర్థ వార్షిక పరీక్షల మాదిరిగా
 ఎస్‌ఏ-1, ఎస్‌ఏ-2 నిర్వహిస్తారు. వాటిని రాయడం ద్వారా నూతన విధానంపై అవగాహన ఏర్పడుతుంది. వార్షిక పరీక్షను ఎస్‌ఏ-3గా వ్యవహరిస్తారు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో 3 భాగాలు ఉంటాయి.

     అవి..     రీడింగ్ కాంప్రెహెన్షన్ (సెక్షన్-ఎ).
     వొక్యాబులరీ అండ్ గ్రామర్ (సెక్షన్-బి).
  యేటివ్ రైటింగ్ (డిస్కోర్సెస్, సెక్షన్-సి).
 
 
 రీడింగ్ కాంప్రెహెన్షన్
 దీనికి 30 మార్కులు కేటాయించారు. ఇందులో మొత్తం నాలుగు ప్యాసేజ్‌లు ఇస్తారు. వాటిపై కాంప్రెహెన్షన్ ప్రశ్నలు ఉంటాయి. రెండు ప్యాసేజ్‌లు టెక్ట్స్ బుక్ నుంచి ఇస్తే మిగతా రెండు అన్‌సీన్ ప్యాసేజ్‌లు. 1వ ప్రశ్న:ఇందులో 8 యూనిట్లలో నుంచి ఏదో ఒక ప్యాసేజ్ (200-250 పదాలు) ఇస్తారు. దీనిపై నాలుగు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. తర్వాత మూడు లఘు ప్రశ్నలు ఇస్తారు. వీటికి 1 లేదా 2 రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. 2వ ప్రశ్న:ఇందులోని ప్యాసేజ్ (100-120 పదాలు) కూడా టెక్ట్స్ బుక్ నుంచే ఉంటుంది. దీనిపై మూడు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. తర్వాత రెండు లఘు ప్రశ్నలు ఇస్తారు. వీటికి 1 లేదా 2 రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. పొయెట్రీ నుంచి కూడా ప్యాసేజ్ వచ్చే అవకాశం ఉంది.
 8 మరో ముఖ్యమైన విషయం..
 పై ప్యాసేజ్‌లు టెక్ట్స్‌బుక్ నుంచే ఇస్తారు.
 
 కానీ టెక్ట్స్‌బుక్‌లోని ప్రశ్నలు ఇవ్వరు.
 కాబట్టి వాటిని బట్టీపట్టడం వంటివి చేయొద్దు. 3వ ప్రశ్న:అన్‌సీన్ ప్యాసేజ్ (200-250 పదాలు). ఇది టెక్ట్స్‌బుక్‌లో ఉండదు. దీనిపై నాలుగు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. తర్వాత మూడు లఘు ప్రశ్నలు ఇస్తారు. వీటికి 1లేదా 2 రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. 4వ ప్రశ్న:అన్‌సీన్ ప్యాసేజ్ (100-120 పదాలు). ఇది కూడా టెక్ట్స్‌బుక్‌లో ఉండదు. దీనిపై మూడు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. తర్వాత రెండు లఘు ప్రశ్నలు ఇస్తారు. వీటికి 1లేదా 2 రెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు.
 
 8 ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఏదైనా ఒక ప్యాసేజ్ తీసుకుని దానిపై  స్వయంగా ప్రశ్నలు తయారు చేసుకోవాలి. వాటికి సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి. ఇందుకు గ్రూప్ యాక్టివిటీ చక్కగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు గ్రూప్‌గా ఏర్పడి ఒకరు ప్రశ్నలు రూపొందిస్తే.. మరొకరు సమాధానాలు రాయడం చేయాలి. చివరగా ప్రశ్నలు-జవాబుల మీద చర్చించుకోవడం బాగా లాభిస్తుంది. ఇలా చేయడం ద్వారా ప్యాసేజ్ నేపథ్యం (సెంట్రల్ ఐడియా), కీలక పదాలు (Key Words) వెంటనే స్ఫురణకు వస్తాయి.
 వొకాబ్యులరీ అండ్ గ్రామర్
 
