న్యూఢిల్లీ: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,100కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) గురువారం ప్రకటించింది. మొత్తం 130 విభాగాల్లో గ్రూప్– బి (నాన్– గెజిటెడ్), గ్రూప్– సికి సంబంధించిన 1136 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. రీజియన్ల వారీగా ఉన్న ఈ పోస్టులకు దేశంలోని అభ్యర్థులు అన్ని రీజియన్లలోనూ పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఆన్‌లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 30 గడువు అని వివరించింది. దరఖాస్తు విధానం, ఫీజు, అర్హత వివరాలు ఠీఠీఠీ.టటఛి.nజీఛి.జీnలో చూడాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment