central govt departments
-
డియర్.. నిప్పులేకుండానే కాలుద్ది జాగర్త!
ఖగపతి యమృతము తేగాభుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్పొగ చెట్టై జన్మించెనుపొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్అని గిరీశం దొరవారు ఎన్నడో సెలవిచ్చారు. ఇప్పుడు పొగపురాణాన్ని తిరగరాసుకోవాల్సి వచ్చేలా ఉన్నది. కమలపతి వడ్డన సేయగపొగచుట్టకు పన్ను పోటు బాగా ముదిరెన్రెక్కలతో ధరలు ఎగరగఅగ్గిపుల్ల లేకున్నా జేబులు కాలున్..అని కొత్తగా తోచిన పజ్జేలు రాసుకుని వాటిని పారాయణం చేసుకుంటూ గడపవలెను. దమ్ము కొట్టాలనిపించినప్పుడెల్లా.. నరాలు పట్టు తప్పి, జిహ్వ లాగి, భయం పుట్టి, వణుకుతో శరీరం కంపించి.. ఇక ఆ ఆలోచననే ధూమపాన ప్రియులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చేలా ఉన్నది మరి! ఢిల్లీ పాలకులు సిగరెట్టుల మీద పన్ను పోటును ఏకంగా 35 శాతానికి పెంచేయాలని తలపోస్తున్న తరుణంలో.. సిగరెట్టును తలచుకుంటే చాలు.. పర్సు కాలి చురుక్కు మంటుందని అనుకోవాల్సిందే.సిగరెట్టు అనగా ఏమిటి? మన లోలోపల గూడుకట్టుకుని ఉండే క్రియేటివిటీ అనే పదార్థాన్ని కరిగించి గంగాప్రవాహంలా వెలుపలికి లాక్కుని వచ్చే ధూమపరికరము కదా.. అని భాష్యం చెప్పగల మహానుభావులు మనకు చాలా మంది కనిపిస్తుంటారు. ‘భలే భలే ఓ సిగరెట్టు.. చేస్తావే బహు కనికట్టు.. చైతన్యానికి తొలిమెట్టు.. బద్ధకముంటే పని పట్టు..’ అంటూ సిగరెట్టు దమ్ము లాగి వదిలితే తప్ప తమలో జీవనోత్సాహం ఇనుమడించదని, దేహశకటం పరుగులెత్తదని నమ్మే ప్రబుద్ధ జీవులు కూడా కొందరుంటారు. పుర్రె బొమ్మ ఉన్నంత మాత్రాన చాపల్యం చావదని, చావు డప్పు మోగుతుందని తెలిసినా ధూమప్రేమ విలోమం కాదని నిరూపించే నిత్య సత్యమే సిగరెట్టు!ఉదయముననే మేల్కాంచి తమ స్నానాలగదిలోకి దూరి తమ చుట్టూ ధూపం వేస్తే తప్ప కాలకృత్యపర్వం కూడా ముగించలేని నిత్య అంకితులు కొందరుంటారు. తమ మునివేళ్ల చివరల్లోమండే అందాల్ని తమకు దూరం చేయాలనే కుట్ర ఏదో అధికారాత్మకంగా జరుగుతున్నదని అనుమానించే సత్యశంకితులు కొందరు ఉంటారు! ఎవరి సంగతి ఎలా ఉన్నప్పటికీ.. సిగరెట్టు అనే పదార్థము తాజా పరిణామముల నేపథ్యములో.. నిప్పు లేకున్ననూ మండును.. మీ బతుకును పొగించడం మాత్రమే కాదు.. తెగించి ముట్టిస్తే నోటిచివర మండుట మాత్రమే కాదు సుమీ.. జేబులోని సొమ్ములను కూడా దహించి మసిచేయును.. అనే భావన ఇప్పుడు దేశ ప్రజలలో వేళ్లూనుకొనుచున్నది!సిగరెట్టు మీది అపరిమితమైన ప్రేమతో, అది అమూల్యమైన వస్తువని గుర్తించి.. దాని విలువను ఆకసమునందలి నక్షత్రాల సరసన ఉంచినప్పుడే దానికి సద్గతి కలుగునని ఏలికలు గ్రహించడమే ఒక చిత్రమైన సంగతి. అందుకే జీఎస్టీ అను జోడింపులో కాస్త పెంపు జత చేసి 35 శాతం వడ్డించడం తగు విధాయకం అని నిర్ణయించడం తాజా తాజా సంగతి! ఇటువంటి పరిస్థితుల్లో సిగరెట్టు అను పరికరముతో దమ్ము కొట్టాలన్నా.. దాని వెంబడి శీతల పానీయములు అనబడు ద్రావకములు గుటక వేయాలన్నా.. బహు కష్టము అని ప్రజలు తెలుసుకోవడం ఒక్కటే ఇంకా పెండింగులో ఉన్నది.ఇటువంటి వికట పరిస్థితులలో.. ధూమ ప్రేమికులకు గత్యంతరమేది? అను సందేహము జనులలో జనియించుట సహజము! పరిష్కారము బహు సులభము. ఓ తెల్లటి కాగితము మీద.. సిగరెట్టును చిత్రించి.. ఓ చివరన పెదవుల బంధమును, మరో చివరన పొగ కెరటములను చిత్రించి.. జిహ్వ లాగినప్పుడెల్లా దానిని చూచుకొనుచూ యుండవలెను. అటుల జేసిన యెడల.. జూచుచూ గడిపిన యెడల.. ధూమపానాసక్తులకు అనుభవైకవేద్యమైన పురాఅనుభవము.. పునః అనుభవములోకి వచ్చి ఆత్మానందము కలుగును. మరియొక మార్గము దుర్లభము. స్వస్తి. ..ఎం. రాజేశ్వరి -
