సాక్షి,న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వెయ్యికి పైగా ఉద్యోగావకాశాలు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటన జారీ అయింది. దాదాపు 130 కేటగిరీల్లో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. దేశంలో ఉద్యోగాలు లేవంటూ మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలు/సంస్థలలో 1,136 ఖాళీలు భర్తీ చేసేందకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా గ్రూప్ బి (నాన్ గెజిటెడ్) / గ్రూప్ సి పోస్టులకోసం ఎస్‌ఎస్‌సీ నియామకాలు చేపట్టనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబరు 30, 2018. ఒక వ్యక్తి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఒక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని పేర్కొంది.
మరిన్ని వివరాలు www.ssc.nic.in, లేదా SSC (northern region) website i.e, www.sscnr.net.in. వెబ్‌సైట్లో లభ్యం. అలాగే అన్ని ఎస్‌ఎస్‌సీ ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా ఖాళీలు, అర్హత , దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన వివరణాత్మక ప్రకటన అందుబాటులోఉంది.
Comments
Please login to add a commentAdd a comment