Staff Selection Commission
-
కేంద్రానికి కేసీఆర్ లేఖ.. నిరుదోగ్యులకు గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్‌కు ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. సీఎం కేసీఆర్ రాసిన లేఖ మేరకు కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. అయితే, సీఎం కేసీఆర్ నవంబర్ 18. 2020న ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్పూర్తిని కొనసాగించాలని కోరారు. రైల్వేలు, డిఫెన్స్, బ్యాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదన్నారు. భిన్న భాషలున్న దేశంలో ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. కాగా, కేసీఆర్ డిమాండ్ మేరకు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది. దీంతో, కేసీఆర్ కృషి ఫలించింది. -
డిగ్రీ పూర్తి చేశారా.. మీకోసమే.. 4,300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా.. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా.. అయితే మీకు మరో చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! సాయుధ దళాలు, ఢిల్లీ పోలీస్ విభాగంలో.. సబ్ ఇన్స్పెక్టర్ కొలువు మీ ముంగిట నిలిచింది! కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ .. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. తాజాగా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్–కేంద్ర సాయుధ పోలీస్ దళాలు) లో.. సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్ఎస్సీ తాజా నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ ఉద్యోగార్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరు డిగ్రీ నుంచే తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తుంటారు. అలాంటి వారికి ఎస్ఎస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ మరో చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ఎస్ఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్‌తోపాటు సీఏపీఎఫ్లో మొత్తం 4,300 ఎస్ఐ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో సీఏపీఎఫ్లో 3960 పోస్టులు ఉండగా.. ఢిల్లీ పోలీసు విభాగంలో 340 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు ►విద్యార్హత: ఆగస్ట్ 30, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ►వయసు: జనవరి 1, 2022 నాటికి 20–25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. ►వేతన శ్రేణి: రూ.35,400–రూ.1,12,400 శారీరక ప్రమాణాలు ►ఎస్ఎస్సీ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలు, వయో పరిమితితో΄ాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. ►పురుష అభ్యర్థులు కనీసం 170 సెంటీ మీటర్లు; మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అదే విధంగా పురుష అభ్యర్థులకు నిర్దేశిత ఛాతీ కొలతలు తప్పనిసరి. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ సబ్–ఇన్స్పెక్టర్ పోస్ట్‌ల భర్తీకి ఎస్ఎస్సీ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ముందుగా పేపర్–1 పేరుతో రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పేరిట దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం పేపర్–2 పేరుతో మరో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు. పేపర్–1 ఇలా తొలి దశగా నిర్వహించే పేపర్–1ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. రెండో దశ ఫిజికల్ ఎండ్యూరెన్స్ పేపర్–1లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించిన వారితో మెరిట్ జాబితా రూ΄÷ందిస్తారు. వీరికి రెండో దశలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పలు ఫిజికల్ ఈవెంట్లలో అభ్యర్థులు తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అవి.. వంద మీటర్లు, 1.6 కిలో మీటర్ల పరుగు పందెం; లాంగ్ జంప్, హై జంప్; షాట్‌పుట్. వంద మీటర్ల పరుగును 16సెకన్లలో, 1.6కిలో మీటర్ల పరుగును 6.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. 3.65 మీటర్ల దూరంతో లాంగ్ జంప్ చేయాలి. 1.2 మీటర్ల ఎత్తులో హై జంప్ చేయాలి. 16 ఎల్బీస్ బరువును 4.5 మీటర్ల దూరం విసరాలి. హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్లకు సంబంధించి గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. మహిళా అభ్యర్థులకు ఈవెంట్లు ఇలా వంద మీటర్ల పరుగును 18 సెకన్లలో; 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల్లో; 2.7 మీటర్ల లాంగ్ జంప్, 0.9 మీటర్ల హై జంప్ ఈవెంట్లు ఉంటాయి. వీరికి కూడా లాంగ్ జంప్, హై జంప్ ఈవెంట్లలో గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. అదే విధంగా వీరికి షాట్ పుట్ నుంచి మినహాయింపు ఉంటుంది. 200 మార్కులకు పేపర్–2 ►ఫిజికల్ ఈవెంట్లలో విజయం సాధించిన వారికి తదుపరి దశలో పేపర్–2 ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనే ఒకే విభాగంలో 200 ప్రశ్నలు–200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ►పేపర్–1, పేపర్–2 రెండూ ఆబ్జెక్టివ్ విధానంలోనే బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ నిబంధన విధించారు. ►ఆన్లైన్ విధానంలో నిర్వహించే రెండు పేపర్లలోనూ పొందిన మార్కులను నార్మలైజేషన్ విధానంలో క్రోడీకరించి.. నిర్దిష్ట కటాఫ్ నిబంధనల మేరకు మెరిట్ జాబితా రూపొందిస్తారు. పరీక్షలో విజయానికి పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఎక్కువగా దేహ దారుఢ్యంపైనే కసరత్తు చేస్తుంటారు. కాని రాత పరీక్షలో విజయం కూడా ఎంతో కీలకంగా నిలుస్తోంది. జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. భారత దేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్–డీకోడింగ్ నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్ మ్యాథ్స్‌తో΄ాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్ పేపర్–1లో మాత్రమే ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో రాణించడానికి అభ్యర్థులు.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్–స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్లను ప్రాక్టీస్ చేయాలి. 200 మార్కులతో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్ పేరుతో నిర్వహించే పేపర్–2లో రాణించడానికి అభ్యర్థులు.. ఫ్రేజెస్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కంప్లీషన్, ప్రెసిస్ రైటింగ్, వొకాబ్యులరీలపై పట్టు సాధించాలి. కమాండెంట్ స్థాయికి సబ్–ఇన్స్పెక్టర్గా కొలువు దీరిన వారు సర్వీస్ నిబంధనలు, ప్రతిభ ఆధారంగా కమాండెంట్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఇన్స్పెక్టర్గా, ఆ తర్వాత అసిస్టెంట్ కమాండెంట్‌గా, అనంతరం డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్ హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ►దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 30,2022 ►ఆన్లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: సెప్టెంబర్ 1 ►ఆన్లైన్ పరీక్ష తేదీ: నవంబర్‌లో ►తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ►పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ssc.nic.in -
జూన్ 6న టీఎస్ఆర్జేసీ సెట్–22
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి జూన్ 6న అర్హత పరీక్ష టీఎస్ఆర్జేసీ సెట్–22 నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40,281 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, ఈనెల 28 నుంచి హాల్‌టికెట్లు వైబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుందని, మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. 24 నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్షలు (10 ప్లస్ టు) ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నుంచి జూన్ 10 వరకూ జరగనున్నాయి. -
స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. ఉద్యోగాలకు నోటిఫికేషన్
భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 3261 ► పోస్టుల వివరాలు: మల్టీటాస్కింగ్ స్టాఫ్, గర్ల్స్ కేడెట్ ఇన్స్ట్రక్టర్, రీసెర్చ్ అసిస్టెంట్, కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్,ల్యాబొరేటరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, టెక్స్టైల్ డిజైనర్ తదితరాలు. (చదవండి: హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్) ► అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియెట్/10+2, గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల్లో ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: పోస్టులను అనుసరించి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్లైన్ పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. (NEET 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!) ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021 ► కంప్యూటర్ బేస్డ్ పరీక్ష: 2022 జనవరి/ఫిబ్రవరి ► వెబ్సైట్: https://ssc.nic.in -
8.72 లక్షల కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీ
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో సుమారు 8.72 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి జితేంద్రసింగ్ గురువారం రాజ్యసభకు తెలిపారు. మొత్తం 40,04,941 పోస్టులకు గాను 2020 మార్చి ఒకటో తేదీనాటికి 31,32,698 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 8,72,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయని లిఖిత పూర్వకంగా వెల్లడించారు. 2016–17 నుంచి 2020–21 వరకు ప్రధాన రిక్రూట్మెంట్ విభాగాలైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 25,267 మందిని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) 2,14,601, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు(ఆర్ఆర్బీలు) 2,04,945 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. విదేశాలకు 6.4 కోట్ల టీకా డోసులు ఈ ఏడాది జనవరి 12 నుంచి జూలై 22వ తేదీ వరకు సుమారు 6.4 కోట్ల డోసుల కోవిడ్ టీకాలను విదేశాలకు పంపినట్లు లోక్‌సభలో పౌరవిమానయాన శాఖ సహాయమంత్రి వీకే సింగ్ ప్రకటించారు. మరో 35.8 కోట్ల డోసులను దేశీయంగా పంపిణీ చేశామన్నారు. -
టెన్త్‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఐదంకెల జీతం
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... ► పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ► మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 ► విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్‌ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్‌ఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ► ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ► వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ► తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ► ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ► జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ► ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ► ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్రర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ► ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ► ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ► ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ► ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ► తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ► కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్‌ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి. ► గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్‌టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ► ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ► పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ► వెబ్సైట్: https://ssc.nic.in -
సాయుధ బలగాల్లో జాబ్, యువతకు శుభవార్త
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్‌ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్‌ఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ►ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ►వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ►తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ►ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ►జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ►జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. బఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ►ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్ర ర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ►ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ►ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ►ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ►ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ►తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ►కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్‌ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి. ►గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్‌టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ►ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ►పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ►వెబ్సైట్: https://ssc.nic.in -
ఎస్ఎస్సీ నోటిఫికేషన్: 25271 కానిస్టేబుల్ పోస్టులు
భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)... వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 25271 ► పోస్టుల వివరాలు: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ల్లో కానిస్టేబుల్ పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మెన్. ► విభాగాల వారీగా ఖాళీలు: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785, ఎస్ఎస్ఎఫ్–240 ► జీతభత్యాలు: పేస్కేల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 ► అర్హత: 01.08.2021 నాటికి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ► వయసు: 01.08.2021 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష(సీబీఈ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ సాండర్ట్ టెస్ట్(పీఎస్టీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► కంప్యూటర్ ఆధారిత పరీక్ష: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులకు, ఇంగ్లిష్/హిందీ 25ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.07.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021 ► వెబ్సైట్: https://ssc.nic.in -
ఎస్ఎస్సీ పోటీ పరీక్షల సన్నద్ధతకై
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి వారం రోజులపాటు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఉద్యోగ పోటీ పరీక్షలు జరగనున్నాయని, దీనికోసం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో టి–శాట్ నెట్వర్క్ చానళ్లు పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నాయని సీఈవో ఆర్.శైలేశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న లైవ్ ప్రసారాలతో ప్రారంభమై 27వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించామని, పోటీ పరీక్షలకు ఈ పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని శైలేశ్‌రెడ్డి వివరించారు. 25వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే లైవ్‌లో సబ్జెక్టు, సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు తమ సందేహాల కోసం ఫోన్ ద్వారా 040–2354 0326, 2354 0726 టోల్ ఫ్రీ 1800425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో సూచించారు. జనవరి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు ప్రసారాలుంటాయని వెల్లడించారు.(చదవండి: గిరిజన గురుకుల పరిధిలో లా కాలేజీ) ఓయూ ఎంసీఏ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఎంసీఏ కోర్సు పలు సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఎంసీఏ 1వ సెమిస్టర్ బ్యాక్లాగ్, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ వెబ్సైట్లో ఫలితాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు. -
కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షల ఖాళీలు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 6.83 లక్షలకుపైగా ఉద్యోగ ఖాళీలున్నాయని సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 38,02,779 పోస్టులుండగా 2018మార్చి 1 నాటికి అందులో 31,18,956 ఉద్యోగులున్నారని పేర్కొన్నారు. 2019–20 ఏడాదికి గాను కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ)లు సుమారు 1.34 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనలు చేశాయన్నారు. -
1350 పోస్టులకు ఎస్ఎస్సీ నోటిఫికేషన్
భారత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు/సంస్థల కోసం 230 కేటగిరీలకు చెందిన 1351 ఖాళీల భర్తీకి కంప్యూటర్ ఆధారిత పరీక్ష పద్ధతిలో రిక్రూట్‌మెంట్‌ను చేపడుతున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పత్రికా ప్రకటన విడుదల చేసింది. అర్హత ప్రమాణాలు, ఇతర నియమ నిబంధనలతో కూడిన వివరణాత్మక ప్రకటన, ఇంకా దరఖాస్తు పత్రాలు కమిషన్ వెబ్సైట్ ssc.nic.inతో పాటు సదరన్ రీజినల్ ఆఫీస్ వెబ్సైట్ sscsr.gov.inలో లభ్యం అవుతాయి. అలాగే చెన్నైలోని ఎస్ఎస్సీ సదరన్ రీజియన్‌కు సంబంధించి 17 కేటగిరీలలో 67 ఖాళీలు కూడా ఇందులోనే ఉంటాయి. రిజర్వేషన్స్‌కు అర్హత కలిగిన ఎస్సీ/ఎస్టీ/ఇఎస్ఎమ్/పీడబ్ల్యుడీ (ఒహెచ్/హెచ్ హెచ్/విహెచ్/ఇతరులు) కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు పరీక్ష పీజు ఉండదు. అర్హులైన అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ ssc.nic.in ద్వారా ఆగస్టు 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష 2019వ సంవత్సరం అక్టోబరు 14వ తేదీ నుంచి 2019వ సంవత్సరం అక్టోబరు 18వ తేదీ మధ్య నిర్వహించే అవకాశం ఉంది. -
1,100 పోస్టుల భర్తీకి ఎస్ఎస్సీ ప్రకటన
న్యూఢిల్లీ: వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,100కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) గురువారం ప్రకటించింది. మొత్తం 130 విభాగాల్లో గ్రూప్– బి (నాన్– గెజిటెడ్), గ్రూప్– సికి సంబంధించిన 1136 పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. రీజియన్ల వారీగా ఉన్న ఈ పోస్టులకు దేశంలోని అభ్యర్థులు అన్ని రీజియన్లలోనూ పలు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఆన్లైన్ దరఖాస్తుకు సెప్టెంబర్ 30 గడువు అని వివరించింది. దరఖాస్తు విధానం, ఫీజు, అర్హత వివరాలు ఠీఠీఠీ.టటఛి.nజీఛి.జీnలో చూడాలని సూచించింది. -
ఎస్ఎస్సీ ఫలితాలు నిలిపివేత
న్యూఢిల్లీ: పలు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామకాల కోసం నిర్వహించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 2017 పరీక్షల ఫలితాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక పరిశీలనలో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్), కంబైన్డ్ హయ్యర్ సెకెండరీ లెవెల్ (సీహెచ్ఎస్ఎల్) పరీక్షల కుంభకోణంతో అభ్యర్థులు లబ్ధి పొందేందుకు అంగీకరించబోమని, వారు సర్వీసులోకి వెళ్లనివ్వబోమని స్పష్టం చేసింది. ‘2018 జూలై 25, ఆగస్టు 30న సీబీఐ ఇచ్చిన స్టేటస్ రిపోర్ట్‌లను చూస్తే సీజీఎల్–2017, సీహెచ్ఎస్ఎల్–2017 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా తెలుస్తోంది. మేం తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా ఫలితాలు వెల్లడించకుండా ఎస్ఎస్ఎస్కి ఆదేశాలు జారీ చేస్తాం’ అని ధర్మాసనం తెలిపింది. విరుద్ధంగా వాదిస్తారా? సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) విక్రమ్‌జిత్ బెనర్జీ స్టేటస్ రిపోర్డులో ఉన్నదానికి విరుద్ధంగా వాదించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మీరు కేంద్రం తరఫున వాదించడం ఆపండి. సీబీఐ తరఫున కోర్టుకు హాజరైన మీరు సీబీఐ నివేదికకు విరుద్ధంగా, నిందితులకు రక్షణగా ఎలా మాట్లాడుతారు? వాస్తవానికి మీరు సమర్పించిన రిపోర్ట్ ఆధారంగా పరీక్షను రద్దు చేయాలని మీరే అడగాలి’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ఏఎస్జీ బెనర్జీ.. సీబీఐ సమర్పించిన రెండో స్టేటస్ రిపోర్డును పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఇవ్వవద్దని, అందులో సున్నితమైన అంశాలు ఉన్నాయని కోరారు. బెనర్జీ వాదనలతో విభేదించిన ధర్మాసనం సీబీఐ నివేదికలో రహస్యమైన, సున్నితమైన అంశాలేవీ లేవని స్పష్టం చేసింది. ఎస్ఎస్సీ కళంకితమైంది.. ఈ సమయంలో పిటిషనర్ శాంతను కుమార్ తరఫున కోర్టుకు హాజరైన అడ్వొకేట్లు ప్రశాంత్ భూషణ్, గోవింద్ వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ మాకు రిపోర్టు ఇస్తుందా, లేదా అనేది ఇక్కడ విషయం కాదు. పరీక్ష ప్రశ్న పత్రం కస్టోడియన్ అయిన సిఫీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సంత్ ప్రసాద్ గుప్తా పేపర్‌ను లీక్ చేసినట్లు సీబీఐ తన తొలి స్టేటస్ రిపోర్టులో పేర్కొంది. అతడిని విచారిస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఎస్ఎస్సీ ఫలితాలు విడుదలయ్యే వీలుంది. వాటిని నిలిపివేయండి’ అని కోరారు. ‘ఎస్ఎస్సీ వ్యవస్థ, మొత్తం పరీక్షల ప్రక్రియ కళంకితమయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పరీక్ష ప్రశ్న పత్రాన్ని కస్టోడియనే లీక్ చేయడాన్ని మేం నమ్మలేకపోతున్నాం’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ప్రభుత్వ విభాగాల్లోని సీ, డీ కేటగిరీ ఉద్యోగ సర్వీసుల్లో చేరతారు. ‘ఆర్టికల్ 35ఏ’పై విచారణ వాయిదా జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, అధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ రాజ్యాంగబద్ధతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండటంతో పాటు శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముందని కేంద్రం విజ్ఞప్తి చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ప్రజలకు ప్రత్యేక అధికారాలను, హక్కులను కల్పిస్తున్న ఆర్టికల్ 35ఏ ను 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. దీనిప్రకారం ఇతర రాష్ట్రాల ప్రజలు కశ్మీర్లో స్థిరాస్తులు కొనడం కుదరదు. అంతేకాకుండా మిగతా భారతీయులను కశ్మీరీ మహిళలు ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారు తమ ఆస్తిపై హక్కును కోల్పోతారు. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు ప్రజాప్రకటనల విషయంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌పై బీజేపీ, కేంద్రం సహా 6 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ ప్రకటనలను నాయకుల వ్యక్తిగత ప్రచారానికి వాడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా నోటీసులపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. కేంద్రం సహా తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లకు నోటీసులిచ్చింది. ఢిల్లీకి చెందిన ఆప్ ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఈ పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారంటూ ఝా తన పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను గుర్తుచేస్తూ.. బీజేపీ పార్టీ, కేంద్రం సహా ఆయా రాష్ట్రాలు ఏవిధంగా ఉల్లంఘనలకు పాల్పడ్డాయో పిటిషన్లో వివరించారు. ఉల్లంఘనలకు పాల్పడినందుకు వీరిపై చర్యలు తీసుకోవాలని, ప్రకటనలకోసం ఖర్చుపెట్టిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలన్నారు. ప్రజా ప్రకటనలపై నియంత్రణ విషయంలో ముగ్గురు సభ్యుల (నిష్కళంకమైన చరిత్ర ఉన్నవారితో) కమిటీని ఏర్పాటు చేయాలని 2015, మే 13న కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. కేంద్ర మంత్రులు, సీఎంలు, గవర్నర్లు, రాష్ట్ర మంత్రులు ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించవచ్చని 2016లో సూచించింది. -
ఎస్ఎస్సీ పేపర్‌లీక్‌పై సీబీ‘ఐ’
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పేపర్ లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా పలు సెంటర్లలో జరిగిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (టైర్–2) పరీక్షల్లో అవకతవకలపై విచారణ జరపాలంటూ ఎస్ఎస్సీ కోరిన నేపథ్యంలోనే కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ‘విద్యార్థుల డిమాండ్‌ను మేం అంగీకరించాం. సీబీఐ విచారణకు ఆదేశించాం. ఈ విద్యార్థులంతా ఆందోళనలు విరమించాలని కోరుతున్నాం’ అని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. పేపర్ లీక్‌ను నిరసిస్తూ ఫిబ్రవరి 27నుంచి ఢిల్లీలోని ఎస్ఎస్సీ కార్యాలయం ముందు ఉద్యోగ ఆశావహులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ బీజేపీ చీఫ్, ఎంపీ మనోజ్ తివారీ.. పలువురు విద్యార్థుల బృందంతో కలిసి ఆదివారం కమిషన్ చైర్మన్ అషీమ్ ఖురానాతో చర్చలు జరిపి.. సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌ను కలిసి తమ ఆందోళనను తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ దిగువశ్రేణి ఉద్యోగాలను భర్తీచేసేందుకు ఎస్ఎస్సీ నియామక పరీక్షలు నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 17 నుంచి 22 వరకు జరిగిన ఎస్ఎస్సీ పరీక్షలకు దేశవ్యాప్తంగా 1,90,000 మంది హాజరయ్యారు. అయితే ఫిబ్రవరి 17న జరిగిన పరీక్షలో ఢిల్లీ, భోపాల్‌లోని ఒక్కో పరీక్షా కేంద్రంలో అవకతవకలు జరిగినట్లు వెల్లడవటంతో విద్యార్థులు ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. -
ఎస్ఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీబీఐ విచారణకు ఆదేశించింది. పలువురు అభ్యర్ధులు విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణను ఆదేశించామని, ఇక నిరసనలు ఆపాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. కాగా సుమారు 9,372 ఖాళీల భర్తీ కోసం ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రం ముందుగానే లీకైందని అభ్యర్ధులు ఆరోపిస్తూ ఆందోళనలు, నిరసనలు చేసిన విషయం తెలిసిందే. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగడంతో పాటు, సమాధానాలతో సహా ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో షేర్ అవడంతో ఫిబ్రవరి 21న జరిగిన పరీక్షను ఎస్ఎస్సి రద్దు చేసింది. ఈ స్కాంపై సీబీఐతో విచారణ జరపాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం విదితమే. -
అడవిలో పరీక్ష అని తెలియక..