కాళేశ్వరం ప్రాజెక్ట్ డేటా ఇస్తారా? లేదా?
సాక్షి, ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్ట్ డేటా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ లేఖ రాసింది. రేపటిలోగా(ఆదివారం) ప్రాజెక్ట్‌కు సంబంధించి సమాచారం ఇవ్వాలని డెడ్‌లైన్ విధించింది. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాచారంలేదని భావిస్తామని లేఖలో పేర్కొంది. వివరాల ప్రకారం.. కాళేశ్వరం ప్రాజెక్టు డేటా కేంద్రానికి ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి 20 రకాల సమాచారాన్ని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగింది. కాగా, ఇప్పటివరకు నాలుగు అంశాలపై మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. మిగితా 16 అంశాలపై తెలంగాణ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. అయితే, ప్రాజెక్టు క్వాలిటీ, జియలాజికల్ స్టడీ , కాంట్రాక్టర్ లయబిలిటీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదు. దీంతో, ఈ విషయాన్ని డ్యామ్ సేఫ్టీ అథారిటీ సీరియస్‌గా తీసుకుంది. డెడ్‌లైన్ విధింపు.. రేపటిలోగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని డ్యామ్ సేఫ్టీ అథారిటీ.. రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. అయినప్పటికీ సమాచారం ఇవ్వని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రాజెక్ట్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేదని తాము భావిస్తామని తెలిపింది. ఈ క్రమంలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. బ్యారేజీల్లో సమస్యలు సహజమే.. మరోవైపు.. ఇసుకపై పునాదులు వేసి కట్టే బ్యారేజీల్లో సమస్యలు సహజమేనని, మేడిగడ్డ బ్యారేజీ డిజైన్, నిర్మాణంలో సమస్యల్లేవని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్‌కుమార్ స్పష్టం చేశారు. బ్యారేజీ డిజైన్‌లో లోపాలుంటే ఎప్పుడో కొట్టుకుపోయేదన్నారు. గతంలో ఫరక్కా, ధవళేశ్వరం బ్యారేజీల్లోనూ సమస్యలు వచ్చాయని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మోనోలిథిక్ డిజైన్‌తో బ్యారేజీ నిర్మించారని, గతేడాది భారీ వరదలను కూడా బ్యారేజీ తట్టుకుందన్నారు. బ్యారేజీ మొత్తం ఎనిమిది బ్లాకులతో నిర్మిస్తే అందులో 7వ బ్లాకులోని పియర్ నంబర్ 16, 17, 18, 19, 20, 21లలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయన్నారు. తొలుత కాఫర్ డ్యామ్ నిర్మించి ఎగువ ప్రాంతాల నుంచి వరదను మళ్లిస్తామని... ఆ తర్వాత చుట్టూ రింగ్ మెయిన్ నిర్మించి పియర్ల కుంగుబాటుకు గల కారణాలను గుర్తించాకే మరమ్మతు పనులు ప్రారంభిస్తామని ఆయన వివరించారు. బ్యారేజీ నిర్మాణం రివర్‌బెడ్‌పై జరగడం, ఇసుకపైనే పునాదులు ఉండటం వల్ల సమస్యలు వస్తాయన్నారు. పిలర్ల కింద ఇసుక కదలడం వల్లే కుంగినట్లు చెప్పారు. మరమ్మతులకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అనుమతించాలని తెలిపారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కోరిన వివరాలను సమర్పించినట్లు చెప్పారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో అగ్రవర్ణాలకు పెద్దపీట -
సవాళ్లున్నా మున్ముందుకే
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 10 లక్షల కొలువుల భర్తీకి ఉద్దేశించిన ‘రోజ్‌గార్ మేళా’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం లాంఛనంగా ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 75,000 మందికి వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఉద్యోగాల సృష్టికి గత ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఆర్థిక వ్యవస్థ దిగజారడంతో పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయని గుర్తుచేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని తెలిపారు. ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడడానికి తాము అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఉద్ఘాటించారు. అడ్డంకులను అధిగమించాం.. ‘‘అంతర్జాతీయంగా పరిస్థితి ఏమాత్రం బాగాలేదన్న మాట ముమ్మాటికీ వాస్తవం. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థలే కుదేలైపోతున్నాయి. శతాబ్దానికి ఒకసారి కనిపించే కోవిడ్–19 లాంటి మహమ్మారుల దుష్పరిణామాలు కేవలం 100 రోజుల్లో అంతమైపోవు. ఈ విషయం ఎవరూ ఆలోచించడం లేదు. కరోనా వైరస్ ప్రపంచమంతటా ప్రతికూల ప్రభావం చూపింది. అయినప్పటికీ ఇలాంటి సమస్యల నుంచి మన దేశాన్ని కాపాడడానికి ఎన్నో చర్యలు చేపట్టాం. రిస్క్‌లు తీసుకున్నాం. ఇది చాలా కఠినమైన సవాలు. ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన ప్రభుత్వ విభాగాల పనితీరు, సామర్థ్యం ఎంతగానో మెరుగుపడింది. ప్రపంచంలో మన ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుంచి గత ఎనిమిదేళ్లలో 5వ స్థానానికి చేరుకుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తయారీ, మౌలిక సదుపాయాలు, టూరిజం వంటి రంగాలను ప్రోత్సహిస్తున్నాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘ముద్ర’ పథకం కింద రుణాలు అందజేస్తున్నాం. యువత కోసం గరిష్ట సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి ప్రభుత్వం బహుముఖంగా పనిచేస్తోంది. ఈ దిశగా ‘రోజ్‌గార్ మేళా’ ఒక ముఖ్యమైన మైలురాయి. యువతలో నైపుణ్యాలు పెంచి.. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాలను పరుగులు పెట్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దిగుమతిదారు నుంచి ఎగుమతిదారుగా.. డ్రోన్ పాలసీని సరళీకృతం చేశాం. స్పేస్ పాలసీ ద్వారా అంతరిక్షంపై పరిశోధనలకు ప్రైవేట్ సంస్థలకూ అవకాశం కల్పించాం. ముద్ర పథకం కింద రూ.20 లక్షల కోట్ల రుణాలిచ్చాం. ‘స్టార్టప్ ఇండియా’తో మన యువత దుమ్ము రేపుతోంది. మనదేశం చాలా రంగాల్లో ఎగుమతిదారుగా ఎదుగుతుండడం సంతోషకరం. రోడ్లు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్‌ల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. మౌలిక సదుపాయాల రంగంలో రూ.100 లక్షల కోట్లు ఖర్చు చేయాలని సంకల్పించాం’’ అని మోదీ పేర్కొన్నారు. -
పార్లమెంట్లో అదే అలజడి.. కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల పెరుగుదల, లోక్‌సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు సోమవారం కూడా ఆందోళన కొనసాగించాయి. దీంతో రెండు సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టడంతో ధరల పెరుగుదలపై లోక్‌సభలో చర్చ జరిగింది. దీనిపై మంగళవారం రాజ్యసభ కూడా చర్చించనుంది. సభ గౌరవాన్ని తగ్గించొద్దు: స్పీకర్ లోక్‌సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. తమ ఎంపీలపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సభ గౌరవాన్ని తగ్గించే పని చేయొద్దని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ వెనక్కి తగ్గలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభమైనా విపక్షాలు నినాదాలు ఆపలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటోందని మండిపడ్డారు. దాంతో సభ మధ్యాహ్నం రెండింటిదాకా వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా అవే దృశ్యాలు కనిపించాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు, ఇది ఈడీ సర్కారు అంటూ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నినాదాలు చేశారు. డీఎంకే, ఎన్సీపీ సభ్యులు వారికి మద్దతుగా నిలిచారు. సభలోకి ఇకపై ప్లకార్డులు తీసుకురాబోమని నలుగురు కాంగ్రెస్ ఎంపీలు హామీ ఇవ్వడంతో వారిపై సస్సెన్షన్‌ను ఎత్తేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సభ్యులను హెచ్చరించారు. సభాపతి స్థానాన్ని అగౌరవపర్చాలన్న ఉద్దేశం ప్రతిపక్షాలకు లేదని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల వినతిని ప్రభుత్వం వినకపోవడం వల్లే నిరసన తెలపాల్సి వస్తోందన్నారు. రాజ్యసభలోనూ అవే సీన్లు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టు తదితరాలపై ప్రతిపక్షాలు రాజ్యసభను స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే ఆందోళనకు దిగాయి. దాంతో సభ మధ్యాహ్నం 12 దాకా వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సభ్యులు శాంతించలేదు. వెల్‌లోకి చేరుకొని, కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభా సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రతిపక్షాలను కోరారు. ధరల పెరుగుదలపై మంగళవారం సభలో చర్చిస్తామన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, అస్సాంలో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే ప్రస్తావించారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపర్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. సభలో విపక్షాల నిరసనల మధ్యే ఖాదీ, జీడీపీలో వీధి వ్యాపారుల పాత్ర, నదుల స్వచ్ఛీకరణ, అభివృద్ధిపై చర్చను చేపట్టారు. నినాదాల హోరు పెరగడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. మాంద్యానికి అవకాశం లేదు: నిర్మల భారత్‌లో ఆర్థిక మాంద్యం గానీ, ఆర్థిక మందగమనం గానీ ఏర్పడే అవకాశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో చెప్పారు. ధరల పెరుగుదలపై చర్చలో ఆమె మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలంగా మారుతోంది అని చెప్పడానికి జీఎస్టీ వసూళ్లు, కొనుగోలు సూచికే(పీఎంఐ) సాక్ష్యమని వివరించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆరేళ్ల బాలిక ప్రధాని మోదీకి రాసిన లేఖ గురించి ప్రస్తావించారు. మోదీపై నమ్మకం ఉంది కాబట్టే లేఖ రాసిందని అన్నారు. ప్రభుత్వ చర్యలు, విధానాల వల్ల ఇటీవల వంట నూనెల ధరలు తగ్గిపోయాయని ఉద్ఘాటించారు. ఆర్థిక మంత్రి సమాధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోక్‌సభ నుంచి కాంగ్రెస్, డీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. ‘నో వన్ కిల్డ్ జెస్సికా తరహాలో దేశంలో ద్రవ్యోల్బణం లేదు’ అని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఎద్దేవా చేశారు. పచ్చి కూరగాయలు తినాల్సిందే ధరల పెరుగుదలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ లోక్‌సభలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ధరల పెరుగుదలపై చర్చ జరుగుతుండగా హఠాత్తుగా లేచి పచ్చి వంకాయను ప్రదర్శించారు. వంట గ్యాస్ ధర విపరీతంగా పెరగడంతో పచ్చి కూరగాయలు తిని కడుపు నింపుకోవాల్సిందేనంటూ వంకాయను కొరికి నిరసన వెలిబుచ్చారు. -
కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను రాజకీయ విరోధులపైకి ఉసిగొల్పుతోందని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని వారు మంగళవారం నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాసిన లేఖలో కోరారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఈడీ ప్రశిస్తున్న సమయంలో వారీ లేఖ రాయడం గమనార్హం. ధరల పెరుగుదల, జీఎస్టీ వంటి అంశాలపై తక్షణమే చర్చ చేపట్టాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకుండా మొండిగా వ్యవహరిస్తుండటం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ లేఖపై కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ, సీపీఎం నేతలు సంతకాలు చేశారు. ‘చట్టం ముందు అందరూ సమానమే. కానీ, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నేతలకు వ్యతిరేకంగా ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో చట్టాలను అమలు చేస్తున్నారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. -
దేశ వ్యాప్తంగా 150 చోట్ల సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సుమారు 150 చోట్ల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోని సంస్థల్లో సీబీఐ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, జైపూర్, జోధ్‌పూర్, గువాహటి, శ్రీనగర్, షిల్లాంగ్, చండీగఢ్, సిమ్లా, చెన్నై, మదురై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పుణె, గాంధీనగర్, గోవా, భోపాల్, జబల్పూర్, నాగ్‌పూర్, పట్నా, రాంచీ, ఘజియాబాద్, లక్నో, డెహ్రాడూన్లలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ రంగంలో అవినీతికి ఆస్కారమున్న సంస్థల్లో సోదాలు చేపట్టినట్లు సీబీఐ అధికారులు చెప్పారు. -
80 శాతం బాంబులు లక్ష్యాన్ని తాకాయి: ఐఏఎఫ్
-
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో దాదాపు 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో పక్షం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, అంతకుముందే నోటిఫికేషన్లు విడుదల చేస్తే భర్తీ ప్రక్రియ సులభతరమవుతుందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, నోటిఫికేషన్లు విడుదల చేస్తే యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతారని తెలిపారు. 72 ప్రభుత్వ శాఖల్లో 4.32 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని, బ్యాంకింగ్ రంగంలో 2.20 లక్షలు, రైల్వేలో 2.40 లక్షలు, రక్షణ శాఖ పరిధిలో 3.5 లక్షలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 2.70 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. -
1,100 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ ప్రకటన
న్యూఢిల్లీ: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,100కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) గురువారం ప్రకటించింది. మొత్తం 130 విభాగాల్లో గ్రూప్– బి (నాన్– గెజిటెడ్), గ్రూప్– సికి సంబంధించిన 1136 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. రీజియన్ల వారీగా ఉన్న ఈ పోస్టులకు దేశంలోని అభ్యర్థులు అన్ని రీజియన్లలోనూ పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఆన్లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 30 గడువు అని వివరించింది. దరఖాస్తు విధానం, ఫీజు, అర్హత వివరాలు ఠీఠీఠీ.టటఛి.nజీఛి.జీnలో చూడాలని సూచించింది. -
గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
