సీసీఈతో చిక్కులే.. | cce educations problems | Sakshi
Sakshi News home page

సీసీఈతో చిక్కులే..

Published Thu, Mar 9 2017 12:18 AM | Last Updated on Thu, Jul 11 2019 5:24 PM

cce educations problems

  • ఆందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
  • రూరల్‌ విద్యార్థుల్లో సృజనాత్మకత 
  • కష్టమంటున్న ఉపాధ్యాయులు
  • సీసీఈ రద్దు పైనే ఆశలు
  • కాకినాడ రూరల్‌:
    విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించి, బట్టీ విధానానికి స్వస్తి పలికేందుకుగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సీసీఈ విధానంపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టకుండా వారిలో ఉన్న తెలివితేటల ఆధారంగా పాఠ్యాంశాల్లోని సారాంశాన్ని గ్రహించి అర్థం చేసుకునేందుకుగాను నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి వల్ల విద్యార్థులు ఏ ఒక్కరోజు పాఠశాల గైర్హాజరు కాకుండా నిత్యం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులు చెప్పే పాఠ్యాంశాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు
    గ్రహించిన పాఠ్యాంశ సారాంశంపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి అవగాహనను అంచనా వేస్తారు. 
    సమ్మెటివ్, ఫార్మటివ్‌ పరీక్షలపై విద్యార్థుల భవితవ్యం
    నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సమ్మెటివ్‌ 1 నుంచి 4, ఫార్మటివ్‌ 1 నుంచి 4 పరీక్షలు నిర్వహిస్తారు. వీటిల్లో ప్రతిభ చూపించిన విద్యార్థులకు పదో తరగతిలో 20 మార్కులు మేర స్కోరింగ్‌ చేసే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలన్నింటికీ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరై పదో తరగతి వార్షిక పరీక్షలో 80 మార్కులకుగాను 35 మార్కులు పైబడి తెచ్చుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఉత్తీర్ణతను కోల్పోవాల్సి ఉంటుంది.
    ఏడు మార్కులు తప్పనిసరి...
    సమ్మెటివ్, ఫార్మటివ్‌ పరీక్షల్లో ప్రతి విద్యార్థి తప్పనిసరిగా 20 మార్కులకుగాను తప్పనిసరిగా ఏడు మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సమ్మెటివ్, ఫార్మటివ్‌ పరీక్షల్లో జీరో (0) మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు వార్షిక పరీక్షలో 80 మార్కులకు 35 మార్కులు పైబడి సాధించుకుంటేనే ఉత్తీర్ణత సాధిస్తారు. పాఠ్యాంశాల్లోని సారాంశంతో పాటు విద్యార్థుల తెలివితేటలను ఆధారంగా చేసుకొని ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను రూరల్‌ ప్రాంతాల్లోని విద్యార్థులు అర్థం చేసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయంటున్నారు పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు.
    సీసీఈపై నివేదిక...
    సీసీఈ విధానాన్ని మొదట్లో సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ సిలబస్‌) ఉన్న పాఠశాలల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈ విధానం వల్ల విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత సాధించలేకపోవటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఆందోళన తీవ్రమైంది. ఓ కమిటీని నియమించి సీసీఈ విధానంపై సమగ్ర విచారణ చేయించింది. కమిటీ సభ్యులు త్వరలో నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలున్నాయి. ఆ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారని విద్యావేత్తలు చెబుతున్నారు.
     
     
    విద్యార్థులకు లాంగ్వేజ్‌పై పట్టు ఉండాలి
    సీసీఈ విధానం వల్ల ప్రతి విద్యార్థికి లాంగ్వేజ్‌పై పట్టుండాలి. నిత్యం పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని అర్థం చేసుకోవాలి. అప్పుడే సీసీఈ విధానం విజయవంతమవుతుంది.రూరల్‌ ప్రాంతాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి.
    – ఎంవీఏ మణికుమార్, ఇంగ్లిషు ఉపాధ్యాయుడు, ఇంద్రపాలెం
     
    గ్రామీణంలో ఇబ్బందే...
    సీసీఈ విధానం మంచిదే కానీ రూరల్‌ ప్రాంతాల్లో విజయవంతం కాదు. విద్యార్థులు పూర్తిగా అర్థం చేసుకొని సొంతంగా జవాబు రాయాల్సి ఉంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ ఉన్న పాఠశాలల్లో ఇది వరకే ఈ విధానాన్ని అమలు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆందోళనతో కేంద్రప్రభుత్వం కమిటీని వేసి విచారించింది. కమిటీ కూడా విచారణ చేసి నివేదికలను సమర్పిస్తే విధానం రద్దయ్యే అవకాశం ఉంది.
    – పి.పుల్లయ్య, హెచ్‌ఎం జెడ్పీ ఉన్నతపాఠశాల,  ఇంద్రపాలెం.
     
    తెలివితేటలపై ఆధారపడి ఉంది...
    సీసీఈ విధానం విద్యార్థుల తెలివితేటలపై ఆధారపడి ఉంది. మొదట్లో ఈ విధానం వల్ల విద్యార్థులు కొంత మేర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలున్నాయి. క్రమేణా ఈ విధానం వల్ల  తెలివితేటలు పెరిగి బట్టీపట్టే విధానానికి దూరమయ్యే అవకాశాలున్నాయి.
     
    – దడాల వాడపల్లి, డీవైఈవో  కాకినాడ డివిజ¯ŒS
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement