ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ
- ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది
- ఏడుగంటల పాటు కొనసాగిన విచారణ
- మరోసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు
- ఏసీబీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్
- పైసలు పంపించానని చెబుతున్నా.. వాళ్లు పైసలు ఇక్కడే ఉన్నాయని చెప్పారు
- కరప్షన్ ఎక్కుడందని అడిగినా.. వాళ్ల నుంచి సమాధానం లేదు
- మీరు విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని ఏసీబీ అధికారులకు చెప్పాను
- రాజకీయ ఒత్తిడిలో పొలిటికల్ కేసు పెట్టి ఏదో చేయాలని చూస్తే అది సీఎం రేవంత్‌రెడ్డి మూర్ఖత్వమే అవుతుంది.
- పాపం వాళ్లు(ఏసీబీ అధికారులు) రేవంత్ రాసిచ్చిన నాలుగు ప్రశ్నల్ని అలా తిప్పి.. ఇలా తిప్పి నలబైసార్లు అడిగారు
- ఇది అసంబద్ధమైన కేసు అని ఏసీబీ అధికారులకు చెప్పాను
- నాకు తెలిసిన సమాచారం అంతా ఏసీబీకి ఇచ్చాను
- విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తాను
- ఎప్పుడు పిలిచినా సంతృప్తికర సమాధానం ఇస్తాను
- వాళ్లు ఎప్పుడు విచారణకు పిలుస్తారో తెలియదు
ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కేటీఆర్ విచారణ. ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు
- ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం
- బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విచారణ
- ఈ కేసులో ఏ1గా కేటీఆర్
- తెలంగాణ కోర్టులో కేటీఆర్‌కు దక్కని ఊరట
- హైకోర్టు తీర్పుతో.. కేటీఆర్ అరెస్ట్‌కు ఏసీబీకి తొలగిన అడ్డంకులు!
- ఏసీబీ తదుపరి చర్యలపై ఉత్కంఠ
ప్రధాన అభియోగం ఇదే..
- ఫార్ములా-ఈ ఆపరేషన్స్, ఎస్ నెక్ట్స్ జెన్, పురపాలకశాఖల మధ్య 9, 10, 11, 12వ సీజన్ల కార్ రేస్‌లు నిర్వహించేలా ఒప్పందం
- 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నెక్లెస్‌రోడ్డులో తొమ్మిదో సీజన్ రేసింగ్ నిర్వహణ.
- అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదంతోనే కుదిరిన ఒప్పందం
- శాఖాధిపతిగా ఎంవోయూ చేసిన ఐఏఎస్ అర్వింద్ కుమార్
- ఈ రేసు నిర్వహించిన విదేశీ సంస్థకు హెచ్‌ఎండీఏ నుంచి చెల్లింపులు
- HMDA బోర్డు, ఆర్థిక శాఖ, ఆర్బీఐల అనుమతి తీసుకోకుండానే నేరుగా రూ.55 కోట్లు చెల్లింపు
- ముఖ్యంగా రూ.46 కోట్ల వరకు డాలర్ల రూపంలో చెల్లించారనేది ప్రధాన అభియోగం.
ఆయన ఫిర్యాదుతో
- ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఏ-1గా కేటీఆర్ పేరు
- ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి
- పుపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్ ఫిర్యాదు మేరకు కదలిన వ్యవహారం
- గవర్నర్ అనుమతి.. ఆపై ఏసీబీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఫార్ములా రేసు పూర్వాపరాలు, అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ(HMDA) ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడం వంటి వ్యవహారాలపై ఏసీబీ దృష్టి
కేటీఆర్ విచారణ.. పెరుగుతున్న ఉత్కంఠ
- ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొనసాగుతున్న విచారణ
- KTR విచారణ పై గంట గంటకు కొనసాగుతున్న ఉత్కంఠ..
- KTR ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం పరిసరాల్లో భారీగా మొహరించిన BRS శ్రేణులు
- ఆరు గంటలుగా కొనసాగుతున్న ఏసీబీ విచారణ
- ఫిర్యాదు దారుడు దాన కిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కొనసాగుతున్న విచారణ
- IAS అరవింద్ కుమార్ ఇచ్చిన వాగ్మూలం ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ
- FEO తో ఒప్పందాలు నగదు,బదిలీ అంశాలపై ప్రశ్నిస్తున్న ఏసీబీ
- కేబినెట్ ఆమోదం, ఆర్ధిక శాఖ అనుమతి లేకుండా ఎందుకు నగదు బదిలీ చేశారు?
- ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి గ్రీన్ కో తప్పుకోవడానికి కారణం ఏంటి?
- BRS పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోళ్లపై ప్రశ్నిస్తున్న ఏసీబీ
- ఇప్పటికే సేకరించిన పత్రాలు ముందు ఉంచి ప్రశ్నిస్తున్న ఏసీబీ
కేటీఆర్‌కు ఏసీబీ సంధించిన ప్రశ్నలు ఇవేనా?
- అసలు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది? ఎవరు ఆమోదించారు?
- ఇక్కడే ఎందుకు నిర్వహించారు?
- ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం కలిగిందా?
- నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని ఎవరైనా హెచ్చరించరా?
- అసలు నిబంధనలు పట్టించుకోకుండా ఎందుకు బదిలీ చేశారు?
- గ్రీన్‌కో ఎందుకు స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలగింది
- నిధుల మళ్లింపు కేబినెట్ దృష్టికి ఎందుకు వెళ్లలేదు?
లంచ్‌బ్రేక్ తర్వాత తిరిగి ప్రారంభమైన కేటీఆర్ విచారణ
- కేటీఆర్‌ను తిరిగి విచారిస్తున్న ఏసీబీ
- లంచ్ తర్వాత కేటీఆర్‌ను విచారిస్తున్న ఏసీబీ
కేటీఆర్ విచారణ.. లంచ్ బ్రేక్
- కేటీఆర్ ఏసీబీ విచారణకు లంచ్ బ్రేక్
- భోజన విరామం తర్వాత కొనసాగనున్న విచారణ
- ఇప్పటిదాకా.. మూడున్నర గంటలకు పైగా కొనసాగిన విచారణ
రెండు గంటలుగా విచారణ
- ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ ప్రత్యేక బృందం
- రెండు గంటలుగా కొనసాగుతున్న విచారణ
- కేటీఆర్ ఓ రూంలో.. ఆయన లాయర్ మరో రూంలో
- రేసు ఒప్పందాలు, నగదు బదిలీపైనే ప్రధానంగా కొనసాగుతున్న విచారణ
కేటీఆర్‌కు ప్రశ్నల వర్షం
- ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న అధికారులు
- ఓ గదిలో కేటీఆర్, పక్కనే లైబ్రరీలో ఆయన లాయర్ రామచందర్‌రావు
- లాయర్‌కు కేటీఆర్ కనిపించేలా ఏర్పాట్లు
- కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం గుప్పిస్తున్న ఏసీబీ అధికారుల బృందం
- HMDA నుంచి FEOకు రూ. 55 కోట్ల నగదు బదిలీపై ఆరా
- రేసు ఒప్పందాల కోసం ఎవరిని కలిశారు? ఎప్పడెప్పుడు కలిశారు? ఎలాంటి చెల్లింపులు జరిగాయి? ఏదైనా వివాదాలు వస్తాయని ముందు జాగ్రత్తగా ఆర్బిట్రేషన్ పెట్టుకున్నారా?అని ప్రశ్నించే అవకాశం.
ACB-KTR వాదనలు ఇలా..
ఏసీబీ: ఒప్పందం కుదరకముందే చెల్లింపులు జరిగాయి
KTR: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకే రూ.55 కోట్ల ఖర్చు
ఏసీబీ: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ చెల్లింపులు జరిగాయి
KTR: గ్రీన్‌కో సంస్థ వెళ్లిపోవడంతో డబ్బులు సర్దుబాటు చేశాం
ఏసీబీ: ఒప్పందంలో భాగం కాకపోయినా హెచ్‌ఎండీఏ ద్వారా చెల్లింపులు
KTR: డబ్బులు ఇచ్చిన సంగతి హెచ్‌ఎండీఏకి తెలుసు
ఏసీబీ: రూ.54 కోట్ల 88 లక్షల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం
KTR: ఈవెంట్ ద్వారా వచ్చిన ప్రయోజనం రూ.700 కోట్లు
ఏసీబీ: ఫార్ములా-ఈకి రెండు విడుతల్లో రూ.45 కోట్ల చెల్లింపులు
KTR: కొన్ని సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి
ఏసీబీ: తొలి విడతలో రూ.22 కోట్ల 69 లక్షల విడుదల
KTR: బ్యాటరీ వెహికిల్స్ రీపర్పస్ చేసే విధంగా జీవో తెచ్చాం
ఏసీబీ: మలివిడతలో రూ.23 కోట్లు చెల్లించిన హెచ్‌ఎండీఏ
KTR: మరో సంస్థ రూ.1200 కోట్ల పెట్టుబడులు పెట్టింది
ఏసీబీ: ఆర్‌బీఐ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులు
KTR: మొబిలిటీ వీక్ ద్వారా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయి
ప్రత్యేక గదిలో కేటీఆర్ విచారణ
- ఏసీబీ కార్యాలయంలో కొనసాగుతున్న కేటీఆర్ విచారణ
- ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు
- జాయింట్ డైరెక్టర్, డీఎస్పీ, సీఐల సమక్షంలో కొనసాగుతున్న విచారణ
- విచారణకు కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్‌రావును లోపలికి అనుమతించిన అధికారులు
- అరవింద్‌కుమార్‌తో పాటు దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ?