సాక్షి, తూర్పుగోదావరి ,రాజమహేంద్రవరం: ఐదు నిమిషాల ఆలస్యంగా వెళ్లడంతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. మంగళవారం ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో ఈ పరీక్షలు జరిగాయి. రెండో విడత ఆన్లైన్ పరీక్ష మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమైంది. అభ్యర్థులు 30 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. అయితే రాజానగరం మండలం దివాన్‌చెరువులోని శ్రీప్రకాశ్ విద్యానికేతన్ స్కూల్ గ్రామానికి లోపల మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామంలోనే విద్యాసంస్థ ఉందని భావించిన అభ్యర్థులు ఆ మేరకు తమ ప్రాంతాల నుంచి వచ్చారు. తీరా దివాన్‌చెరువు గ్రామానికి వచ్చిన తర్వాత స్కూలు మూడు కిలోమీటర్ల లోపల, అడవిలో ఉందని తెలియడంతో అక్కడకు ఎలా వెళ్లాలో తెలియక కంగారు పడ్డారు. రవాణా సౌకర్యం కూడా లేకపోవడం, ఓ పక్క సమయం మించిపోతుండడంతో పలువురు అభ్యర్థులు పరుగులు పెట్టారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యేందుకు ఒంటి గంటకు అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. అయితే పలువురు అభ్యర్థులు 1.05 గంటలకు చేరుకోవడంతో గేటు వద్దే వారిని నిలిపివేశారు. జరిగిన విషయం వివరించినా సెక్యూరిటీ సిబ్బంది వారిని అనుమతించలేదు. స్కూలు గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న విషయం తెలియక తాము నష్టపోయామని భావించిన కె.సత్యనారాయణ, ప్రసాద్, నవీన్‌కుమార్ తదితర పది మంది అభ్యర్థులు మరొకరు తమలా నష్టపోకూడదంటూ ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చారు. జరిగిన విషయం చెప్పి వాపోయారు. పరీక్ష కేంద్రం మూడు కిలోమీటర్ల దూరంలో ఉండడం, రవాణా సౌకర్యం కూడా లేకపోవడం ఆ సెంటర్‌ను మరోసారి ఎంపికచేసే సమయంలో అధికారులు పునరాలోచన చేయాలని విజ్జప్తి చేస్తున్నారు. నెలల తరబడి పరీక్షకు సిద్ధమైన తాము తమ తప్పు లేకుండానే నష్టపోయామని వాపోయారు. -
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ)లో 20 పోస్టులు
కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో 20 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. 1.సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ ఖాళీలు: 9 (జనరల్-6, ఓబీసీ-2, ఎస్సీ-1) 2.సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీలు: 3 (జనరల్) 3.అసిస్టెంట్ ఎఫిగ్రాఫిస్ట్, ఖాళీ: 1 (ఓబీసీ) 4.టెక్స్టైల్ డిజైనర్, ఖాళీలు: 2 (జనరల్) 5.కోర్ట్ మాస్టర్, ఖాళీలు: 2 (ఓబీసీ-1, ఎస్టీ-1) 6.ట్యూబ్‌వెల్ ఆపరేటర్, ఖాళీ: 1 (జనరల్) 7.ఫాం అసిస్టెంట్, ఖాళీ: 1 (జనరల్) 8.జూనియర్ కెమిస్ట్, ఖాళీ: 1 (జనరల్) వయోపరిమితి: పై అన్ని విభాగాల్లోని పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు అక్టోబర్ 3, 2016 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోసడలింపు ఉంటుంది. విద్యార్హతలు సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్ట్‌కు కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్‌కు అగ్రికల్చర్ డిగ్రీతోపాటు ఆగ్రోనమీ/ప్లాంట్ బ్రీడింగ్/జెనెటిక్స్‌లో పీజీ ఉండాలి. అసిస్టెంట్ ఎఫిగ్రాఫిస్ట్ పోస్ట్‌కు తమిళం/మలయాళం/తెలుగు/కన్నడలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీలో ప్రాచీన భారతదేశ చరిత్రను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి. (లేదా) హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ స్థాయిలో ప్రాచీన భారతదేశ చరిత్ర, తమిళం/మలయాళం/తెలుగు/కన్నడ సబ్జెక్టు చదివి ఉండాలి. వీటితోపాటు ఆర్కియాలజీ/ఎపిగ్రఫీలో పీజీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. టెక్స్టైల్ డిజైనర్ పోస్టుకు టెక్స్టైల్ డిజైన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/టెక్స్టైల్ డిజైన్ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ ఇన్ ఫైన్ఆర్ట్స్ చదివి ఉండాలి. వీటితోపాటు ఈ రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి (లేదా) టెక్స్టైల్ డిజైన్ ఒక సబ్జెక్ట్‌గా మూడేళ్ల డిప్లొమా ఇన్ ఫైన్ఆర్ట్స్తోపాటు ఈ రంగంలో మూడేళ్ల అనుభవం ఉండాలి. కోర్ట్ మాస్టర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు కోర్ట్స్/ట్రిబ్యునల్స్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ట్యూబ్‌వెల్ ఆపరేటర్ పోస్ట్‌కు ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్, మూడేళ్ల అనుభవం ఉండాలి. వీటితోపాటు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలో ఎలక్ట్రీషియన్ శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫాం అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్/తత్సమాన కోర్సుతోపాటు అగ్రికల్చర్లో సర్టిఫికెట్/ట్రైనింగ్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. అగ్రికల్చర్ ఫాంలో ఏడాది పని అనుభవం ఉండాలి (లేదా) బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేసి ఉండాలి. జూనియర్ కెమిస్ట్ పోస్టుకు కెమిస్ట్రీ/డెయిరీ కెమిస్ట్రీ/ఆయిల్ టెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి (లేదా) కెమిస్ట్రీ ఒక సబ్జెక్ట్‌గా బీఎస్సీ/బీఎస్సీ ఆనర్స్ ఇన్ కెమిస్ట్రీతో పాటు అనలిటికల్ వర్క్‌లో రెండేళ్ల అనుభవం ఉండాలి. ఎంపిక విధానం అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఓఎంఆర్/కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆయా పోస్టులను బట్టి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి 150/200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత (నెగటివ్ మార్క్) విధిస్తారు. తర్వాత ఆయా పోస్టుల అవసరాన్ని