ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 12 నుంచి వారం రోజులపాటు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఉద్యోగ పోటీ పరీక్షలు జరగనున్నాయని, దీనికోసం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో టి–శాట్ నెట్‌వర్క్ చానళ్లు పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నాయని సీఈవో ఆర్.శైలేశ్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 25న లైవ్ ప్రసారాలతో ప్రారంభమై 27వ తేదీ నుండి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించామని, పోటీ పరీక్షలకు ఈ పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని శైలేశ్‌రెడ్డి వివరించారు. 25వ తేదీ ఉదయం 11 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే లైవ్‌లో సబ్జెక్టు, సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని, అభ్యర్థులు తమ సందేహాల కోసం ఫోన్ ద్వారా 040–2354 0326, 2354 0726 టోల్ ఫ్రీ 1800425 4039 నెంబర్లకు కాల్ చేయాలని సీఈవో సూచించారు. జనవరి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12 వరకు ప్రసారాలుంటాయని వెల్లడించారు.(చదవండి: గిరిజన గురుకుల పరిధిలో లా కాలేజీ)
ఓయూ ఎంసీఏ ఫలితాలు విడుదల
ఉస్మానియా యూనివర్సిటీ: విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఎంసీఏ కోర్సు పలు సెమిస్టర్ల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ తెలిపారు. ఎంసీఏ 1వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్, 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షల ఫలితాలను వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఉస్మానియా వర్సిటీ వెబ్‌సైట్‌లో ఫలితాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment