ఇంటి గుట్టు - కాపురం రట్టు అని లోకోక్తి . ఇంటికి గుట్టు ఎంత అవసరమో, కాపురం రట్టు కాకుండా ఉండటమూ అంతే అవసరమని దీని భావం. విశాల ప్రజానీకం ప్రయోజనాలు ఇమిడి ఉండే ప్రభుత్వ వ్యవహారాలకూ ఇది వర్తిస్తుంది. సర్కారు విధానాలు, నిర్ణయాలు, ప్రతిపాదనలు, అంచనాలు, అంతర్గత చర్చలు కచ్చితంగా ఎలా ఉంటున్నాయో ముందస్తుగా బహిర్గతమైతే, అందులో గోప్యత లేకుంటే పాలనా నౌకకు చిల్లులు పడటం ఖాయం. కేంద్రంలో ఆర్ధిక, పెట్రోలి యం, బొగ్గు , ఇంధన మంత్రిత్వ శాఖలు చాలా కీలకం. వీటి రోజువారీ కార్యకలా పాలు అటు ఖజానాపైనా, ఇటు జనజీవనంపైనా ప్రభావం చూపుతాయి.అలాంటి శాఖల నుంచి చాలా కాలంగా ముఖ్యమైన రహస్య పత్రాలు భద్రతా కోటలు దాటి స్వార్ధపరుల చేతికి చేరుతున్నాయని ఢిల్లీ పోలీసులు రెండు రోజుల కిందట బయటపెట్టడం యావద్దేశాన్నీ విస్మయపపరచింది.
ఈ గూఢచర్యంలో దేశంలోని ఐదు ప్రముఖ కార్పొరేట్ సంస్థల ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించడం ఇంకా ఆశ్చర్యకరం. ఈ రహస్య పత్రాల లీకుల కుంభకోణంలో ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగులు నలుగురు, ఒక సీనియర్ జర్నలిస్టు , ఇద్దరు కన్సల్టెంట్లు సహా ఐదుగురు ప్రముఖ పారిశ్రామిక సంస్థల ఉన్నతాధికారులు ఉన్నట్టు గుర్తిం చారు. ఈ పన్నెండు మందినీ అరెస్టు చేయడమే కాక, కేసు దర్యాప్తుని ముమ్మరం చేశారు. నిఘా కోసం చిన్న దుకాణాల వద్ద సైతం ఈ రోజుల్లో సీసీటీవీ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ఇవి విరామం లేకుండా 24 గంటలూ వాటి ముందు జరిగే ప్రతి క్షణాన్నీ నిఘా నేత్రంతో రికార్డు చేస్తాయి. అయినప్పుడు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి రహస్య పత్రాలు దర్జాగా ఐదు, పది వేల ఖరీదుకు వీధిన పడటం నిస్సందేహంగా భద్రతా వైఫల్యమే.
ఇంటి దొంగల లాలూచీ లేనిదే ఈ కుంభకోణం సాధ్యపడదు. నాలుగు నెలల క్రితం చూచాయగా గూఢచర్యాన్ని పసిగట్టిన జాతాయ భద్రతా సలహాదారు దీనిపై దృష్టి సారించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సూచించారు. దాంతో ఈ ఆఫీసులలో నిఘా పెట్టారు. బోగస్ పత్రాలను కీలకమైనవిగా నమ్మించి నిందితుల్ని పక్కదారి పట్టించి వలపన్ని పట్టుకున్నారు. ఈ కేసులో నిందితులు కార్యాలయాలను నకిలీ తాళం చెవులతో తెరిచినట్టు, నకిలీ ఐడీ కార్డులతో ప్రవేశించి పత్రాలను అపహరించినట్టు చెప్పే ఆధారాలు దొరికినట్టు చెబుతున్నారు.
ఇలా చోరీకి గురైన రహస్య పత్రాల్లో కేబినెట్ మినిట్స్( చర్చనీయాంశాలు), ప్రభుత్వ ఆదేశాలు (జీవోలు), మెమోలు, నోట్‌లు ఉన్నాయి. ఆఖరికి ఈ నెల 28 వ తేదీన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో చేయబోయే బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యభాగాలు కూడా నిందితుల నుంచి స్వాధీ నం చేసుకున్న రహస్య పత్రాల్లో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. అంటే, పత్రాల చోరులు ఎంత విచ్చలవిడిగా ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొరబడుతు న్నారో అర్ధమవుతుంది. బడ్జెట్ ప్రసంగంలో అంశాలు ఆర్థిక మంత్రి సభలో చదివి వినిపించే వరకు గోప్యంగా ఉంటాయి. అవి లీకవడం వల్ల బడ్జెట్ కారణంగా ప్రభావితమయ్యే వర్గాలు జాగ్రత్తపడతాయి. తద్వారా ప్రభుత్వ ఆర్థిక లక్ష్యాలు దెబ్బ తింటాయి. ఆర్ధిక ప్రణాళికలు పల్టీ కొడతాయి.
అరుణ్ జైట్లీ ఈ సారి బడ్జెట్‌ప్రసంగంలో వెల్లడించబోయే వాటిలో జాతీయ గ్యాస్‌గ్రిడ్ ప్రతిపాదన ఉందని, దాని వివరాలు ముందుగా తెలుసుకోడానికి రిల యెన్స్, ఎస్సార్, అడాగ్, కెయిర్న్స్, జూబిలంట్ ఎనర్జీ సంస్థలు ఆసక్తిచూపుతు న్నాయని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కంపెనీలన్నీ విద్యుత్, గ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన వాణి జ్య రంగాలలో నిమగ్న మై ఉన్నవే. కాబట్టి, ఇవి రహస్య పత్రాల చౌర్యానికి ప్రయత్నించి ఉంటాయనే అను మానాలకు ఆస్కారం ఉంది. అయితే, ఈ ఆరోపణల్ని సదరు ఐదు కంపెనీలూ ఖం డిస్తున్నాయి.
ఇందులోని సత్యాసత్యాలు పోలీసుల సమగ్ర దర్యాప్తులో గాని తేలవు. ఈ ‘లీక్‌గేట్’ లో దోషులుగా బయటపడిన ఎవ్వరినీ వదలబోమని, ఇందులో ప్రభు త్వ అధికారులు, దళారుల మధ్య లాలూచీని కొట్టివేయలేమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ రహ్యపత్రాల లీకేజీ ఇప్పటిదా లేక ఇంతకు ముందు నుంచే జరుగుతోందా? అన్నది దర్యాప్తులో తేలుతుందని కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
భారీ స్థాయిలో జరిగిన ఈ లీకేజీ ఉదంతాన్ని స్వ యంగా బయటపెట్టడం వెనుక ఒక సందేశం ఉందని, ఏ పారిశ్రామిక సంస్థ అయి నా అవినీతి, అక్రమమార్గాల్లో పయనించరాదని ప్రభుత్వం వాటికి స్పష్టంగా చెప్ప డమే అసలు ఉద్దేశమని ఎన్‌డీఎ సర్కారు వర్గాలు అంటున్నాయి. అదేంకాదు, మోదీ సర్కారు తన ప్రతిష్టని పెంచుకోడానికి ఇలాంటి తేలికపాటి గూఢచర్యం కేసు ల్ని బయటపెట్టి, ఏదో మహానేరం జరిగినట్టు యాగీ చేసి చివరికి ఏమీ నష్టం లేద ని తేల్చివేసే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడే వర్గాలూ ఉన్నాయి. వ్యాపారం, వాణిజ్యం, రాబడి వంటి అంశాలతో ప్రమేయం ఉన్న ప్రభుత్వ శాఖలలో ప్రైవేట్ కంపెనీల ‘లాబీయింగ్’ కొత్తేమీ కాదు.
ఈ శాఖలలో కన్సల్టెంట్ల(సలహాదారులు) నియామకం కూడా సాధారణమే. ఇలాంటి రహస్య పత్రాల లీకేజీలు ఈ సలహాదా రులనే అనుమానిస్తాయి. జాతి పురోగతికి నష్టం కలిగించే ఈ తరహా చర్యలు దేశ ద్రోహం కంటే తక్కువవేమీ కాదు. గతంలో పోటీ పారిశ్రామిక సంస్థల మధ్య ఫార్ములాలు, ఇంజినీరింగ్ డిజైన్లు, ప్లాన్లు వంటి వాటి విషయంలో గూఢచర్యం సాగేది. సాప్ట్‌వేర్‌రంగం అభివృద్ధితో అది కొంత తగ్గింది. పాతికేళ్ళ క్రితం భారత్ రోదసీ విజ్ఞాన రంగంలో విదేశీ గూఢచర్యం కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిం చింది. ఏ రూపాన కొనసాగినా కీలక రహస్య సమాచార లీకేజి దేశానికి అపార నష్టం కలగచేస్తుంది. రాజకీయాలకు అతీతంగా ఈ కేసుని శోధించి, దోషుల్ని గుర్తించి, ససాక్ష్యాలతో వారికి తగిన శిక్షపడేలా చూడడమే మోదీ సర్కారు విధి.
ఇంటిగుట్టుకు తూట్లు
Published Mon, Feb 23 2015 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM
Advertisement
Advertisement