బట్టి టైపింగ్/డేటా ఎంట్రీ/కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ వంటి పరీక్షలు కూడా ఉంటాయి. దరఖాస్తు విధానం: అభ్యర్థులు http://ssconline.nic.in/sscselectionpost ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమయంలో రూ.100 రుసుమును నెట్‌బ్యాంకింగ్/క్రెడిట్‌కార్డ్/డెబిట్ కార్డ్/ఎస్బీఐ చలానా ద్వారా చెల్లించాలి. అన్ని కేటగిరీల మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మన్ అభ్యర్థులను ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు. పూర్తిచేసిన దరఖాస్తును ప్రింట్ తీసుకుని అవసరమైన అన్ని ధ్రువపత్రాల జిరాక్స్‌లను జతచేసి, సెల్ఫ్ అటెస్ట్ చేసి నిర్దేశిత అడ్రస్‌కు పంపాలి. ఆన్లైన్ దరఖాస్తుకు, ఫీజు చెల్లింపునకు చివరి తేది: అక్టోబర్ 3, 2016 వెబ్సైట్: http://www.sscwr.net -
ఎడ్యు న్యూస్
ఎస్ఎస్సీ ఫలితాల ప్రకటన తేదీలు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పోటీ పరీక్షల ఫలితాల తేదీలు.. ⇒ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ఈ) 2015 తుది ఫలితాలు మే 30 ⇒ జూనియర్ ఇంజనీర్స్ (సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) ఎగ్జామినేషన్ 2015 పేపర్-1 ఫలితాలు మే 16 ⇒ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్ 2015 రాత పరీక్ష ఫలితాలు జూలై 22 ⇒ స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ సి, డి) ఎగ్జామినేషన్ 2015 రాత పరీక్ష ఫలితాలు జూన్ 8. -
స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ తీరును తప్పు పట్టిన హైకోర్టు
-
ప్రతిభను చూడాలి..అప్రధాన తప్పిదాలను కాదు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీరును తప్పుపట్టిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: సమాధానపత్రాల మూల్యాంకనం విషయంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుపట్టింది. పోటీ పరీక్షల్లో టెస్ట్ ఫాం నంబర్ (టీఎఫ్ఎన్) తదితరాలను బబ్లింగ్ (పెన్సిల్‌తో గళ్లను పూరించడం) చేయకపోవడం వంటి అప్రధాన తప్పిదాలను సాకుగా చూపుతూ ఏకంగా సమాధానపత్రం మొత్తాన్ని మూల్యాంకనం చేయకుండా పక్కనపెట్టడం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇలాంటి అప్రధానమైన తప్పిదాలతో ఎవరి సమాధానపత్రాలైతే మూల్యాంకనానికి నోచుకోలేదో, వారు న్యాయస్థానాలను ఆశ్రయించనప్పటికీ, వారి సమాధానపత్రాలు మూల్యాం కనం చేయాల్సిందేనని ఎస్ఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. ఇదీ వివాదం.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌కు ఎస్ఎస్సీ 2014లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి విజయవాడకు చెందిన గూడూరు రాజ సూర్య ప్రవీణ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగిన మొదటి దశ పరీక్షలో 138 మార్కులతో 609 ర్యాంకు సాధించారు. ఢిల్లీలో జరిగిన రెండో దశ పరీక్షలో రెండు పేపర్లుంటే, మొదటి పేపర్లో 155 మార్కులు సాధిం చారు. రెండో పేపర్లో టెస్ట్ ఫాం నంబర్‌ను సరిగా బబ్లింగ్ చేయకపోవడం వల్ల మూల్యాంకనం చేయలేదని అధికారులు చెప్పారు. దీనిపై ప్రవీణ్ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. అతనికి అనుకూలంగా క్యాట్ తీర్పునిచ్చింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్రం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పూర్తిస్థాయిలో వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. టెస్ట్ ఫాం నంబర్‌ను బబ్లింగ్ చేయకపోవడం సమాధానపత్రం మూల్యాంకనానికి ఏ విధంగానూ అడ్డుకాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కంప్యూటర్ ద్వారా నిర్దేశిత ప్రోగ్రాం ద్వారా సమాధానాలను మూల్యాంకనం చేస్తారే తప్ప, టెస్ట్ ఫాం నంబర్‌ను కాదన్నారు. ఈ కారణంతో మొత్తం సమాధాన పత్రాన్నే మూల్యాంకనం చేయకుండా పక్కన పడేయటం సరికాదని పేర్కొంది. కోర్టుకు రానివారికీ ఈ తీర్పు వర్తింపజేయాలి ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణ లక్ష్యం పరీక్ష రాసిన వారిలో ప్రతిభావంతులనే ఎంపిక చేయడమే. ఇందులో భాగంగా ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో కంప్యూటర్ ద్వారా మూల్యాంకనం చేయిస్తున్నారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చే విషయంలో అభ్యర్థి ఆ సమాధానం గడిని పూరించనంత మాత్రాన మొత్తం సమాధాన పత్రాన్ని పక్కనపెట్టలేరు కదా. సాంకేతిక కారణాలతో పిటిషనర్ వంటి ప్రతిభావంతుడిని అడ్డుకోవడం సరికాదు. ఈ విషయంలో ఎస్ఎస్సీ నిర్ణయం సహేతుకమైంది కాదు. పిటిషనర్లాగే సమాధాన పత్రాలు మూల్యాంకనం విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ కోర్టుకు రాలేని అభ్యర్థులు ఎంతో మంది ఉంటారు. న్యాయవాదులను పెట్టుకునే స్తోమత వారికి ఉండకపోవచ్చు. అయితే న్యాయం పొందడానికి ఇది ఎంత మాత్రం అడ్డుకాదు. కోర్టుకు రాని అభ్యర్థుల విషయంలో పిటిషనర్‌కు ఇచ్చిన ఆదేశాలను ఎస్ఎస్సీ వర్తింపచేయాలి. అప్రధాన తప్పిదాలతో వారి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా పక్కన పెట్టి ఉంటే వెంటనే వాటిని మూల్యాంకనం చేసి ఫలితాలను వెల్లడించాలి. -
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తీరును తప్పుబట్టిన హైకోర్టు