 దీనికి 20 మార్కులు కేటాయించారు. ఇందులో నాలుగు ప్యాసేజ్‌లు ఇస్తారు. వాటిలో రెండు పాఠ్యపుస్తకం నుంచి ఇస్తే మరో రెండు అన్‌సీన్ ప్యాసేజ్‌లు. ఒక్కో ప్యాసేజ్‌కు 5 మార్కులు. ఇందులోని ప్రశ్నలు.. 5వ ప్రశ్న:ఇందులో టెక్ట్స్‌బుక్ నుంచి ఏదైనా ఒక ప్యాసేజ్ ఇస్తారు. అందులో కొన్ని వాక్యాలకు 1 నుంచి 5 సంఖ్యలు ఇస్తారు. సంఖ్యలు ఉన్నచోట తప్పు (ఎర్రర్) ఉంటుంది. దాన్ని కనుక్కొని సరైన పదం/పదబంధం/వాక్యం (Word/ Phrase/ Sentence) రాయాలి.
 
 6వ ప్రశ్న:టెక్ట్స్‌బుక్ నుంచి ఏదైనా ఒక ప్యాసేజ్ ఇస్తారు. అందులో అక్కడక్కడా కొన్ని ఖాళీలు (ఆ్చజుట) ఉంటాయి. ప్రతి ఖాళీకి 1 నుంచి 5 సంఖ్యలు ఇస్తారు. ప్యాసేజ్ కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్‌ల్లోంచి సరైన దాన్ని ఎన్నుకొని రాయాలి. దీన్ని క్లోజ్ టెస్ట్ అంటారు.7వ ప్రశ్న:    ఇది 5వ ప్రశ్న మాదిరిగానే ఉంటుంది. కాకపోతే అడిగే ప్యాసేజ్ టెక్ట్స్‌బుక్‌లో ఉండదు. అందులో కొన్ని వాక్యాలకు 1 నుంచి 5 సంఖ్యలు ఇస్తారు. సంఖ్యలు ఉన్నచోట తప్పు (ఎర్రర్) ఉంటుంది. దాన్ని కనుక్కొని సరైన పదం/పదబంధం/వాక్యం రాయాలి. 8వ ప్రశ్న:    ఇది 6వ ప్రశ్న వంటి క్లోజ్ టెస్ట్. అయితే అన్‌సీన్ ప్యాసేజ్ ఇస్తారు. అందులో అక్కడక్కడా కొన్ని ఖాళీలు ఉంటాయి. ప్రతి ఖాళీకి 1 నుంచి 5 సంఖ్యలు ఇస్తారు. ప్యాసేజ్ కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్‌ల్లోంచి సరైన దాన్ని ఎన్నుకొని రాయాలి.
 
 8 ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందాలంటే మొదటి యూనిట్ నుంచి చివరి యూనిట్ వరకు ఉన్న పాఠాల్లో తెలియని పదాల అర్ధాలు తెలుసుకోవాలి. వాటిని  సొంత వాక్యాల్లో ప్రయోగించడం నేర్చుకోవాలి. అదేవిధంగా వాక్యనిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక నియమాలు, ప్యాసేజ్‌లలో వాక్యాల అమరికపై చక్కటి అవగాహన అవసరం. ముఖ్యం. డిక్షనరీ ఉపయోగించడం అలవాటుగా చేసుకోవడం తప్పనిసరి.  కూడా అవగాహన ఉండటం ప్రయోజనకరం.