- బిజినెస్ రూల్స్ ఉల్లంఘనతో పాటు నిధుల దుర్వినియోగం అభియోగాలు
- కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపుల అభియోగాలపై ప్రశ్నలు
ఏసీబీ ఆఫీస్‌కు కేటీఆర్
- ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్
- నందినగర్ నివాసం నుంచి ఏసీబీ ఆఫీస్‌కు చేరుకున్న కేటీఆర్
- కేటీఆర్ వెంట ఆయన లాయర్, మాజీ ఏఏజీ రామచంద్రరావు
నిఖార్సైన తెలంగాణ బిడ్డను..: కేటీఆర్
- నందినగర్ నివాసం వద్ద మీడియాతో కేటీఆర్
- తెలంగాణ ప్రతిష్టను పెంచడానికే నేను ప్రయత్నించాను
- హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడానికి ప్రయత్నించాం
- ఈ క్రమంలోనే ఈ కార్ రేసు నిర్వహించాం
- మంత్రిగా తన బామర్దులకు కాంట్రాక్ట్ ఇప్పించే ప్రయత్నం నేనేం చేయలేదు
- అరపైసా కూడా అవినీతి చేయలేదు
- ఇంకా ఎన్ని కేసులైనా పెట్టుకో.. వాటిని ఎదుర్కొంటాం (సీఎం రేవంత్‌ను ఉద్దేశించి..)
- తెలంగాణ బిడ్డగా రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా స్పష్టంగా చెప్తున్నా
- రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం ప్రపంచ స్థాయిలో ఎదిగేలా పని చేశా..
- మేము కుటుంబం కోసం పని చేయలేదు
- నేను 50 లక్షల డబ్బుతో ఎమ్మెల్యే లను కొని దొరికిన దొంగను కాదు
- నిజం నిలకడ మీద తెలుస్తది
- మీ వైఫల్యాలపై పోరాడింది బీఆర్‌ఎస్.. అందుకే మా మీద కేసులు
- మీ డైవర్షన్ లకు లోనుకాము
- నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను.. ఏ తప్పు చేయలేదు
- ఏ ప్రశ్నలు అడిగిన చెప్తం .. తెలంగాణ కోసం చస్తాను తప్ప తల వంచను
ఎక్స్‌లో కేటీఆర్
- తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకేర్ములా ఈ కార్ రేసు నిర్వహించాం
- పెట్టుబడులను రప్పించేందుకు కోసం కృషి చేశాం
- వీటన్నింటిని ప్రజలు అర్థం చేసుకుంటారని విశ్వసిస్తున్నా
- ఎప్పటికైనా సత్యం, న్యాయమే గెలుస్తుంది
Worked tirelessly for bringing a prestigious event to India, to enhance the Brand image of Hyderabad & Telangana globally
Agenda was to make Hyderabad a pivotal hub for sustainable mobility as the world transitions towards it. Formula-E race was a part of the effort to realise… pic.twitter.com/JhqimVe9TI— KTR (@KTRBRS) January 9, 2025
భారీ భద్రత ఏర్పాటు
- బంజారాహిల్స్‌లోని ఏసీబీ ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు
- కేటీఆర్ విచారణ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఏర్పాటు
- ఏసీబీ ఆఫీస్‌కు ఇరువైపులా భారీ బారికేడ్లు
- మరోవైపు బీఆర్‌ఎస్ నేతల హౌజ్ అరెస్టులు
- కేటీఆర్ ఇంటికి బీఆర్‌ఎస్ నేతల క్యూ
Comments
Please login to add a commentAdd a comment