-బబ్లింగ్ సరిగా చేయలేదన్న సాకుతో ఆన్సర్‌షీట్‌ను దిద్దరా? -ఇది ఎంత మాత్రం సరికాదు -అలాంటి వారందరి పత్రాలను మూల్యాంకనం చేయండి -కోర్టును ఆశ్రయించలేనివారి ఆన్సర్‌షీట్లను కూడా మూల్యాంకనం చేయండి -ఆ తరువాత ఫలితాలను వెల్లడించండి -ఎస్ఎస్సీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్ : సమాధానపత్రాల మూల్యాంకనం విషయంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తీరును ఉమ్మడి హైకోర్టు తప్పుబట్టింది. పోటీ పరీక్షల్లో టెస్ట్ ఫాం నెంబర్ (టీఎఫ్ఎన్) తదితరాలను బబ్లింగ్ (పెన్సిల్‌తో గళ్లను పూరించడం) చేయకపోవడం వంటి అప్రధాన తప్పిదాలను సాకుగా చూపుతూ ఏకంగా సమాధానపత్రం మొత్తాన్ని మూల్యాంకనం చేయకుండా పక్కనపెట్టడం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. టెస్ట్ ఫాం నెంబర్లో రెండు నెంబర్లను బబ్లింగ్ చేయకుండా మర్చిపోయినందుకు మూల్యాంకనం చేయకుండా పక్కనపెట్టిన ఓ అభ్యర్థి సమాధానపత్రాన్ని వెంటనే మూల్యాంకనం చేసి ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలని ఎస్ఎస్సీని ఆదేశించింది. హాల్ టిక్కెట్ నెంబర్, రోల్ నెంబర్ నమోదు చేసి బబ్లింగ్ చేయడం మర్చిపోయారన్న కారణంతో మూల్యాంకనం చేయకుండా ఎవరి సమాధానపత్రాలనైతే పక్కన పెట్టారో ఆ అభ్యర్థులందరి సమాధానపత్రాలను మూల్యాంకనం చేయాల్సిందేనని ఎస్ఎస్సీకి తేల్చింది. పోటీ పరీక్షల్లో చూడాల్సిన అభ్యర్థి ప్రతిభ తప్ప, ఇటువంటి అప్రధాన తప్పిదాలను కాదని ఎస్ఎస్సీకి హైకోర్టు హితవు పలికింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ నూతి రామ్మోహనరావు, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ఇలాంటి అప్రధానమైన తప్పిదాలతో ఎవరి సమాధానపత్రాలైతే మూల్యాంకనానికి నోచుకోలేదో, వారు న్యాయస్థానాలను ఆశ్రయించి ఉత్తర్వులు పొందకపోయినప్పటికీ, వారి సమాధానపత్రాలు మూల్యాంకనం చేయాల్సిందేనని ఎస్ఎస్సీని ధర్మాసనం ఆదేశించింది. ఇదీ వివాదం.. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్‌కు ఎస్ఎస్సీ 2014లో నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి విజయవాడకు చెందిన గూడూరు రాజ సూర్య ప్రవీణ్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. రెండు దశలలో జరిగిన ఈ పరీక్షలో మొదటి పరీక్ష రాజస్థాన్ అజ్మీర్‌లో జరిగింది. ఇందులో 138 మార్కులతో 609 ర్యాంకు సాధించారు. రెండో దశ పరీక్ష ఢిల్లీలో జరిగింది. రెండో దశ పరీక్షలో రెండు పేపర్లుంటే, ప్రవీణ్ మొదటి పేపర్లో 155 మార్కులు సాధించారు. అయితే అధికారులు రెండో పేపర్‌ను మూల్యాంకనం చేయలేదు. రెండో పేపర్లో టెస్ట్ ఫాం నెంబర్‌ను సరిగా బబ్లింగ్ చేయకపోవడం వల్ల మూల్యాంకనం చేయలేదని అధికారులు చెప్పారు. దీనిపై అతను కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)ను ఆశ్రయించారు. వాదనలు విన్న క్యాట్ ప్రవీణ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు నేతత్వంలోని ధర్మాసనం విచారించింది. పూర్తిస్థాయిలో వాదనలు విన్న ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. టెస్ట్ ఫాం నెంబర్‌ను బబ్లింగ్ చేయకపోవడం సమాధానపత్రం మూల్యాంకనానికి ఏ విధంగానూ అడ్డుకాదని ధర్మాసనం స్పష్టం చేసింది. కంప్యూటర్ ద్వారా నిర్దేశిత ప్రోగ్రాం ద్వారా సమాధానాలను మూల్యాంకనం చేస్తారే తప్ప, టెస్ట్ ఫాం నెంబర్‌ను కాదన్నారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఆతృత, ఆందోళన వల్ల కొన్ని సందర్భాల్లో అప్రధాన తప్పులు దొర్లుతుంటాయని, అలాగే ఈ కేసులో కూడా ప్రవీణ్ టెస్ట్ ఫాం నెంబర్లో రెండు గడులను బబ్లింగ్ చేయలేదని ధర్మాసనం తెలిపింది. ఈ కారణంతో మొత్తం సమాధాన పత్రాన్నే మూల్యాంకనం చేయకుండా పక్కన పడేయటం సరికాదంది. స్థోమత లేనంత మాత్రాన న్యాయం అందకుండా పోదు... 'ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణ లక్ష్యం పరీక్ష రాసిన వారిలో ప్రతిభావంతులను ఎంపిక చేయడమే. ఇందులో భాగంగా ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో కంప్యూటర్ ద్వారా మూల్యాంకం చేయిస్తున్నారు. ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చే విషయంలో అభ్యర్థి ఆ సమాధానం గడిని పూరించకుండా వదిలేసినంత మాత్రాన మొత్తం సమాధాన పత్రాన్ని పక్కన పెట్టలేరు కదా. ఈ కేసులోనూ అంతే. ప్రభుత్వ ఉద్యోగాల్లో అర్హులందరికీ సమానావకాశం పొందే హక్కును రాజ్యాంగం కల్పించింది. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరూ ఆ హక్కును కాలరాయలేరు. అందులోనూ పిటిషనర్ వంటి ప్రతిభావంతుడిని ఇలా అడ్డుకోవడం ఎంత మాత్రం సరికాదు. ఈ విషయంలో ఎస్ఎస్సీ నిర్ణయం ఎంత మాత్రం సహేతుకమైంది కాదు. పిటిషనర్లాగే సమాధాన పత్రాలు మూల్యాంకనం విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ కోర్టుకు రాలేని అభ్యర్థులు ఎంతో మంది ఉంటారు. న్యాయవాదులను పెట్టుకునే స్థోమత వారికి ఉండకపోచ్చు. అయితే న్యాయం పొందడానికి ఇది ఎంత మాత్రం అడ్డుకాదు. ఖర్చుతో నిమిత్తం లేకుండా న్యాయం అందరికీ అందాలన్నది న్యాయవ్యవస్థ మౌలిక సూత్రాల్లో ఒకటి. ప్రస్తుత యువతలో చాలా మందికి కోర్టుకు వచ్చే పోరాడేంత ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవచ్చు. కోర్టుకు వస్తేనే పిటిషనర్లా న్యాయం దక్కుతుందని అనుకోనక్కరలేదు. కోర్టుకు రాని అభ్యర్థుల విషయంలో పిటిషనర్‌కు ఇచ్చిన ఆదేశాలను ఎస్ఎస్సీ వర్తింప చేయాలి. అప్రధాన తప్పిదాలతో వారి సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయకుండా పక్కన పెట్టి ఉంటే వెంటనే వాటిని మూల్యాంకనం చేసి ఫలితాలను వెల్లడించాలి' అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. -
జవాన్ ఉద్యోగాలకు 1300 దరఖాస్తులు
23న పరుగుపందెం ఎంపికైన వారికి ఉచిత శిక్షణ పాడేరు ఏఎస్పీ బాబూజీ పాడేరు: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేయనున్న 63 వేల జవాన్ పోస్టులకు సంబంధించి తమ కార్యాలయం ద్వారా 1300 మంది గిరిజన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారని పాడేరు ఏఎస్పీ ఎ.బాబూజీ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతు పాడేరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలో జవాన్ పోస్టులకు యువతీ, యువకులంతా ఆసక్తి చూపడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తమ పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్ని వసతులతో కూడిన ఉచిత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ మేరకు ఈ నెల 23 నుంచి 5 కిలోమీటర్ల పరుగు పందెం పోటీలను నిర్వహించి అర్హులైన అభ్యర్థులను ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తామన్నారు. పాడేరు, హుకుంపేట మండలాలకు సంబంధించిన అభ్యర్థులకు ఈ నెల 23వ తేదీన, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల మండలాల అభ్యర్థులకు 24న, మిగిలిన అభ్యర్థులకు 25న పరుగు పందెం పోటీలు పాడేరులో నిర్వహిస్తామన్నారు. పరుగు పందెం పోటీలు పైతేదిల్లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులంతా ఈ పరుగుపందెం పోటీలకు గాను కుల, టెన్త్ ధ్రువపత్రం, ఆన్లైన్ దరఖాస్తు ఫారాన్ని తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. పరుగు పందెం పోటీల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నెల రోజులపాటు అన్ని వసతులతో కూడిన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌తోపాటు షూ, భోజన వసతి, వైద్యసౌకర్యాలు ఉంటాయన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలు కేవలం జవాన్ పోస్టులకే కాకుండా కానిస్టేబుళ్లు, టీచర్లు, వీఆర్వో, వీఆర్ఏ, గ్రూప్ 4, ఇతర పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయని ఏఎస్పీ తెలిపారు. -
కేంద్ర బలగాల్లో భారీ అవకాశాలు
కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో చేసుకున్న అవగాహన ఒప్పందం మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఓ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర సాయుధ బలగాల్లో 62,390 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), రైఫిల్ మ్యాన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలు ఆంధ్రప్రదేశ్: 5,009 తెలంగాణ: 2,055 ఉద్యోగాలు: 62,390 అర్హత: పదో తరగతి వేతన స్కేల్: రూ.5,200-20,200+రూ.2000 గ్రేడ్ పే. బీఎస్ఎఫ్ పురుషులు: 17,698 మహిళలు: 4,819 ఐటీబీపీ పురుషులు: 2,795 మహిళలు: 306 సీఐఎస్ఎఫ్ పురుషులు: 4,493 మహిళలు: 507 ఏఆర్ పురుషులు: 300 మహిళలు: 300 సీఆర్పీఎఫ్ పురుషులు: 22,623 మహిళలు: 1,965 ఎన్ఐఏ పురుషులు: 82 మహిళలు: 4 ఎస్ఎస్బీ పురుషులు: 5,619 మహిళలు: 605 ఎస్ఎస్ఎఫ్ పురుషులు: 247 మహిళలు: 27 అర్హత: పదో తరగతి. వయసు 18-23 ఏళ్లు(2015, ఆగస్టు 1 నాటికి). రిజర్వేషన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. శారీరక ప్రమాణాలు: ఎత్తు- పురుషులు: 170 సెం.మీ, మహిళలు: 157 సెం.మీ. చాతీ (పురుషులకు మాత్రమే) - 80 సెం.మీ, ఊపిరి పీల్చితే 5 సెం.మీ. వ్యాకోచించాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలి. ఎంపిక విధానం: 1. నిర్దేశ శారీరక ప్రమాణాలు ఉన్నాయా.. లేదా అన్నది పరిశీలిస్తారు. 2. శారీరక సామర్థ్య పరీక్ష ఉంటుంది. ఇందులో పురుషులైతే 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో పూర్తిచేయాలి. మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని ఎనిమిదన్నర నిమిషాల్లో పూర్తిచేయాలి. 3. ఫిజికల్ టెస్ట్‌లో విజేతలకు అభ్యర్థి ఎంపికను అనుసరించి ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో రాత పరీక్ష నిర్వహిస్తారు. 4. అర్హులకు వైద్య పరీక్షలు జరుపుతారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తొలి దశ రిజిస్ట్రేషన్‌లో అవసరమైన సమాచారాన్ని నింపాలి. ఫీజు చెల్లించిన తర్వాత రెండో దశ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చివరి తేదీ (మొదటి దశ): ఫిబ్రవరి 21, 2015. రెండో దశ: ఫిబ్రవరి 23, 2015. వెబ్సైట్: http://ssconline.nic.in; http://ssconline2.gov.in పరీక్ష విధానం పరీక్ష తేదీ: అక్టోబర్ 4, 2015 ఆన్లైన్లో రాయాలనుకుంటే ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అయితే ఇంగ్లిష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు. రెండు గంటల్లో సమాధానాలు గుర్తించాలి. సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 25 జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 25 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 25 ఇంగ్లిష్/హిందీ 25 25 మొత్తం 100 100 ప్రిపరేషన్ ప్రణాళిక ఫిజికల్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే రాత పరీక్షకు అనుమతిస్తారు. కాబట్టి తగిన శారీరక ప్రమాణాలున్నవారు ఇప్పటి నుంచే పరుగు ప్రాక్టీస్ చేయాలి. దీనికి సమాంతరంగా రాత పరీక్షలో విజయానికి కృషిచేయాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగ్‌పై దృష్టిసారించాలి. వెర్బల్‌లో కోడింగ్, డీకోడింగ్, సిరీస్, అనాలజీ తదితర విభాగాలు ముఖ్యమైనవి. క్లిష్టత స్థాయి చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ప్రాక్టీస్ చేస్తే పూర్తి మార్కులు సాధించవచ్చు. ఇందులో కనీసం 20 మార్కులు తెచ్చుకోవాలి. జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్: తన చుట్టూ ఉన్న పరిసరాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళికశాస్త్రం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, రాజ్యాంగం, క్రీడలు తదితరాలతో పాటు వర్తమాన వ్యవహారాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ప్రా థమిక అంశాలను పూర్తిగా నేర్చుకుంటే సరిపోతుంది. తప్పనిసరిగా దినపత్రికలు చదివి,ముఖ్యాంశాలను గుర్తుంచుకోవాలి. ఎలిమెంటరీ మ్యాథ్స్: ఆరు, ఎనిమిదో తరగతి పుస్తకాల్లోని అంశాలపై పట్టు సాధించాలి. సూక్ష్మీకరణలు, సంఖ్యా వ్యవస్థ, శాతాల నుంచి ఎక్కువ (15 వరకు) ప్రశ్నలు రావొచ్చు. దీనికి ప్రాక్టీస్ ప్రధానం. ఇంగ్లిష్/హిందీ: పదో తరగతి స్థాయిలో వొకాబ్యులరీ, గ్రామర్, కాంప్రెహెన్షన్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సరిగా ప్రాక్టీస్ చేస్తే తేలిగ్గా 18-20 మార్కులు తెచ్చుకోవచ్చు. పరీక్షకు ఎనిమిది నెలల సమయం ఉంది. మొదటి నాలుగు నెలల్లో సిలబస్‌కు సంబంధించిన అంశాల్లోని కాన్సెప్టులపై పట్టు సాధించాలి. అంశాల వారీగా సమస్యల్ని సాధించాలి. పరీక్షలు కూడా రాయాలి. తర్వాతి నాలుగు నెలల్లో దాదాపు 100 గ్రాండ్ టెస్ట్‌లు రాయాలి. సరైన ప్రణాళికను రూపొందించుకోవడంతో పాటు దాన్ని కచ్చితంగా అమలు చేస్తే తేలిగ్గా 70-90 మార్కులు తెచ్చుకోవచ్చు. - ఎన్.వినయ్‌కుమార్ రెడ్డి, డైరెక్టర్ ఐఏసీఈ, హైదరాబాద్. -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్షలో ఇంగ్లిష్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించడం ఎలా? - శ్రుతి ప్రియ, సూరారం కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ పరీక్షలో ఇంగ్లిష్ నుంచి 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు. ఇంగ్లిష్‌లో ప్రాథమిక స్థాయి పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు వస్తాయి. స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, మిస్ స్పెల్ట్ వ ర్డ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఒన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్, పాసివ్ వాయిస్ ఆఫ్ వెర్బ్స్, కన్వర్షన్ ఇన్టు డెరైక్ట్, ఇన్‌డెరైక్ట్ నరేషన్, షఫ్లింగ్ ఆఫ్ సెంటె న్స్ పార్ట్స్, షఫ్లింగ్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ పాసేజ్, క్లోజ్ పాసేజ్, కాంప్రహెన్షన్ పాసేజ్, వొకాబ్యులరీ, పాసివ్ వాయిస్, డెరైక్ట్ అండ్ ఇన్‌డెరైక్ట్ స్పీచెస్, క్వశ్చన్ ట్యాగ్స్, క్రియలు, విశేషణాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటిపై ప్రాథమిక అవగాహన కోసం ప్రామాణిక డిక్షనరీ, స్టడీ మెటీరియల్, గ్రామర్ బుక్‌లను చదవాలి. పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళి తెలుసుకోవాలి. రోజూ ఏదైనా ఒక ఇంగ్లిష్ దిన పత్రిక చదవడం, ఇంగ్లిష్ వార్తలు వినడం, జాతీయ టీవీ ఛానళ్లలో చర్చా కార్యక్రమాలను చూడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ‘ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్: ఎస్. చాంద్ పబ్లికేషన్స్’ బుక్ రిఫర్ చేయడం ప్రయోజనకరం. ఇన్పుట్స్: ప్రొఫెసర్ పి.వి.సి.హెచ్.శాస్త్రి, హెచ్ఓడీ, ఐడీఎస్ (ఇంగ్లిష్) -
కేటరింగ్ బాయ్ TO సీబీఐ ఎస్సై వరకు..
నార్నూర్ : ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ గ్రామానికి చెం దిన చాటే విఠల్, లక్ష్మీబాయి దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరు ఆరేళ్ల క్రితం నార్నూర్ మండల కేంద్రానికి వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమారులు, కూతు రు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు సంతోష్, రెండో కుమారుడు కృష్ణ. సంతోష్ వ్యాపారం నిర్వహిస్తూ కు టుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక కృష్ణకు చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో ఇష్టం. తమ్ముడి ఆసక్తిని గమనించిన సంతోష్ పట్టుదలతో చదివించి, ఎల్లవేళలా ప్రోత్సహిం చాడు. కృష్ణ ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ముత్నూర్ ప్రభుత్వ పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు ఇంద్రవెల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. పదో తరగతిలో 518 మార్కులు సాధించి మండలంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. నిర్మల్ ఎన్బీఆర్ జూని యర్ కళాశాలలో ఇంటర్ చదివి 948 మార్కులు సాధిం చి కళాశాల టాపర్‌గా నిలిచాడు. అతడి ప్రతిభను గుర్తిం చిన హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య కళాశాలల యాజమాన్యం ఒక సంవత్సరం ఉచితంగా ఎంసెట్‌లో కోచింగ్ ఇచ్చింది. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకుతో హైదరాబాద్‌లోని సీవీఆర్ కళాశాలలో ఇంజినీరింగ్‌లో చేరాడు. చదువు.. పని.. ఇంజినీరింగ్ చదువుతూనే సొంత ఖర్చుల నిమిత్తం కేటరింగ్ పనికి వెళ్లేవాడు. పగలు కళాశాలకెళ్లి.. రాత్రి కేటరింగ్ బాయ్‌గా పనిచేసేవాడు. కేటరింగ్ ద్వారా రోజు రూ.150 సంపాదించేవాడు. ఆ డబ్బుతో చదువు, సాధారణ ఖర్చులకు ఇబ్బంది ఉండేదికాదు. ఇలా.. చదివి బీటెక్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. తార్నాకలోని వంజారి సంఘం హాస్టల్లో ఉంటూ సినీ హీరో శ్రీకాంత్ కుమారులకు హోం ట్యూషన్ చెబుతూ ఏడాదిపాటు పోటీ పరీక్షలకు సొంతంగా ప్రిపేర్ అయ్యాడు. 2012లో ఎస్ఎస్సీ(స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) డిగ్రీ అర్హతతో ప్రకటన వెలువడడంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రిపేర్ అయ్యాడు. దేశవ్యాప్తంగా మొదటి దశకు పది లక్షల మంది హాజరవగా రెండో దశకు 1.12 లక్షల మంది అర్హత సాధించారు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఐదు వేల మంది ఎంపికయ్యారు. తెలుగు మీడియం అయినప్పటికీ కృష్ణ ఇంగ్లిష్‌లో జరిగిన ఇంటర్వ్యూలో సునాయాసంగా విజయం సాధించాడు. దేశవ్యాప్తంగా 34 మంది సీబీఐ ఎస్సైగా ఎంపికైతే వారిలో తెలంగాణ రాష్ట్రం నుంచి కృష్ణ ఒక్కడే కావడం అతడి అసాధారణ ప్రతిభకు నిదర్శనం. అంతేకాదు ఎస్బీఐ, ఎస్బీడబ్ల్యూ, ఆంధ్రాబ్యాంక్, ఆర్ఆర్బీ, ఎఫ్‌సీఐ తదితర ఉద్యోగాలను ఒకే ప్రయత్నంలో సాధించాడు. గాజియాబాద్ (యూపీ)లోని సీబీఐ అకాడమీలో 8 నెలల శిక్షణ పూర్తి చేశాడు. సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా ద్వారా బంగారు పతకం అందుకున్నాడు. ప్రస్తుతం సీబీఐ ముంబయి బ్రాంచిలో అవినీతి నిరోధక విభాగంలో సీబీఐ ఎస్సైగా పనిచేస్తున్నాడు.