 క్రియేటివ్ రైటింగ్ (డిస్కోర్సెస్)
 దీనికి 30 మార్కులు కేటాయించారు. పదో తరగతి పూర్తయ్యే విద్యార్థికి రిటెన్ ఇంగ్లిష్ (Writ-ten English) పరంగా సామర్థ్యాలు  ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ విభాగాన్ని రూపొందించారు. ఇందులో మొత్తం 4 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో రెండు మేజర్ డిస్కోర్సెస్, రెండు మైనర్ డిస్కోర్సెస్. మేజర్ డిస్కోర్సెస్‌ను ఎ,బిలుగా విభజించారు. విద్యార్థులు ఈ రెండింటిలోని డిస్కోర్సెస్‌ను నేర్చుకోవాలి. అవి.. 8 Major discourses A: Story/ narrative; Conversation; Description; Drama script/ Play; Interview and Choreography. 8 Major discourses B: Biography; Essay; Re-port/ news report; Letter and Speech (script)
 
 9వ ప్రశ్న:ఒక ప్యాసేజ్/న్యూస్ రిపోర్ట్/బయోగ్రఫీ వంటి ఏదో ఒకటి ఇచ్చి దానిపై మేజర్ డిస్కోర్సెస్ గ్రూప్-ఎ నుంచి రెండు డిస్కోర్సెస్ అడుగుతారు. దీనిలో ఒక దానికి సమాధానం రాయాలి. దీనికి 10 మార్కులు.10వ ప్రశ్న:ఇందులో పిక్చర్(ఇమేజ్)తో కూడిన అంశాన్ని ఇస్తారు. మేజర్ డిస్కోర్సెస్ గ్రూప్-బి నుంచి రెండు డిస్కోర్సెస్ అడుగుతారు. దీనిలో ఒక దానికి సమాధానం రాయాలి. దీనికి 10 మార్కులు. 8 మైనర్ డిస్కోర్సెస్‌ను కూడా ఎ,బిలుగా విభజించారు. అవి.. Minor discourses A: Message; Notice and Diary. Minor discourses B: Poster; Invitation and Profile.

 11వ ప్రశ్న:దులో ఏదైనా ఒక నరేటివ్ (Narrativ) ఇచ్చి దానిపై మైనర్ డిస్కోర్సెస్ గ్రూప్-ఎ నుంచి ఏదైనా ఒక ప్రశ్న అడుగుతారు. చాయిస్ లేదు. దీనికి 5 మార్కులు.12వ ప్రశ్న:    ఇందులో ఏదైనా ఒక సందర్భానిచ్చి దానిపై మైనర్ డిస్కోర్సెస్‌లోని గ్రూప్-బి నుంచి ఏదైనా ఒక డిస్కోర్సెస్ రాయమంటారు. దీనికి కూడా చాయిస్ లేదు. 8 ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. టెక్ట్స్‌బుక్ యూనిట్లలో ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్‌లను స్వయంగా చేయాలి. ఈ క్రమంలో సొంతంగా ఆలోచించడం,

 ఆ ఆలోచనలను పేపర్‌పై పెట్టడం, వాటిని క్రమ పద్ధతిలో అమర్చడం, మేజర్-మైనర్ డిస్కోర్సెస్‌లుగా వాటిని ప్రెజెంట్ చేయడం వంటివి నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. ఇందులో అడిగే ప్రశ్నలు దాదాపుగా ఓపెన్ ఎండెడ్. వీటికి ఏవిధంగా సమాధానం రాసినా సరిపోతుంది. కాకపోతే  సమాధానాన్ని ఏవిధంగా రాసామనేది కీలకం. కాబట్టి భాషాపరమైన దోషాలు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కాబట్టి విద్యార్థి స్వీయ ఆలోచనలను పేపర్‌పై వివిధ డిస్కోర్సెస్ రూపంలో పెట్టడం ప్రయోజనకరం. ఇందుకోసం నలుగురైదుగురు విద్యార్థులు జట్టుగా ఏర్పడి చర్చించుకోవడం కూడా లాభిస్తుంది.
 
 గుర్తుంచుకోవాల్సినవి
     రోజు వారీ పాఠాలను ఎప్పటికప్పుడు చదవాలి.
     ఏ రోజు నోట్స్ ఆ రోజు పూర్తి చేయాలి.
     తెలియని విషయాలను స్నేహితులు లేదా
 ఉపాధ్యాయులతో చర్చించి తెలుసుకోవాలి.
     పాజెక్ట్ వర్క్‌ను కూడా తప్పకుండా చేయాలి.
     తరగతి గదిలో ప్రతి యాక్టివిటీలో పాల్గొనాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement