
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల్లో దాదాపు 15 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. మరో పక్షం రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుందని, అంతకుముందే నోటిఫికేషన్లు విడుదల చేస్తే భర్తీ ప్రక్రియ సులభతరమవుతుందని అన్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, నోటిఫికేషన్లు విడుదల చేస్తే యువత పోటీ పరీక్షలకు సిద్ధమవుతారని తెలిపారు. 72 ప్రభుత్వ శాఖల్లో 4.32 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని, బ్యాంకింగ్ రంగంలో 2.20 లక్షలు, రైల్వేలో 2.40 లక్షలు, రక్షణ శాఖ పరిధిలో 3.5 లక్షలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో 2.70 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment