గుంటూరు, సాక్షి: తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కొన్న పెద్దిరెడ్డి సుధారాణికి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధైర్యం చెప్పారు. గురువారం మధ్యాహ్నాం తన కుటుంబ సభ్యులతో ఆమె తాడేపల్లికి వెళ్లి ఆయన్ని కలిశారు.
తమపై అకారణంగా కేసులు పెట్టి వేధించారని ఈ సందర్భంగా జగన్ వద్ద సుధారాణి వాపోయారు. అయితే అధైర్య పడొద్దని, ఆమె కుటుంబానికి అండగా నిలుస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందజేస్తామని జగన్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి విడదల రజిని, సుధారాణి కుటుంబాన్ని దగ్గరుండి జగన్‌కు కలిపించారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, అడ్వకేట్ పోలూరి వెంకటరెడ్డి, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment