విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాల్లో ఏ-గ్రేడ్లో అత్యధికంగా 57.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 4,11,941 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,03,934 మంది ఉత్తీర్ణులయ్యారు.73.78%గా ఉత్తీర్ణత శాతం నమోదైంది. బాలికలు 76.43, బాలురు 71.02 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతంలో కంటే ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఏ-గ్రేడ్ 75% మార్కుల కంటే ఎక్కువ, బీ-గ్రేడ్ 60 నుంచి 75%, సీ-గ్రేడ్ 50 నుంచి 60%, డీ-గ్రేడ్ 35 నుంచి 50%గా నిర్ణయించారు.
గ్రేడ్ల వారీగా ఫలితాల వివరాలు:
ఏ-గ్రేడ్ : 1,74,649( 57.16 %)
బీ-గ్రేడ్ : 84407 (27.77%)
సీ-గ్రేడ్ : 33,864 (11.14%)
డీ-గ్రేడ్ : 11,014 (3.62%).
గ్రేడ్ల వారీగా ఇంటర్ ఫలితాలు
Published Tue, Apr 19 2016 12:11 PM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM
Advertisement
Advertisement