సాక్షి,న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వెయ్యికి పైగా ఉద్యోగావకాశాలు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఒక అధికారిక ప్రకటన జారీ అయింది. దాదాపు 130 కేటగిరీల్లో గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. దేశంలో ఉద్యోగాలు లేవంటూ మోదీ సర్కార్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలు/సంస్థలలో 1,136 ఖాళీలు భర్తీ చేసేందకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా గ్రూప్ బి (నాన్ గెజిటెడ్) / గ్రూప్ సి పోస్టులకోసం ఎస్ఎస్సీ నియామకాలు చేపట్టనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబరు 30, 2018. ఒక వ్యక్తి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఒక మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. కంప్యూటర్ ఆధారంగా నిర్వహించే వ్రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నామని పేర్కొంది. మరిన్ని వివరాలు www.ssc.nic.in, లేదా SSC (northern region) website i.e, www.sscnr.net.in. వెబ్సైట్లో లభ్యం. అలాగే అన్ని ఎస్ఎస్సీ ప్రాంతీయ కార్యాలయాల్లో కూడా ఖాళీలు, అర్హత , దరఖాస్తుకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన వివరణాత్మక ప్రకటన అందుబాటులోఉంది. -
ఇంటిగుట్టుకు తూట్లు
ఇంటి గుట్టు - కాపురం రట్టు అని లోకోక్తి . ఇంటికి గుట్టు ఎంత అవసరమో, కాపురం రట్టు కాకుండా ఉండటమూ అంతే అవసరమని దీని భావం. విశాల ప్రజానీకం ప్రయోజనాలు ఇమిడి ఉండే ప్రభుత్వ వ్యవహారాలకూ ఇది వర్తిస్తుంది. సర్కారు విధానాలు, నిర్ణయాలు, ప్రతిపాదనలు, అంచనాలు, అంతర్గత చర్చలు కచ్చితంగా ఎలా ఉంటున్నాయో ముందస్తుగా బహిర్గతమైతే, అందులో గోప్యత లేకుంటే పాలనా నౌకకు చిల్లులు పడటం ఖాయం. కేంద్రంలో ఆర్ధిక, పెట్రోలి యం, బొగ్గు , ఇంధన మంత్రిత్వ శాఖలు చాలా కీలకం. వీటి రోజువారీ కార్యకలా పాలు అటు ఖజానాపైనా, ఇటు జనజీవనంపైనా ప్రభావం చూపుతాయి.అలాంటి శాఖల నుంచి చాలా కాలంగా ముఖ్యమైన రహస్య పత్రాలు భద్రతా కోటలు దాటి స్వార్ధపరుల చేతికి చేరుతున్నాయని ఢిల్లీ పోలీసులు రెండు రోజుల కిందట బయటపెట్టడం యావద్దేశాన్నీ విస్మయపపరచింది. ఈ గూఢచర్యంలో దేశంలోని ఐదు ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం ఇంకా ఆశ్చర్యకరం. ఈ రహస్య పత్రాల లీకుల కుంభకోణంలో ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులు నలుగురు, ఒక సీనియర్ జర్నలిస్టు , ఇద్దరు కన్సల్టెంట్లు సహా ఐదుగురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ఉన్నతాధికారులు ఉన్నట్టు గుర్తిం చారు. ఈ పన్నెండు మందినీ అరెస్టు చేయడమే కాక, కేసు దర్యాప్తుని ముమ్మరం చేశారు. నిఘా కోసం చిన్న దుకాణాల వద్ద సైతం ఈ రోజుల్లో సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఇవి విరామం లేకుండా 24 గంటలూ వాటి ముందు జరిగే ప్రతి క్షణాన్నీ నిఘా నేత్రంతో రికార్డు చేస్తాయి. అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రహస్య పత్రాలు దర్జాగా ఐదు, పది వేల ఖరీదుకు వీధిన పడటం నిస్సందేహంగా భద్రతా వైఫల్యమే. ఇంటి దొంగల లాలూచీ లేనిదే ఈ కుంభకోణం సాధ్యపడదు. నాలుగు నెలల క్రితం చూచాయగా గూఢచర్యాన్ని పసిగట్టిన జాతాయ భద్రతా సలహాదారు దీనిపై దృష్టి సారించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సూచించారు. దాంతో ఈ ఆఫీసులలో నిఘా పెట్టారు. బోగస్ పత్రాలను కీలకమైనవిగా నమ్మించి నిందితుల్ని పక్కదారి పట్టించి వలపన్ని పట్టుకున్నారు. ఈ కేసులో నిందితులు కార్యాలయాలను నకిలీ తాళం చెవులతో తెరిచినట్టు, నకిలీ ఐడీ కార్డులతో ప్రవేశించి పత్రాలను అపహరించినట్టు చెప్పే ఆధారాలు దొరికినట్టు చెబుతున్నారు. ఇలా చోరీకి గురైన రహస్య పత్రాల్లో కేబినెట్ మినిట్స్( చర్చనీయాంశాలు), ప్రభుత్వ ఆదేశాలు (జీవోలు), మెమోలు, నోట్లు ఉన్నాయి. ఆఖరికి ఈ నెల 28 వ తేదీన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో చేయబోయే బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యభాగాలు కూడా నిందితుల నుంచి స్వాధీ నం చేసుకున్న రహస్య పత్రాల్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అంటే, పత్రాల చోరులు ఎంత విచ్చలవిడిగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడుతు న్నారో అర్ధమవుతుంది. బడ్జెట్ ప్రసంగంలో అంశాలు ఆర్థిక మంత్రి సభలో చదివి వినిపించే వరకు గోప్యంగా ఉంటాయి. అవి లీకవడం వల్ల బడ్జెట్ కారణంగా ప్రభావితమయ్యే వర్గాలు జాగ్రత్తపడతాయి. తద్వారా ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాలు దెబ్బ తింటాయి. ఆర్ధిక ప్రణాళికలు పల్టీ కొడతాయి. అరుణ్ జైట్లీ ఈ సారి బడ్జెట్ప్రసంగంలో వెల్లడించబోయే వాటిలో జాతీయ గ్యాస్గ్రిడ్ ప్రతిపాదన ఉందని, దాని వివరాలు ముందుగా తెలుసుకోడానికి రిల యెన్స్, ఎస్సార్, అడాగ్, కెయిర్న్స్, జూబిలంట్ ఎనర్జీ సంస్థలు ఆసక్తిచూపుతు న్నాయని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కంపెనీలన్నీ విద్యుత్, గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన వాణి జ్య రంగాలలో నిమగ్న మై ఉన్నవే. కాబట్టి, ఇవి రహస్య పత్రాల చౌర్యానికి ప్రయత్నించి ఉంటాయనే అను మానాలకు ఆస్కారం ఉంది. అయితే, ఈ ఆరోపణల్ని సదరు ఐదు కంపెనీలూ ఖం డిస్తున్నాయి. ఇందులోని సత్యాసత్యాలు పోలీసుల సమగ్ర దర్యాప్తులో గాని తేలవు. ఈ ‘లీక్గేట్’ లో దోషులుగా బయటపడిన ఎవ్వరినీ వదలబోమని, ఇందులో ప్రభు త్వ అధికారులు, దళారుల మధ్య లాలూచీని కొట్టివేయలేమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ రహ్యపత్రాల లీకేజీ ఇప్పటిదా లేక ఇంతకు ముందు నుంచే జరుగుతోందా? అన్నది దర్యాప్తులో తేలుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారీ స్థాయిలో జరిగిన ఈ లీకేజీ ఉదంతాన్ని స్వ యంగా బయటపెట్టడం వెనుక ఒక సందేశం ఉందని, ఏ పారిశ్రామిక సంస్థ అయి నా అవినీతి, అక్రమమార్గాల్లో పయనించరాదని ప్రభుత్వం వాటికి స్పష్టంగా చెప్ప డమే అసలు ఉద్దేశమని ఎన్డీఎ సర్కారు వర్గాలు అంటున్నాయి. అదేంకాదు, మోదీ సర్కారు తన ప్రతిష్టని పెంచుకోడానికి ఇలాంటి తేలికపాటి గూఢచర్యం కేసు ల్ని బయటపెట్టి, ఏదో మహానేరం జరిగినట్టు యాగీ చేసి చివరికి ఏమీ నష్టం లేద ని తేల్చివేసే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడే వర్గాలూ ఉన్నాయి. వ్యాపారం, వాణిజ్యం, రాబడి వంటి అంశాలతో ప్రమేయం ఉన్న ప్రభుత్వ శాఖలలో ప్రైవేట్ కంపెనీల ‘లాబీయింగ్’ కొత్తేమీ కాదు. ఈ శాఖలలో కన్సల్టెంట్ల(సలహాదారులు) నియామకం కూడా సాధారణమే. ఇలాంటి రహస్య పత్రాల లీకేజీలు ఈ సలహాదా రులనే అనుమానిస్తాయి. జాతి పురోగతికి నష్టం కలిగించే ఈ తరహా చర్యలు దేశ ద్రోహం కంటే తక్కువవేమీ కాదు. గతంలో పోటీ పారిశ్రామిక సంస్థల మధ్య ఫార్ములాలు, ఇంజినీరింగ్ డిజైన్లు, ప్లాన్లు వంటి వాటి విషయంలో గూఢచర్యం సాగేది. సాప్ట్వేర్రంగం అభివృద్ధితో అది కొంత తగ్గింది. పాతికేళ్ళ క్రితం భారత్ రోదసీ విజ్ఞాన రంగంలో విదేశీ గూఢచర్యం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిం చింది. ఏ రూపాన కొనసాగినా కీలక రహస్య సమాచార లీకేజి దేశానికి అపార నష్టం కలగచేస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఈ కేసుని శోధించి, దోషుల్ని గుర్తించి, ససాక్ష్యాలతో వారికి తగిన శిక్షపడేలా చూడడమే మోదీ సర్కారు విధి.